అమెరికా

హాలీవుడ్ సినిమా సమీక్షలు

the first grader – స్పూర్తి దాయకం

the first grader – స్పూర్తి దాయకం

  కెన్యాలో,  1953 వ సంవత్సరంలో బ్రిటీషుపాలనకి వ్యతిరేకంగా కొన్ని తెగలు  సాయుధ పోరాటం జరిపాయి . ఆ పోరాటంలో ఎందరో మరణించారు. వేలకొద్దీ జైలుపాలయ్యారు. కొందరు  చిత్రహింసలు అనుభవించారు. ఎట్టకేలకి స్వాతంత్రం సిద్దించినా చాలా మందికి కలిగిన కష్టనష్టాలు..బాధలు..గాయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.   ఓ గుడిసె..  ఎనభైఏళ్ళ ముసలాడు   ఒంటరి జీవితం, గతం తాలూకు జ్ఞాపకాలతో బతుకుతుంటాడు. కొత్త ప్రభుత్వం అందరికీ  ఉచిత ప్రాధమిక విద్య అని ప్రకటిస్తుంది. ఊరూరా స్కూళ్లు వెలుస్తాయి. ఎక్కడెక్కడి(…)

Paris, Texas – కలిసిన దూరాలు.

Paris, Texas – కలిసిన దూరాలు.

 తెలియని పయనం ..లేదు గమ్యం.. ఏదీ బ్రతుక్కు అర్థం. ఉన్నట్టే ఉంటుంది.. మాయమవుతుంది. మాయమయ్యింది మళ్ళీ వస్తుంది.అప్పుడే ఆనందం…అంతలోనే దుఃఖం ఇస్తుంది మనసులకి ముడులేస్తూ … విప్పేస్తూ మనుషులని కలుపుతూ ..విడగొడుతూ  దేవుడో  దయ్యమో అర్థం కానిదే  ‘అది’ ప్రేమించటానికి ఎన్ని కారణాలుంటాయో ..విడిపోవటానికీ అన్నే ఉంటాయి. ప్రేమ అకస్మాత్తుగా వస్తుంది. కాని దాన్ని నిలబెట్టుకోవటం మాత్రం కష్టమవుతుంది.  ప్రేమ ఎంత త్వరగా ..  బలంగా కలగొచ్చో .. విడిపోవటమూ అంత సులభంగా  జరగొచ్చు. కొన్ని సార్లు(…)

The Hobbit – Desolation of Smaug

The Hobbit – Desolation of Smaug

1. సీ. మొదటి భాగము మెండు ముచ్చట కల్పించె, హాబిట్టు కథజూడ నబ్బురమ్ము కథకు నాయువుపట్లు కదలివచ్చిరి షైరు, గాండాల్ఫె వెనుదన్ను కారణమ్ము బిల్బోను జతచేర పిలువవచ్చిరి వారు, సాహసయాత్రకు సత్వరమ్ము తాతల రాజ్యము తమ ధనాగారము, కబళించె నొక్క రాకాశిబల్లి తే. అంతమొందించి దానిని స్వంతసొమ్ము, చేత చిక్కించుకొనవలె శీఘ్రతరము పరహితమ్ముండు పరదేశ పయనముండు, గాన మరుగుజ్జులన్ బిల్బొ కలసి సాగె 2. తే. పూర్వ రంగము కొద్దిగా పొందుపఱచి, బిల్బొ కథలోకి ఎటులొచ్చె పిసరుచెప్ప(…)

Moulin Rouge

Moulin Rouge

Baz Luhrmann and his romance with musicals is a blessing from the conventional boy-meets-girl plots in the modern era of films. Going back to the colorful old-French 1890s, the dancing, singing and entertaining people with more than just performing but giving an experience worth more than money, Moulin Rouge is a fine example of how(…)

సిటిజెన్ కేన్

సిటిజెన్ కేన్

1927లో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ‘ది జాజ్ సింగర్’ ప్రపంచంలోని మొట్టమొదటి టాకీ చిత్రం. అప్పటి నుండీ ఈ ఎనభయ్యేళ్లలో హాలీవుడ్ నిర్మించిన వేలాది సినిమాల నుండి జాగ్రత్తగా ఏరి వంద అత్యుత్తమ చిత్రాల జాబితానొకదాన్ని రూపొందిస్తే, వాటిలో మొదటి స్థానంలో నిలిచేది: ‘సిటిజెన్ కేన్’. 1941లో విడుదలైన ఈ నలుపు-తెలుపు చిత్రం విడుదలానంతరం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిలో ఓ మహాకావ్యంగా గుర్తింపు పొందితే, ఈ చిత్రం తీసి విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు(…)

“టుడేస్ స్పెషల్”

“టుడేస్ స్పెషల్”

పరదేశం పోయి ఏళ్ళ తరబడి నువ్వు అక్కడ నివసించినా..నీ మూలాలు మాత్రం నువ్వు బయలు దేరిన చోటే ఉంటాయి. నువ్వెక్కడ పుట్టావో అదే నీ వూరు! వూరు మారినా ఉనికి మారదు….. చెప్పడానికి వాక్యం చిన్నదే అయినా తవ్వి తీస్తే ఈ వాక్యం వెనుక బోల్డు కథలు ఉంటాయి. ఆ కథలు బతకడానికి పరదేశం పోయిన ఏ మనిషి వైనా కావొచ్చు! అలాంటి ఒక పరదేశీయుని కథే “టుడేస్ స్పెషల్”! సినిమా! అంతే కాదు, కమ్మని భారతీయ(…)

హంగర్ గేమ్స్

హంగర్ గేమ్స్

మీరు పుస్తకాల పురుగయితే ఈ పాటికి మీరు “హంగర్ గేమ్స్” గురించి వినే ఉంటారు. పిల్ల బచ్చాగాళ్ల కోసం రాసిన ట్వైలైట్ సీరీస్ తర్వాత అంత పెద్ద పాపులారిటీ పొందిన బుక్స్ గా ఈ హంగర్ గేమ్స్ సీరీస్ ని చెప్పుకోవచ్చు. ఈ పుస్తకాల ఆధారంగా రూపొందించిన “హంగర్ గేమ్స్” సినిమా చూడడానికి నిన్న సినీ మాక్స్ కి వెళితే అక్కడంతా ఈ పిల్ల బచ్చాగాళ్లే. అంతే కాదు, సినిమా అయిపోయాక విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి(…)

Eternal Sunshine of Spotless Mind

Eternal Sunshine of Spotless Mind

బయట హోరున వాన పడుతుంటే, లోపలెక్కడో, ఆదమరుపుగా కళ్ళు మూసుకొని ఆ చప్పుడు వింటున్నట్టు, కిటికి దగ్గర నించొని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానను రెప్పార్పకుండా చూస్తున్నట్టు, చూరు కింద నిలబడి వాన చినుకులతో ఆడకున్నట్టు, గొడుగేసుకొని సగం తడుస్తూ, సగం తడవకుండా నడుస్తున్నట్టు, రేన్ కోర్ట్ వేసుకొని వానలో తడుస్తూనే వడివడిగా నడుస్తున్నట్టు, తడవడం ఇష్టం లేక ఏ మూల ఇంత నీడ (షేడ్) దొరికినా దూరిపోయి, అకాల వానను తిట్టుకున్నట్టు, తప్పించుకునే వీల్లేక వానలో(…)

The Fall (2006)

The Fall (2006)

దాదాపుగా ప్రతి జీవితంలోనూ వచ్చే మలుపు ఇది. ఆ మలుపు వద్ద, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ మిగల్లేదనిపిస్తుంది. ముందుకు చూడబోతే ఏమీ కనిపించదు, గాఢాంధకారం తప్పించి. అక్కడే ఆగిపోదామంటే ముళ్ళపై నుంచున్నట్టు ఉంటుంది. ఉండలేక, వెళ్ళలేక, నిలువలేక ఉన్న ఆ పరిస్థితుల్లో గుక్కెడు విషం ఇచ్చినవారు కూడా దేవతాసమానులైపోతారు. కానీ చిత్రంగా, అలా విషమిచ్చి చేతులు దులిపేసుకోక, ఒక చిన్న దివిటి వెలగించి మనకేదో కొత్త వెలుగు చూపించేవారు తయారవుతారు. మనం చూడకూడదని కళ్ళు మూసుకున్నా,(…)

In to the wild.

In to the wild.

ఈ ప్రకృతి , ప్రపంచం, ఈ సమాజం, వ్యక్తి  ప్రతీదీ ఒక వ్యవస్థే. ఆ వ్యవస్థ ఎందుకు ఎలా ఎవరిద్వారా ఏర్పడిందో తెలిదు. వ్యవస్థ ని అర్థం చేసుకున్నవాళ్ళకి, లేదా అనుకూలంగా కాలం గడుపుతున్న వాళ్ళకి పెద్ద బాధేమి ఉండదు. కాని ఏ వ్యవస్థ ఇలానే ఎందుకు ఉంది అని ప్రశ్నించే వాళ్ళకి మాత్రం ప్రతి క్షణం నరకమే. సమాధానం దొరికే దాకా కుదురుగా ఉండనివ్వదు. ఆ సమాధానం కనుగొనే ప్రయత్నమే వాళ్ళ జీవితం అవుతుంది. ఆ(…)

Story Story Story

Story Story Story

Interview: Benjamin Sant Monday, August 23, 2010 (My friend(Randin Graves – film composer) sent me this article…..thought this article would be helpful if i posted here on NT….especially for aspiring writers/filmmaker.have a good read folks) Over the past year, my colleagues and I have received a lot of scripts to read over in order to(…)

అమ్మ కూడా ఒకప్పుడు హీరోయినే !!

అమ్మ కూడా ఒకప్పుడు హీరోయినే !!

తల్లిప్రేమ, తండ్రిప్రేమ, సోదరప్రేమ…. ఇలా ఒక prefix లేకుండా ఉత్తగా “ప్రేమ ” ఆడా మగా మధ్య మానసిక శారీరిక సంబంధాలే గుర్తుకువస్తాయి. ఆడామగా మధ్య ఆ ప్రేమే లేకపోతే మనిషికీ జంతువుకీ తేడా లేదు, సృష్టి ముందుకెళ్ళదు. కాబట్టేనేమో ప్రేమ కథలూ , సినిమాలు మెచ్చనివారు చాలా తక్కువమంది ఉంటారు. అయినా ఒక ఆడది , ఒక మగవాడు. ఎలాగోలా తంటాలు పడి ప్రేమించుకుంటారు , ఇందులో conflict ఏముంది అనుకునేవాళ్ళందరూ తప్పక చూడాల్సిన చిత్రం (…)

The Birds (1963)

The Birds (1963)

అదొక ఆలోచన. ఆ ఆలోచనే నిజమైతే? అన్న ఊహే భయంకరంగా ఉంది. ఆ ఆలోచనే నిజమైతే? అన్న ఊహే కొందరికి ’అబ్సర్డ్’ అనిపించొచ్చు కూడా. ఆ ఆలోచనే నిజమైతే? అన్న ఊహకి దృశ్య రూపం ఇస్తేమాత్రం – ’ది బర్డ్స్’ సినిమా ఔతుంది. సినిమా ముగిసే సరికి – నాకు బాల్కనీలోకి వెళ్ళాలంటే కూడా భయమేసింది – మా బాల్కనీకి పావురాళ్ళ తాకిడి ఎక్కువ మరి!! కథ: సాన్ ఫ్రాన్సిస్కో నుండి మెలానీ డేనియల్స్ అన్న యువతి(…)

హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్

హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్

ఛ ఈ వయసులో కార్టూన్/యానిమేషన్ సినిమాకి ఒక్కడినే వెళ్ళటం ఏమిటి అనుకున్నా. యుఎస్ న్యూస్ లో రివ్యూ బాగుండటం పైగా నా ఫ్లయ్ ట్ కి చాలా టైం ఉండటం తో సర్లే పద అనుకుని ఈ సినిమాకు వెళ్ళాను. 3డి అనుకుని వెళ్ళా కాని ఆ ధియేటర్ లో నార్మల్ ఫార్మాట్ లోనే చూడాల్సి వచ్చింది. అద్బుతం అమోఘం అని చెప్పక తప్పదు. చాలా రోజుల తర్వాత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చుని(…)

It’s a wonderful life

It’s a wonderful life

మనిషి జీవితం ఎంతో ఉన్నతమయినది. పది మందికీ ఉపయోగపడేది, పడాల్సినది. కానీ మనం కాలక్రమంలో అప్పుడప్పుడూ మన జీవితం మీద ఆసక్తి కోల్పోతుంటాము. మన జీవితం యొక్క పరమార్థం గ్రహించకుండా ఉంటాము. అసలు మీరు లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాని వల్ల మీ చుట్టుపక్కల వారికి ఏదయినా మార్పు ఉందా ? లేకపోయినట్లయితే మీ జీవితానికి అర్థం లేదేమో ? ఇలాంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా ఒక మంచి సినిమా “It’s a wonderful life”(…)

పా-త్రీ ఇడియట్స్-సీతా సింగ్స్ ది బ్లూస్

నాకు సినిమాలకీ దూరం పెరిగి చాన్నాళ్ళైనట్లుంది. అంటే, నేను చూడట్లేదని కాదు. కొత్త సినిమాలు బానే చూస్తున్నా. కానీ, ఏమిటో రాయాలి అనిపించట్లేదు. ఇవాళ ఓ సినిమా చూశాక, నాకెందుకో రాయాలనిపిస్తోంది. ఇటీవల చూసిన సినిమాలు కొన్నింటి గురించీ. పా: జూన్ నుంచి ఎదురుచూస్తూ, ఆఖరికి సినిమా రిలీజైన నెలరోజులగ్గానీ చూడలేకపోయాను. ’చీనీకం’ సినిమా గుర్తొచ్చింది చాలాసార్లు, ఈ సినిమా చూస్తూ ఉంటే. బహుశా, దర్శకుడి శైలి వంటబట్టిందేమో నాకు. ఈ సినిమాకీ, ఆ సినిమాకీ కథాపరంగా(…)

