ప్రపంచ సినిమా back to homepage

kane-lead సిటిజెన్ కేన్

1927లో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ‘ది జాజ్ సింగర్’ ప్రపంచంలోని మొట్టమొదటి టాకీ చిత్రం. అప్పటి నుండీ ఈ ఎనభయ్యేళ్లలో హాలీవుడ్ నిర్మించిన వేలాది సినిమాల నుండి జాగ్రత్తగా ఏరి వంద అత్యుత్తమ చిత్రాల జాబితానొకదాన్ని రూపొందిస్తే, వాటిలో మొదటి స్థానంలో నిలిచేది: ‘సిటిజెన్ కేన్’. 1941లో విడుదలైన ఈ నలుపు-తెలుపు చిత్రం విడుదలానంతరం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిలో ఓ మహాకావ్యంగా గుర్తింపు పొందితే, ఈ చిత్రం తీసి విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు [...]

wbush W.

దర్శకత్వం : ఆలివర్ స్టోన్. రచన: స్టాన్లీ వైసర్ నిర్మాతలు: మోర్టిజ్ బోర్మన్, జోన్ కిలిక్, బిల్ బ్లక్, ఆలివర్ స్టోన్ నటన : జాష్ బ్రోలిన్, ఎలిజబెత్ బాంక్స్, జేమ్స క్రామ్ వెల్, ఎల్లన్ బర్ స్టన్ తదితరులు. విడుదల: 17 అక్టొబరు 2008 ప్రపంచంలో చాలా మంది బుద్ధిమంతులకి జార్జ్ బుష్ అంటే మంట. అందులో నేనూ ఒకణ్ణి. బుష్ ద్వేషుల్లో ముందు వరసలో వుండే వాళ్ళల్లో ముందుండేవాడు ఆలివర్ స్టోన్. ఆయన గురించి [...]

enemy-lead ఎనిమీ ఎట్ ది గేట్స్

‘రెండవ ప్రపంచ యుద్ధాన్ని మలుపు తిప్పిన రోజు ఏది’ అన్న ప్రశ్నకి కొందరు చరిత్రకారులు ‘జూన్ 6, 1944′ (నార్మండీ వద్ద జరిగిన డి-డే పోరాటం) అంటే మరి కొందరు ‘డిసెంబర్ 7, 1941′ (పెర్ల్ హార్బర్ మీద జపాన్ వైమానిక దాడి) అంటారు. ఎక్కువమంది మాత్రం ముక్త కంఠంతో ‘జూన్ 22, 1941′ అని చెబుతారు. హిట్లర్ ఆదేశాలతో జెర్మన్ దళాలు సోవియెట్ యూనియన్ మీద మెరుపు దాడి చేసిన రోజది; ఇష్ఠమున్నా లేకున్నా స్టాలిన్ [...]

bar-lead Burn After Reading – Forget after watching

Coen brothers ఈ సారి meaningless comedyతో ముందుకొచ్చారు. గత సంవత్సరం ఆస్కార్ పంట పండించిన నో కంట్రీ ఫర్ ఓల్డ్ మన్ నే మసిపూసి మారెడుకాయచేసినట్టు ఉన్న ఈ Burn after reading సినిమా కాలక్షేపానికి ఒకసారి చూడొచ్చు. సినిమా అంతా చాలా ఆహ్లాదంగా నడిచినప్పటికీ ఎందుకో అనుకున్నంత స్ధాయిలొ లేదనిపిస్తుంది. ఒకవేళ హాలివుడ్ దీగ్గజాలందర్నీ పెట్టుకొని ఇలా spy comedy పేరుతో ప్లాట్‌ని పూర్తిగా మర్చిపోవడమే అందుకు కారణం కావచ్చు. కధలోకి వస్తే CIA [...]

bella-lead బెల్లా

సినిమాలు రకరకాలు. నచ్చేవి, నచ్చనివి, మళ్లీ మళ్లీ చూడాలనిపించేవి, ఒక్క సారికే విసుగెత్తించేవి, వెంటనే మర్చిపోయేవి, ఎన్నాళ్లైనా వెంటాడేవి. ‘బెల్లా’ (Bella, 2007 విడుదల) చివరి కోవకి చెందింది. ఇటువంటి సినిమాలు తీయటం కత్తిమీద సాము. మసాలాలు ఏవీ లేని ఈ కధని జనరంజకంగా మలచి విజయవంతం చేయటం దర్శక నిర్మాతల ప్రతిభ, ధైర్యం. చిన్న సంఘటనలు కొన్ని జీవితాలని ఎలా మలుపు తిప్పుతాయో ఈ చిత్రం చెబుతుంది. చిత్ర కధనం అంతా మూడు విలువల చుట్టూ [...]

ramchand-pakistani-2 రామ్ చంద్ పాకిస్తానీ

హఠాత్తుగా మనని పోలీసులు అరెస్టు చేసారనుకోండి..అందులోనూ ఈ ఇనఫర్మేషన్ ఏదీ మనవాళ్ళకి పాస్ చేయలేదు. పోనీ మనవాళ్ళు మనం కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ సమాధానం ఇవ్వటంలేదు.మనకేమో ఆ నరక కూపంలో ఎంత కాలం ఉండాలో తెలియదు… అప్పడుమన పరిస్ధితి ఏమిటి…ఇలాంటి పాయింట్ నే డీల్ చేస్తూ…భారత్-పాకిస్ధాన్ బోర్డర్ సమస్యను బ్యాక్ డ్రాప్ లో చేసుకుని ‘రామ్ చంద్..పాకిస్ధానీ’ అనే పాకిస్దానీ సినిమా రెండు వారాల క్రితం వచ్చింది. ఎనిమిదేళ్ళ రామ్ చంద్ చాలా అల్లరి [...]

