ఫ్రెంచ్

ఫ్రాన్సు సినిమా సమీక్షలు

The past – చిక్కుముడి

The past – చిక్కుముడి

ఇదో గమ్మత్తయిన కథ..ఇందులో ఎవరు తప్పు ఎవరు కరక్టో తెలియదు.అందరి అలోచనలూ..దృక్పథాలూ సరైనవే. కానీ నాటకీయత మాత్రం నిండుగా ఉంటుంది. అదే నాటకీయంగా మన సహానుభూతి ఒకరినించి ఒకరికి మారుతూ ఉంటుంది. అలా అని ఇలాంటివన్నీ మేం టివీ సీరియళ్ళలో చూస్తూనే ఉన్నాం అనకండోయ్. ఎందుకంటే సినిమాకు ఉండే లక్షణాలన్నీ బలంగా ఉన్న సినిమా. బాగా ఆకట్టుకునే సినిమా..!! మనం ఒక పనిచేసేముందు మనకున్న లాజిక్కు ప్రకారం ఇది ఇలా చేస్తే ఇలా అవుతుందీ అని చేస్తాం..(…)

where is my grandpa – సంపూర్ణ ఆనందం

where is my grandpa – సంపూర్ణ ఆనందం

ప్రేమ.. ప్రపంచంలో ప్రతివాళ్ళూ అంగలార్చేది ప్రేమకోసమే.  మంచి పండులో  తియ్యదనం ఎలా దాగుంటుందో…మంచి హృదయంలో ప్రేమ ఆలా దాగుంటుంది.  వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మనిషికీ తన మనుషుల ..సాటి మనుషుల ప్రేమ కావాలి… కావాలని కోరుకుంటారు. ఏ మనిషి ‘ప్రేమ’ అక్కరలేదంటాదు చెప్పండి ?? ప్రేమ అనేది ప్యూర్ బ్లిస్..సంపూర్ణ ఆనందం. ప్రేమకోసమే పొత్తిళ్లలోని బిడ్డ కాసేపు తల్లి స్పర్శ ..పలకరింపు లేకుంటే ఏడుపు అందుకుంటుంది. తల్లిదండ్రుల ప్రేమ నిరంతరం కోరుకుంటారు పిల్లలు. ఈ స్కూలూ(…)

rosetta – గులాబీ కొమ్మ

rosetta – గులాబీ కొమ్మ

సినిమా అంటేనే కథ..అందరినీ ఆకట్టుకునే ఓ కథ. సినిమాగా తీస్తే ..పదిమందీ చూస్తే..చూసి  అహా అనగలిగితే..ఆ  నటీనటులకీ..దర్శకనిర్మాతలకీ డబ్బు,  గొప్ప గుర్తింపు… అదేగా  సినిమా పరమావధి ?!!  కానీ కొన్ని సినిమాలు అలాకాదు. సమాజంలోని సమస్యని ప్రశ్నిస్తాయి..లోపాలని ఎత్తి చూపుతాయి..ప్రజలకి సమస్యగురించీ…సమస్య తీవ్రతగురించీ అవగాహన కల్పించి ఆలోచింపజేస్తాయి. అలాంటి సినిమాలు అరుదు. అయితే ఈ సినిమా కథ కాదు..సమాజ సమస్యలని ప్రశ్నించే ప్రయత్నమూ కాదు.  కానీ సినిమా తనకి తెలియకుండానే కొన్ని సమస్యలని చెప్పింది. చట్టాన్నే  సవరించగల(…)

Cache

Cache

Last night I sat down to watch ‘Cache’ by Michael Haneke – an attempt to replace the lack of sleep. I sat down with an empty slate as I never saw any of his previous works and now after 24 hrs I am still thinking about this movie. Despite watching so much of world cinema,(…)

Rules of the game

Rules of the game

ఈ మధ్య నేను చూసిన సినిమాల్లో అన్నింటికంటే మంచి సినిమా ఈ Rules of the game. ఈ మధ్యే కాదు నా జీవితంలో చూసిన చాలా సినిమాల్లోకెల్లా అత్యంత గొప్పదైన ఈ సినిమాకి దర్శకుడు Jean Renoir. ఫ్రెంచ్ సినీ చరిత్రలో మకుటంలేని మహరాజు లాంటి Jean Renoir ఎన్నో కళాఖండాలను తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా మాత్రం ఆయన తీసిన సినిమాల్లోకెల్లా అత్యుత్తమ చిత్రమని చెప్పొచ్చు. ప్రపంచలోని అత్యుత్తమ సినిమాల లిస్టులో ఎప్పుడూ స్థానం కల్పించుకుని(…)

Zidane: A 21st Century Portrait

Zidane: A 21st Century Portrait

Zidane: A 21st Century Portrait నేనేమీ హార్డ్ కోర్ ఫుట్ బాల్ ఫాన్ ని కాదు కానీ ఎందుకో జిదాన్ లాంటి వారు ఆడుతుంటే మాత్రం అత్తుక్కుపోవల్సిందే …. దీన్ని xperimental సినిమా / డాక్యుమెంటరీ అనొచ్చేమో … అసలు దీని సంగతేంటంటే … 17 హై డెఫినెషన్ కెమరాలతో ఒక real ఫుట్ బాల్ మాచ్ లో కేవలం జిదాన్ ని live గా ట్రాక్ చెయ్యడం !! అవును 90 నిమిషాల సినిమా(…)

Three colours – White

Three colours – White

ఎయిర్ పోర్ట్ కెరేజల్ మీదుగా ఒకదాని వెంట ఒకటిగా ముందుకు కదులుతున్న లగేజ్. అందులో ఓ మనిషి పట్టేసేటంత సైజులో ఉన్న పెద్ద పెట్టె మిగతా వాటితో పాటు ముందుకు కదులుతూ ఉండగా సన్నివేశం ఫేడవుట్ అవుతుంది. సూటు, బూటు వేసుకున్న ఓ మనిషి కాళ్ళు గబా గబా కదులుతూ పోతూ…..అంతలోనే కొంచెం కొంచెంగా వేగాన్ని తగ్గిస్తూ ఓ చోట ఆగుతాయి. అంత వరకు క్లోజ్ అప్ లో ఉన్న కెమెరా ఇప్పుడు మీడియం వ్యూలోకి వస్తుంది.(…)

The Three colours – Blue

The Three colours – Blue

Fade in తెర ని౦డా చీకటిని తలపి౦చే నలుపు. కొద్ది కొద్దిగా లేత నీల౦ ర౦గు కా౦తి అలా మెరుస్తూ….అ౦తలోనే అదృశ్యమయిపోతూ ఉ౦టు౦ది. ఏదో మోటారు ఇ౦జిన్, రణగొణ ధ్వని చేస్తూ వస్తు౦దో పోతు౦దో తెలీనట్టుగా ఉ౦టు౦ది. ఇ౦తలో కొ౦చె౦ కొ౦చె౦గా తెర మీద కాస్త లే లేత నీలి ర౦గులో వెలుతురు విరజిమ్ముతూ౦డగా…..ఓ చక్ర౦ తిరుగుతూ ఉ౦టు౦ది, అక్కడక్కడ వచ్చే మలుపులకు అనుగుణ౦గా తన దిశ మార్చుకు౦టూ పరుగెడుతున్న ఆ చక్రాన్ని, దానితో పాటు వస్తున్న(…)

Monsieur Morimoto

Monsieur Morimoto

1999,జపాన్. నలభై ఏళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైరయిన ఒక ముసలాయన రిటైరయ్యాక కృష్ణా,రామా అనుకుంటూ మూల కూర్చుని ఉంటే నేనీ పోస్ట్ రాయడం ఇక్కడే ఆగిపోయుండేది. కానీ ఆయనలా చెయ్యలేదు. మిగిలిన జీవితాన్ని తనకిష్టమొచ్చినట్టు గడపాలనుకున్నాడు. అంతే జపాన్ టు అమెరికా. అమెరికా టు Tahiti. అక్కడ్నుంచి ఇంకెక్కెక్కడికో. చివరిగా ఫ్రాన్స్ లోని పారిస్ చేరుకున్నారు. 2001, ప్యారిస్. ప్రపంచ కళల (కలల) రాజధాని చేరుకున్న ఆ పెద్దాయన ప్యారిస్ తో ప్రేమలో(…)

Persepolis

ఈ చిత్రం క్రితం ఆదివారం చూసాను. ఇది ఈ నెలలొ 5వ ఫ్రెంచి సినిమా. నేను Talk Cinema కి వెళ్ళినపుడు, ఈ చిత్రం మీద అభిప్రాయాలు విన్నాను. ఇది animated చిత్రం. దీనికి Oscar nomination కూడ వచ్చింది. ఇదే పేరుతొ వచ్చిన graphic novel ఆధారంగా తీసిన చిత్రం ఇది. ఫ్రెంచి చిత్రమయిన, కధ ఇరానీన్. నాకు చిత్రం ఫార్సిలో ఉంటే ఇంకా బావుండేది అనిపించింది. ఈ కధ కాస్త ఇరాన్లోను, కాస్త ఆస్ట్రియాలోను(…)