Category: ప్రపంచ సినిమా

Travellers and Magicians - భూటాన్

Travellers and Magicians – భూటాన్

Country:Bhutan
Year:2004
Language:Dzonghka
Story & Direction: Khyentse Norbu
Awards: Deauville Asian Film Festival – Audience award
Asian Americal Film Festival – Emrging Director award
“మానవుని దు:ఖానికి కారణం ఉంది. కోరిక వలన దు:ఖం పుడుతోంది. దు:ఖం పోవాలంటే కోరిక నశించాలి” అని చెప్పిన బుద్ధుని బోధనలు విశ్వసిస్తున్న దేశాలలో భూటాన్ ఒకటి.
దర్శకుడు Khyentse Rinpoche ఒక పేరుపొందిన బౌద్ధ లామా. తన భూటాన్ ప్రజల జీవితాన్ని, సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు. మోహంలో మునిగిన [...]

ఖుదా కే లియే -In the name of God (ఒక పాకిస్తానీ చిత్ర సమీక్ష)

ఖుదా కే లియే -In the name of God (ఒక పాకిస్తానీ చిత్ర సమీక్ష)

“ఖుదా కే లియే”, “ఖామోష్ పాని” తరువాత, నేను చూసిన పాకిస్తానీ సినిమా ఇది. అంటే నా జీవితంలో చూసిన రెండవ పాకిస్తానీ సినిమా అన్నమాట. “షోయబ్ మన్సూర్” దీనికి దర్శకుడు. పాకిస్తాన్ టి.వి. లో చాలా కార్యక్రమాలు,సీరియళ్ళు తీసిన ఇతడికి ఇదే మొదటి సినిమా. 9/11 తరువాత “ముస్లిం ఐడెంటిటీ” గురించి చర్చించిన ఈ చిత్రం ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా గుర్తించవచ్చు. ముస్లింల పట్ల మిగతా ప్రపంచం (ముఖ్యంగా అమెరికన్ల) మారిన వైఖరితోపాటు, ముస్లిం సమాజంలోనే [...]

పా-త్రీ ఇడియట్స్-సీతా సింగ్స్ ది బ్లూస్

పా-త్రీ ఇడియట్స్-సీతా సింగ్స్ ది బ్లూస్

నాకు సినిమాలకీ దూరం పెరిగి చాన్నాళ్ళైనట్లుంది. అంటే, నేను చూడట్లేదని కాదు. కొత్త సినిమాలు బానే చూస్తున్నా. కానీ, ఏమిటో రాయాలి అనిపించట్లేదు. ఇవాళ ఓ సినిమా చూశాక, నాకెందుకో రాయాలనిపిస్తోంది. ఇటీవల చూసిన సినిమాలు కొన్నింటి గురించీ.
పా: జూన్ నుంచి ఎదురుచూస్తూ, ఆఖరికి సినిమా రిలీజైన నెలరోజులగ్గానీ చూడలేకపోయాను. ’చీనీకం’ సినిమా గుర్తొచ్చింది చాలాసార్లు, ఈ సినిమా చూస్తూ ఉంటే. బహుశా, దర్శకుడి శైలి వంటబట్టిందేమో నాకు. ఈ సినిమాకీ, ఆ సినిమాకీ కథాపరంగా చాలా [...]

అవతార్-మరోవ్యూ

అవతార్-మరోవ్యూ

నవతరంగంలో ఇప్పటికే అవతార్ సినిమా గురించి ఎన్నో రివ్యూలు వచ్చాయి, ఇది మరోవ్యూ. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా కథ మౌళికంగా మనుషుల, ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాల మేధావుల పశ్చాత్తాపం అని అనుకోవచ్చు.
తాను కూర్చున్న కొమ్మను నరుకుతూ, గడిచిన కాలంలో ఈ భూమిపైనున్న ప్రకృతిని రెండు చేతులతో నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తూ వచ్చిన మనిషి, రేపటి తరాలకు ఏమి మిగులుస్తున్నాడో తెలియక, గతాన్ని చూసి బాధపడుతూ, తాను నేర్చుకున్న పాఠాలను వల్లె వేయడమే ఈ సినిమాలో [...]

Invictus

Invictus

Invictus– అతడి ప్రజలు నాయకుణ్ణి కోరుకున్నారు. అతడు అజేయుడ్ని ఇచ్చాడు.
నెల్సన్ మండేలా గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 1995 రగ్బి ప్రపంచ కప్ మరియు స్ప్రింగ్ బోక్స్ (సౌతాఫ్రికా రగ్బీ జట్టు పేరు) చుట్టూ తిరిగే చిత్రం ఇది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వుత్సవాలలో మంచి పేరు సంపాదించింది. ఒక పుస్తకం (జాన్ కార్లిన్ “ప్లేయింగ్ ది ఎనిమి“ ఆధారం చేసుకుని తీసిన చిత్రం ఇది. నెల్సన్ మండేలా గా మోర్గాన్ ఫ్రీమన్, స్ప్రింగ్ [...]

అవతార్

అవతార్

కథలో కొత్త ఆలోచనలు గానీ సరికొత్తగా ప్రతిపాదించిన సూత్రాలు కానీ ఏవీ లేవు గానీ అవతార్ సినిమా రెండున్నర గంటల సేపు కళ్ళకీ మనసుకీ విందు చేసిందనే నాకనిపించింది.
సృష్టిలో అన్నిటినీ కలిపి ఉంచే మూల సూత్రం ఒకటున్నదనీ, ఒక అంతస్సూత్రం ఉన్నదనీ, దాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయినా కనీసం దాని ఉనికిని గుర్తించి దానితో (లిటరల్‌గా)”టచ్” లో ఉంటే, మనము మన చుట్టూతా ఉన్న ఈ సృష్టితో ఒక సమతుల్యతలో ఉండవచ్చునని అనేక ప్రాచీన మానవ [...]

అవతార్ : ఒక కథ, ఒక నిజం, ఒక సత్యం...ఒక సినిమా

అవతార్ : ఒక కథ, ఒక నిజం, ఒక సత్యం…ఒక సినిమా

ఒక కథ:
అనగనగా ఒక అడవి.
ఆ అడవిలో ప్రకృతితో కలిసి బ్రతికే కోయజాతి ప్రజలు.
ఒక పారిశ్రామికవేత్త అక్కడొక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటాడు. లేదా అక్కడదొరికే ఖనిజసంపదను దోచెయ్యాలనుకుంటాడు.
అలాచెయ్యాలంటే కోయోల్లని అక్కడ్నించీ తరిమెయ్యాలి.
అప్పుడు… కోయవాళ్ళకు మంచిచేసి, మచ్చికచేసుకుని, మోసం చెయ్యడానికి ఒకడ్ని నియమిస్తాడు.
అతడే హీరో…
ఆ హీరో విలన్ కోసం అక్కడికి వెళ్ళినా, త్వరలోనే ఆ కోయోళ్ళ ప్రకృతి ప్రేమని, అమాయకత్వాన్నీ అర్థం చేసుకుంటాడు.
పనిలోపనిగా కోయదొర కూతురు (హీరోయిన్)తో ప్రేమలో పడతాడు.
వచ్చింది మోసం చెయ్యడానికే అయినా, జరిగిన కనువిప్పుతో విలన్ కు వ్యతిరేకంగా [...]

తుల్పాన్ (Tulpan) (2008): కజకిస్తాన్ చిత్రం

తుల్పాన్ (Tulpan) (2008): కజకిస్తాన్ చిత్రం

Cannes 2008 లో “Prix Un Certain Regard” విజేత ఐన కజాకిస్తాన్ సినిమా తుల్పాన్ (Tulpan) ఎప్పట్నుంచో చూద్దామనుకుంటున్నా. ఇన్నాళ్ళాకు DVD విడుదల అయ్యింది.  డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు Sergey Dvortsevoy కు ఇది మొదటి చలన చిత్రం. డాక్యుమెంటరి చిత్రాల అనుభవం కాబోలు ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం నిజంగా మన కళ్ళ ముందరే జరుగుతోందన్న అనుభూతి కలిగేలాగ తీసారు.
కథా కమామిషూ :
నావికుడిగా పనిచేసిన ఒక యువకుడు “ఆస” (Asa) తన ఊళ్ళో స్వంత [...]

4నెలల 3 వారాల 2 రోజులు

4నెలల 3 వారాల 2 రోజులు

దాదాపు రెండు దశాబ్దాల పాటు రొమానియా ప్రజలను పట్టి పీడించిన కమ్యూనిస్టు భూతం Nicolae Ceausescu ని సాయుధ ఉద్యమం ద్వారా కిందకు దించి అతనికి మరణ శిక్ష విధించడంతో రొమానియన్ ప్రజలు తిరిగి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. కానీ ఆ రెండు దశాబ్దాల కాలంలో Nicolae Ceausescu పాలనలో రొమానియా ఎన్నో విధాల నష్టపోయింది. ఎన్నో రంగాల్లో ప్రపంచం లోని ఇతరదేశాలకంటే వెనుకబడింది. ఇలా వెనుకబడిన వాటిలో రొమానియా చలనచిత్ర పరిశ్రమ కూడా ఒకటి.
1989 నుంచి [...]

Postmen in the Mountains - చైనా

Postmen in the Mountains – చైనా

కధ
ఇది ఓ తండ్రీ కొడుకుల కధ.
తండ్రి పోస్ట్ మేన్. చైనాలో,హునాన్ అనబడే మారుమూల పర్వత ప్రాంతాల్లో, కాలినడకన ఉత్తారాలు బట్వాడా చేస్తుంటాడు. పెంపుడు కుక్క లాయోర్ తోడుగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం క్షీణించంటంతో ఆ ఉద్యోగం కొడుక్కి వస్తుంది.
ఉదయాన్నే కొడుకు కొత్త ఉద్యోగానికి రెడీ అవుతుంటాడు. తండ్రి విశ్రాంతి తీసుకోకుండా అతనికి ఒకటే జాగ్రత్తలు చెపుతుంటాడు. కొండలు గుట్టలు ఎక్కి ఆ చిన్న చిన్న గ్రామాల్లో ఉత్తరాలు పంచటం చిన్న విషయం కాదు. తిరిగిరావటానికి 3 రోజులు [...]

District 9 (2009)

District 9 (2009)

పీటెర్ జాక్సొన్(Lord of Rings fame) నిర్మాణంలో, నీల్ బ్లొకెంప్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా District 9. ఇది ఒక socio-political message తొ కూడుకున్న కథాంశం.
కథ లోకి వెళ్తే ఒక స్పేస్ షిప్ దక్షిణాఫ్రికా లోని జొహన్స్ బర్గ్ కి రావడం తో కథ ప్రారంభం అవుతుంది. ఇందు లో ప్రాన్స్ అనబడే గ్రహాంతరవాసులు చాలా దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుని వుంటారు. ప్రపంచ దేశాక ఒత్తిడికి లొంగి దక్షిణాఫ్రికా ప్రభుత్వం గ్రహాంతరవాసులకి ఒక షెల్టెర్ [...]

Inglourious Basterds - మరోసారి

Inglourious Basterds – మరోసారి

టరంటినో గురించి వినడమే కానీ ఎప్పుడూ అతని సినిమాలు చూడలేదు ఇప్పుడు మొదటిసారి చూసిన సినిమా – “Inglourious Basterds”. సినిమా మొత్తంగా బానే ఉంది. నిజానికి నాకు నచ్చింది. అయితే, హైపెక్కువవడం వల్ల నేను కాస్త నిరాశపడ్డాను అనే చెప్పాలి. నన్ను అడిగితే మంచి సినిమా అని చెప్తాను కానీ, అద్భుతమైన సినిమా అనను.
(స్పాయిలర్లు కలవు)
కథ: హిట్లర్ కాలం నాటి కథ. మొదటి సీనులో – “Jew Hunter” గా ముద్రపడ్డ నాజీ – Hans [...]

Inglourious Basterds రివ్యూ

Inglourious Basterds రివ్యూ

Chapter 1 – The Jew Hunter
బ్రాడ్ పిట్ కథానాయకుడయినా అమితంగా ఆకట్టుకునేది Christoph Waltz. జర్మనీ పాలిత ఫ్రాన్సులోని యూదులను మట్టుపెట్టే ఈ డిటెక్టివ్ పాత్రకు తగిన నటుడు దొరక్కపోతే సినిమా తీయకూడదు అనుకున్నానని టరంటినో ఎందుకన్నాడో సినిమా చూస్తే తెలుస్తుంది. స్వతహాగా ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్ భాషలు అనర్గళంగా మాట్లాడే వాల్ట్జ్ మొదటి చాప్టర్లో నవ్వుతూ పెద్దమనిషి తరహాలో మాట్లాడుతూ నెమ్మదిగా తన విశ్వరూపం చూపుతాడు. తర్వాతి చాప్టర్లలో వాల్ట్జ్ కనిపించాడంటే ఇప్పుడు ఏమి [...]

Inherit the wind (1960)

Inherit the wind (1960)

మొదట నాకు ఈ సినిమా కథతో పరిచయమైన సందర్భంతో మొదలుపెడతాను. లాంగ్ వీకెండ్, హోమ్ అలోన్ – అలాంటప్పుడే జైఅర్జున్ అనబడు jabberwock బ్లాగును చూస్తూ ఉంటే ఈ టపా కనిపించింది. ఈ సినిమా స్కోప్స్ ట్రయల్ (Scope’s trial of 1925) ఆధారంగా తీశారని తెలిసి, కుతూహలం పెరిగింది. ఆమధ్య ఓరోజు కార్టూనింగ్ ఎవల్యూషన్ వెబ్సైట్లో డార్విన్ సిద్ధాంతంపై కార్టూన్లు చూస్తూ ఉంటే, స్కోప్స్ ట్రయల్ గురించి తెలిసింది. అలా ఓ రెండ్రోజులు ఆ ఉదంతానికి [...]

మోక్షము గలదా?

మోక్షము గలదా?

కొన్ని సినిమాల గురించి పరిచయం చెయ్యాలంటే చాలా కష్టం. ఈ సినిమాల గురించి చాలామందికి ఎంతో కొంత తెలిసే వుంటుంది. ఇక కొత్తగా చెప్పడానికేముంటుంది అపిస్తుంది. ఉదాహరణకు సత్యజిత్ రే సినిమా పథేర్ పాంచాలి గురించి మనందరికీ తెలుసు. ఈ సినిమా ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటని, పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిందనీ, ఎన్నో అవార్డులు గెలుచుకుందనే విషయాలతో పాటు ఇప్పుడా సినిమా ఓ క్లాసిక్ అనీ సినిమా చూడని వాళ్ళయినా తలూపేసి ఒప్పేసుకుంటారు. ఉదాహరణకు మనం మిస్సమ్మ [...]

హారీ పాటర్ చూశాక నాతో నేను.

హారీ పాటర్ చూశాక నాతో నేను.

హారీ పాటర్ మరియు అర్ద కులీన రాజకుమారుడు సినిమా చూశాను.
అవునా? ఆలాంటి పేరెప్పుడూ వినలేదే?
అదేలేవోయ్, హారీ పాటర్ అండ్ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ కు నా తెలుగు సేత
ఏడ్సినట్టుంది.
ఏంటి సినిమానా ?
కాదు, నీ తెలుగు సేత. అయినా సినిమా చూసింది నువ్వు కదా, ఏడ్సినట్టుందో, నవ్వినట్టుందో నువ్వే చెప్పాలి కదా. అవునూ ఇంతకీ సినిమా తెలుగులో చూశావా ?
ఇంగ్లీషులోనే చూశా!
మరి తెలుగులో సేతడమెందుకో?
తెల్దా? స్టైలు.
అవునా? ఎక్కడ?
బ్లాగుల్లో!
హ హ హ . ఇంతకీ సినిమా తెలుగులో ఎందుకు [...]

Transformers 2 రివ్యూ

Transformers 2 రివ్యూ

చక్కని కథనం, అప్పటివరకు చూసిన గ్రాఫిక్స్ కంటే విభిన్నమయిన గ్రాఫిక్స్ లతో తీసిన Transformers చూసిన వెంటనే ఈ సినిమా సీక్వల్ తప్పక చూడాలి అని నిర్ణయించుకున్నాను. రెండవ పార్టు విడుదలయి కేవలం ఒక్క రోజులో 60 మిలియన్ డాలర్లు, వారాంతానికల్లా $112 మిలియన్ల కలెక్షన్ రాబట్టింది. ఈ వివరాలు చూసి ఈ సినిమా పైన మరిన్ని ఎక్కువ అంచనాలతో వెళ్ళాను.
మొదటి పార్టు హిట్ అయింది కాబట్టి రెండవ పార్టుకు కాస్త ఫ్లాష్‌బ్యాక్ కలపాలన్న ప్రాథమిక సూత్రాన్ని [...]

Definitely, May be (2008)

Definitely, May be (2008)

ఇప్పుడీ సినిమా కథ చెప్పాలంటే, అదో పెద్ద కథ. చూసేటప్పుడు కూడా నాకు కాస్త కన్ఫ్యూజింగ్ గానే అనిపించింది. విషయానికొస్తే, మన కథ వర్తమానంలో మొదలౌతుంది. విల్ హేస్ తన భార్య నుండి విడాకులు కోరి ఉంటాడు. ఈ ప్రయత్నాలు నడుస్తూ ఉండగా, విల్ పదేళ్ళ కూతురు మాయ తన తల్లిదండ్రుల వివాహానికి ముందు జరిగిన కథను తెలుసుకోవాలనుకుంటుంది. విల్ ఈ కథని యదాతథంగా చెప్పక – పాత్రల పేర్లు మార్చి, కాస్త నాటకీయంగా చెప్పడం [...]

Father of the bride

Father of the bride

Father of the bride 1991లో వచ్చిన ఇంగ్లీషు సినిమా. అప్పుడెప్పుడో “ఆకాశమంత” చూసినప్పుడు ఎవరో అన్నారు ఈ సినిమా, ఆ సినిమా ఒకే థీం అని. విని ఊరుకున్నాను. ఆ తరువాత ఓ పదిరోజుల క్రితం అనుకోకుండా ఈ సినిమా చూశాను. పనిగట్టుకుని ఆలోచించకపోయినా కూడా రెండింటినీ పోల్చడం మొదలుపెట్టాను కాసేపు. ఇప్పుడీ వ్యాసం దాని పర్యవసానమే…
కథ విషయానికొస్తే, జార్జ్ బ్యాంక్స్ అన్న పెద్దాయన కూతురు Annie ఆర్థికంగా తమకంటే పై అంతస్థులో ఉన్న అబ్బాయిని [...]

డిఫాయన్స్

డిఫాయన్స్

కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు, ఆ సినిమా కథాగమనంతో భౌగోళికంగానూ కాలమాన పరిస్థితులతోనూ నాకెటువంటి సంబంధం లేకపోయినా కూడా ఒక్కోసారి అందులోని పాత్రలమధ్యలో నేను కూడా దూరిపోయి వాళ్ళతో పాటే అష్టకష్టాలు పడి వాళ్ళతోపాటుగా ఓడుతూ గెలుస్తూ సినిమాలోని అన్ని ఎమోషన్స్ ని అనుభవించి సినిమా అయ్యేటప్పటికి ఏదో ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ఉద్విగ్నతకు లోనవుతుంటాను. ముఖ్యంగా వార్ మూవీస్ చూసినప్పుడు. అలాంటిదే ఈ సినిమా – డిఫాయన్స్(Defiance).
టైటిల్ చూసి, పోస్టర్ మీద మన సరికొత్త [...]

Page 1 of 612345...Last »