bnreddy.jpgతెలుగు సినిమా బాల్య దశలోఉన్న తొలి రోజుల్లోతన దిశానిర్దేశంతో ఒక ప్రాంతీయ భాషా చిత్రం అంతర్జాతీయస్థాయి ఎలా అందుకోగలదో చూపిన మార్గదర్శి బి.యన్.రెడ్డి.

నవంబర్ 16, 1908న కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించిన బి.యన్.సంస్కరణాభిలాషతో చలనచిత్ర నిర్మాణ,దర్శకత్వం చేపట్టారు.ప్రతి సినిమాతోఅక్షరాస్యత అతి తక్కువ ఉన్న మన సమాజాన్ని పట్టి పీడుస్తున్న అసంఖ్యాక సమస్యలకు కొంతమేరకు పరిష్కారం చూపేందుకు యత్నించిన సహృదయుడు బి.యన్.

ఎన్నోఅద్భుతమైన కళాఖండాల తో తెలుగుసినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని సముపార్జించి పెట్టిన బి.యన్.రెడ్డి శతజయంతి సంవత్శరం లో ఆ మహామనిషికి ఆయన చేతిలో రూపుదిద్దుకున్న మహత్తర చిత్రరాజాలకు నివాళి అర్పించే సదుద్దేశ్యంతో నవతరంగం.కామ్ ఫిబ్రవరి నెలలో బి.యన్. ప్రత్యేక కధనాలు, వ్యాసాలు,సమీక్షలు,విశ్లేషణలు,పాఠకులకు ఆయనతో,ఆయన సినిమాలతో ఉన్న అనుబంధాన్నిఅందరితో పంచుకునే అవకాశం కల్పిస్తుంది. మంచి సినిమాను అభిమానించే పాఠకమహాశయులందరూ తమతమ అనుభూతులను పంపవలసింది గా మనవి చేస్తున్నాం.

నవతరంగంలో బి.యన్. గురించిన వ్యాసాలు: