తను తెలుగు వాడిగా — వాడిగా తెలుగు వ్రాయగల వాడిగా — పుట్టడం మన అదృష్టం అన్న గర్వంతో మనసు పులకరిస్తుంది ఆయన పేరు వింటే.
నేను తెలుగు వాడినై — అంతో ఇంతో తెలుగు చదవగలిగిన వాడినై — పుట్టడం నా అదృష్టం అన్న స్పృహతో వళ్ళు గగుర్పొడుస్తుంది ఆయన రచన చదివితే.
పానగల్ పార్కులోని పేరులేని చెట్టును తక్షశిల, నలందా, వారణాశి విశ్వవిద్యాలయాలంత “ఎత్తు”కు పెంచిన కులపతి — పుంభావసరస్వతి — ఆయన.
రూపాయ చేసే సెకెండు హ్యాండు [...]
నాగరిక్(The Citizen)1952 - బెంగాలి
బెంగాల్ విభజన జరిగినప్పుడు కలకత్తాకు వలసవచ్చిన ఒక కుటుంబం కథ ఈ నాగరిక్ సినిమా.ఇది రిత్విక్ ఘటక్ మొదటి సినిమా. 1952 లో ఈ సినిమా నిర్మాణం అయినప్పటికీ విడుదలయింది మాత్రం పాతికేళ్ళ తర్వాత. రిత్విక్ ఘటక్ మరణానంతరం సెప్టెంబర్ 20, 1977 న కలకత్తాలోని ఎంపైర్ సినిమాలో ఈ సినిమా మొదటిసారిగా ప్రదర్శించబడింది. సత్యజిత్ రే ’పథేర్ పాంచాలీ’ సినిమా తో భారతీయ సినిమా ప్రపంచానికి పరిచయం అయినప్పటికీ ఆ సినిమా [...]
గత ముప్పైసంవత్సరాలుగా తెలుగు జీవితాలలో, తెలుగు సినిమాలలో ప్రేమకథల్ని ప్రభావితం చేసిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరో చరిత్ర’. 1978 లో విడుదలైన ఈ చిత్రం సృష్టించిన సంచలనం ఇంతా అంతాకాదు. ఈ ఏటితో ఈ చిత్రానికి ముప్ఫైఏళ్ళూ నిండుతాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొంత తలుచుకుందాం.
నటుడిగా అభివృద్ధి చెందుతున్న దశలోవున్న కమల్ హాసన్, ఆ సినిమాతో పరిచయమైన ‘నల్లపిల్ల’ సరిత, మాధవి, జయవిజయ, శ్యామల, పి.ఎల్.నారాయణ, రమణ మూర్తి ఇందులో ముఖ్యతారాగణం. [...]