జాతీయ చలనచిత్ర పురస్కారాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ప్రపంచ చలనచిత్ర పురస్కారాల చరిత్ర

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ప్రపంచ చలనచిత్ర పురస్కారాల చరిత్ర

వచ్చే నెల 9వ తేదీ 58 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రధానం చేయబడే రోజు. ఈ సందర్భంగా జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి మనం తెలుసుకుందాం. యాభై ఎనిమిది ఏళ్ళ పాటు నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న ఈ చలనచిత్ర పురస్కారాల చరిత్ర తెలుసుకోవాలంటే, ముందు చలనచిత్ర కళ యొక్క ఆవిర్భావం నుంచి మొదలుపెట్టాలి. 1895 లో లూమియర్ సోదరులు తొలిసారిగా ఒక చలనచిత్రాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. లండన్ లో ఈ ప్రదర్శన జరిగిన(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – చరిత్ర

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – చరిత్ర

1953 లో భారతదేశంలో నిర్మింపబడిన వివిధ భాషా చిత్రాలనుంచి ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ చిత్రాలకు పురస్కారాలు అందచేయాలని 1954 లో ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నిర్ణయించింది. ఆ విధంగా భారతదేశంలో ఉత్తమ చలనచిత్రాలకు పురస్కారాలు అందచేయడమనే ప్రక్రియ మొదలయిందని చెప్పుకోవచ్చు. ఈ పురస్కారాలను అప్పట్లో “స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్” గా పిలిచే వారు. నిజానికి 1949 ఆగష్టు నెలలో అప్పటి మద్రాస్ ప్రభుత్వానికి చెందిన సెన్సార్ బోర్డ్ ప్రెసిడెంట్ రాసిన ఒక లేఖలో ఆ యేడు(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తొలి రోజులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తొలి రోజులు

ఇక మనం 1954 లో మొట్టమొదటి సారిగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న చిత్రాల వివరాలు చూద్దాం. శ్రీ మంగల్ దాస్ పక్వాసా అధ్యక్షుడిగా సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఇప్పుడు ఉన్నన్ని అవార్డులు ఆ రోజుల్లో లేవు. జాతీయ ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ పతకం అందచేసేవారు. పీకే ఆత్రే దర్శకత్వంలో వచ్చిన మరాఠీ చిత్రం “శ్యాంచీ ఆయ్” ఈ అవార్డు గెలుచుకుంది. శ్యాం అనే అల్లరి కుర్రవాడిని అతని(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-పరిణామ క్రమం

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-పరిణామ క్రమం

భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అబివృద్ధి చెందుతూండగా ఎన్నో మార్పులు సంభవించాయి. మొదట్లో అత్యధిక శాతం సినిమాలు హిందీ నిర్మించబడేవి. కానీ ఈ రోజు తమిళం మరియు తెలుగు సినీ పరిశ్రమలు హిందీ సినిమా పరిశ్రమకు ధీటుగా నిలిచాయి. ఈ మార్పుల కారణంగానే జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందచేయడంలో కూడా మార్పు సంభవించిందనే చెప్పాలి. ముఖ్యంగా 1970 మరియు 1980 లలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏర్పడిన మార్పులు ఇందుకు కారణం అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – బెంగాలీ సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – బెంగాలీ సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలందుకున్న సినిమాలను సాధారణంగా అవార్డు సినిమాలని అంటుంటారు. అలాంటి అవార్డు సినిమాలనగానే మనకి గుర్తుకొచ్చేవి బెంగాలీ లేదా మళయాళీ సినిమాలే. గత కొన్ని రోజులుగా మనం జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే గత 58 ఏళ్ళగా కొనసాగుతూ వస్తున్న ఈ పురస్కారాల్లో 22 బెంగాలీ సినిమాలు ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడ్డాయంటే బెంగాలీ సినిమాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరాలాల్ సేన్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి భారతీయ(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- పథేర్ పాంచాలి

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- పథేర్ పాంచాలి

మొదటి రెండు సంవత్సరాల పాటు అవార్డులు వచ్చిన సినిమాల సంగతి ఒక ఎత్తైతే ఆ తర్వాత 1956 లో భారత ప్రభుత్వం ప్రకటించిన మూడవ జాతీయ అవార్డులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరంలోనే ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రూపొందించిన తొలి చిత్రం “పథేర్ పంచాలి” జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. గతంలో ఇచ్చిన అవార్డులన్నీ కూడా కథా ప్రధానమైన, భక్తి ప్రధానమైన లేదా ప్రబోధాత్మక సినిమాలకే(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ నటీ నటులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ నటీ నటులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు కేవలం ఉత్తమ చిత్రాలను మాత్రమే గుర్తిస్తూ ఈ అవార్డులను అందచేసే వారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అంటే 1968 లో మొదటి సారిగా చలనచిత్రాల్లో నటించిన ఉత్తమ నటీనటులకు అవార్డులు అందచేయాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ బాల నటీనటుల విభాగాల్లో మొత్తం మూడు అవార్డులు నటీనటులకు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కేటాయించారు. 1968 నుంచి 1974 వరకూ ఉత్తమ నటుడు అవార్డులను(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దక్షిణ భారత సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దక్షిణ భారత సినిమాలు

మన దేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యలో చలనచిత్రాలు నిర్మించే భాషల్లో తెలుగు, తమిళం, మళయాళం మరియు కన్నడ ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల సంఖ్య కలిపితే ప్రపంచం లోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే ప్రాంతంగా దక్షిణ భారతదేశాన్ని పేర్కొనవచ్చు. 1954 లో మొట్టమొదటి చలనచిత్ర పురస్కారాలు అందచేసినప్పటినుంచీ 1966 వరకూ దక్షిణ భారతదేశానికి చెందిన కథాచిత్రాలేవీ స్వర్ణ కమలం గెలుచుకోలేదు. డాక్యుమెంటరీ మరియు ఇతర విభాగాల్లో స్వర్ణ కమలం అవార్డులు గెలుచుకున్నప్పటికీ మొదటిసారిగా దక్షిణాదికి చెందిన(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్

నేడు మన బారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి ఆనందాన్ని, ఆటవిడుపునూ అందిస్తోన్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేర్గాంచిన వారు శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్‌కు 30కిలోమీటర్ల దూరంలోని త్రియంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మరియు బరోడాలోని కళాభవన్‌లలో ఆయన విధ్యాభ్యాసం చేశారు. 1896లో ఆయన బొంబాయిలోని(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ సాంకేతిక నిపుణులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ సాంకేతిక నిపుణులు

చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీతం ,సాహిత్యం, శిల్పం మరియు ఇతర లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. చలనచిత్రానికి దర్శకుడు ముఖ్యమే కానీ ఒక చలనచిత్ర నిర్మాణం కేవలం దర్శకుడి ఒక్కడి వల్లే కాదు. నిజానికి చలనచిత్రం లోని అన్ని విభాగాల నిపుణుల చేత తనకు కావలసినట్టుగా పని చేయించుకోగలిగేవాడే దర్శకుడు. చలనచిత్ర కళలో చివరిగా మనకి తెరమీద కనిపించేది నటీనటులే అయినప్పటికీ తెర వెనుక దర్శకుడితో(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-2

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-2

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అతి ముఖ్యమైన అవార్డులుగా భావించే వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి విభాగాలు ఉన్నాయి. ఇప్పటివరకూ తెలుగులో నిర్మించిన ఏ చలనచిత్రం కూడా ఉత్తమ చలన చిత్రం గా జాతీయ అవార్డు పొందలేదు. అలాగే ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడు విభాగాల్లో కూడా మన వాళ్ళకి ఇంతవరకూ అవార్డులు దక్కలేదు. హిందీ తర్వాత అంత పెద్ద చలనచిత్ర పరిశ్రమగా పిలువబడే మన తెలుగు సినిమాకి(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-1

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-1

1954 లో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడానికి ముందే తెలుగు చలనచిత్రమయిన “పాతాళ భైరవి” భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికయిన ఏకైక చిత్రం గా గుర్తింపు పొందింది.ఇలాంటి ఖ్యాతి సాధించిన మరో తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి”. ఈ సినిమా బీజింగ్‌లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై, 1953 మార్చి 14న చైనీస్‌ సబ్‌ టైటిల్స్‌ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదలయింది. ఈ విధంగా 1953 కంటే ముందే కొన్ని(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- మరి కొన్ని విశేషాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- మరి కొన్ని విశేషాలు

నేషనల్ ఫిల్మ్ ఆవార్డ్స్ లేదా జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా పిలువబడే ఈ అవార్డులు మొట్టమొదట 1954 లో ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ నేడు ఇవ్వనున్న 58 వ పురస్కారాల వరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల్లో కొన్ని ముఖ్య సంగతులను మనం చలనచిత్ర అవార్డుల పరిణామ క్రమం లో తెలుసుకున్నాము. కానీ జాతీయ చలనచిత్ర అవార్డులు అనగానే మనకి గుర్తొచ్చేవి కొన్నే.ఉత్తమ చిత్రం,ఉత్తమ నటీ నటులు, ఉత్తమ దర్శకుల అవార్డులు మాత్రమే మనకి ఎక్కువగా(…)