focus.JPGప్రపంచంలో కెల్లా అత్యుత్తమ సినీదర్శకుడు ఎవరు అంటే టక్కున సమాధానం చెప్పడం కష్టమేమోగానీ, ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచుర్యం కలిగిన సినిమా దర్శకుడు ఎవరంటే అకిరా కురసావా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. తన సినిమాలతో ప్రపంచ సినీప్రేమికులంరినీ మంత్ర ముగ్ధులను చేయడమే కాకుండా అంతవరకూ ఐరోపా, అమెరికా ఖండాలకే పరిమితమనుకున్న సినిమా కళను, మరో కొత్త కోణంలో ఆవిష్కరించారు.

జపనీస్ సినిమారంగానికి త్రిమూర్తులుగా భావించబడే వారిలో కురసోవా ఒకరు. ఈ సంవత్సరం జనవరి నెలలో ’ఫోకస్’ శీర్షికన జపనీస్ త్రిమూర్తుల్లో ఒకరైన కెంజి మిజోగుచి గురించి నవతరంగంలో తెలుసుకున్నాం. ఈ నెలలో అకిరా కురసావా పై ఫోకస్ శీర్షికలో ఆయన దర్శకత్వం వహంచిన సినిమాల గురించి సమీక్షలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆయన గురించిన సినిమాలపై వ్యాఖ్యానం,పుస్తక పరిచయం లాంటి అంశాలను పొందుపరచాలన్నది మా ప్రయత్నం.

ఈ సందర్భంగా నవతరంగం సభ్యులు మాత్రమే కాకుండా పాఠకులూ తమ వ్యాసాలను navatarangam[at]gmail[dot]com కు పంపించవలసిందిగా మనవి.

నవతరంగంలో అకిరా కురొసావా వ్యాసాలు: