డాక్యుమెంటరీ సినిమా

డాక్యుమెంటరీ సినిమా-1

డాక్యుమెంటరీ సినిమా-1

డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటో ఇప్పుడు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా నేడు డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణం జరుగుతోంది. అయితే డాక్యుమెంటరీ అనే పదాన్ని మొట్టమొదటిగా Robert Flaherty నిర్మించిన ’నానూక్ ఆఫ్ ది నార్త్’ అనే చలనచిత్రం గురించి వ్రాసిన ఒక సమీక్షలో వాడడం జరిగింది. ఇంతకూ డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటి? నిజజీవితంలోని విషయాలను ఉన్నదున్నట్టుగా విజువల్ గా డాక్యుమెంట్ చేయడమే డాక్యుమెంటరీ సినిమా అని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ డాక్యుమెంటరీ సినిమాకు ఆద్యుడిగా(…)

డాక్యుమెంటరీ సినిమా-2

డాక్యుమెంటరీ సినిమా-2

రష్యా విప్లవంలో ప్రజల సినిమా రష్యా దీర్ఘకాలిక విప్లవంలోకి నానా రకాల ప్రజలు కలిసి వచ్చారు. లెనిన్ నాయకత్వంలో అలాంటి కృషి విజయవంతంగా నెరవేరింది. ప్రజలలోని ఎన్నో రకాల కళారూపాలు , వాటిని సృష్టించిన కళాకారులూ విప్లవంలోకి కలిసి వచ్చారు. నాటకం, చిత్రకళ, సాహిత్యం, సంగీతం మొదలైన ఎన్నో కళలు కొత్త రూపమెత్తాయి. అందుకు ఒక పరిణామ క్రమం వుంది. విప్లవం కొత్త శక్తులకు పురుడు పోసింది. కొత్త చైతన్యాన్ని, సామాజిక అవసరాలనూ ముందుంచింది. ఒక కళారూపం(…)

డాక్యుమెంటరీ సినిమా-3

డాక్యుమెంటరీ సినిమా-3

చైనా సినిమా – చరిత్ర – దశలు అభ్యుదయ సినిమాలకి అభివృద్ధి నిరోధక సినిమాలకీ ఉన్న సంఘర్షణే చైనా సినిమా చరిత్ర. “పోరాటం – ఓటమి” పోరాటం – ఓటమి – గెలుపు” అన్న మావో సూక్తి చీకటి కోణంలో దాగిన సినిమా చరిత్రను చదవటానికి ప్రేరేపిస్తుంది. చైనాలో 1896 లోనే సినిమా ప్రదర్శింపబడింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాతే చైనాలో సినిమాలు తీయడం ప్రారంభించారు. చైనా సినిమా చరిత్రని సమగ్రంగా తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి ఇప్పటిదాకా(…)

డాక్యుమెంటరీ సినిమా-4

డాక్యుమెంటరీ సినిమా-4

మొదటి ప్రపంచ యుద్ధంలో సినిమా కళ చాలా పవిత్రమైనదని, దాన్ని క్షుద్రమైన తాత్కాలిక ప్రయోజనాలకు వాడకూడదని, కళావిలువలకు, కళా ప్రయోజనానికి శాశ్వతత్వం ఆపాదించే అన్ని వర్గాల వారు కూడా కళను ఒక చీపురుకట్టలాగ, ఒక గ్లాసుడు మంచినీళ్లలాగా తక్షణావసరాలకు వాడుకోవడం చరిత్ర అంతటా జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా యుద్ధం, సరిహద్దు తగాదాలు మొదలైన సందర్భాలలో కవులూ, కళాకారులూ విజృంభించి ప్రచారంతో హోరెత్తిస్తారు. మొదటి ప్రపంచయుద్ధం సందర్భంగా ఇంగ్లండు, ఫ్రాన్సు, జర్మనీ దేశాలే కాక తటస్థంగా ఉన్న అమెరికా(…)

డాక్యుమెంటరీ సినిమా-5

డాక్యుమెంటరీ సినిమా-5

అమెరికాలో కార్మిక సినిమా (1930 – 1935) అమెరికా బూర్జువా వ్యవస్థలోని దుర్గుణాలను, కర్కశత్వాన్ని బట్టబయలు చేయాలని, పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా ఉన్న బానిస విధానాన్ని, అమెరికా రాజ్యాంగంలో దాగిన ప్రాధమిక లోపాల్నీ, బహిర్గతం చేసి శ్రామికవర్గంలో విప్లవ జెండా ఎగరెయాలనీ, విప్లవపధంలో వీరోచితంగా నడుస్తున్న శ్రామికవర్గం అండగా సినిమా మాధ్యం తన రంగూ రూపూ మార్చుకుంది. పనివేళల కోసం, కనీస సౌకర్యాల కోసం, ఆహారం కోసం, చేసిన పనికి సరైన కూలీ డబ్బులకోసం, యుద్ధాన్ని వ్యతిరేకించడం(…)

డాక్యుమెంటరీ సినిమా-6

డాక్యుమెంటరీ సినిమా-6

రెండో ప్రపంచ యుద్ధ సినిమా మొదటి ప్రపంచయుద్ధం తరువాత జర్మనీలో ఆర్ధిక సాంఘిక రంగాలలో అనేక మార్పులు వచ్చాయి. ‘వర్సెల్స్ సంధి ‘ నియమాలు జర్మన్ జాతికి అవమానకరంగా కనబడ్డాయి. అంటే మొదటి ప్రపంచయుద్ధానికి ముందున్న ఉత్సాహ ఉద్వేగాలు మౌనరూపం దార్చాయి. అందులో విషాదరేఖ ప్రస్ఫుటంగా ఉంది. దీనికి రాజకీయ ఆర్ధిక కారణాలు గమనించి, గమనించకా కొందరు మధ్యతరగతి మేధావులు సంయమనం కోల్పోయారు. నిరాశ, నిస్పృహ రాజ్యమేలింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగిన నాలుగైదు సంవత్సరాల కాలాన్ని(…)

డాక్యుమెంటరీ సినిమా-7

డాక్యుమెంటరీ సినిమా-7

గోబెల్స్ నాజీ ప్రచార చిత్రాలు నాజీ ప్రచారధోరణి హిట్లర్ తాత్విక భావాలకు అనుగుణంగా రూపొందించబడింది. నాజీ తత్వంలో స్త్రీకి చాలా హీనమైన స్థానం ఉంది. ఇంచుమించు స్త్రీకి ఆలోచన చేతగాదనీ, ఆలోచన అవసరమని హిట్లర్ గాఢంగా విశ్వసించాడు. జన సమూహం అతని దృష్టిలో ఒక మూక. మూకను తన అభిప్రాయాలవైపు మళ్లించడం చాలా సులువని సూత్రీకరించాడు. జన సమూహాన్ని హిట్లర్ ఆడదానిగా భావించాడు. ఆడది కూడా ఒకరి సహాయంతోనే ఆలోచిస్తుంది. ఆమె మనస్తత్వం బలహీనమైంది. చెప్పినట్టు నడుచుకుంటుంది.(…)

డాక్యుమెంటరీ సినిమా-8

డాక్యుమెంటరీ సినిమా-8

వెండితెరపై రెండో ప్రపంచ యుద్ధం చరిత్రలో 1930 దశాబ్ధానికున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈ కాలంలో కధారహిత చిత్ర నిర్మాతలు ఓ ప్రత్యేకమైన దృష్టితో, ప్రత్యేక శైలి కోసం అన్వేషణ సాగించారు. సరికొత్త వ్యక్తీకరణ రూపాలను సృష్టించారు. ఈ కొత్తదనం కారణంగా వారి కృషి అత్యధిక భాగం ప్రయోగాత్మకంగానే కొనసాగింది. కొన్నిమార్లు వారి శైలిపై వారికే స్పష్టత కుదరలేదు. అయినా చిత్రాలు బాగా ప్రజాదరణ పొందాయి. నిర్మాతలకు ఉత్సాహాన్ని కలిగించాయి. నాన్ ఫిక్షన్ సినిమా(…)

డాక్యుమెంటరీ సినిమా-9

డాక్యుమెంటరీ సినిమా-9

లాటిన్ అమెరికాలో సినిమా ఆయుధం లాటిన్ అమెరికా సినిమాల్ని అర్ధం చేసుకోవాలంటే వాటికి వియత్నాంకి గల మమేకతని, అమెరికా ఆయుధబలగాలు, బలం మొ..వాటిని లెక్కలోకి తీసుకోవాలి. సాంకేతికాభివృద్ధి చెందిన ఆయుధాలతో, పరికారాలతో అణచివేతకు పూనుకునే అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనడానికి లాటిన్ అమెరికా దేశాల ఉద్యమకారులు ప్రజాసముద్రంలో చేపల్లా మారారు. కాని ఆ సముద్రాన్నే ఎండగట్టడానికి ప్రయత్నాలు సాగేటప్పుడు లాటిన్ అమెరికాదేశాలు ఎలాంటి పరిస్థితిలో ఉంటాయి? ఈ నేపధ్యంలో భాగంగా ఆ సినిమాని బేరీజు వేయాలి. లాటిన్ అమెరికాదేశాలన్నీ(…)

డాక్యుమెంటరీ సినిమా-10

డాక్యుమెంటరీ సినిమా-10

బ్రెజిల్ కొత్తసినిమా సామాన్యంగా తిరుగుబాటు సినిమా లేక విప్లవ సినిమా విప్లవ విజయానంతరం మాత్రమే సాధ్యమవుతుందని భావిస్తారు. ఉదాహరణకి 1959 తరువాతే క్యూబాలో ఒక నిర్దుష్టమైన విప్లవ చలనచిత్ర రంగం ఆవిర్భవించింది. అట్లని అంతకుముందు సినిమా మీడియాని ఉపయోగించుకోలేదని అర్ధం కాదు.. కాని ఇందుకు భిన్నంగా బ్రెజిల్లాంటి కొన్ని చోట్ల విప్లవానికిముందే తిరుగుబాటు సినిమా సగర్వంగా తలెత్తి నిలిచింది. 1960 పూర్వం లాటిన్ అమెరికాలో సినిమాలన్నీ హీనస్థాయి వినోదాన్ని కుప్పతెప్పలుగా అందించేవి. నిజం చెప్పాలంటే అవన్నీ ఉత్తర(…)

డాక్యుమెంటరీ సినిమా-11

డాక్యుమెంటరీ సినిమా-11

సినిమా విముక్తి ఉద్యమంలో అగ్నిజ్వాలల్లో ( The House of Furnaces) “అగ్నిజ్వాలల్లో అర్జెంటైనా” ఒక సినిమా ఇతిహాసం. మేధావులకీ, సౌందర్య(కళా) ఆరాధకులకీ సంతృప్తి కలిగించే టెక్నిక్‌లు, పద్ధతులు యిందులో లేవు. సంప్రదాయానుసారంగా తీసిన చిత్రాలు చూసే వారికిది ఒక షాక్ లాంటిది. అయితే ప్రేక్షకుల్ని తనలో యిముడ్చుకుని, వారిచే తలలూపించే షాక్ యిది. ఒక ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ. ఒక రాజకీయ చర్య, ఒక విప్లవ ఆయుధం, ఒక విముక్తి నినాదం – వీటన్నిటి మేలి కలయిక(…)