నవతరంగం ద్వారా తెలుగు వారికి ప్రపంచ సినిమా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెలా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులను, వారి సినిమాలను పరిచయం చేయడమే ఈ ఫోకస్ శీర్షిక ముఖ్య ఉద్దేశం. జనవరి నెలకు గానూ ఈ శీర్షికలో జపాను కు చెందిన ప్రఖ్యాత దర్శకుడు కెంజి మిజోగుచి గురించి పరిచయం చేసుకుందాం. ప్రపంచంలోని పది మంచి సినిమాలు ఏవి అని ఎవర్నడిగినా అందులో కనీసం ఒక్క సినిమా అయినా మిజోగుచి సినిమా ఉంటుందంటే ఆశ్చర్యం లేదు. ఈయన దర్శకత్వంలో రూపొందిన Ugetsu, Life of Oharu, Sansho-the Bailiff సినిమాలు వచ్చి ఇప్పటికి దశాబ్దాలు గడిచిపోయినప్పటికీ,నేటికీ ఈ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈయన గురించి ఈయన సినిమాలు, దర్శకత్వ శైలి గురించి వీలైనంత సమాచారం అందించేందుకు నవతరంగం ద్వారా ప్రయత్నం చేస్తాం. పాఠకులు కూడా తాము చూసిన మిజోగుచి సినిమాల గురించి తమ అభిప్రాయాలు తెలియచేయాలనుకుంటే ఈ క్రింది అడ్రస్ కు మెయిల్ చేయగలరు.
మీ వ్యాసాలు, సమీక్షలు, అభిప్రాయాలు, సలహాలు పంపించవలసిన e-చిరునామా:navatarangam [at] gmail [.] com
ఫోకస్ శీర్షికలో మిజోగుచి గురించిన వ్యాసాలు: