మన సినిమాకో భాష ఉందా?
టేక్ 1 మొన్నీ మధ్యన ఏదో చర్చల్లో మన సినిమాకి ఒక భాష, వ్యాకరణం లేకపోవడమే నేటి మన సినిమాల దుస్థితికి కారణమని నేనొక బోల్డ్ స్టేట్మెంట్ చేసేసాను. వెంటనే పక్కన ఉన్నవాళ్ళెవరో అసలు సినిమాకో భాష ఉండడమేంటి? అయినా మన సినిమాలు తెలుగు భాషలోనే కదా ఉంటాయి. ఇంకో కొత్త భాష ఎందుకు? అని నా మీద యుద్ధం ప్రకటించారు. “సినిమా దృశ్య మాధ్యమం. అందుకే సినిమాలో దృశ్యం మాట్లాడాలంటారు. దృశ్యం మాట్లాడడమంటే కథ చెప్పకుండా(…)












