|
The Shawshank Redemption (1994)
పరిచయం:హాలివుడ్ లో “ఆల్ టైం గ్రేట్” లు గా నిలిచిన చిత్రాలలో ఒకటి “ది షాషంక్ రెడెంప్షన్” అనే ఈ చిత్రం. ఆశ (Hope),ఇదే మనిషికి జీవనాధారం. రేపటి మీద ఆశ లేకుంటే జీవితమే పెద్ద ప్రశ్నార్ధకమవుతుంది. కష్టాల్లో కూడా మనిషిని నిలిపేది,నడిపించేది రేపటి మీది ఆశే అనేది ఈ సినిమా లోని అంత:సూత్రం. చక్కటి కధ,స్క్రీన్ ప్లే,మంచి నటన ఈ సినిమా లో ఆకట్టుకొనే అంశాలు. ముందు ఒక్కసారి ఈ సినిమా కధ : తన [...] |
|
KungFu Panda (2008)
kungfu panda డ్రీమ్‍వర్క్స్ వారి యానిమేషన్ చిత్రం. కుంగ్‍ఫూ నేర్చుకోవాలనుకుంటున్న ఓ పండా (panda) కథే ఈ సినిమా. చాలా యానిమేషన్ సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా అంతర్లీనంగా జీవితం ఉంది. జీవిత సత్యం ఉంది. కానీ, ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి అంటే, ఆద్యంతమూ హాస్యంతో నవ్విస్తూనే ఆ విషయాన్ని చెప్పడం. సెంటీ డైలాగులు, సెంటీ సీన్లూ లేకుండానే సినిమా ద్వారా చెప్పదలుచుకున్న సీరియస్ విషయాన్ని తేలిగ్గా చెప్పేసారు. కథ విషయానికొస్తే, పో (po) [...] |
|
హెల్ బాయ్ (2004)
పరిచయం:సూపర్ హీరోలు సినిమాలు కొంతవరకే భరించగలము. స్పైడర్ మ్యాన్ అయినా, సూపర్ మ్యాన్ అయినా, బ్యాట్ మ్యాన్ అయినా లేదా కొత్తగా వచ్చిన ఐరన్ మ్యాన్ అయినా కొన్నాళ్ళ వరకే ప్రేక్షకులను ఆకట్టుకోగలవు. కామిక్ బుక్స్ నుంచి, టివి కి ఎదిగి, ఆ తర్వాత సినిమా తెరపైకి ఎక్కిన ఎంతోమంది సూపర్ హీరోలు నేడు మనకి ఉన్నారు. ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళు (ఐరన్ మ్యాన్, హల్క్) తోడవుతూనే వున్నారు. అలాగే కొత్త దర్శకుల చేతుల్లో పాత [...] |
|
Casablanca (1942)
“కాసాబ్లాంకా” – సినిమా గురించి వినడమే కానీ, ఇప్పటిదాకా చూడలేదు. చూశాక దాన్ని గురించి సాయంత్రం నుండి ఇప్పటిదాకా ఎన్నిసార్లు తలుచుకున్నానో లెక్కలేదు. సినిమా చారిత్రక విలువ నాకు పూర్తిగా అవగతం కాలేదు కానీ, సినిమా మాత్రం నాకు చాలా నచ్చేసింది. కథ: రిక్ అన్న అమెరికా నుంచి వలసొచ్చిన వ్యక్తి కాసాబ్లాంకా లో ఓ క్లబ్బు నడుపుతూ ఉంటాడు. ఇక్కడ రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. రిక్ కాస్త సీరియస్ టైపు గా పేరు పడ్డ [...] |
|
The Dark Knight (2008)
“డార్క్ నైట్” సినిమా రిలీజైన మొదటిరోజు నుండే సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రిలీజవడానికి ముందు నుంచే ఈ సినిమా కోసం ఎదురుచూసిన వారు ఎంతమందో నాకు తెలీదు కానీ, రిలీజవగానే imdb రేటింగుల్లో అమాంతం మొదటి స్థానానికి ఎగబాకడంతో కలిగిన కుతూహలం కొద్దీ ఇక్కడ రిలీజైన మొదటివారంలోనే ఆ సినిమా చూసిన వారిలో నేనొకదాన్ని. ముందు బ్యాట్‍మ్యాన్ సినిమాలు చూసిన అనుభవం లేకపోయినా కూడా, ఈ సినిమా చూశాక తక్కినవి కూడా చూడాలనిపించింది. ఇంత [...] |
|
Zodiac (2007)
1960-70 లలో అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలో భయభ్రాంతులు సృష్టిస్తాడు జోడియాక్ అనే సీరియల్ కిల్లర్. అతన్ని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలన్న శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసు విభాగంలో డిటెక్టివ్ గా వున్న David Toschi, స్వతంత్రంగా ఈ కేసుని పరిశోధించాలని ప్రయత్నించే పత్రికా విలేఖరి Paul Avery, వేరెవ్వరికీ పరిష్కరించ సాధ్యమవ్వని ఈ కేసుని తన మనోబలంతో పరిష్కరించగలడనుకునే కార్టూనిస్ట్ Robert Graysmithల కథే జోడియాక్. అమాయకులైన ప్రజలను అమానుషంగా చంపడమే కాకుండా, తన తదుపరి యత్నాలను ఎప్పటికప్పుడూ [...] |
