ఆగష్టు 2008
భారతీయ సినిమా రంగంలో రిత్విక్ ఘటక్ ఓ హై ఓల్టేజీ టాలెంట్. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎంచుకున్న సబ్జెక్టు కానీ, నిర్మాణ రంగంలో ఆయన చిత్రీకరణ పధ్ధతి , సంగీతాన్ని దృశ్యాల్ని లయీకరించిన విధానమూ ఆయన స్థాయిని చెబుతాయి.భారతదేశ విభజన పట్ల ఆయన దు:ఖపడడమూ, కళాత్మకంగా స్పందించిన తీరూ ఆయనలోని సున్నితత్వాన్ని, నిజాయితీని స్పష్టపరుస్తాయి.నవ్య వాస్తవిక వాదిగా ఆయన చిత్రాల్లో అత్యంత వేదనా భరితమయిన బతుకుల్ని వెళ్ళదీస్తున్న వారే ప్రధాన పాత్రలుగా నిలుస్తారు.భారతీయ నవ్య సినిమా రంగంలో గ్రేట్ మాస్టర్స్ గా చెప్పుకునే ముగ్గురిలో (సత్యజిత్ రే, మృణాల్ సేన్) రిత్విక్ ఘటక్ ఒకరు.

ఆయన నిర్మించిన చిత్రాల్లో ఒక్కొక్కటి ఒక దృశ్య కావ్యం.కాని ’మేఘేధాక తార’ ను ఆయన చిత్రాల్లో కెల్లా గొప్ప చిత్రమని ఆయనే పేర్కొన్నారు.ఇందులో స్వార్థాన్ని త్యజించి,  తన కుటుంబంలోని వారి అవసరాలు నెరవేర్చడం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయిన నీత ముఖ్యాభినేత్రి.ఈ చిత్రంలో స్త్రీత్వాన్ని, త్యాగాన్ని ప్రధానాంశాలుగా చేసుకొని మధ్య తరగతి జీవుల మనస్తత్వాల్ని స్వార్థాల్ని విశ్లేషిస్తాడు రిత్విక్ ఘటక్.ఈయన సినిమాలు, దర్శకత్వ శైలిని విశ్లేషించడమే ఈ నెల ఫోకస్ విభాగం యొక్క లక్ష్యం.

మీరు గతంలో రిత్విక్ ఘటక్ సినిమా లు చూసి వున్నా, లేదా ఇప్పుడు చూడాలని ఆసక్తి వున్నా ఆ సినిమాలు చూసి మీ అభిప్రాయాలు, విశ్లేషణలు navatarangam at gmail dot com కి పంపగలరు.

రిత్విక్ ఘటక్ గురించి నవతరంగంలో వచ్చిన వ్యాసాలు: