|
రియలిస్టిక్ థ్రిల్లర్-నో వన్ కిల్డ్ జెస్సికా
ఇన్నాళ్లకి బాలీవుడ్‌లో కొత్త సంవత్సరం నిజంగానే ‘కొత్త’ ఫీలింగ్‌ను తెచ్చింది. ప్రతీసారీ కొత్తసంవత్సరం ఆరంభంలో కూడా పాత కథలను, తిరగరాసిన కథలనే తెరమీద చూసే పాతదానికి అలవాటుపడిన ప్రేక్షకులకి నిఖార్సయిన ‘కొత్త’దనాన్ని సినిమాపరంగా ఆవిష్కరించిన సినిమా – ‘నోవన్ కిల్‌డ్ జెస్సికా’! బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా కథలను అల్లుకునే ట్రెండ్ పెరిగిపోతోంది. ఇది సినిమాటిక్ గ్రామర్‌లో ఓ అద్భుతమైన ధోరణే! అయితే నిజజీవిత సంఘటనలకు ఇన్‌స్పైర్ అయి తీసిన సినిమాలలో అన్ని [...] |
|
“శుభలేఖ” రాసుకున్నా ఎదలో ఎపుడో!
కొన్ని సినిమాలతో ఏదో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. అవి గొప్ప సినిమాలు కాకపోవచ్చు, గొప్ప హిట్టూ కాకపోవచ్చు, కాని మనసులో వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతివారికీ ఇలాటి కొన్ని సినిమాలు ఉంటాయి. నాకు ఇలా నచ్చిన సినిమా – కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన “శుభలేఖ”. వరకట్న సమస్య గురించి తీసిన ఈ సినిమా నేను 10th class లో ఉన్నప్పుడు మొదటి సారి చూసినప్పుడే నాపై ఏదో తెలియని ముద్ర పడింది. అప్పట్నించీ చాలా సార్లు [...] |
|
తొణకని కుండ కు తింగరి బుచ్చికీ పెళ్ళి : తను వెడ్స్ మను
‘హమ్ ఆప్కే కౌన్’ లాంటి సూరజ్ భరజాత్య పెళ్ళి వీడియో లాంటి సినిమాను భారీసెట్టింగుల్లో కాకుండా మధ్యతరగతి ఇళ్ళల్లో, పెళ్ళివిడిదిగా R&B గెస్ట్ హౌసుల్లో తీస్తే ! అదీ ఆ సినిమాలో ‘జబ్ వుయ్ మెట్’ తరహా ఇంతియాల్ అలీ సినిమాలోని పాత్రల్ని ప్రవేశపెట్టి ఉత్తరప్రదేశ్, పంజాబ్ చిన్నచిన్న పట్టణాల సంస్కృతిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది “తను వెడ్స్ మను”. లండన్ లో పదిసంవత్సరాలుగా ఒక ఫార్మా కంపెనీలో రీసెర్చ్ చేస్తున్న డాక్టర్ [...] |
|
’క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవాల’ సమాహారం ‘ఎయిట్ అండ్ హాఫ్’
This film talks about you… About your life… About your family… About your work… About your doubts… About your dreams… You will see yourself in the leading role as though you were looking in a mirror… This is your film – Federico Fellini వేళ్ళ సందున ఇసుక రేణువుల్లా జారిపోతున్న క్షణాలు, జీవన కణాల్లోకి క్షణికాలైన అనుభూతుల్ని జార్చి మాయమయ్యే [...] |
|
వీడని జీవితపు మిస్టీరియస్ ముడి “లా ‘వెంచూర”
ఇటలీ దర్శకుడు మైకలాంజిలో ఆంటోనిని వివాదాస్పదుడిని, ప్రసిద్ధుడ్ని చేసిన సినిమా లా’వెంచూర. ఈ సినిమాకి పూర్వం ఆయన ఐదు పూర్తి స్థాయి చలనచిత్రాలను నిర్మించాడు.అయితే ఈ సినిమాకి పూర్వం తీసిన సినిమాలు అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులనీ సంతృప్తిపరచలేదు. ఇలాంటి దశలో ఆయన ఆరో సినిమాగా నిర్మించిన L’avventura నిర్మాణ దశలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ఈ సినిమా మొదటగా ఫ్రాన్స్ లోని కాన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఏవో [...] |
|
కృష్ణలీలలు (1959)
లక్ష్మీరాజ్యం సమర్పించు, కృష్ణలీలలు – అని వీసీడీ కవర్ పైన కనబడ్డది. అయితే, కింద పేర్లు రాస్తూ – లక్ష్మీరాజ్యం, ఎస్వీరంగారావు, రేలంగి,గుమ్మడి అని ఉంది. అక్కడ నాకు క్యూరియాసిటీ మొదలైంది – ఎవరు ఈ లక్ష్మీరాజ్యం అని. సరే, సినిమా ఏదో బాగుండేలాగుందని అనిపించి కొన్నాను ప్లానెట్ ఎం లో. టైటిల్స్ వేస్తూ ఉంటే గమనించాను, ఈ సినిమా దర్శకత్వం – జంపన అని. ఎవరూ – రైటరు జంపన గారే! అని ఆశ్చర్యపోయాక, చూడ్డం [...] |
|
నవ్వుల పంట ‘అహనా పెళ్ళంట’
