సీజన్స్-ఒక లఘు చిత్రం
సంవత్సరం క్రితం ప్రకామ్య లో శ్రీనివాస్ అనే సభ్యుడు ఒక ప్రకటన చేశారు. అందులో తను తీయబోయే లఘు చిత్రానికి నేపధ్య సంగీతం అందించే వారు కావాలని ప్రకటించారు. ఆ ప్రకటనలో తన సినిమా కథ గురించి వివరించారు కూడా.
హైదరాబాద్ లోని ఒక లోకల్ రైల్వేస్టేషన్. పెళ్లయి, మూడునాలుగేళ్లయిన ఒక యువతి ఆఫీషు నుండి ఇంటికి వెళ్లడానికి స్టేషన్ కి వస్తుంది. ఆమెకు కాలేజి రోజులనాటి తన ప్రేమికుడు కనపడతాడు. చాలా రోజుల తర్వాత ఒకప్పటి తన [...]