పూర్తినిడివి సినిమా

డాక్యుమెంటరీ చిత్రాలు

తిరువిళయాడల్

తిరువిళయాడల్

“తిరువిళయాడల్” అంటే భగవంతుని ఆటలు అని అర్థం. “తిరువిళయాడల్ పురాణం” తమిళ శైవ వాఙ్మయంలో ఒక భాగం. అందులోని అరవై నాలుగు కథల్లోంచి ఎంచిన నాలుగు కథలు కలిస్తే ఈ సినిమా. నలుపు-తెలుపుల తెలుగు సినిమాల్లో “నవరాత్రి” సినిమా నాకెందుకో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ సినిమా తమిళ మాతృక తీసిన ఏ.పి.నాగరాజన్ ఈ తిరువిళయాడల్ కి కూడా దర్శకుడు. అదే ఏకైక కారణం ఈ సినిమా చూడ్డానికి. ఎందుకో గానీ నాకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది.(…)

సద్గతి ; కులవివక్ష పై సత్యజిత్ రే వ్యాఖ్యానం

సద్గతి ; కులవివక్ష పై సత్యజిత్ రే వ్యాఖ్యానం

1981 లో దూరదర్శన్ కోసం సత్యజిత్ రే దర్శకత్వం వహించిన లఘు/టెలి చిత్రం “సద్గతి”. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన అదేపేరుతో ఉన్న హిందీ లఘు కథ ఈ చిత్రానికి మూలం. అసలు ఈ సినిమాని సత్యజిత్ రే ఎందుకు చేయవలసి వచ్చింది అనడానికి, బహుశా సృష్టమైన సమాధానం లేదనుకుంటా. అందుకే ఈ “అవసరాన్ని” అర్థంచేసుకొనె దిశగా నా ఆలోచనని పదునుపెడతాను. సత్యజిత్ రే తీసిన సినిమాలన్నీదాదాపు బెంగాలీ భాషలోనే,ఒక్క రెండుతప్ప. అవి, “షత్రంజ్ కే ఖిలాడీ” మరియు మనం ఇప్పుడు చర్చిస్తున్న(…)

సంకట్ సిటీ – ఒక చీకటి సిటీ

సంకట్ సిటీ – ఒక చీకటి సిటీ

ఈ మధ్యకాలంలో కొందరు నటులుంటే చాలు ఆ సినిమా బాగానే ఉంటుంది అని నమ్మెయ్యదగ్గ “నమ్మకం” సంపాదించుకున్న నటుల్లో బాలీవుడ్ నటుడు కేకే(మీనన్) ఒకరు. హఠాత్తుగా ఒక పోస్టర్ చూసి ఇదేదో హాలీవుడ్ సినిమా ‘సిన్ సిటీ’ తరహాలో ఉందే అనుకుంటే ఆ సినిమా పేరే ‘సంకట్ సిటీ’ అని కనిపించింది. ఆ పోస్టర్ పైన కేకే బొమ్మ. ఇంకేం సినిమా చూసెయ్యాలని డిసైడ్ అయ్యాను. చూశాను. ఇదొక వెధవ సినిమా. సినిమాలో కనిపించే ప్రతిపాత్రా వెధవ(…)

The Cabinet of Dr. Caligari – వీడియో

1920 లలో జర్మనీ లో మొదలయిన కళాత్మక ఉద్యమమయిన భావవ్యక్తీకరణ వాదం (Expressionism) అప్పటి కళలను ఎంతో ప్రభావితం చేసింది. ఈ వాదం అప్పటి జర్మన్ సినిమాలలోనూ కనిపిస్తుంది. ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ శీర్షికన ఈ వారం జర్మన్ expressionism గురించి నవతరంగంలో వ్యాసాలు ప్రచురిస్తున్న సందర్భంగా Expressionism సినిమాలలో ముఖ్యమైన సినిమాగా భావించే ’The Cabinet of Dr. Caligari’ సినిమాను వీక్షించే అవకాశం నవతరంగం పాఠకులకు ఇక్కడ అందిస్తున్నాం. చూసి ఆనందించండి. గమనిక: ఈ(…)