Menu

Reviews Archive

టెర్రర్ (2016)

సినిమా పరిశ్రమలో “చిన్న సినిమా”, “పెద్ద సినిమా” అనే విభజన కొన్ని సినిమాల పట్ల శాపంగా మారింది. కొన్ని సినిమాలు కనీసం విడుదల కూడా కావడం లేదంటే, దాని వెనుక పేరుమోసిన నిర్మాణ సంస్థ, దర్శకుడు, హిట్టు లేని నటుడు ఉండడంతో పాటు, ఈ “చిన్న సినిమా” అనే బిరుదు కూడా ఉంటోంది. అలాంటి ఒక “చిన్న” సినిమానే “టెర్రర్”. శ్రీకాంత్, నిఖిత జంటగా నటించిన ఈ సినిమాకు “సతీష్ కాసెట్టి” దర్శకత్వం వహించారు. ఈయన గతంలో

Talvar – ప్రశ్నార్థక మరణం !!

మరణం ఒక జవాబు.. మరణం ఒక ప్రశ్న.. మరణం ఒక పరిష్కారం.. మరణం ఒక సమస్య.. మరణం ఒక నిజం.. మరణం ఒక అబద్దం. మరణం ఒక మరణం.. మరణం ఒక బ్రతుకు ..మరణం ఒక ప్రశాంతత.. మరణం ఒక అశాంతి..!! మరణం మార్మికమైనది. ప్రతిమరణం ఎంతో కొంత  విషయాన్ని తనలోదాచుకుంటుంది. ఒక వ్యక్తి తాలూకు తనకు మాత్రమే పరిమితమైన కొన్ని విషయాలు, అంతర్గత మధనం ఆ మరణంలో ఉంటుంది. అది ఎవ్వరికీ ..ఎప్పటికీ తెలియనిది. కొన్ని

Masaan – స్వేచ్చ పొందు చోటు

ఇద్దరు వ్యక్తులు ఏకాంతంలో ఉంటే ఎంత కామమో అనుకుంటారు గానీ.. ఎంత ప్రేమో అని అనుకోరు. – చలం కొందరు ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకుంటారు.  కొందరు ప్రేమిస్తారు జతకట్టాలని అనుకుంటారు. పెళ్ళయినా, జతకట్టటం అయినా ఒక వయసు నిండాక  వ్యక్తిగతం. కానీ అంత స్వేచ్చ ఇచ్చే సమాజాన్ని మనం నిర్మించుకోలేదు. దానికితోడు కాలానుగుణ ప్రమాదాలు ఉండనే ఉన్నాయి. అన్నీ కలిసి జీవితాన్ని సంక్లిష్టం చేస్తాయి. ఎదురుకొని నిలవమని సవాలు విసురుతాయి.   ఈ విషయాలని రెండు సమాంతర

నేను.. శైలజ… (2016)

“మనకు నచ్చిన సినిమాలు చేయడం కాదు, మనకు నప్పే సినిమాలు చేయాలి!” అనే మాట ఎక్కడో ఎవరో చెప్పినట్టు నాకు జ్ఞాపకం. “రామ్” విషయంలో ఈ వాక్యం అక్షరాల ఋజువైంది. “పండగ చేస్కో”, “శివమ్” లాంటి మూస సినిమాలతో విసిగించేసిన రామ్ ఈసారి ఓ చక్కని పసందైన ప్రేమకథతో వచ్చాడు. అదే, కీర్తి సురేష్ తో జంటగా నటించిన “నేను..శైలజ..”. 2015 ఆఖరులో వచ్చిన చెత్త సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కూడా 2016 మొదట్లో ఓ మంచి

కోర్ట్ – తనని తాను ప్రశ్నించుకోని ఏ వ్యవస్థ అయినా ప్రమాదకరమే!

ఈయన హీరో కాదు. హీరో అవ్వాలనీ అనుకోలేదు. ఈయన విలన్ కాదు. ఎవరికీ హాని చేసే ఉద్దేశమూ లేదు. ఈయన పేరు నారాయణ కాంబ్లే. వయసు ఎనభై. పిల్లలకి పాఠాలు చెప్పడం, వీలైనప్పుడల్లా తన పాటలతో ప్రజలను ఉత్తేజపరచడం – ఇదే ఈయన దైనందిన జీవితం. పాపం ఈ పెద్దాయన్ని ఎందుకిలా కోర్ట్ బోన్ లో నిలబెట్టారు? రండి తెలుసుకుందాం. నారాయణ కాంబ్లే ఎప్పటిలానే ఒక స్టేజి మీద పాట పాడుతున్నాడు. పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్