ఇంగ్లండ్

ఇంగ్లండ్ సినిమాల సమీక్షలు

Morvern Callar – అంతరంగపు అన్వేషణ

Morvern Callar – అంతరంగపు అన్వేషణ

ఈ సినిమా ఆది మధ్య  అంతం అనే కథా సూత్రాలమీద నడవదు. అసలు ఇక్కడ కథే లేదు.ఇది ఒక అమ్మాయి, ఆమె భావోద్వేగాలు మాత్రమే. జీవితం అనేది జీవించటానికి ..  అంటే సంతోషాల్ని సొంతం చేసుకోవటానికి, ఆనందాన్ని అందిపుచ్చుకోవటానికి ఇవ్వబడింది. లైఫ్ ఈజ్ ప్యూర్ బ్లిస్. కానీ  ఆ ప్రయత్నంలో మనకి విషాదాలు.. బాధలూ ..ఎదురవుతూంటాయి. కొంతమంది బాధలని నొక్కిపట్టి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొందరు సంతోషాన్ని దూరం చేసుకొని బాధలోనే జీవిస్తారు. అమె తన ప్రియుడి(…)

Brief Encounter

Brief Encounter

బ్రీఫ్ ఎన్‌కౌంటర్ అనే ఈ అద్భుతమయిన సినిమా కాన్సెప్టు 1945 లో వచ్చిందంటే నమ్మడానికి చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. మామూలుగా పెళ్ళి అనేది ప్రేమ జీవితానికి ముగింపు. ఆ తరువాత ప్రేమ అంటే మన భాగస్వామితోనే. కానీ పెళ్ళి తరువాత మీ భాగస్వాములతో కాక వేరొకరితో ప్రేమలో పడితే ?? ఆ సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించే అద్భుతమయిన సినిమా “బ్రీఫ్ ఎన్‌కౌంటర్”. లారా అనే ఒక మామూలు గృహిణి ఎంతో ఆనందమయిన జీవితం గడుపుతుంటుంది. మంచి భర్త,(…)

shame – వాంచాలోలత్వం .

shame – వాంచాలోలత్వం .

ఈ సినిమా  ఏమిటీ అనేది ఒక  నిశ్చిత అభిప్రాయానికి రాలేము..  దర్శకుడు కూడా ఒక ఖచ్చితమైన ముగింపు ఇవ్వలేదు కూడా . ఇవ్వలేడుకూడా !! ఎందుకంటే ఇది కథకాదు ఏదో ఒక ముగింపు ఇవ్వటానికి. ఇందులో కథ లేదు. ఒక పాత్ర ..దాని స్వభావం అంతే ! ప్రపంచంలో  కోట్లమంది వ్యక్తులు ..ఒక్కో వ్యక్తీ తమ అభిరుచీ.ఇష్టాఇష్టాలకి అనుగుణంగా ఒక్కో ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. ఆ ప్రపంచంలో బతుకుతుంటాడు. చుట్టు మనుషులే ఉంటారు.కాని తన ప్రపంచంవేరు.పెరుగుదలతో పాటు తన (…)

తడబాటు మాటల నుంచి ప్రభావంతమైన ప్రసంగం వరకు :The King’s Speech

తడబాటు మాటల నుంచి ప్రభావంతమైన ప్రసంగం వరకు :The King’s Speech

అప్పటికి ఆయన ఒక యువరాజు. అదష్టం కలిసొస్తే మహరాజయ్యే అవకాశం వుంది. అడుగులో అడుగేసుకుంటూ ముందుకు వచ్చాడు. ఎదురుగా అశషంగా కనిపిస్తున్నప్రేక్షకులు, ప్రజలు. అతని వెనుకే నేను తోడున్నానని కళ్ళతోనే చెప్తున్నభార్య. తడబడుతూనే ముందుకు వచ్చాడు. అతను పలకబోయే ప్రతి మాటకోసం అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రసంగం మొదలైంది. మాటమాటకి తడబడుతున్నాడు, నత్తితో పొడిగా పొడిగా అక్షరాలు పలుకుతున్నాడు. మాటపెగలని ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తోంది. ప్రజల్లో అసహనం పెరుగుతోంది. యువరాజు ఓడిపోయాడు. ***(…)

సాహసంతో తీసిన ధీరుడి నిజమైన కథ 127  Hours

సాహసంతో తీసిన ధీరుడి నిజమైన కథ 127 Hours

(Caution: Spoilers ahead; towards the end of the article) ఏరన్ రాల్‌స్టన్ సాహసక్రీడలపై మోజున్న యువకుడు. నిర్జనమైన కొండలమధ్య సన్నని లోయలో సాహసయాత్రకు బయలుదేరాడు. ఉన్నట్టుండి కాలు జారింది. ఆ పాటులో కదిలిన పెద్ద బండరాయి అతని కుడి చేతిని కొండకు నొక్కిపెట్టేసింది. మోచేతికి కొంతకిందనించి అరచేతిదాకా రాయికీ కొండకూమధ్య నలిగిపోతుంది. ఆ చేయి కదిపే వీలు కూడా లేదు. ఆ బండని కదపటానికి ఎంత ప్రయత్నించినా అతని బలం చాలటంలేదు. అతని దగ్గర(…)

Withnail and I

ఈ మధ్య  సినిమా హాలులో చూసిన మరో మంచి సినిమా Withnail and I. 1987లో వచ్చిన ఈ సినిమాకి Bruce Robinson దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందు ఈయన పేరు ఎప్పుడూ వినలేదు. అయినా బ్రిటీష్ సినిమాలోని ఆణిముత్యాల సీరీస్ లో చివరిగా ప్రదర్శిస్తున్న ఈ సినిమా ఎలా అయినా చూడాలని అఫీసునుంచి హడావుడిగా పరిగెత్తుకొచ్చి చూస్తే సినిమా హాలులో ఎప్పుడూ లేనంత పెద్ద క్యూ కట్టబడివుండడం చూసి ఆశ్చర్యపోయాను. తీరా చూస్తే ఆ క్యూ(…)

హారీ పాటర్ చూశాక నాతో నేను.

హారీ పాటర్ చూశాక నాతో నేను.

హారీ పాటర్ మరియు అర్ద కులీన రాజకుమారుడు సినిమా చూశాను. అవునా? ఆలాంటి పేరెప్పుడూ వినలేదే? అదేలేవోయ్, హారీ పాటర్ అండ్ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ కు నా తెలుగు సేత ఏడ్సినట్టుంది. ఏంటి సినిమానా ? కాదు, నీ తెలుగు సేత. అయినా సినిమా చూసింది నువ్వు కదా, ఏడ్సినట్టుందో, నవ్వినట్టుందో నువ్వే చెప్పాలి కదా. అవునూ ఇంతకీ సినిమా తెలుగులో చూశావా ? ఇంగ్లీషులోనే చూశా! మరి తెలుగులో సేతడమెందుకో? తెల్దా? స్టైలు. అవునా?(…)

The Last King of Scotland

The Last King of Scotland

ఈ వారం అనుకోకుండా ఒక మంచి సినిమా చూసాను. ఇది ‘ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్’. ఏదో మామూలు మూడ్ లైట్ చేసుకుందామని, దీని ఓ, నా, మా లు తెలీకండా, ఇదేదో ఫన్నీ సినిమా అనుకుని, చూసాను గానీ, కొంచెం కధ లో మునిగేదాకా నేనెందులో పడ్డానో తెలిసిరాలేదు. ఒకసారి నా బ్లాగ్ లో ‘ఇండిపెండెంట్’గారు, ‘కొలంబియా లో ఇంగ్రిడ్ విడుదల’ గురించి రాసినపుడు, వ్యాఖ్యానిస్తూ, ఆపరేషన్ ఎంటెబ్ గురించి వీడియో లింక్ ఇచ్చారు.(…)

Frost/Nixon

Frost/Nixon

ఫ్రాస్ట్/నిక్సన్-2008 లో నేను చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. గత సంవత్సరంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి; ఇలాంటి అంటే ప్రముఖల జీవితాలు లేదా వారి జీవితాల్లోని వివిధ ఘట్టాల ఆధారంగా వచ్చిన సినిమాలు. ఉదాహరణకు జార్జి బుష్ గురించి వచ్చిన ‘W’, చే గువెరా గురించి వచ్చిన రెండు సినిమాలు ’చే-1′ మరియు ’చే-2′, ఇటలీ మాజీ ప్రధాని Giulio Andreotti జీవితం ఆధారంగా వచ్చిన ’Il Divo’ అనే ఇటాలియన్ సినిమా, Harvey Milk(…)

స్లమ్ డాగ్ మిలియనీర్

ఒకే ఒక్క ప్రశ్న మిగిలుంది. సరైన జవాబిస్తే చాలు అతని జాతకం మారుతుంది. లేదా…తిరిగి మామూలు జీవితంలోకి ప్రయాణమే! ఇదేనా నీ తుది జవాబు? ఈజ్ దట్ యువర్ ఫైనల్ ఆన్సర్? యే హై తుమ్హారీ ఆఖరీ జవాబ్? భాషేదైనా వీటికి జవాబొకటే; అవును – కాదు. ఇది ఊపిరి బిగపెట్టే సన్నివేశం. వేడెక్కిన వాతావరణం. చూసే వాళ్ళకి ఎంతో ఉత్కంఠ. ఆఖరి ప్రశ్నకి జవాబు అతన్ని కోటీశ్వరుణ్ణి చేయచ్చు. లేదా నిరాశతో నిష్క్రమించేలా చేయచ్చు. ఇంతవరకూ(…)

స్లమ్ డాగ్ మిలియనీర్

స్లమ్ డాగ్ మిలియనీర్

మరో ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్తే జమాల్ మాలిక్ రెండు కోట్ల రూపాయలు గెలుచుకుంటాడు. అతను ఇంత దూరం ఎలా రాగలిగాడు? 1) అతను మోసగాడు 2) అతను అదృష్టవంతుడు 3) అతను మేధావి 4) అది అతని తలరాత ’స్లమ్ డాగ్ మిలియనీర్’ అనే త్వరలో విడుదలవబోయే ఒక సినిమా పై ప్రశ్న తో మొదలవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఈ సినిమా కథ. పరిచయం:గతంలో Trainspotting, Sunshine చిత్రాల ద్వారా ప్రపంచ(…)

The Bridge on River Kwai

The Bridge on River Kwai

ఈ సినిమా సంగతేంటి? వంద మంది విమర్శకులను పిలిపించి, ఈ శతాబ్దపు 100 అత్యుత్తమ ఆంగ్ల చిత్రాల జాబితా పొందుపరచమని చెబితే, ప్రతి ఒక్కరి జాబితాలో ఈ చిత్రానికి ఏదో ఒక స్థానం ఖచ్చితంగా లభించి తీరుతుంది. పోస్టర్లు చూసి “ఇది యుద్ద నేపథ్యం గల సినిమాలా ఉందే…ఆ..ఏముంది…రెండు దేశాలు కొట్టుకుంటాయి…కనీళ్ళు తెప్పించేలా సైనికుల త్యాగాలను చూపి ఉంటారు అంతే..”అనుకుంటే, తప్పులో కాలు వేసినట్లే. యుద్ద నేపథ్యం ఉన్నా, కథ యుద్దం చుట్టూ, దేశాల చుట్టూ కాక(…)

రాక్ ’న్ రోలా

రాక్ ’న్ రోలా

Spoilers ahead పరిచయం:ఇంతకుముందు గయ్ రిచీ పేరు వినివుంటే ఆయన తీసిన ’లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బారెల్స్’, ’స్నాచ్’ అనే రెండు సినిమాల గురించి మీకు తెలిసే వుంటుంది.ఈ దశాబ్దంలో వచ్చిన అతి కొద్ది ఇంగ్లీష్ (అంటే బ్రిటన్ దేశపు సినిమాలని ఇక్కడ అర్థం) సినిమాల్లో ఈ రెండింటినీ తప్పక ప్రస్తావించవచ్చు. మన వాళ్ళు పూర్వం రాజుల సినిమాలు తీసినట్టుగా ఈ ఇంగ్లాడు వాళ్ళు కూడా ఎక్కువ రాజులూ రాణుల కథలతో కాస్ట్యుమ్ డ్రామాలు(…)

Atonement

Atonement సినిమా చూడాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నా ఎదో ఒక కారణం వలన ఇన్నాళ్ళూ చూడలేకపోయాను. పోయిన వారాంతరం ఎలాగో కుదుర్చుకుని వెళ్ళి ఈ సినిమా చూసాను. సినిమా మరీ గొప్పగా లేకపోయినా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని మంచి సినిమాలలో ఇది ఒకటి. ఈ సినిమా మొదటి సగం ఒక రోజులో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందించబడితే మిగిలిన సగం ఒక జీవిత కాలపు కథను కలిగి వుంటుంది. ఇది Briony మరియు Cecilia అనే(…)