అవతార్-మరోవ్యూ

అవతార్-మరోవ్యూ

నవతరంగంలో ఇప్పటికే అవతార్ సినిమా గురించి ఎన్నో రివ్యూలు వచ్చాయి, ఇది మరోవ్యూ. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా కథ మౌళికంగా మనుషుల, ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాల మేధావుల పశ్చాత్తాపం అని అనుకోవచ్చు. తాను కూర్చున్న కొమ్మను నరుకుతూ, గడిచిన కాలంలో ఈ భూమిపైనున్న ప్రకృతిని రెండు చేతులతో నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తూ వచ్చిన మనిషి, రేపటి తరాలకు ఏమి మిగులుస్తున్నాడో తెలియక, గతాన్ని చూసి బాధపడుతూ, తాను నేర్చుకున్న పాఠాలను వల్లె వేయడమే ఈ(…)

Invictus

Invictus

Invictus– అతడి ప్రజలు నాయకుణ్ణి కోరుకున్నారు. అతడు అజేయుడ్ని ఇచ్చాడు. నెల్సన్ మండేలా గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 1995 రగ్బి ప్రపంచ కప్ మరియు స్ప్రింగ్ బోక్స్ (సౌతాఫ్రికా రగ్బీ జట్టు పేరు) చుట్టూ తిరిగే చిత్రం ఇది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వుత్సవాలలో మంచి పేరు సంపాదించింది. ఒక పుస్తకం (జాన్ కార్లిన్ “ప్లేయింగ్ ది ఎనిమి“ ఆధారం చేసుకుని తీసిన చిత్రం ఇది. నెల్సన్ మండేలా గా మోర్గాన్ ఫ్రీమన్, స్ప్రింగ్ బోక్స్(…)

అవతార్

అవతార్

కథలో కొత్త ఆలోచనలు గానీ సరికొత్తగా ప్రతిపాదించిన సూత్రాలు కానీ ఏవీ లేవు గానీ అవతార్ సినిమా రెండున్నర గంటల సేపు కళ్ళకీ మనసుకీ విందు చేసిందనే నాకనిపించింది. సృష్టిలో అన్నిటినీ కలిపి ఉంచే మూల సూత్రం ఒకటున్నదనీ, ఒక అంతస్సూత్రం ఉన్నదనీ, దాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయినా కనీసం దాని ఉనికిని గుర్తించి దానితో (లిటరల్‌గా)”టచ్” లో ఉంటే, మనము మన చుట్టూతా ఉన్న ఈ సృష్టితో ఒక సమతుల్యతలో ఉండవచ్చునని అనేక ప్రాచీన(…)

అవతార్ : ఒక కథ, ఒక నిజం, ఒక సత్యం…ఒక సినిమా

అవతార్ : ఒక కథ, ఒక నిజం, ఒక సత్యం…ఒక సినిమా

ఒక కథ: అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ప్రకృతితో కలిసి బ్రతికే కోయజాతి ప్రజలు. ఒక పారిశ్రామికవేత్త అక్కడొక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటాడు. లేదా అక్కడదొరికే ఖనిజసంపదను దోచెయ్యాలనుకుంటాడు. అలాచెయ్యాలంటే కోయోల్లని అక్కడ్నించీ తరిమెయ్యాలి. అప్పుడు… కోయవాళ్ళకు మంచిచేసి, మచ్చికచేసుకుని, మోసం చెయ్యడానికి ఒకడ్ని నియమిస్తాడు. అతడే హీరో… ఆ హీరో విలన్ కోసం అక్కడికి వెళ్ళినా, త్వరలోనే ఆ కోయోళ్ళ ప్రకృతి ప్రేమని, అమాయకత్వాన్నీ అర్థం చేసుకుంటాడు. పనిలోపనిగా కోయదొర కూతురు (హీరోయిన్)తో ప్రేమలో పడతాడు.(…)

District 9 (2009)

District 9 (2009)

పీటెర్ జాక్సొన్(Lord of Rings fame) నిర్మాణంలో, నీల్ బ్లొకెంప్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా District 9. ఇది ఒక socio-political message తొ కూడుకున్న కథాంశం. కథ లోకి వెళ్తే ఒక స్పేస్ షిప్ దక్షిణాఫ్రికా లోని జొహన్స్ బర్గ్ కి రావడం తో కథ ప్రారంభం అవుతుంది. ఇందు లో ప్రాన్స్ అనబడే గ్రహాంతరవాసులు చాలా దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుని వుంటారు. ప్రపంచ దేశాక ఒత్తిడికి లొంగి దక్షిణాఫ్రికా ప్రభుత్వం గ్రహాంతరవాసులకి ఒక(…)

Inglourious Basterds – మరోసారి

Inglourious Basterds – మరోసారి

టరంటినో గురించి వినడమే కానీ ఎప్పుడూ అతని సినిమాలు చూడలేదు ఇప్పుడు మొదటిసారి చూసిన సినిమా – “Inglourious Basterds”. సినిమా మొత్తంగా బానే ఉంది. నిజానికి నాకు నచ్చింది. అయితే, హైపెక్కువవడం వల్ల నేను కాస్త నిరాశపడ్డాను అనే చెప్పాలి. నన్ను అడిగితే మంచి సినిమా అని చెప్తాను కానీ, అద్భుతమైన సినిమా అనను. (స్పాయిలర్లు కలవు) కథ: హిట్లర్ కాలం నాటి కథ. మొదటి సీనులో – “Jew Hunter” గా ముద్రపడ్డ నాజీ(…)

Inglourious Basterds రివ్యూ

Inglourious Basterds రివ్యూ

Chapter 1 – The Jew Hunter బ్రాడ్ పిట్ కథానాయకుడయినా అమితంగా ఆకట్టుకునేది Christoph Waltz. జర్మనీ పాలిత ఫ్రాన్సులోని యూదులను మట్టుపెట్టే ఈ డిటెక్టివ్ పాత్రకు తగిన నటుడు దొరక్కపోతే సినిమా తీయకూడదు అనుకున్నానని టరంటినో ఎందుకన్నాడో సినిమా చూస్తే తెలుస్తుంది. స్వతహాగా ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్ భాషలు అనర్గళంగా మాట్లాడే వాల్ట్జ్ మొదటి చాప్టర్లో నవ్వుతూ పెద్దమనిషి తరహాలో మాట్లాడుతూ నెమ్మదిగా తన విశ్వరూపం చూపుతాడు. తర్వాతి చాప్టర్లలో వాల్ట్జ్ కనిపించాడంటే ఇప్పుడు(…)

Inherit the wind (1960)

Inherit the wind (1960)

మొదట నాకు ఈ సినిమా కథతో పరిచయమైన సందర్భంతో మొదలుపెడతాను. లాంగ్ వీకెండ్, హోమ్ అలోన్ – అలాంటప్పుడే జైఅర్జున్ అనబడు jabberwock బ్లాగును చూస్తూ ఉంటే ఈ టపా కనిపించింది. ఈ సినిమా స్కోప్స్ ట్రయల్ (Scope’s trial of 1925) ఆధారంగా తీశారని తెలిసి, కుతూహలం పెరిగింది. ఆమధ్య ఓరోజు కార్టూనింగ్ ఎవల్యూషన్ వెబ్సైట్లో డార్విన్ సిద్ధాంతంపై కార్టూన్లు చూస్తూ ఉంటే, స్కోప్స్ ట్రయల్ గురించి తెలిసింది. అలా ఓ రెండ్రోజులు ఆ ఉదంతానికి(…)

హారీ పాటర్ చూశాక నాతో నేను.

హారీ పాటర్ చూశాక నాతో నేను.

హారీ పాటర్ మరియు అర్ద కులీన రాజకుమారుడు సినిమా చూశాను. అవునా? ఆలాంటి పేరెప్పుడూ వినలేదే? అదేలేవోయ్, హారీ పాటర్ అండ్ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ కు నా తెలుగు సేత ఏడ్సినట్టుంది. ఏంటి సినిమానా ? కాదు, నీ తెలుగు సేత. అయినా సినిమా చూసింది నువ్వు కదా, ఏడ్సినట్టుందో, నవ్వినట్టుందో నువ్వే చెప్పాలి కదా. అవునూ ఇంతకీ సినిమా తెలుగులో చూశావా ? ఇంగ్లీషులోనే చూశా! మరి తెలుగులో సేతడమెందుకో? తెల్దా? స్టైలు. అవునా?(…)

Transformers 2 రివ్యూ

Transformers 2 రివ్యూ

చక్కని కథనం, అప్పటివరకు చూసిన గ్రాఫిక్స్ కంటే విభిన్నమయిన గ్రాఫిక్స్ లతో తీసిన Transformers చూసిన వెంటనే ఈ సినిమా సీక్వల్ తప్పక చూడాలి అని నిర్ణయించుకున్నాను. రెండవ పార్టు విడుదలయి కేవలం ఒక్క రోజులో 60 మిలియన్ డాలర్లు, వారాంతానికల్లా $112 మిలియన్ల కలెక్షన్ రాబట్టింది. ఈ వివరాలు చూసి ఈ సినిమా పైన మరిన్ని ఎక్కువ అంచనాలతో వెళ్ళాను. మొదటి పార్టు హిట్ అయింది కాబట్టి రెండవ పార్టుకు కాస్త ఫ్లాష్‌బ్యాక్ కలపాలన్న ప్రాథమిక(…)

Definitely, May be (2008)

Definitely, May be (2008)

ఇప్పుడీ సినిమా కథ చెప్పాలంటే, అదో పెద్ద కథ. చూసేటప్పుడు కూడా నాకు కాస్త కన్ఫ్యూజింగ్ గానే అనిపించింది. విషయానికొస్తే, మన కథ వర్తమానంలో మొదలౌతుంది. విల్ హేస్ తన భార్య నుండి విడాకులు కోరి ఉంటాడు. ఈ ప్రయత్నాలు నడుస్తూ ఉండగా, విల్ పదేళ్ళ కూతురు మాయ తన తల్లిదండ్రుల వివాహానికి ముందు జరిగిన కథను తెలుసుకోవాలనుకుంటుంది. విల్ ఈ కథని యదాతథంగా చెప్పక – పాత్రల పేర్లు మార్చి, కాస్త నాటకీయంగా చెప్పడం మొదలుపెడతాడు.(…)

Father of the bride

Father of the bride

Father of the bride 1991లో వచ్చిన ఇంగ్లీషు సినిమా. అప్పుడెప్పుడో “ఆకాశమంత” చూసినప్పుడు ఎవరో అన్నారు ఈ సినిమా, ఆ సినిమా ఒకే థీం అని. విని ఊరుకున్నాను. ఆ తరువాత ఓ పదిరోజుల క్రితం అనుకోకుండా ఈ సినిమా చూశాను. పనిగట్టుకుని ఆలోచించకపోయినా కూడా రెండింటినీ పోల్చడం మొదలుపెట్టాను కాసేపు. ఇప్పుడీ వ్యాసం దాని పర్యవసానమే… కథ విషయానికొస్తే, జార్జ్ బ్యాంక్స్ అన్న పెద్దాయన కూతురు Annie ఆర్థికంగా తమకంటే పై అంతస్థులో ఉన్న(…)

డిఫాయన్స్

కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు, ఆ సినిమా కథాగమనంతో భౌగోళికంగానూ కాలమాన పరిస్థితులతోనూ నాకెటువంటి సంబంధం లేకపోయినా కూడా ఒక్కోసారి అందులోని పాత్రలమధ్యలో నేను కూడా దూరిపోయి వాళ్ళతో పాటే అష్టకష్టాలు పడి వాళ్ళతోపాటుగా ఓడుతూ గెలుస్తూ సినిమాలోని అన్ని ఎమోషన్స్ ని అనుభవించి సినిమా అయ్యేటప్పటికి ఏదో ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ఉద్విగ్నతకు లోనవుతుంటాను. ముఖ్యంగా వార్ మూవీస్ చూసినప్పుడు. అలాంటిదే ఈ సినిమా – డిఫాయన్స్(Defiance). టైటిల్ చూసి, పోస్టర్ మీద మన(…)

Music & Lyrics

Music & Lyrics

Music & Lyrics – 2007 హాలీవుడ్ చిత్రం. తారాగణం: హూగ్ గ్రాంట్, డ్రూ బారిమూర్. కథ: ఎనభైల్లో ప్రచారం పొందిన్ పాప్! అన్న సంగీతకారుల గుంపు (కల్పితం) ను చిత్రిస్తూ మొదలౌతుంది సినిమా. టైటిల్స్ గట్రా అయిపోయి వర్తమానానికి వస్తే, పాప్! ఆ తరువాత విడిపోతుంది. దానిలో ప్రధాన సభ్యులైన కాలిన్, అలెక్స్ ఫ్లెచర్ (హూగ్ గ్రాంట్) లలో కాలిన్ సోలోగా చాలా పేరు తెచ్చుకుంటాడు. అలెక్స్ అదృష్టం బాగోక – చిన్నా చితకా ప్రోగ్రాం(…)

Ice Age 3 రివ్యూ

Ice Age 3 రివ్యూ

ఒక చిన్న పిల్లవాడిని అతడి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడానికి ఒక ఏనుగు చేసే ప్రయత్నాల ఆధారంగా 2002 లో తీయబడిన Ice Age మంచి కథనం, అంత కంటే మంచి పాత్రలు, కనువిందు చేసే గ్రాఫిక్స్ తో ఆకట్టుకొంది. ఈ సినిమా ఘనవిజయంతో Ice Age 2 సీక్వల్ వచ్చింది. Manny కి, ఆడ ఏనుగు Ellie కి మధ్య లవ్ స్టోరీ రెండవ పార్టు కథాంశం. బోరు కొట్టించే కథ, చిరాకు పుట్టించే క్యారక్టర్లతో రెండవపార్టు(…)

Ed Wood (1994)

Ed Wood (1994)

ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు నటీనటుల పనితనం వీధినాటకాల వాళ్ల నటనకంటే తీసి కట్టుగా అనిపించిందా?, సెట్టింగుల్లో డొల్లతనం కళ్ళు మూసుకున్నా కనిపించిందా? నాసిరకం నిర్మాణ విలువలు అడుగడుగునా విసుగెత్తించాయా? ఇలాంటి సినిమాలకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచన కలిగిందా? .హాలీవుడ్ వాళ్ళు అలాంటి వాటిని ఎడ్‍వూడ్స్ పిల్మ్స్ అని ముద్దుగా పిల్చుకుంటారు. ఈ ఎడ్‍వూడ్ ఎవరా అనుకుంటున్నారా? అయితే మీరు టిమ్ బర్టన్ సినిమా ఎడ్‍వూడ్స్ చూడాల్సిందే. ఆత్మ విశ్వాసం, పట్టుదల, స్నేహితుల తోడ్పాటు ఉంటే(…)

Valkyrie

Valkyrie

గతవారం వాల్కైరీ చూట్టానికి బయలుదేరేముందు అదొక సినిమా వచ్చిందన్న విషయం తప్ప, అందులో టాం క్రూజ్ ఉంటాడన్న విషయం తప్ప మరేమీ తెలీదు నాకు. అయితే, ఎవరో చెప్పగా అది హిట్లర్ పై హత్యా యత్నం టైపు కథని వినేసరికి కాస్త కుతూహలం కలిగింది. సినిమా చూసొచ్చాక మరీ “వావ్!” ఫీలింగ్ కలక్కపోయినా కూడా ఓ historical thriller చూసిన భావనలోని “వావ్” ను అనుభవించగలిగాను. కథ: ఈ కథ రెండో ప్రపంచ యుద్ధం నాటి జర్మనీ(…)

ది రెజ్లర్

ది రెజ్లర్

కొంతమంది దర్శకులుంటారు. వాళ్ళొక్క సినిమా తీస్తారు. ప్రపంచాన్నంతా ఆకర్షిస్తారు. అప్పట్నుంచి ఈ దర్శకుడు ఇక ఎలాంటి సినిమాలు తీస్తాడో,తర్వాత సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అని, అందరూ కాకపోయినా, కొంత మంది వీరాభిమానులయినా ఎదురు చూసేలా చేస్తారు. అంతే కాదు ఈ సినిమా మూందూ ఆ దర్శకుడు ఏయే సినిమాలు తీసాడని వెత్కించేలా చేస్తారు. అప్పట్లో క్రిస్టోఫర్ నోలన్ ముందు ఒక ఇండీ ఫిల్మ్ ‘ది ఫాలోయింగ్’ తీసి ఆ తర్వాత ‘మొమెంటో’ తీసాక ఇదే పరిస్థితి. కాకపోతే(…)

రెవల్యూషనరీ రోడ్

రెవల్యూషనరీ రోడ్

అసలీ సినిమా గురించి వ్రాయడం వేస్ట్. అలా అని ఈ పేరుతో వచ్చిన సినిమా కానీ పుస్తకం కానీ వేస్ట్ అని కాదు నా ఉద్దేశం. నాకు తెలిసిన వాళ్ళకయితే బలవంతంగా ఈ సినిమా చూపించాను. బలవంతంగానైనా పుస్తకం చదివేలా చేశాను. రెండూ అంతగా నచ్చాయి నాకు. కాకపోతే ఈ సినిమా గురించి గానీ పుస్తకం గురించి గానీ వ్రాయడం ఎందుకు దండగ అన్నానంటే కొన్నింటి గురించి ఎంత చెప్పినా వ్రాసినా ఆయా పుస్తకాలో సినిమాలో చూసినప్పుడు(…)

Frost/Nixon

Frost/Nixon

ఫ్రాస్ట్/నిక్సన్-2008 లో నేను చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. గత సంవత్సరంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి; ఇలాంటి అంటే ప్రముఖల జీవితాలు లేదా వారి జీవితాల్లోని వివిధ ఘట్టాల ఆధారంగా వచ్చిన సినిమాలు. ఉదాహరణకు జార్జి బుష్ గురించి వచ్చిన ‘W’, చే గువెరా గురించి వచ్చిన రెండు సినిమాలు ’చే-1′ మరియు ’చే-2′, ఇటలీ మాజీ ప్రధాని Giulio Andreotti జీవితం ఆధారంగా వచ్చిన ’Il Divo’ అనే ఇటాలియన్ సినిమా, Harvey Milk(…)

Outsourced

Outsourced

ఒక విదేశీయుడు భారతదేశానికి వచ్చిన అంశం ఆధారంగా సినిమా తీయబడింది. అందులో ఏమేమి ఉంటాయో ఊహించుకోండి! ఏముంది, ఎక్కడ చూసినా కిటకిటలాడే జనాభా, కాలుష్యం, మురికివాడల్లో దయనీయస్థితిలో జీవించే ప్రజానీకం, అవకాశం వస్తే ఆ విదేశీయుడిని మోసం చేసేవారు, భారతదేశములో సగటు మనిషి ఎదుర్కుంటున్న కష్టాలు.. ఇవి నా మనసులో వచ్చిన ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఏమిటంటారా? ఇప్పటివరకు చూసిన So Called చిత్రరాజములే. ఇప్పటివరకు ప్రపంచ ఖ్యాతిగాంచిన (ముఖ్యముగా గత రెండు దశాబ్దాల్లో)(…)

Groundhog Day

Groundhog Day

కొద్ది కాలం క్రితం IMDB Top 250 పైన యుద్దం ప్రకటించి ఒక్కొక్క సినిమా సంగతి చూడడం మొదలు పెట్టినపుడు ఆ జాబితాలో Groundhog Day సినిమాను  చూసాను. అప్పటివరకు ఈ సినిమా పేరు వినలేదు,  ఈ సినిమా గురించి ఎక్కడా చదవలేదు, పైగా సినిమాలో కథానాయకుడు బిల్ మర్రే!! ” బిల్ మర్రే సినిమాలు అంటే  మామూలు కామెడీతో కాసేపు నవ్వుకొని మరచిపోయేవి, పొరపాటున ప్రేక్షకులు ఎక్కువ రేటింగ్ ఇచ్చారేమో”నని అనుమానంతో  సినిమా చూడడం మొదలు(…)

రెండవ మాడగాస్కర్ (Madagascar: Escape 2 Africa)

రెండవ మాడగాస్కర్ (Madagascar: Escape 2 Africa)

మును మాడగాస్కరను పుర మును, తమ పట్టణపు హొయల ముంచిన వైన మ్మును గని నగి జనిన జన మ్ము నుల్లసమున మలి ముంచి ముదమందించే *** పని తలపెట్టి, కితకితల పనితనముకు సానపెట్టి, పసతో గురిత ప్పని హాస్యము సంధించియు, పనితములయిన పనులన్ సఫలముగ సలిపే *** నలుగురు ముందు కురికి, కో నులు కానలు తిరిగి యాతనల బడినా, పి న్నల పెద్దల కొరకై, చి న్నెలు చిందించి యలరింప నేర్చిరి భళిరా! ***(…)

ది క్యూరియస్ కేస్ ఆఫ్ ‘బెంజిమన్ బటన్’

ది క్యూరియస్ కేస్ ఆఫ్ ‘బెంజిమన్ బటన్’

న్యూఆర్లియన్స్, లూసియానా 2005. కత్రీనా కన్ను ఆ నగరం పై పడ్డ వేళ.. ఓ ఆసుపత్రిలో మరణశయ్యపై ఓ వృద్ధురాలు. పక్కనే ప్రౌఢ వయస్సులో ఉన్న అమె కూతురు. ఆమె చేతిలో ఓ పుస్తకం. అది వేరెవరిదో కాదు మన కథానాయకుడు ‘బెంజిమన్ బటన్’ రాసుకొన్న డైరీ. ఇక్కడి నుంచి కథ ప్రారంభం అవుతుంది. అక్కడ ఒక్కో పేజీ తిప్పుతూంటే ఇక్కడ బెంజిమన్ జీవితంలో ఒక్కో ఘట్టం మన ముందుకు వచ్చి పోతూంటుంది. ఏ కథకైనా ప్రారంభం,(…)

ట్వైలైట్

ట్వైలైట్

కం. పొరబడి పేరంటంలో జొరబడి చతికిలబడి మనసొప్పనిదైనా స్థిరపడినందుకు వ్యధపడి భరియించి తుదకు త్వరపడి బయటపడితిరోయ్ క్లుప్తంగా చెప్పాలంటే అలాంటిదే ట్వైలైట్ అనుభవం కూడాను. శనివారం ఉదయం పదకొండు గంటల సమయానికి ఇంటిదగ్గర ఉన్న హాలులో యస్ మాన్ ఆడుతోందేమో చూద్దామనుకొని వెళ్ళి, త్వరలో ఆటేదీ లేదని తెలిసాక, మరో ఐదు నిమిషాలలో ట్వైలైట్ ప్రారంభం కానున్నదిని గమనించి, అది మొదటి వారంలో అమెరికాలో ఢంకా మ్రోగించిందని లీలగా గుర్తురావడం వలన ఆబతో డబ్బుపెట్టేయడం ఆ అనుభవానికి(…)

ది మెజెస్టిక్

ది మెజెస్టిక్

హాలీవుడ్ హాస్య చిత్రాలనగానే నేటి తరం ప్రేక్షకులకి గుర్తొచ్చే మొదటి పేరు: జిమ్ క్యారీ. ‘ది మాస్క్’, ‘ఏస్ వెంచురా: పెట్ డిటెక్టివ్’,  ‘లయర్-లయర్’, ‘డంబ్ అండ్ డంబర్’, ‘హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్’,  ‘బ్రూస్ ఆల్‌మైటీ’ వంటి హిట్ చిత్రాలతో హాస్యనటుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడీ ప్రతిభావంతుడు. క్యారీ పేరు చెప్పగానే అతని ఎలాస్టిక్ ముఖమే మదిలో మెదులుతుందెవరికైనా. ఐతే జిమ్ క్యారీ హాస్య చిత్రాలకే పరిమితమవకుండా ‘ది ట్రూమాన్ షో’, ‘ఎటర్నల్ సన్‌షైన్(…)

The Kid (1921)

The Kid (1921)

“ది కిడ్” 1921 నాటి చార్లీ చాప్లిన్ మూకీ సినిమా. అప్పటి సినిమాల్లో అత్యంత ప్రాచూర్యం పొందినవాటిలో ఇదీ ఒకటి. ఇప్పటికీ “ది కిడ్” అభిమానులు చాలా మంది ఉన్నారు. సినిమా విడుదలై తొంభై ఏళ్ళౌతూ ఉంటే ఇంకా ఆ సినిమా పేరు జనాల మధ్య ఉండటం అంటే మాటలు కాదు. అదొక్క విషయం చాలు ఈ సినిమా చారిత్రక విలువను తెలియజెప్పడానికి. కథ: ప్రేమలో మోసపోయిన ఓ యువతి బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బాబునేం చేయాలో(…)

The Tramp (1915)

The Tramp (1915)

చార్లీ చాప్లిన్ సినిమాలతో నాకు పెద్ద పరిచయం లేదు. అప్పుడెప్పుడో “easy street” వంటి చిన్న సినిమాలు ఒకట్రెండు చూసాను కానీ, ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. “ఆవారా” చూస్తున్నప్పుడు “ఆవారాహూ” పాటలో రాజ్ కపూర్ ని చూసాక చాప్లిన్ ని మళ్ళీ చూడాలనిపించింది. ఆ విధంగా “ది ట్రాంప్” అన్న 1915 మూకీ చిత్రం చూసాను. ఆవారా పాత్ర రూపకల్పనకి ప్రేరణ అయిన “ట్రాంప్” పాత్రధారణ మొదలైన తొలి సినిమా ఇదేనని తెలిసింది. చాప్లిన్(…)

ఆస్ర్టేలియా

ఆస్ర్టేలియా

‘ఒక మూటలో పట్టేవాటి కన్నా ఎక్కువ నాదగ్గర ఏమీ లేవు. మనతో కూడా ఏమీ తీసుకెళ్ళలేం, మనగురింఛి చెప్పుకోడానికి ఒక కథ తప్ప’ అన్న అర్ధంలో ఒక మాట అంటాడు ‘ఆస్ట్రేలియా’ సినిమాలో డ్రోవర్ (హ్యూజ్ జాక్ మాన్) తన వాహనంలో డజన్ల పెట్టల సామన్లతో ప్రయాణం చేస్తున్న లేడీ సారా ఆష్లీ (నికోల్ కిడ్ మాన్)తో. ఒక మంచి మహాకావ్యం (epic) చూపిస్తానన్నాడు కదా అని కూర్చుంటే అరడజను కథలు కలగాపులగం చేసి, దానికి యింకొన్ని(…)

W.

W.

దర్శకత్వం : ఆలివర్ స్టోన్. రచన: స్టాన్లీ వైసర్ నిర్మాతలు: మోర్టిజ్ బోర్మన్, జోన్ కిలిక్, బిల్ బ్లక్, ఆలివర్ స్టోన్ నటన : జాష్ బ్రోలిన్, ఎలిజబెత్ బాంక్స్, జేమ్స క్రామ్ వెల్, ఎల్లన్ బర్ స్టన్ తదితరులు. విడుదల: 17 అక్టొబరు 2008 ప్రపంచంలో చాలా మంది బుద్ధిమంతులకి జార్జ్ బుష్ అంటే మంట. అందులో నేనూ ఒకణ్ణి. బుష్ ద్వేషుల్లో ముందు వరసలో వుండే వాళ్ళల్లో ముందుండేవాడు ఆలివర్ స్టోన్. ఆయన గురించి(…)

ఎనిమీ ఎట్ ది గేట్స్

ఎనిమీ ఎట్ ది గేట్స్

‘రెండవ ప్రపంచ యుద్ధాన్ని మలుపు తిప్పిన రోజు ఏది’ అన్న ప్రశ్నకి కొందరు చరిత్రకారులు ‘జూన్ 6, 1944′ (నార్మండీ వద్ద జరిగిన డి-డే పోరాటం) అంటే మరి కొందరు ‘డిసెంబర్ 7, 1941′ (పెర్ల్ హార్బర్ మీద జపాన్ వైమానిక దాడి) అంటారు. ఎక్కువమంది మాత్రం ముక్త కంఠంతో ‘జూన్ 22, 1941′ అని చెబుతారు. హిట్లర్ ఆదేశాలతో జెర్మన్ దళాలు సోవియెట్ యూనియన్ మీద మెరుపు దాడి చేసిన రోజది; ఇష్ఠమున్నా లేకున్నా స్టాలిన్(…)

Burn After Reading –  Forget after watching

Burn After Reading – Forget after watching

Coen brothers ఈ సారి meaningless comedyతో ముందుకొచ్చారు. గత సంవత్సరం ఆస్కార్ పంట పండించిన నో కంట్రీ ఫర్ ఓల్డ్ మన్ నే మసిపూసి మారెడుకాయచేసినట్టు ఉన్న ఈ Burn after reading సినిమా కాలక్షేపానికి ఒకసారి చూడొచ్చు. సినిమా అంతా చాలా ఆహ్లాదంగా నడిచినప్పటికీ ఎందుకో అనుకున్నంత స్ధాయిలొ లేదనిపిస్తుంది. ఒకవేళ హాలివుడ్ దీగ్గజాలందర్నీ పెట్టుకొని ఇలా spy comedy పేరుతో ప్లాట్‌ని పూర్తిగా మర్చిపోవడమే అందుకు కారణం కావచ్చు. కధలోకి వస్తే CIA(…)

బెల్లా

బెల్లా

సినిమాలు రకరకాలు. నచ్చేవి, నచ్చనివి, మళ్లీ మళ్లీ చూడాలనిపించేవి, ఒక్క సారికే విసుగెత్తించేవి, వెంటనే మర్చిపోయేవి, ఎన్నాళ్లైనా వెంటాడేవి. ‘బెల్లా’ (Bella, 2007 విడుదల) చివరి కోవకి చెందింది. ఇటువంటి సినిమాలు తీయటం కత్తిమీద సాము. మసాలాలు ఏవీ లేని ఈ కధని జనరంజకంగా మలచి విజయవంతం చేయటం దర్శక నిర్మాతల ప్రతిభ, ధైర్యం. చిన్న సంఘటనలు కొన్ని జీవితాలని ఎలా మలుపు తిప్పుతాయో ఈ చిత్రం చెబుతుంది. చిత్ర కధనం అంతా మూడు విలువల చుట్టూ(…)

Raiders of the Lost Ark-ఒక సమీక్ష

Raiders of the Lost Ark-ఒక సమీక్ష

పరిచయం:అతనికి James Bond లాగా గాడ్జెట్స్ లేవు, వున్నదల్లా ఒక కొరడా ఒక చిన్న తుపాకి. తల పై ఒక తోపి, మాసిన గడ్డం, అంతకన్నా మాసిన దుస్తులు. అయనకి పాములు అంటే చాలా భయం, ఎప్పుడు చూసినా ఏదో  ఒక చిక్కు లో పడుతూ వుంటాడు.నేను ఎవరు గురించి చెప్తునానో మీకు అర్తం అయ్యుంటుంది ఈ పాటికి. 1981 లో అపర బ్రహ్మ స్టీవెన్ స్పీల్బర్గ్ దర్సకత్వం లో విడుదులై సినీ ప్రపంచాన్ని ఒక ఊపు(…)

The Bridge on River Kwai

The Bridge on River Kwai

ఈ సినిమా సంగతేంటి? వంద మంది విమర్శకులను పిలిపించి, ఈ శతాబ్దపు 100 అత్యుత్తమ ఆంగ్ల చిత్రాల జాబితా పొందుపరచమని చెబితే, ప్రతి ఒక్కరి జాబితాలో ఈ చిత్రానికి ఏదో ఒక స్థానం ఖచ్చితంగా లభించి తీరుతుంది. పోస్టర్లు చూసి “ఇది యుద్ద నేపథ్యం గల సినిమాలా ఉందే…ఆ..ఏముంది…రెండు దేశాలు కొట్టుకుంటాయి…కనీళ్ళు తెప్పించేలా సైనికుల త్యాగాలను చూపి ఉంటారు అంతే..”అనుకుంటే, తప్పులో కాలు వేసినట్లే. యుద్ద నేపథ్యం ఉన్నా, కథ యుద్దం చుట్టూ, దేశాల చుట్టూ కాక(…)

When Harry Met Sally(1989)

When Harry Met Sally(1989)

హాలీవుడ్ లొ ఏక్షన్,సస్పెన్స్ ధ్రిల్లర్స్ కి ఎంత ఆదరణ ఉంటుందో, రొమాంటిక్ సినిమాలకు కూడా అంతే ఆదరణ. ప్రతి సంవత్సరం చెప్పుకోదగ్గ సంఖ్య లో ఈ కేటగిరీ  చిత్రాలు విడులదవుతూ  ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రం పేరు “వెన్ హ్యారీ మెట్ సేలి”. ఈ సినిమా అంతా ఒకే లైన్ మీద నడుస్తుంది, “ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య పరస్పర శారీరక ఆకర్షణ కి అతీతంగా స్వచ్చమైన స్నేహం అనేది ఉంటుందా?” అని. Men and women(…)

Wall-E (2008)

Wall-E (2008)

“Wall-E” – యానిమేషన్ ప్రియుల్లో ఇటీవల భారతదేశానికి (ఎట్టకేలకు) వచ్చిన ఈ సినిమా పేరు వినని వాళ్ళు ఉండకపోవచ్చు. పిక్సార్-డిస్నీ కాంబినేషన్ లో వచ్చిన తొమ్మిదో యానిమేషన్ చిత్రం. తక్కిన ఎనిమిదీ – టాయ్ స్టోరీ-1 (1995), టాయ్ స్టోరీ-2 (1999), బగ్స్ లైఫ్ (1998), మాన్స్టర్స్ ఇంక్ (2001), ఫైండింగ్ నెమో (2003), ఇన్క్రెడిబుల్స్ (2004), కార్స్ (2006) మరియు రాటాటూయీ (2007). వీటిలో రాటాటూయీ గురించి నవతరంగంలో ఇదివరకే ఓ వ్యాసం వచ్చింది. తక్కిన(…)

The Shawshank Redemption (1994)

The Shawshank Redemption (1994)

పరిచయం:హాలివుడ్ లో “ఆల్  టైం గ్రేట్” లు గా నిలిచిన చిత్రాలలో ఒకటి “ది షాషంక్ రెడెంప్షన్” అనే ఈ చిత్రం. ఆశ (Hope),ఇదే  మనిషికి జీవనాధారం. రేపటి మీద ఆశ లేకుంటే జీవితమే పెద్ద ప్రశ్నార్ధకమవుతుంది. కష్టాల్లో కూడా మనిషిని నిలిపేది,నడిపించేది రేపటి మీది ఆశే అనేది ఈ సినిమా లోని అంత:సూత్రం. చక్కటి కధ,స్క్రీన్ ప్లే,మంచి  నటన ఈ సినిమా లో ఆకట్టుకొనే అంశాలు. ముందు ఒక్కసారి ఈ సినిమా కధ : తన(…)

KungFu Panda (2008)

KungFu Panda (2008)

kungfu panda డ్రీమ్‍వర్క్స్ వారి యానిమేషన్ చిత్రం. కుంగ్‍ఫూ నేర్చుకోవాలనుకుంటున్న ఓ పండా (panda) కథే ఈ సినిమా. చాలా యానిమేషన్ సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా అంతర్లీనంగా జీవితం ఉంది. జీవిత సత్యం ఉంది. కానీ, ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి అంటే, ఆద్యంతమూ హాస్యంతో నవ్విస్తూనే ఆ విషయాన్ని చెప్పడం. సెంటీ డైలాగులు, సెంటీ సీన్లూ లేకుండానే సినిమా ద్వారా చెప్పదలుచుకున్న సీరియస్ విషయాన్ని తేలిగ్గా చెప్పేసారు. కథ విషయానికొస్తే, పో (po)(…)

హెల్ బాయ్ (2004)

హెల్ బాయ్ (2004)

పరిచయం:సూపర్ హీరోలు సినిమాలు కొంతవరకే భరించగలము. స్పైడర్ మ్యాన్ అయినా, సూపర్ మ్యాన్ అయినా, బ్యాట్ మ్యాన్ అయినా లేదా కొత్తగా వచ్చిన ఐరన్ మ్యాన్ అయినా కొన్నాళ్ళ వరకే ప్రేక్షకులను ఆకట్టుకోగలవు. కామిక్ బుక్స్ నుంచి, టివి కి ఎదిగి, ఆ తర్వాత సినిమా తెరపైకి ఎక్కిన ఎంతోమంది సూపర్ హీరోలు నేడు మనకి ఉన్నారు. ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళు (ఐరన్ మ్యాన్, హల్క్) తోడవుతూనే వున్నారు. అలాగే కొత్త దర్శకుల చేతుల్లో పాత(…)

Casablanca (1942)

“కాసాబ్లాంకా” – సినిమా గురించి వినడమే కానీ, ఇప్పటిదాకా చూడలేదు. చూశాక దాన్ని గురించి సాయంత్రం నుండి ఇప్పటిదాకా ఎన్నిసార్లు తలుచుకున్నానో లెక్కలేదు. సినిమా చారిత్రక విలువ నాకు పూర్తిగా అవగతం కాలేదు కానీ, సినిమా మాత్రం నాకు చాలా నచ్చేసింది. కథ: రిక్ అన్న అమెరికా నుంచి వలసొచ్చిన వ్యక్తి కాసాబ్లాంకా లో ఓ క్లబ్బు నడుపుతూ ఉంటాడు. ఇక్కడ రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. రిక్ కాస్త సీరియస్ టైపు గా పేరు పడ్డ(…)

The Dark Knight (2008)

The Dark Knight (2008)

“డార్క్ నైట్” సినిమా రిలీజైన మొదటిరోజు నుండే సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రిలీజవడానికి ముందు నుంచే ఈ సినిమా కోసం ఎదురుచూసిన వారు ఎంతమందో నాకు తెలీదు కానీ, రిలీజవగానే imdb రేటింగుల్లో అమాంతం మొదటి స్థానానికి ఎగబాకడంతో కలిగిన కుతూహలం కొద్దీ ఇక్కడ రిలీజైన మొదటివారంలోనే ఆ సినిమా చూసిన వారిలో నేనొకదాన్ని. ముందు బ్యాట్‍మ్యాన్ సినిమాలు చూసిన అనుభవం లేకపోయినా కూడా, ఈ సినిమా చూశాక తక్కినవి కూడా చూడాలనిపించింది. ఇంత(…)

Zodiac (2007)

1960-70 లలో అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలో భయభ్రాంతులు సృష్టిస్తాడు జోడియాక్ అనే సీరియల్ కిల్లర్. అతన్ని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలన్న శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసు విభాగంలో డిటెక్టివ్ గా వున్న David Toschi, స్వతంత్రంగా ఈ కేసుని పరిశోధించాలని ప్రయత్నించే పత్రికా విలేఖరి Paul Avery, వేరెవ్వరికీ పరిష్కరించ సాధ్యమవ్వని ఈ కేసుని తన మనోబలంతో పరిష్కరించగలడనుకునే కార్టూనిస్ట్ Robert Graysmithల కథే జోడియాక్. అమాయకులైన ప్రజలను అమానుషంగా చంపడమే కాకుండా, తన తదుపరి యత్నాలను ఎప్పటికప్పుడూ(…)

శ్యామలన్ – ది హ్యాపెనింగ్

శ్యామలన్ తెలివైనవాడో, ఫూలో అర్ధంకాదు. కొన్ని sceneలు అద్భుతమనిపించేలా ఉంటాయి. కొన్ని పిచ్చిగా ఉంటాయి. ఈ సినిమాని క్లైమాక్స్ కట్ చేసేసి విడుదల చేసి ఆ రహస్యమేదో ప్రేక్షకుల్నే తెలుసుకొమ్మని( antonioniలా) వదిలేస్తే సరిపోయేదనుకొంట. అప్పుడు తాను చెప్పాలనుకున్న point (ప్రకృతిని మనిషి జయించలేడు) clearగా pass అయ్యేది. ఇలా చివర్లో తానే ఎదోక justification ఇచ్చేద్దామన్న తొందరపాటులో తనతో ప్రేక్షకులు ఏకీభవించలేరన్న విషయాన్ని మరిచిపోయాడు. అయినా ఈ సినిమాని photograpy కోసమైనా ఒక్కసారి చూడొచ్చు. ఇంకా(…)