ఇరాన్

ఇరాన్ సినిమాల గురించి

About Elly – మనసు నాటకం

About Elly – మనసు నాటకం

కొన్ని మనం వదిలేయాలనుకుంటాం..కొత్తగా జీవించాలని ఆశపడతాం.  కానీ అవి మనని వదలవు ..అంతలోనే కొత్తవి అల్లుకుపోతుంటాయి. ఏం చేయాలోతోచదు..  అప్పుడు మనని మనమే వదిలేయాలని నిర్ణయించుకుంటాం !! తమ సమస్యని కాలం కూడా పరిష్కరించలేదని భావించిన మనిషి ఏం చేస్తాడు ??? !! ఈ సినిమా డౌన్లోడు అవుతుండగా.. మధ్యలో ఒకసారి క్వాలిటీ చెక్ కోసం ప్లే చేసాను. చూడతగ్గ క్వాలిటీ లేకుంటే డౌన్లోడు వేస్ట్ కదా అందుకే !   క్వాలిటీ ఒకే..కానీ ప్లే అవుతున్న (…)

A Separation – ఓ విడతీత

A Separation – ఓ విడతీత

రాత్రి 12 గంటలు. ఫేస్బుక్కుతో విసిగి..ఇహ పడుకుందాం అనుకుంటున్నా.. కానీ నిద్ర రావటం లేదు. ఏం చేయాలబ్బా.. సరే సినిమా చూద్దం కాసేపు..నిద్ర వచ్చేవరకు..  ఏదైనా.. దించుకున్న సినిమాల లిస్ట్ వెతుకుతుంటే కనిపించింది. ఈ సినిమా ‘ దించుకొని’  చాలా రోజులైంది. ఒకటో రెండు సార్లు అలా  ముందుకీ వెనక్కీ తిప్పి చూసాను. ఎక్కడా చూడు ఓ ఇద్దరు ముగ్గురు మనుషు, ఓ ముసలాడూ  ఏవో మాటలూ ….సర్లే ఏదో ఓపికతో చూడాల్సిన  సినిమాలాగా ఉన్నది అని(…)

Children of Heaven

Children of Heaven

అలీ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు బాగుచేయించడానికి తీసుకెళ్ళిన తన చెల్లెలు జహ్ర షూస్‌ను దారిలో పోగొట్టుకుంటాడు. కొత్త షూస్ కొనే స్థోమత తండ్రికి లేకపోవడం , చెబితే కొడతారనే భయం ఆ అన్నాచెల్లెల్లిద్దరూ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచేలా చేస్తాయి. అలీకి ఉన్న చినిగిపోయిన స్నీకర్స్‌నే ఇద్దరూ జాగ్రత్తగా పంచుకుంటారు. ఒకరు ఉదయం పూటా ఇంకొకరు మద్యాహ్నం పూటా స్కూల్‌కి వెళ్తూ పోయిన షూస్‌ని వెతికే పనిలో ఉంటారు. ఈ ప్రయత్నంలో వాళ్ళ పరిధికి మించి(…)

Color of Paradise

దేశం:ఇరాన్ దర్శకుడు: మజిద్ మజిది కాలం:1999 ఇరాన్ దేశం ప్రపంచానికి కొన్ని చక్కటి దర్శకులని ఇచ్చింది. వారిలో నేను చూసిన వారు ఇద్దరు. ఒకరు అబ్బస్ ఖిరొత్సమి మరొకరు మజిద్ మజిది. ఈ ఇద్దరిది ఎవరి శైలి వారిదే. ఈ చిత్రం ఒక అంధుల పాఠశాలలో మొదలవుతుంది. పిల్లల పరిక్షలయిపోయి ఇంటికి వెళ్ళదానికి ఎదురు చూస్తూంటారు. వారిలో మొహమ్మద్ ఒకడు. అతడికి అందరి పిల్లల్లనే ఉత్సాహం ఎక్కువ. మంచి దయగలవాడు కూడాను. అంధుడైనా ఎవరి మీదా ఆధారపడకుండా(…)

Persepolis

ఈ చిత్రం క్రితం ఆదివారం చూసాను. ఇది ఈ నెలలొ 5వ ఫ్రెంచి సినిమా. నేను Talk Cinema కి వెళ్ళినపుడు, ఈ చిత్రం మీద అభిప్రాయాలు విన్నాను. ఇది animated చిత్రం. దీనికి Oscar nomination కూడ వచ్చింది. ఇదే పేరుతొ వచ్చిన graphic novel ఆధారంగా తీసిన చిత్రం ఇది. ఫ్రెంచి చిత్రమయిన, కధ ఇరానీన్. నాకు చిత్రం ఫార్సిలో ఉంటే ఇంకా బావుండేది అనిపించింది. ఈ కధ కాస్త ఇరాన్లోను, కాస్త ఆస్ట్రియాలోను(…)