నవ్వటం ఎంత ఈజీనో..నవ్వంచటం అంత కష్టం అనేది తెలిసిందే. అలాగే కామెడీలో పంచ్ మిస్సైతే ప్రేక్షకుడు ముఖంపై పంచ్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది అని సినీ అనుభవజ్ఞులు చెప్తూంటారు. ఈ నేపధ్యంలో ఓ కొత్త దర్శకుడు కామిడీతో ముందుకు వచ్చాడంటే అది అతని దర్శకత్వం పై ఉన్న నమ్మకమని చెప్పాలి. కామిడీకి కేరాఫ్ ఎడ్రస్ గా మారిన అల్లరి నరేష్ తో వీరభధ్రమ్ దర్సకుడుగా పరిచయం అవుతూ రూపొందించిన అహనాపెళ్ళంట ఈ రోజు రిలీజైంది. రెగ్యులర్ అల్లరి [...] |
|
అ‘మంగళ’
అనగనగా ‘మంగళ’ (ఛార్మి) అనే ఒక సినీనటి. ఆవిడకున్న అభిమానుల్లో లో ఒక పిచ్చి అభిమాని ‘చిన్నా’(విజయ్ సాయి). చిన్నా తండ్రి ఒంటికన్ను క్షుద్ర మాంత్రికుడు (ప్రదీప్ రావత్). మంగళ మీద అభిమానంతో చిన్నా ఒక బుల్లి కారుని కొని బర్త్ డే గిఫ్ట్ గా ఇద్దామనుకుంటాడు. చిన్నా ఉన్న అభిమానుల గుంపులో నుంచీ ఒకరు మంగళ ఒంటిమీద చెయ్యివేస్తే అది చిన్నానే అనుకుని మంగళ ఫ్రెండు/ డ్రైవరు ‘సుబ్బు’(సుభాష్) చిన్నను తన్నితగలేస్తాడు. ఈ అవమాన భారంతో [...] |
|
తడబాటు మాటల నుంచి ప్రభావంతమైన ప్రసంగం వరకు :The King’s Speech
అప్పటికి ఆయన ఒక యువరాజు. అదష్టం కలిసొస్తే మహరాజయ్యే అవకాశం వుంది. అడుగులో అడుగేసుకుంటూ ముందుకు వచ్చాడు. ఎదురుగా అశషంగా కనిపిస్తున్నప్రేక్షకులు, ప్రజలు. అతని వెనుకే నేను తోడున్నానని కళ్ళతోనే చెప్తున్నభార్య. తడబడుతూనే ముందుకు వచ్చాడు. అతను పలకబోయే ప్రతి మాటకోసం అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రసంగం మొదలైంది. మాటమాటకి తడబడుతున్నాడు, నత్తితో పొడిగా పొడిగా అక్షరాలు పలుకుతున్నాడు. మాటపెగలని ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తోంది. ప్రజల్లో అసహనం పెరుగుతోంది. యువరాజు ఓడిపోయాడు. *** [...] |
|
లఫంగే పరిందే
కొన్ని కొన్ని సినిమాలు బాగా ఉండి కుడా ఎందుకు ఆడకుండా పోతాయి అనేది ఇప్పటికి అర్థం కాని ప్రశ్న. అలాంటి కోవకే చెందిన సినిమా “లఫంగే పరిందే”. యష్ రాజ్ ఫిల్మ్స్ బానేర్ లో వచ్చిన ఈ సినిమాకి దర్శకత్వం ప్రదీప్ సర్కార్. పరిణీత మరియు లాగా చునరిమే దాగ్ లాంటి సినిమాలు తీసిన ప్రదీప్ చాలా సింపుల్ సబ్జెక్టు ని ఎన్నుకొన్నా కాని సినిమా ఆద్యంతము ఆసక్తికరంగా మలిచాడు. నీల్ నితిన్ ముకేష్, దీపిక పదుకొనే [...] |
|
ఆహ్లాదకరమైన వైవిధ్యం – LBW
జీవితాలు ఎక్కడ విడిపోయి ఎక్కడ కలుసుకుంటాయో. బంధాలు ఏవిధంగా అనుబంధాల్ని కలుపుకుంటాయో. స్నేహాలూ, ఆకర్షణలూ ప్రేమలూ జీవితాల్ని నిర్దేశించేవే కాకుండా అప్పుడప్పుడూ అనుభవాలుగా, అనుభూతులుగా ఎలా మిగిలిపోతాయో… కొందరు యువతజీవిత అనుభవశకలాల్ని ఏర్చికూర్చిన సినిమాటిక్ అనుభవం LBW – లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ : పెళ్ళికి ముందు జీవితం. కథ: ఈ సినిమాకథలో రెండు కథలున్నాయి. నిజానికి మూడున్నాయి. మూడోకథ గురించి అప్రస్తుతంగానీ, ముందుగా రెండుకథల గురించి చూద్దాం. కథ1: హైదరాబాద్ లో జై (అభిజిత్) – [...] |
|
ఆరు జీవితాలు-రెండు ముక్కోణ ప్రేమలు–ఒక మంచి సినిమా(LBW–Life Before Wedding)
ఎప్పుడూ ఒకే రకం మూస చిత్రాల వరదలో కొట్టుకుపోయే తెలుగు సినిమాకి అప్పుడప్పుడు ఒక శేఖర్ కమ్ముల, ఒక క్రిష్, ఒక దేవకట్టా దొరుకుతుంటారు. వాళ్ళు తీసే సినిమాలు అన్నీ ట్రెండ్ సెట్టర్లు కాకపోయినా ఒకే రకమైన (ఫ్లాప్) సినిమాలతో బోరెత్తిన జనానికి ఒక ప్రెష్ ఫీల్ ఇస్తుంటాయి. రోజు అన్నం తినే వారికి అప్పుడప్పుడు పిజ్జా తిన్నట్టు..!! సరిగ్గా అలాంటి సినిమానే LBW – Life Before Wedding. ఈ మధ్య కాలంలో విదేశాలనుంచి దిగుమతి [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |