Menu

Videos Archive

ప్రస్థానం మొదలు ‘ప్రస్థానం’ వరకూ…దేవ కట్ట (వీడియో) ఇంటర్వ్యూ

‘వెన్నెల’ చిత్రంతో తన ఉనికిని చాటుకుని, ‘ప్రస్థానం’తో తెలుగు సినిమాకి కొత్తరంగులు అద్ది, కథను నమ్మే పాతవైభవాన్ని మళ్ళీతెస్తాడేమో అన్న ఆశలు రేపిన దర్శకుడు దేవ కౌశిక్ కట్టా.  కాంబినేషన్లు, మూసకథలు, కమర్షియల్ హంగులు, నిరర్థకమైన ఫార్ములాలే సినిమా అనుకుంటున్న తెలుగు పరిశ్రమ, అగాధపు అంచులు అందుకుంటున్న ఈ తరుణంలో వచ్చిన ఒక చల్లని తెమ్మెర దేవ కట్టా.  సంచలనాల్ని నమ్మే ప్రరిశ్రమలో స్వయంకృషిని నమ్ముకునొచ్చిన కార్యశీలి దేవ. సినిమా మీద ప్రేమ. ఎంచుకున్న పనిమీద నమ్మకం.

నేనూ నా వింతలమారి ప్రపంచమూ…

పోయిన డిశెంబరు చివరి  వారంలో మిత్రుడు శ్రీనివాస్ ఒక మంచి వ్యక్తి గురించి ఆయన తీసిన ఒక లఘు చిత్రాన్నీ పరిచయం చేశారు. పరిచయం చేయడమే కాకుండా ఆ లఘు చిత్రం మరియు దానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని నాకు అందచేశారు. ఆ రోజు నా పుట్టినరోజు కూడా. అప్పుడు చూడలేదు కానీ చూశాక మాత్రం ఆ వీడియో నా పుట్టినరోజున నాకు అందిన గొప్ప బహుమతిగా అనిపించింది. ఆ రోజు శ్రీనిఆస్ గారు నాకు పరిచయం

ఎలిపత్తయం

ఎలిపత్తయం (Elippathayam) అంటే ఎలుక బోను. ఇది ప్రముఖ మలయాళ దర్శకుడు అదూర్ గోపాల్ కృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన ఒక గొప్ప సినిమా. ఈ సినిమాకి గానూ బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు అదూర్. కేరళలో ఫ్యూడల్ వ్యవస్థ అస్తమిస్తున్న రోజుల్లో అదే భావజాలంలో నిండామునిగిపోయిన ఒక వ్యక్తి కథనాన్ని ఎంతో నైపుణ్యంగా ఈ సినిమాలో చిత్రీకరించారు అదూర్. ఈ సినిమా మొదట్లో చూడగానే చాలామంది బాబోయ్ అవార్డు సినిమా అని ఎగిరి

Hakob Hovnatanyan

హకొబ్ హొవ్నతాన్యన్ (Hakob Hovnatanyan) (1806-1881) ఒక ఆర్మేనియా కళాకారుడు. ఆ కళాకారుడి పైన 1967 లో వచ్చిన 10 నిమిషాల డాక్యుమెంటరి ఈ చిత్రం : Hakob Hovnatanyan. హకొబ్ హొవ్నతాన్యన్ portrait artist గా ప్రసిద్దుడు. మేటి ఐరోపా portrait కళాకారుల్లో ఈయన ఒకరు. పుట్టింది Tiflis లో(ఇప్పుడు అదే – Tbilisi, జార్జియా రాజధాని). నేర్చుకున్నది చర్చి కళాకారుడైన తన తండ్రి Mkrtum Hovnatanyan నుంచి. తన 23వ ఏట Academy of