ఈ నెల సినిమా

ప్రపంచంలో అన్ని మూలల నుండి ఎన్నో మంచి సినిమాలు వస్తూనే వున్నాయి. వాటన్నింటి గురించీ కాకపోయినా నెలకో సారి, పెద్దగా ప్రచారానికి నోచుకని మంచి సినిమాలను పరిచయం చేయడమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశం.

2008 లో ’ఈ నెల సినిమా’ శీర్షకలో ప్రచురింపబడ్డ వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

ఏప్రిల్ నెల సినిమా: Happiest Girl in the World

happiestగత కొన్నేళ్ళుగా రొమానియన్ సినిమాలకు అంతర్జాతీయంగా మంచి ప్రాచుర్యం లభించింది. రెండేళ్ళ క్రితం Cannes చలనచిత్రోత్సవంలో అత్యుత్తమ సినిమాగా 4 Months, 3 Weeks, 2 Days అనే రొమానియన్ సినిమా ఎన్నుకోబడిన తర్వాత ఈ దేశం నుంచి వస్తున్న సినిమాలపై సినీ అభిమానులు ఓ కన్నేసి ఉంచినమాట నిజం. అయితే గత సంవత్సరం మరీ అంతగా చెప్పుకోదగ్గ రొమానియన్ సినిమాలేవీ రాలేదనే చెప్పాలి. వచ్చిన వాటిల్లో Perscuit Sportive అనే సినిమా కొన్ని చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి మంచి పేరే తెచ్చుకుంది. రొమానియన్ సినిమాల గురించీ, వాటి చరిత్ర, ప్రస్తుత పరిస్థుతుల గురించి మరో సారి వివరంగా రాసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి గత వారం రోజులుగా రొమానియా రాజధాని బుకరెస్ట్ లో జరిగిన B-est అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో నేను చూసిన కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రయత్నంలో మొదటిగా Happiest Girl in the World(Cea mai fericita fata din lume) అనే రొమానియన్ సినిమా గురించి చర్చించుకుందాం.

ఈ సినిమా సమీక్ష: Happiest Girl in the World

మార్చి నెల సినిమా: గులాల్

gulaalదర్శకత్వం: అనురాగ్ కశ్యప్

మొదటి సినిమా “పాంచ్” ఇప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ వాళ్ళు ఆపేసారు. రెండో సినిమా “బ్లాక్ ఫ్రైడే” విడదలచెయ్యకుండా దాదాపు మూడు సంవత్సరాలు కోర్టు ఆపేసింది. ఆ తరువాత “నో స్మోకింగ్” అని తనకు తప్ప చాలా మందికి అర్థం కాని ప్రయోగాన్ని చేసి ‘బాగుంది కానీ అర్థం కాలేదు’ అనిపించుకున్నాడు.

ఈ మధ్యనే దేవదాసుకు “దేవ్ డి” అని కొత్త భాష్యం చెప్పిన అనురాగ్ కశ్యప్ మరొక్కసారి ప్రేక్షకుల్ని తన సినెమాటిక్ ఫైర్ తో అబ్బురచిరిచిన చిత్రం “గులాల్”.

సమకాలీన భారతీయ సినీదర్శకుల్లో ఇంత అలజడిని, భవిష్యత్తుపై ఆశనూ కలిగించిన మరో దర్శకుడు లేడేమో! ఇప్పటి వరకూ తను తీసిన చిత్రాలు  వ్యక్తిగత expression కూ, cinematic excellence కూ, విషయవస్తువులోని integrity కీ మధ్య పొంతన కుదరని ప్రయత్నాలుగా మిగిలిపోయాయి. కానీ వాటిని అధిగమించి ఒక పూర్ణచిత్రంగా ఆవిర్భవించిన సినిమా, గులాల్ అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా సమీక్ష: రాజకీయ ‘రంగు’లరాట్నం – గులాల్

ఫిబ్రవరి నెల సినిమా:Man from the earth

man_from_earth_2006_teaser

దర్శకత్వం:Richard Schenkman

ఇది 2007 లోనే వచ్చిన సినిమా అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది ఇంకా. అంత లో-ప్రొఫైల్ గా వచ్చి వెళ్ళినట్లు ఉంది. ఇండీ ఫిలిం అంటారట ఈ సినిమా వంటి వాటిని. అదే – ఇండిపెండెంట్ ఫిలిం అని. హాలీవుడ్ స్టూడియో సిస్టం తో సంబంధం లేకుండా నిర్మించిన చిత్రాలని అలా పిలుస్తారంట.ఇవి మామూలు కమర్షియల్ చిత్రాల్లా కాకుండా కాస్త భిన్నంగా ఉండే చిత్రాలు కూడా అని చదివాను. ఇక విషయానికొస్తే, మేన్ ఫ్రం ఎర్త్ (భూమికి చెందిన మనిషి.. హీహీ) సినిమా అంతా ఒకే గదిలో నడుస్తుంది. ఆ కథా వస్తువు విని – నేను అసలు ఊహించని విషయం ఇది. కథలో అంత చరిత్ర ఉంటే, ఒకే గదిలో ఎలా చూపుతారు? అనుకున్నా. కానీ, అక్కడున్న మనుష్యుల మధ్య సంభాషణలే ఈ కథకి అన్నీనూ. కేవలం సంభాషణలతోనే కథంతా నడిపించడం (శ్రీపాద వారి కథల్లాగా), అది కూడా సినిమా లో – నాకు కాస్త కొత్తగానే ఉంది. కొన్నింటిలో హావభావాల వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తాయి, కథంగా ఒకే గదిలో నడిచినా కూడా. ఈ కథాంశం అలా కాదు. దీనికి సంభాషణలే మొత్తం అంతానూ -సౌమ్య

ఈ సినిమా సమీక్ష:Travellers and Magicians – భూటాన్

జనవరి నెల సినిమా:Groundhog Day

groundhog-leadదర్శకత్వం:Harold Ramis

కొద్ది కాలం క్రితం IMDB Top 250 పైన యుద్దం ప్రకటించి ఒక్కొక్క సినిమా సంగతి చూడడం మొదలు పెట్టినపుడు ఆ జాబితాలో Groundhog Day సినిమాను  చూసాను. అప్పటివరకు ఈ సినిమా పేరు వినలేదు,  ఈ సినిమా గురించి ఎక్కడా చదవలేదు, పైగా సినిమాలో కథానాయకుడు బిల్ మర్రే!! ” బిల్ మర్రే సినిమాలు అంటే  మామూలు కామెడీతో కాసేపు నవ్వుకొని మరచిపోయేవి, పొరపాటున ప్రేక్షకులు ఎక్కువ రేటింగ్ ఇచ్చారేమో”నని అనుమానంతో  సినిమా చూడడం మొదలు పెట్టాను.

సినిమా చూసిన తర్వాత “ఇది టాప్ 250 లో మాత్రమే కాదు, టాప్ 50 జాబితా రూపొందిస్తే అందులో తప్పక ఉండవలసినది” అనిపించింది.  నేను సినిమాలు చూస్తూ చప్పట్లు కొట్టిన సన్నివేశాలు చాలా తక్కువ, అందులో ఎక్కువ ఈ సినిమాలోనే ఉన్నాయి. మన దైనందిన జీవితంలో ఎంతోమంది కొత్తవారిని, తెలిసినవాళ్ళను కలుస్తుంటాము. వీలున్నా స్నేహపూర్వకంగా మాట్లాడము. సహాయం చేసే అవకాశం ఉన్నా సహాయం చెయ్యము. ఒకవేళ నిన్నటిరోజు మళ్ళీ పునరావృతం అయితే ఇంకొంచెం సంతోషాన్ని మరొకరితో పంచుకోగలమా? నిన్న జరిగినవన్నీ యథాతథంగా ఈ రోజు పునరావృతం అవుతాయని తెలిస్తే నిన్న చేయలేని మంచిపని ఒకటయినా ఈ రోజు చెయ్యగలిగే మనసు మనకు ఉందా? వంటి అంశాలతో చాలా విలువయిన సందేశాన్ని హాస్యభరితమయిన సన్నివేశాలతో దర్శకుడు అందించాడు. (చందు)

ఈ సినిమా సమీక్ష:గ్రౌండ్ హాగ్ డే

Comments (5)

Trackback URL | Comments RSS Feed

  1. G.KRISHNA says:

    telugu people never accept experimental movies which are failed

  2. శ్రీకర్ says:

    బాగున్నాయి మీ రివ్యూస్

  3. tejaswini says:

    these are very nice.can u keep some more for us.thankyou

  4. venkat says:

    navatarangam is the best

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.