పోలాండ్

పోలాండ్ సినిమా సమీక్షలు

Three colours – White

Three colours – White

ఎయిర్ పోర్ట్ కెరేజల్ మీదుగా ఒకదాని వెంట ఒకటిగా ముందుకు కదులుతున్న లగేజ్. అందులో ఓ మనిషి పట్టేసేటంత సైజులో ఉన్న పెద్ద పెట్టె మిగతా వాటితో పాటు ముందుకు కదులుతూ ఉండగా సన్నివేశం ఫేడవుట్ అవుతుంది. సూటు, బూటు వేసుకున్న ఓ మనిషి కాళ్ళు గబా గబా కదులుతూ పోతూ…..అంతలోనే కొంచెం కొంచెంగా వేగాన్ని తగ్గిస్తూ ఓ చోట ఆగుతాయి. అంత వరకు క్లోజ్ అప్ లో ఉన్న కెమెరా ఇప్పుడు మీడియం వ్యూలోకి వస్తుంది.(…)

Katyn-by Andrzej Wajda

Katyn-by Andrzej Wajda

’చరిత్ర ఎప్పుడూ విజేతల చేతే వ్రాయబడుతుంద’ని ఒక నానుడి. అందుకే రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆధారం చేసుకొని వచ్చిన చిత్రాల్లో సామాన్యంగా  ఎప్పుడూ హిట్లర్ అనుయాయులైన నాజీలనే దోషులుగా చూస్తాం. ఏమాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నా చరిత్రని వక్రీకరించారని నింద వేస్తారు. ఎన్నో లక్షలమంది ప్రాణాలు బలిగొన్న రెండవ ప్రపంచ యుద్ధంలో చరిత్ర పేజీల్లోకి ఎక్కని నిజాలెన్నో. కేవలం విజేతల విజయగాధలు, నాజీల అకృత్యాలతో నిండిపోయిన ఈ చరిత్ర పుస్తకంలో మరుగున పడిపోయిన భయంకరమైన మూకుమ్మడి హత్యల్ని(…)