|
శ్యామలన్ – ది హ్యాపెనింగ్
శ్యామలన్ తెలివైనవాడో, ఫూలో అర్ధంకాదు. కొన్ని sceneలు అద్భుతమనిపించేలా ఉంటాయి. కొన్ని పిచ్చిగా ఉంటాయి. ఈ సినిమాని క్లైమాక్స్ కట్ చేసేసి విడుదల చేసి ఆ రహస్యమేదో ప్రేక్షకుల్నే తెలుసుకొమ్మని( antonioniలా) వదిలేస్తే సరిపోయేదనుకొంట. అప్పుడు తాను చెప్పాలనుకున్న point (ప్రకృతిని మనిషి జయించలేడు) clearగా pass అయ్యేది. ఇలా చివర్లో తానే ఎదోక justification ఇచ్చేద్దామన్న తొందరపాటులో తనతో ప్రేక్షకులు ఏకీభవించలేరన్న విషయాన్ని మరిచిపోయాడు. అయినా ఈ సినిమాని photograpy కోసమైనా ఒక్కసారి చూడొచ్చు. ఇంకా [...] |
|
ది హ్యాపెనింగ్
ఈ సినిమా గురించి మరీ ఎక్కువగా రాసి ఇప్పటికే నేను వేస్ట్ చేసిన సమయాన్ని మరింత పెంచదలుచుకోలేదు కనుక చెప్పాల్సిన విషయాన్ని స్ట్రైట్ గా చెప్పేస్తాను. శుక్రవారం గనుక ఆఫీస్ లో మేనేజర్ ఆదమరిచివుంటాడనే కాన్ఫిడెన్స్ తో మధ్యాహ్నం లంచ్ సమయంలో వెళ్ళి చూసొచ్చాను ఈ సినిమా. కథ పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు. అప్పుడెప్పుడో వచ్చిన తెలుగి సినిమా జంపలకడి పంబ లో జనాలు ఏదో మందు కలిపిన నీళ్ళు తాగి మొదటి స్టేజ్ లో [...] |
|
రాటటూయీ (2007)
రాటటూయీ అకాడెమీ అవార్డు అందుకున్న యానిమేషన్ చిత్రం. ఇలా చెప్పడం మీలో కాస్త కుతూహలం కలిగించవచ్చు. మినిమమ్ గ్యారంటీ నమ్మకం కలిగించవచ్చు. ఇది పిక్సార్ సంస్థ తీసింది అనగానే యానిమేషన్ ప్రియులకి అయితే, “అయితే ఓకే” అనిపించి ఉంటుంది. అలా అనుకున్నా కూడా, ఎలుకల మీద సినిమా అన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇన్నాళ్ళూ చూడలేదు. చివరికి తెగించి చూసాక గానీ అర్థంకాలేదు ఈ సినిమాని వీలుంటే చూసి తీరాలి అని. యానిమేషన్ ఎలుకలకూ, నిజం ఎలుకలకూ చాలా [...] |
|
3:10 టు యుమా – మరో సమీక్ష
ఎప్పటి నుంచో ఎంతో మంది “3:10 to Yuma” సినిమా గురించి చెబుతూనే ఉన్నారు, అద్భుతమయిన సినిమా అని. చూద్దామనుకుంటుంటే ఇన్నాళ్ళకు తీరింది. సినిమా నచ్చింది అన్నది అండర్ స్టేట్‌మెంటవుతుంది. చాలా బాగా నచ్చింది. ఇంతకీ నేను చూసింది ౨౦౦౭ లో విడుదలయిన సినిమా. ఇది ౧౯౫౭ లో విడుదలయిన పాత “3:10 to Yuma” కి రీమేకు. సినిమాకు హైలైటు “రసెల్ క్రో” (గ్లాడియేటరు చూసిన వారికి రసెల్ క్రో గురించి చెప్పక్కర్లేదనుకుంట.) టూకీగా సినిమా [...] |
|
3:10 టు యుమా – సమీక్ష
కథ:Ben Wade(రస్సెల్ క్రౌ) అనే గజ దొంగ దాదాపు ఇరవై కి పైగా దోపీడీలు చేసి పరారీలో వుంటాడు. మరో కొత్త దోపిడీ ప్రయత్నంలో అనుకోని పరిథితుల్లో ఒక మూరమూల ప్రాంతంలో దొరికిపోతాడు. అతన్ని బంధించి చట్టానికి అప్పచెప్పాలంటే రెండు రోజులు గుర్రాల పై ప్రయాణం చేసి కంటెనెషెన్ పట్టణం చేరుకుని అక్కడ 3:10 గంటలకి Yuma బయల్దేరి వెళ్ళే రైలులో అతన్ని ఎక్కించాలి. క్షణంలో తుపాకీ గుళ్ళ వర్షం కురిపించగల Ben Wade ని రెండు [...] |
|
The man from earth (2007)
ఇది 2007 లోనే వచ్చిన సినిమా అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది ఇంకా. అంత లో-ప్రొఫైల్ గా వచ్చి వెళ్ళినట్లు ఉంది. ఇండీ ఫిలిం అంటారట ఈ సినిమా వంటి వాటిని. అదే – ఇండిపెండెంట్ ఫిలిం అని. హాలీవుడ్ స్టూడియో సిస్టం తో సంబంధం లేకుండా నిర్మించిన చిత్రాలని అలా పిలుస్తారంట.ఇవి మామూలు కమర్షియల్ చిత్రాల్లా కాకుండా కాస్త భిన్నంగా ఉండే చిత్రాలు కూడా అని చదివాను. ఇక విషయానికొస్తే, మేన్ ఫ్రం ఎర్త్ (భూమికి [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |