లంకెలు

ఇతర సైట్ల వ్యాసాలకు లంకెలు

Big week-April 8th

Big week-April 8th

It is the beginning of the new quarter for the film industry. The previous quarter was not so good for many film industries. Telugu industry has done well so far and Hindi too has done fairly well. Other industries suffered majorly. This week (April 5th-11th) saw some major releases in all the languages. Primarily, Baadshah(…)

ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా

ఈ నెల నవతరంగంలో జాపనీస్ దర్శకుడు అకిరా కురొసావా మీద ఫోకస్ శీర్షికనా ప్రత్యేక వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి పాఠకులకు తెలిసిన విషయమే. ఇదే సమయంలో అంతర్జాల పత్రిక ఈ మాటలో అకిరా కురొసావా చిత్రాల్లో అత్యంతా ప్రఖ్యాతి గాంచిన ’రషోమన్ ’ సినిమా గురించి వ్యాసం వెలువడింది. ఈ సినిమా సారాంశం ఎంత శక్తి వంతమైనదంటే మనస్తత్వ శాస్త్రంలో ఈ సినిమా పేరుతో ఒక నిర్వచనం కూడా ఉంది. ఒకే సంఘటనకి సాక్షులైన వారి కథనాల్లో,(…)

“ఒకే ఒక్క చాన్స్..” కాదు.. ఇప్పుడు – “ఒకే ఒక్క నిముషం”

“ఒకే ఒక్క చాన్స్..” కాదు.. ఇప్పుడు – “ఒకే ఒక్క నిముషం”

సినిమా తీయాలన్న వుత్సాహం మీలో వుందా? సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? ఆ ఒక్క చాన్స్ ఎప్పుడు వస్తుందా అని వేచి వున్నారా? నిజం చెప్పమంటారా? అవకాశం మీ ఎదురుగానే వుంది. మీరు ఇంతవరకూ దీన్ని పట్టించుకోకపోవటమే ఆశ్చర్యం. అవునండీ, నేను చెప్పేది నిజం. సినిమా అంటే రెండున్నర గంటల నిడివి, ఎంతోమంది టెక్నీషియన్లు, షెడ్యూల్స్, అన్నింటినీ మించి అంతంత  డబ్బు పెట్టగలిగిన నిర్మాత, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్లు.. ఇవన్నీ కావాలనుకుంటున్నారా? అవేమీ అవసరంలేకుండానే మీరు సినిమా(…)

Oye Lucky Lucky Oye

Oye Lucky Lucky Oye

Oye Lucky Lucky Oye త్వరలో విడుదల కానున్న ఒక బాలీవుడ్ సినిమా. ఈ సినిమా దర్శకుడు దిబాకర్ బెనర్జీ. ఈ దర్శకుడు గతంలో Khosla ka Ghosla అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అభయ్ డియోల్ (Manorama Six Feet Under) మరియు నీతూ చంద్ర (గోదావరి, ట్రాఫిక్ సిగ్నల్) తో పాటు పరేష్ రావల్ (ట్రిపుల్ యాక్షన్), అనుపమ్ ఖేర్, రణవీర్ షోరేలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్స్(…)

నో స్మోకింగ్ – స్క్రీన్ ప్లే

నో స్మోకింగ్ – స్క్రీన్ ప్లే

హాలీవుడ్ లో అయితే ఒక సినిమా విడుదలవగానే ఆ సినిమా స్క్రిప్టు కూడా (most of the times) ఏదో ఒక వెబ్ సైట్ లో ప్రత్యక్షం అవుతుంది. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్యాశన్ ఫర్ సినిమా వెబ్ సైటు ఈ మధ్యనే కొన్ని ఉత్తమ స్క్రీన్ ప్లే లను పాఠకులు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కలుగచేసింది. ఈ సీరిస్ లో వచ్చిన మరో స్క్రీన్ ప్లే నో స్మోకింగ్.(…)

మనోరమ-సిక్స్ ఫీట్ అండర్-స్క్రీన్ ప్లే

మనోరమ-సిక్స్ ఫీట్ అండర్-స్క్రీన్ ప్లే

హాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే ‘ది బెస్ట్’ స్క్రీన్ ప్లే గా ‘The Chinatown’ అని చెప్తుంటారు. ఈ సినిమా చూసిన ఎవరైనా ఆ విషయంలో ఎంతో కొంతైనా ఏకీభవిస్తారు. అయితే ఈ సినిమా బేస్ గా చేసుకుని మన బాలీవుడ్ లో పోయిన సంవత్సరం వచ్చిన సినిమా ’Manorama – Six feet under’. దర్శకుడు నవదీప్ సింగ్ తో కలిసి దేవికా భగత్ రచించిన ఈ స్క్రీన్ ప్లే ‘Chinatown’ తో పోల్చలేకపోయినా ఈ(…)

వర్మతో ముఖాముఖి

వర్మతో ముఖాముఖి

Here is one more from PFC. రాంగోపాల్ వర్మ తో PFC మెంబర్స్ చేసిన ఇంటర్వ్యూ. అది కూడా వీడియో లో! It started with a review of Sarkar Raj posted on PFC that Ramu had read recently. He could not remember the name of the blogger. (i think it was Sudhir Nair’s review of Sarkar Raj) Ramu – so(…)

రాజకీయాల్లో సినిమా స్టార్స్

ప్యాశన్ ఫర్ సినిమా లో ఈ రోజు సుబ్రాత్ రాజకీయాల్లో సినిమా స్టార్స్ గురించి ఆసక్తికరమైన విశ్లేషణా వ్యాసం రాసారు. మన దేశపు రాజకీయాల్లో రాణించిన MGR, NTR దగ్గర్నుంచి త్వరలో పార్టీ స్థాపించబోతున్న చిరంజీవి గురించి, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లోనే సినిమా స్టార్ లు రాజకీయాల్లో ఎందుకు రాణిస్తున్నారో మిగిలినా రాష్ట్రాల్లో అలా జరగకపోవడానికి కారణాలను కూడా ఈ వ్యాసం లో రచయిత విశ్లేషించారు. First, let me start with debunking the most(…)

సుబ్రమణ్యపురం దర్శకుడితో ఇంటర్వ్యూ

మొన్నీ మధ్యనే విడుదలయిన తమిళ చిత్రం సుబ్రమణ్యపురం 2008 లో తమిళనాడులో విడుదలయిన చిత్రాల్లో నంబర్ వన్ గా నిలిచింది. నెలరోజులయినా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలక్షన్స్ తో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా దర్శకుడు శశికుమార్ తో రిడిఫ్ ఈ రోజు ఇంటర్వ్యూ ప్రచురించింది. When did you realise that there was a change in the taste of the Tamil audience? No change has taken place in(…)

సినిమా తీయడం ఎలా?

స్క్రీన్‌ప్లే అంటే ఏమిటి? అందులో రకాలు ఏమిటి? స్క్రీన్‌ప్లే ఎలా వ్రాసుకోవాలి? లో బడ్జెట్ సినిమాకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? సినిమా బడ్జెట్టు ఎలా అంచనా వెయ్యాలి? sets మీదకు వెళ్ళక మునుపు ముగించాల్సిన పనులేమిటి? రెడ్ వన్ కెమెరా అంటే ఏమిటి? ఎలాంటప్పుడు ఎటువంటి కేమెరా వాడాలి? Cinematography, Lighting, Sound Recording లాంటి ఎన్నో Technical విషయాల మీద అవగాహన కల్పించే ఉచిత పుస్తకం “Movie Making Manual” తారసపడింది. ఔత్సాహిక సినీ జీవులకు(…)

సినిమా కూడా ఒక పాఠ్యాంశం కావాలి:అదూర్ గోపాలకృష్ణన్

సినిమా కూడా పాఠశాలల్లో ఒక పాఠ్యాంశం కావాలి అని భావించే వారిలో ముఖ్యుడు అదూర్ గోపాలకృష్ణన్. తీసింది పది సినిమాలే అయినా ఒక్కొక్కటీ మరో పది తరాల వరకూ గుర్తుండి పోయే సినిమా. ఈ మధ్యనే ఈయన రూపొందించిన ’నాలు పెన్నుంగల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లోనో ప్రదర్శింపబడింది. ఫ్రాన్స్ లో జరిగిన ’ఫెస్టివల్ ఆఫ్ 3 కాంటినెంట్స్’ లో అతని సినిమా ప్రదర్శన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కూడా పాఠశాలల్లో చదవదగినదే అని(…)

రాంగోపాల్ వర్మ త్రిచిత్రాలు (Trilogy) – ఒక సామాజిక విశ్లేషణ

రాంగోపాల్ వర్మ మంచి దర్శకుడా, చెత్త దర్శకుడా అనే చర్చలు తను తీసిన ప్రతి సినిమా రిలీజైన తరువాత మన మధ్యన జరిగేవే. సినీవిశ్లేషకుల నుంచీ, సాధారణ ప్రేక్షకుడి వరకూ తన సినిమాలోని ప్రతి దృశ్యం, ప్రతి కెమెరా కోణం, ప్రతి పాత్ర కదలికా చాలా ఇష్టంగా చీల్చిచండాడుతాం. ఈ love -hate సంబంధానికి మూలకారణం, ఈ దర్శకుడు చాలా ప్రతిభావంతుడూ, సమకాలీన దర్శకుల నడుమ తనదైన ప్రత్యేకత కలిగినవాడూ అవడమే అని నా నమ్మకం. ఏది(…)

అమ్మో అభిమాన సంఘాలు

తెలుగు సినిమా హీరోల అభిమాన సంఘాల గురించి తెలుగు వన్ లో వ్యాసం సినిమా విజయంపై బెట్టింగులు,ఛాలెంజులు,సవాళ్ళు….తెరపై హీరోనో, హీరోయినో కనిపించగానే హారతులు,టెంకాయలు కొట్టడాలు, పోస్టర్ ల పైన హీరో బొమ్మలకు రక్త తిలకాలు….అవసరమైతే ఆత్మాహుతి యత్నాలకు కూడా వెనుదీయని ఉన్మాదం…. పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి    

54 వ జాతీయ చలనచిత్ర అవార్డులు

2006 సంవత్సరంలో విడుదలయిన భారతీయ సినిమాలకు ఇచ్చే అవార్డుల జాబితా ఈ రోజు విడుదలయింది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు బుద్ధ దేబ్ దాస్ గుప్తా అధ్యక్షతన జ్యూరీ చే ఎంపికచేయబడిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సందర్భంగా నవతరంగం తరుపున విజేతలకు హార్ధిక శుభాకాంక్షలు. గమనిక:అవార్డుల పూర్తి వివరాల కొరకు ఇక్కడ చూడండి ఉత్తమ చిత్రం : పులిజన్మం(మలయాళం) నిర్మాత:విజయ్ దర్శకత్వం:ప్రియనందన్ ఉత్తమ మొదటి సినిమా దర్శకునికిచ్చే ఇందిరా గాంధీ అవార్డు: ఏకాంతం (మలయాళం) దర్శకత్వం:మధు(…)

సర్కార్ రాజ్ సమీక్షలను సమీక్షించిన వర్మ

వివిధ వార్తా పత్రికలు, ఇంటర్నెట్ సైట్లలో వచ్చిన సర్కార్ రాజ్ సమీక్షకులు లేవనెత్తిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చి ఆశ్చర్య పరిచాడు వర్మ. If the point of a review is to critically analyze someone else’s work and to possibly inform/educate or psyche the viewer why to or why not to watch a particular film, I think it’s only fair that the filmmaker(…)

మహెక్-మరో సమీక్ష

గత నెల లో ’ఈ నెల సినిమా శీర్షిక’ లో పరిచయం చేసిన మహెక్ సినిమా ను ఈ మధ్యనే ఒక అమెరికన్ యూనివర్శిటీ సిలబస్ లో చేర్చడం జరిగింది. గతంలో ఈ సినిమా గురించి ఎన్నో సమీక్షలు/రిపోర్ట్ లు వచ్చినప్పటికీ హిందూ బిజినెస్ లైన్ లో వచ్చిన ఈ సమీక్ష లో ఈ సినిమా గురించి ఎన్నో వివరాలు అందచేసింది. Cinema should be taken seriously, otherwise we may end up with(…)

తెలుగులో అంతర్జాలంలో సత్యజిత్ రాయ్

మిత్రులారా,మన వెంకట్ మనందరికీ రానున్న మే నెలలో సత్యజిత్ రాయ్ గురించి రాయమన్నారు.ఆ మహా దర్శకుడి గురించి తెలుగులో అంతర్జాలంలో వెలువడ్డ కొన్ని లింకులు ఉపయోగపడొచ్చని ఇస్తున్నా.చూడండి మీరు రాసినవీ ఉన్నయేమో! అభిమాన కథ-ప్రజాకళ ఫోటోలు-పిరమిడ్ సాయిమీరా బ్లాగ్ నివాళి-తెలుగు జర్నల్ చిడియాఖానా-24fps రే విజ్ఞాన సర్వస్వం-దట్స్ తెలుగు 

మంచి సినిమాని ప్రోత్సాహించండి

సినీ గోయర్ సైటులో ఇటీవల విడుదలైన మీ శ్రేయోభిలాషి సినిమా గురించి ఒక వ్యాసం ప్రచురించబడింది. మంచి సినిమాలకు ఆదరణ కరువయిందని సత్యసాయి గారు ఆందోళన చెందుతున్నారు,’ఇంత అన్యాయమా? ఇలా చేస్తే మంచి సినిమా చనిపోతుంది’ అనే వ్యాసంలో. మీ శ్రేయోభిలాషి సినిమా కమర్షియల్ సినిమా కాదు అని సమాధానం చెబుతున్న ఆయా ఛానెల్ నిర్వాహకులు కమర్షియల్ సినిమాకూ, అవార్డు చిత్రాలకూ…ఇలా విడివిడిగా ప్రత్యేక నిర్వచనాలు ఇవ్వగలరా? పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.

అంతర్జాలంలో ఎల్వీ ప్రసాద్

అంతర్జాలంలో ఎల్వీ ప్రసాద్

నవతరంగం లో ఈ నెల ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన శ్రీ ఎల్వీ ప్రసాద్ పై ఫోకస్ శీర్షిక లో  వీలైనంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఆయన గురించి ఒక పరిచయ వ్యాసం ప్రచురింపబడింది. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ సినిమా గురించి ఒక వ్యాసం కూడా ఈ శీర్షికలో పొందుపరచబడింది.ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు ముందు మరిన్ని వ్యాసాలు నవతరంగంలో ప్రచురించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవతరంగంలో మాత్రమే కాకుండా(…)

తళుకు బెళుకులు కోరుతున్న మళయాల సినిమా

మన దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కళ లోపించిన సినిమాలు వస్తున్నా కేరళ లో మాత్రం కొద్దో గొప్పో మంచి సినిమాలు వస్తూ వుండేవి. ఈ మధ్య కాలంలో అక్కడి ప్రజలు కూడా బాగా మారిపోయారు. ఒకప్పుడు రియలిస్టిక్ సినిమాని ఎంతగానో ఆ దరించిన అక్కడి వాళ్ళు ఈ మధ్య తెలుగు తమిళం డబ్బింగ్ సినిమాలను ఆదరించడమే కాకుండా మలయాళం సినిమాల్లోనూ కమర్షియల్ హంగులు కోరుకుంటున్నారట. ఇదే విషయం గురించి వర్ణచిత్రం అనే వెబ్సైటు లో(…)

తెలుగువారి టైమ్పాస్-సినిమాలు

తెలుగువారి సినిమా పిచ్చి గురించి చెప్పేదేముంది. ఈ మధ్య బ్లాగులొచ్చి కొంతమందికైనా వేరే వ్యాపకం కల్పించాయి గానీ …..ఏదేమైనప్పటికీ తెలుగువారికి టైమ్పాసు కలిగించే సినిమాల గురించి చైతన్య పాటూరు ఇలా అంటున్నారు. అని చాలా రోజులే అయిందిగానీ ఇప్పుడు కళ్ళబడింది కాబట్టి ఇక్కడ ఇలా…. ఇక పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే అభిమానులకు పిచ్చ టైమ్పాస్ అవుతుంది. సినిమా కాస్త బాగుంటే(అభిమానులకి బాగుంటే) చాలు, మళ్ళీ మళ్ళీ చూస్తూనే వుంటారు. ఇంక వీరాభిమానులు అందుకోసమే ఆడియో విడుదల(…)

సినిమా వాళ్ళతో ముఖాముఖి

MSN ఇండియా వెబ్‍సైటు తెలుగులో వుందని తెలుసు గానీ పెద్దగా ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు చూస్తుంటే కొన్ని ఇంటర్వ్యూలు కనిపించాయి. “తెలుగు సినీ సాహిత్యం-భాషా సాహిత్య విలువలు” సదస్సులో పాల్గొన్న పరుచూరి “సినిమాల వల్ల జనం చెడిపోరని, సామాజిక విలువలే వారిని ప్రభావితం చేస్తాయని” అంటున్నారు. శ్యామ్ బెనగల్ తన ఇంటర్వూలో “పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటే ఇమేజ్ చట్రం అడ్డు వస్తుంది.” అంటున్నారు. పూరీ జగన్నాధ్ తన ఇంటర్వ్యూలో “నేను గనక సమాజాన్ని చైతన్య(…)

తెలుగు సినిమా-Myth and the Reality

ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల గురించి అందులో తనకి నచ్చిన నచ్చని అంశాల గురించి శ్రవణ్ తన బ్లాగు శ్రావణం లో ఇలా అంటున్నారు. “సిరా” లాంటి సినిమా కిచ్చే విలువ ఎలాగూ ఇస్తాం, కాని అన్ని సినిమాల్నీ ఇట్టా తీస్తే సినిమా(మనకి సంబంధించి నంత వరకూ) కి వున్న basic purpose అయినటువంటి ఎంటర్తైన్మెంట్ మిస్ అయిపొతాముకదా! అయినా మంచి సినిమాలు రావట్లేదని ఎవెరన్నారూ…”బొమ్మరిల్లు” నచ్చని తెలుగువాళ్ళు ఉంటారా(60 దాటని వాళ్ళు). అయినా ఓ కత్తిలాంటి(…)

అంతర్జాలంలో బి యెన్ రెడ్డి

ఈ నెల ఫోకస్ విభాగంలో బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి గురించిన సమాచారం అందించాలన్న ప్రయత్నం మొదలుపెట్టాము. ఈ నెలలో సాధ్యమైనంత సమాచారం సమకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాము. ఒక వేళ వీలు కాకపోతే రాబోయే రోజుల్లో కూడా బి యెన్ రెడ్డి సినిమాల గురించి, ఆయన గురించి వ్యాసాలు ప్రచురించే ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే ’కథను గాలికొదిలేసిన తెలుగు సినిమా’ అనే వ్యాసంలో రాజేంద్ర గారు బి యెన్ రెడ్డి గారి ఆలోచనలను పంచుకున్నారు. బియెన్ గురించి అంతర్జాలంలోనూ(…)

Download నవతరంగం

Download నవతరంగం

నవతరంగం వెబ్‌సైట్ మొదలుపెట్టి ఇప్పటికి నెల కావొస్తుంది. ఈ నెలలో దాదాపు 50 వ్యాసాలు ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసాలపై పాఠకుల స్పందన కూడా బాగానే వుంది. భవిష్యత్తులో మరింత మంది రచయితలు నవతరంగం రాసే అవకాశాలున్నాయి. దాంతోనే మరింతమంది పాఠకులను ఈ సైటు ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. తెలుగు సినిమాకి సంబంధించిన వెబ్ సైట్లు చాలానే ఉన్నప్పటికీ, ఆ వెబ్ సైట్లలో తెలుగులో వున్నవి తక్కువే. నవతరంగం ద్వారా ఆ కొరత తీర్చాలన్నది మా ప్రయత్నం.(…)

సినిమాలో విధ్వంసమవుతున్న సీమ సంస్కృతి పై ‘పొద్దు’లో వ్యాసం

అంతర్జాల తెలుగు పత్రిక పొద్దులో రాయలసీమ వాసి అయిన విశ్వప్రసాద్ గారు, నేటి తెలుగు సినిమా కర్తలు రాయలసీమ సంస్కృతి పేరిట తెరకెక్కిస్తున్న హింసాఖాండనీ, జుగుప్సాకరమైన సంభాషణలనీ విమర్శిస్తూ వ్యాసాన్ని వ్రాసారు. గ్రామ పార్టీల సమస్యపై కనీసం ‘సహానుభూతి’ కూడా లేని వాళ్లందరూ సీమ గ్రామపార్టీల కథలను రాసుకుని ఈ ప్రాంత సంస్కృతిని వక్రీకరించి సినిమాలు తీసి ఆంధ్రదేశమంతటా వెదజల్లడం సీమవాసులు చేసుకున్న దురదృష్టం… చిత్రసీమ ప్రముఖులు సీమకు చేస్తున్న తీరని ద్రోహం… నేరం…! పూర్తివ్యాసం ఇక్కడ.

జోధా అక్బర్

భారి వ్యయాలతో జోధా అక్బర్ సినిమా వస్తున్న తరుణంలో, “దీప్తి ధార” బ్లాగరు చీమకుర్తి భాస్కర రావు గారు అక్బర్ జీవితం గురించి కొన్ని చారిత్రిక ప్రశ్నలు మీ ముందుకు తెస్తున్నరు. అక్బర్ చరిత్రను పొందుపరిచిన అక్బర్నామా లో జొధాబాయి ప్రస్తావనే లేదని చరిత్రకారులు చెప్తున్నారు. అక్బర్,కచ్చవా వంశం, అంబర్ లోని, భార్ మల్ పుత్రిక హీరా కువారి ను వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అక్బర్ తన కొత్త మతం దిన్-ఎ-ఇలాహి ని ప్రకటించి, ఈమెకు మరియం(…)

నక్షత్రాలు నేల మీద…మరో TZP సమీక్ష

నా మదిలో బ్లాగు రచయిత ప్రవీణ్ తన అభిమాన నటుడు నటించి దర్శకత్వం వహించిన ’తారే జమీన్ పర్ ’ సినిమా గురించి ఇక్కడ రాస్తున్నారు. చదవండి. కొన్ని సినిమాలని టెక్నికాలిటీ దృష్టితో చూడలేము. టెక్నికల్గా ఇది వంద పర్సెంటు కరెక్టుగా లేదు అని మార్కులు వేయలేము. కొన్ని చోట్ల ఎసెన్సు గుర్తించడం ముఖ్యం. ఆ సినిమా తెచ్చిన అవేర్‌నెస్ ముఖ్యం. అనుభవించిన వారికి మాత్రం ఈ సినిమాలోని విషయాలు అర్థమవుతాయి ఈ సినిమా సమీక్షే కాదు,(…)

కొత్త సినిమా సమీక్షలు

ఈ మధ్యనే విడుదలయిన హిందీ సినిమా ’తారే జమీన్ పర్ సినిమా’ గురించి నాగరాజు గారు వివరణాత్మకంగా వ్రాసిన సమీక్ష “నేలకొరిగిన ఇంద్రధనుస్సు” ఆయన బ్లాగులో చదవండి. అమీర్ ఖాన్‌కి మంచి కథలు ఎన్నుకోవటం తెలుసు, సినిమాకి కావల్సిన సెట్టింగులూ, అందమైన సీన్లు తయారు చేసుకోవటం తెలుసు. కాని, సినిమా లాంటి ఒక అతి శక్తివంతమైన విశువల్ మీడియమ్‌ని ఎలా వాడుకోవాలో ఇంకా పట్టుబడినట్టుగా లేదు. అనవసరంగా చాలా సాగదీసాడు. ప్రేక్షకుల హృదయంలో చెరగని ముద్రపడేటట్టుగా చెప్పటానికి(…)

Okka Magadu Comical Review

ఒక్క మగాడు సినిమా సమీక్షని, సినిమా చూస్తున్న అనుభవాన్ని హాస్యభరితంగా శ్రీధర్ గారు తన బ్లాగులో వ్రాసారు. తెలుగు భారతీయుడు-’ఒక్క మగాడు’ (సారీ! ఇది హార్ట్ పేషెంట్లకు నిషిద్దం) ఆయన చెప్పినట్లు ఇది ఎవరినీ నొప్పించడానికి కాదు. అలానే అది సినిమా ఒక్క సాంకేతిక అంశాల సమీక్ష కాదు. చదవి ఆనందించండి.