కొరియా

కొరియా సినిమా సమీక్షలు

Bakha satang – పిప్పరమెంటు బిళ్ళ లాంటి సినిమా

Bakha satang – పిప్పరమెంటు బిళ్ళ లాంటి సినిమా

ఉపోద్ఘాతం మీకెప్పుడైనా  ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందా? కనీసం చావు మీదకి మనసు మళ్ళిందా? అసలు ఒక మనిషికి చావాలనే కోరిక ఎందుకు కలుగుతుందో అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? మీరెప్పుడైనా నిద్ర లేవగానే  పిప్పరు మెంటు బిళ్ళ తిన్నారా? న్యూటను గమన సూత్రాలని ఒక పసి పిల్లవాడితో ఆడుకుంటం ద్వారా మీ విద్యార్థులకి మరింత బాగా చెప్పొచ్చనే ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? జీవితం మీద విరక్తి అంటే ఏమిటో మీకెప్పుడైనా అవగతమైందా? కడుపులో దేవేసే సన్నివేశాలని ఎప్పుడన్నా(…)

భావోద్వేగాల ప్రయాణం ‘ద వే హోం’

భావోద్వేగాల ప్రయాణం ‘ద వే హోం’

మా చిన్నప్పుడు వేసవి సెలవులకు అమ్మమ్మగారింటికి మా అమ్మ తీసుకెళ్ళేది. వెళ్ళేటప్పుడు సరదాగానే ఉండేది కాని వచ్చేటప్పుడు ఒకటే ఏడుపు. నేనయితే పారిపోయేవాడ్ని.నన్ను వెతకటానికి మా మామయ్యలు పరుగెట్టేవారు. అలాంటి అనుభవం మళ్ళీ ఇన్నాళ్ళకు ద వే హోం సినిమా చూస్తూంటే కలిగింది. అప్పటి సంగతులన్నీ కలసికట్టుకుని ఒక్కసారిగా కళ్ళముందు ఆడాయి. అందుకేనేమో టైటిల్ ఇంటికి దారి అనే పేరు పెట్టారు. నిజానికి ఇది పెద్ద కధేమీ కాదు. ఊహకందని ట్విస్టులు అస్సలే లేవు.రెండు పాత్రలు ఒకరితో(…)

II Mare

II Mare

కొన్నేళ్ళ క్రితం వచ్చిన ప్రేమలేఖ సినిమా గుర్తుందా. ఐతే ఈ కధ గురించి మీకు పెద్దగా వివరించక్కర్లేదు. అందులోలానే ఇక్కడ కూడా హీరోహీరోయిన్లు ఉత్తరాల ద్వారానే ప్రేమించుకుంటారు. ఇక్కడ తేడా ఏంటంటే ప్రేమలేఖ సినిమాలో అజిత్, దేవయాని వేరు వేరు రాష్ట్రాలలో ఉండి కలుసుకోవడం కుదరకపోతే, ఇక్కడ హీరో హీరోయిన్లిద్దరూ వేరు వేరు కాలాల్లో ఉండడం వల్ల కలుసుకోలేరు.ఇలాంటి ఐడియాలతో చాలా హాలీవుడ్ ధ్రిల్లర్స్ చూసే ఉంటాం, కానీ ఒక ఫీల్‍గుడ్ ప్రేమకధను మాత్రం ఊహించలేం. కొరియన్(…)