staff_of_ra Raiders of the Lost Ark-ఒక సమీక్ష

పరిచయం:అతనికి James Bond లాగా గాడ్జెట్స్ లేవు, వున్నదల్లా ఒక కొరడా ఒక చిన్న తుపాకి. తల పై ఒక తోపి, మాసిన గడ్డం, అంతకన్నా మాసిన దుస్తులు. అయనకి పాములు అంటే చాలా భయం, ఎప్పుడు చూసినా ఏదో  ఒక చిక్కు లో పడుతూ వుంటాడు.నేను ఎవరు గురించి చెప్తునానో మీకు అర్తం అయ్యుంటుంది ఈ పాటికి. 1981 లో అపర బ్రహ్మ స్టీవెన్ స్పీల్బర్గ్ దర్సకత్వం లో విడుదులై సినీ ప్రపంచాన్ని ఒక ఊపు [...]

bridge-on-river-kwai-lead The Bridge on River Kwai

ఈ సినిమా సంగతేంటి? వంద మంది విమర్శకులను పిలిపించి, ఈ శతాబ్దపు 100 అత్యుత్తమ ఆంగ్ల చిత్రాల జాబితా పొందుపరచమని చెబితే, ప్రతి ఒక్కరి జాబితాలో ఈ చిత్రానికి ఏదో ఒక స్థానం ఖచ్చితంగా లభించి తీరుతుంది. పోస్టర్లు చూసి “ఇది యుద్ద నేపథ్యం గల సినిమాలా ఉందే…ఆ..ఏముంది…రెండు దేశాలు కొట్టుకుంటాయి…కనీళ్ళు తెప్పించేలా సైనికుల త్యాగాలను చూపి ఉంటారు అంతే..”అనుకుంటే, తప్పులో కాలు వేసినట్లే. యుద్ద నేపథ్యం ఉన్నా, కథ యుద్దం చుట్టూ, దేశాల చుట్టూ కాక [...]

california_dreamin California Dreamin’-ఈ నెల సినిమా

సినిమా:California Dreamin’ దేశం: రోమానియా దర్శకుడు:Cristian Nemescu కాలం:2008 ఈ సినిమా గురించి చెప్పేముందు ఈ సినిమా దర్శకుని గురించి చెప్పుకోవాలి.ఈ సినిమా దర్శకుడు Cristian Demescu. ఈ సినిమా ఎడిటింగ్ పూర్తికాకూండానే ఒక ఏక్సిడెంట్ లో మరణించాడు. ఆయనకు నివాళులర్పిస్తూ పూర్తిగా ఎడిటింగ్ జరగకుండానే Cristian Demescu వుండగా ఎలా వుందో అలాగే ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. అందుకే ఈ సినిమాకు క్యాప్షన్ endless అని వుంటుంది. కానీ చాలా మంది రోమానియన్లు [...]

when-harry-met-sally When Harry Met Sally(1989)

హాలీవుడ్ లొ ఏక్షన్,సస్పెన్స్ ధ్రిల్లర్స్ కి ఎంత ఆదరణ ఉంటుందో, రొమాంటిక్ సినిమాలకు కూడా అంతే ఆదరణ. ప్రతి సంవత్సరం చెప్పుకోదగ్గ సంఖ్య లో ఈ కేటగిరీ  చిత్రాలు విడులదవుతూ  ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రం పేరు “వెన్ హ్యారీ మెట్ సేలి”. ఈ సినిమా అంతా ఒకే లైన్ మీద నడుస్తుంది, “ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య పరస్పర శారీరక ఆకర్షణ కి అతీతంగా స్వచ్చమైన స్నేహం అనేది ఉంటుందా?” అని. Men and women [...]

wall-e-lead Wall-E (2008)

“Wall-E” – యానిమేషన్ ప్రియుల్లో ఇటీవల భారతదేశానికి (ఎట్టకేలకు) వచ్చిన ఈ సినిమా పేరు వినని వాళ్ళు ఉండకపోవచ్చు. పిక్సార్-డిస్నీ కాంబినేషన్ లో వచ్చిన తొమ్మిదో యానిమేషన్ చిత్రం. తక్కిన ఎనిమిదీ – టాయ్ స్టోరీ-1 (1995), టాయ్ స్టోరీ-2 (1999), బగ్స్ లైఫ్ (1998), మాన్స్టర్స్ ఇంక్ (2001), ఫైండింగ్ నెమో (2003), ఇన్క్రెడిబుల్స్ (2004), కార్స్ (2006) మరియు రాటాటూయీ (2007). వీటిలో రాటాటూయీ గురించి నవతరంగంలో ఇదివరకే ఓ వ్యాసం వచ్చింది. తక్కిన [...]

shawshank-redemption-lead The Shawshank Redemption (1994)

పరిచయం:హాలివుడ్ లో “ఆల్  టైం గ్రేట్” లు గా నిలిచిన చిత్రాలలో ఒకటి “ది షాషంక్ రెడెంప్షన్” అనే ఈ చిత్రం. ఆశ (Hope),ఇదే  మనిషికి జీవనాధారం. రేపటి మీద ఆశ లేకుంటే జీవితమే పెద్ద ప్రశ్నార్ధకమవుతుంది. కష్టాల్లో కూడా మనిషిని నిలిపేది,నడిపించేది రేపటి మీది ఆశే అనేది ఈ సినిమా లోని అంత:సూత్రం. చక్కటి కధ,స్క్రీన్ ప్లే,మంచి  నటన ఈ సినిమా లో ఆకట్టుకొనే అంశాలు. ముందు ఒక్కసారి ఈ సినిమా కధ : తన [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories