ఫోకస్

ఫోకస్-2008 వ్యాసాలకోసం ఇక్కడ చూడండి.

ఫోకస్-2009

ఎందరో మహానుభావులు. అందరికీ వందనము. ప్రపంచ సినిమా చరిత్రలో ఎంతో మంది కళాకారులు ఎన్నో అద్భుత కళాఖండాలను సృష్టించారు.నవతరంగంలో ప్రతి నెలా ఒక ప్రముఖ సినీ కళాకారులను ఎన్నుకొని వారి సినిమా సమీక్షలు, విశ్లేషణా వ్యాసంగంతో పాటు ఆయా కళాకారులను పాఠకులకు పరిచయం చేయడమే ఈ ఫోకస్ శీర్షిక లక్ష్యం.

నవతరంగం ద్వారా తెలుగు వారికి ప్రపంచ సినిమా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెలా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులను, వారి సినిమాలను పరిచయం చేయడమే ఈ ఫోకస్ శీర్షిక ముఖ్య ఉద్దేశం.

ప్రస్తుతానికి ప్రపంచ దేశాల దర్శకులతో పాటు భారతీయ సినిమా దర్శకులనూ పరిచయం చేస్తూ ప్రచురించే వ్యాసాలు త్వరలో మిగతా సాంకేతిక నిపుణులు మరియు నటీనటుల గురించి కూడా వ్యాసాలు ప్రచురించే ప్రయత్నం చేస్తాము.అలాగే మీకు నచ్చిన దర్శకుడు లేదా ఇతర కళాకారుల గురించి ఈ శీర్షికలో వ్యాసాలు ప్రచురించాలని మీకనిపిస్తే ఆయా కళాకారులను పరిచయం చేస్తూ మీ వ్యాసాలు మాకు పంపించండి.

2008వ సంవత్సరంలో నిర్వహించిన ఫోకస్ శీర్షికలోని వ్యాసాలకోసం ఇక్కడ చూడండి.

____________________________________

ఏప్రిల్ 2009: సెర్జీ పరజనోవ్

parajanovప్రపంచ సినిమాని ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ చదివేసి చూసేసిన వారు సైతం ఒక్కో సారి కొన్ని సినిమాలనూ కొంతమంది దర్శకులనూ మర్చిపోయే అవకాశం ఉంది. ఇలా ప్రేక్షకులు, విమర్శకులు చేత ఇగ్నోర్ చెయ్యబడ్డ జీఇయస్ ఫిల్మ్ మేకర్స్ లో మొదటి వాడు పరజనోవ్.తీసింది చాలా తక్కువ సినిమాలైనా ఆయన ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోగలిగాడు. ఈ మధ్యనే ఈయన గురించీ, ఈయన సినిమాల గురించి ప్రపంచ సినీ ప్రేమికుల్లో కొత్త ఆసక్తి మొదలయ్యింది.

తెలుగు వారికి మొదటగా నవతరంగం ద్వారా పరజనోవ్ గురించి పరిచయం చేయడం మా అదృష్టం గా భావిస్తున్నాము.

ఈ నెల ఫోకస్ శీర్షికలో ఆయన దర్శకత్వం వహంచిన సినిమాల గురించి సమీక్షలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆయన గురించిన సినిమాలపై వ్యాఖ్యానం,పుస్తక పరిచయం లాంటి అంశాలను పొందుపరచాలన్నది మా ప్రయత్నం.

ఈ సందర్భంగా నవతరంగం సభ్యులు మాత్రమే కాకుండా పాఠకులూ తమ వ్యాసాలను navatarangam[at]gmail[dot]com కు పంపించవలసిందిగా మనవి.

నవతరంగంలో పరజనోవ్ వ్యాసాలు:

మార్చ్ 2009: Jean-Luc Godard

godardJean-Luc Godard, డిశెంబరు 3, 1930 న ప్యారిస్ లోని బాగా డబ్బున్న (బూర్జువా అని చదువుకోండి) ఒక స్విస్ కుటుంబంలో జన్మించాడు. ప్రపంచ యుద్ధసమయంలో అతన్ని స్విట్జర్లాండ్ కి పంపించివేశారు. యుద్ధానంతరం ప్యారిస్ తిరిగివచ్చిన Godard 1949 లో సోర్బోన్ యూనివర్శిటీలో చేరాడు. ఇక్కడ Godara మరియు అతని మిత్ర బృందం తాము చూసి, చర్చించిన సినిమాల గురించి వ్యాసాలు ప్రచురిస్తే బావుంటుందనే ఆలోచనతో 1949 లో Gazette du Cinema పేరుతో ఒక పత్రికను స్థాపించారు. ఈ పత్రికలో Godard తన పేరుతో కొన్ని వ్యాసాలు మరియు Hans Lucas అనే మారుపేరుతో కొన్ని వ్యాసాలు ప్రచురించారు. ఐదు నెలలపాటు నడిపాక నిధులు లేక ఈ పత్రిక మూతపడింది. ఆ తర్వాత 1951 లో Andre Bazin స్థాపించిన Cahiers du Cinema (Notebooks of Cinema) అనే పత్రికను స్థాపించారు. Godard మరియు అతని మిత్రులు ఈ పత్రికలో తరచుగా తమ సినీ సమీక్షలు, విశ్లేషణలు ప్రచురించేవారు. ఒక వైపు రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే మరోవైపు తన మిత్రులతో కలిసి లఘు చిత్ర నిర్మాణంలోకి దిగారు Godard.

అలా ప్రారంభమైన Godard సినీ ప్రస్థానం కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ సినీప్రేమికును ఉత్తేజపరిచింది.

ఈ నెల ఫోకస్ శీర్షికలో ఆయన దర్శకత్వం వహంచిన సినిమాల గురించి సమీక్షలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆయన గురించిన సినిమాలపై వ్యాఖ్యానం,పుస్తక పరిచయం లాంటి అంశాలను పొందుపరచాలన్నది మా ప్రయత్నం.

ఈ సందర్భంగా నవతరంగం సభ్యులు మాత్రమే కాకుండా పాఠకులూ తమ వ్యాసాలను navatarangam[at]gmail[dot]com కు పంపించవలసిందిగా మనవి.

నవతరంగంలో Godard వ్యాసాలు:

ఫిబ్రవరి 2009: Adoor Gopala Krishnan

adoor3అదూర్ గోపాలకష్ణన్ అంతర్ముఖుడయిన ఓ గొప్ప భావుకుడు. ఆయన చిత్రాల్లో తెరలుతెరలుగా ఆయనదే అయిన జీవన చిత్రం కనిపిస్తూ ఉంటుంది. మలయాళీ చిత్ర సీమలో నవ్య సినిమాల పరంగా ప్రముఖుడయి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన అదూర్ 1941 లో పుట్టారు. పూనే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో స్క్రిప్ట్ రైటింగ్, దర్శకత్వ శాఖల్లో డిప్లొమా పొందారు. ఆయన కేరళ ఫిలిం సొసైటీ ఉద్యమానికి ఊపిరిగా ఉన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా చిత్ర నిర్మాణం కోసం ’చిత్రలేఖ ఫిలిం కో ఆపరేటివ్’ ని స్థాపించి 1972లో ’స్వయంవరం’ నిర్మించాడు. అదూర్ గ్రామంలో కథాకళి నాటికలు పోషించే కుటుంబంలో జన్మించిన గోపాలకృష్ణన్ నిర్మించిన ’స్వయంవరం’ జాతీయస్థాయిలో ఉత్తమచిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటి బహుమతుల్ని అందుకుంది. ఈ చిత్రంలో నటనకి తెలుగు నటి శారదకి ఊర్వశి అవార్డు లభించింది. అలాగే ఈ సినిమా నాలుగు రాష్ట్ర స్థాయి బహుమతులు కూడా అందుకుంది.

ఈ నెల ఫోకస్ శీర్షికలో ఆయన దర్శకత్వం వహంచిన సినిమాల గురించి సమీక్షలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆయన గురించిన సినిమాలపై వ్యాఖ్యానం,పుస్తక పరిచయం లాంటి అంశాలను పొందుపరచాలన్నది మా ప్రయత్నం.

ఈ సందర్భంగా నవతరంగం సభ్యులు మాత్రమే కాకుండా పాఠకులూ తమ వ్యాసాలను navatarangam[at]gmail[dot]com కు పంపించవలసిందిగా మనవి.

నవతరంగంలో అడూర్ గోపాలకృష్ణన్ వ్యాసాలు:

 

జనవరి 2009: Orson Welles

owelles-lead1939 లో నిండా పాతికేళ్లు కూడా లేని ఒక యువకుడితో RKO రేడియో పిక్చర్స్ అనే సంస్థ వరుసగా మూడు సినిమాలు (సంవత్సరానికొకటి) నిర్మించే కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఆరోజుల్లో అదొక పెద్ద సంచలనం. ఆ సెన్సేషన్ అంతటితో ఆగలేదు. ఆ సినిమాలకు నిర్మాత, దర్శకుడు, రచయిత గా మాత్రమే కాకుండా ఆ సినిమాల్లో ముఖ్య భూమిక పోషించేది కూడా ఆ పాతికేళ్లు నిండని యువకుడే అని ప్రకటిస్తూ, అడ్వాన్స్ గా 150,000 డాలర్లు ఆయన చేతిలో పెట్టడమే కాకుండా ఈ సినిమాల్లో వచ్చిన లాభాల్లో పాతిక శాతం అతనికిస్తారని ప్రకటించి సంచలనం సృష్టించింది RKO సంస్థ. ఇన్నిఆద్భుత అవకాశాల్ని ఒకే సారి అందిపుచ్చుకున్న ఈ కుర్రాడు అంతకుముందు సినిమాల్లో ఏమైనా పని చేసిన అనుభవం ఉండా అంటే అదీ లేదు. కాకపోతే ఆయన అప్పటికే కొన్ని నాటకాలను దర్శకత్వం వహించి ఉన్నాడు. అలాగే కొన్ని సంచలనాత్మకమైన (హెచ్.జి.వెల్స్ రచించిన ది వార్ ఆఫ్ ది వరల్డ్స్ నవలను రేడియోలో నాటికలా ప్రసారం చేస్తే జనాలు అదంతా నిజమనుకుని నానా హడావుడి చేసారట) రేడియో ప్రోగ్రామ్ లు కూడా రూపొందించి మంచి పేరు ప్రఖ్యాతలే సంపాదించి ఉన్నాడు. అయినప్పటికీ అంత పెద్ద బాధ్యత ఆయనకివ్వడమూ ఆయన ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించడమూ అద్భుతమైన విషయమే. ఇదంతా చూసి హాలీవుడ్ లో చాలామంది ముక్కున వేలేసుకున్నారు, పక్కకు వెళ్ళి బచ్చా గాడు వీడేం చేస్తాడనీ కూడా అనుకున్నారు. ఈ కుర్రాడేమైనా సామాన్యుడా! అంతా చేసి తనకు దొరికిన అవకాశం ఒక చిన్న పిల్లాడికిచ్చిన రైలు బొమ్మతో (This is the biggest electric train a boy ever had!)పోల్చాడు. ఆ యువ సంచలనం పేరు Orson Welles.

ఆ నాడు ప్రపంచ సినిమా చరిత్ర ను ఒక మలుపు తిప్పిన ఆర్సన్ వెల్స్  పై ఈ నెల ఫోకస్ శీర్షికలో ఆయన దర్శకత్వం వహంచిన సినిమాల గురించి సమీక్షలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆయన గురించిన సినిమాలపై వ్యాఖ్యానం,పుస్తక పరిచయం లాంటి అంశాలను పొందుపరచాలన్నది మా ప్రయత్నం.

ఈ సందర్భంగా నవతరంగం సభ్యులు మాత్రమే కాకుండా పాఠకులూ తమ వ్యాసాలను navatarangam[at]gmail[dot]com కు పంపించవలసిందిగా మనవి.

నవతరంగంలో ఆర్సన్ వెల్స్ వ్యాసాలు:

____________________________


3 Comments

 1. VENKAT
  Mar 25, 2009 @ 14:39:24

  manchi essay kantha rao garu gurunchi yevvaru try cheyalede…
  bahdakaram..

  Reply

 2. Sunkara Ramesh
  May 18, 2010 @ 12:04:40

  F12mi patrika chala bagunnadi

  Reply

 3. Sunkara Ramesh
  May 18, 2010 @ 12:06:23

  iam very much interested your effort

  Reply

Leave a Reply