తెలుగు back to homepage

images ఒక రచయిత కృషి “ఋషి”

ప్రసాద్ ప్రొడక్షన్స్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నిర్మాణరంగంలోని అడుగుపెట్టాలనుకుంటే ఖచ్చితంగా అచితూచి అడుగేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానితోపాటూ అలాంటి నిర్మాణ సంస్థని ప్రేరేపించి, మళ్ళీ ఒక సినిమా తియ్యాలనే కోరిక కలిగేలా చేసిన కథకుడూ దర్శకుడూ రాజ్ మాదిరాజు ప్రతిభని కూడా అంచనా వెయ్యొచ్చు. ఈ నమ్మకం, అంచనాతోపాటూ, “మెడిసన్ ఒక తపస్సు. డాక్టర్ ఒక ఋషి” అంటూ ప్రోమోలు కలిగించిన ఆసక్తితో థియేటర్ కి వెళితే వేటినీ నిరాశపరచని చిత్రం ‘ఋషి’.   [...]

wp-2sonthavooru800 రుద్రుడి “సొంతఊరు” కథ

ఎల్బీ శ్రీరాం చాలా బాగా చేసాడు అని ఒకరిద్దరు పదే పదే చెప్పగా విన్నాక, ఈ సినిమా ఎట్టకేలకు చూసేసాను. నాకనిపించింది టూకీగా చెప్పాలంటే: ఈ సినిమాని కమర్షియలైజ్ చేయాలా? లేకుంటే అలాగ “ఆర్టు” సినిమాలాగా ఉంచేయాలా అన్న అయోమయంలో ఈ సినిమా తీసిన వాళ్ళు అలాగ కొట్టుమిట్టాడుకుంటూ, చివరికి దీన్ని ఇలా ఒక కిచిడీ లా చేసారేమో అనిపించింది. డైలాగులు, ఎల్బీ శ్రీరాం నటన మాత్రం అద్భుతం. ఇక వివరాల్లోకి వెళితే: కథా విశేషాలు ఏమిటంటే: [...]

Poster5 copy ఎడారి వర్షం: దోషం నాది కాదు, మూలానిది!

ఏం చెప్పదల్చుకున్నాడో రచయిత ముందే నిక్కచ్చిగా నిర్ణయించేసుకోవడం వల్ల పుట్టే అసంబద్ధమైన కథల కోవకి చెందినది దేవరకొండ బాల గంగాధర తిలక్‌ ‘ఊరిచివర ఇల్లు’. పరాయి జీవితమైనా దాన్నొక సహానుభవంగా కాకుండా స్వకపోల కల్పితంగా ‘సృజిస్తే’ కొన్ని అష్టావక్ర కథలు పుట్టుకొస్తాయి. తన ఆధునిక కవిత్వానికి ఆపాదించుకున్నట్లే, కథలకు కూడా ప్రబోధించే తత్త్వాన్ని ఎక్కించాలని ‘బాధ్యత’తో భావించినందువల్లనేనేమో తిలక్‌ కథలు చాలావరకూ పైకోవకి చెందుతాయి. ఇక ‘ఊరి చివర ఇల్లు’ విషయానికొస్తే, ఈ కథకి Third person [...]

Rajanna Movie Wallpapers జానపద హీరో ‘రాజన్న’

చాలా రోజుల తరువాత తెలుగులో ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మిగిల్చిన చిత్రం ‘రాజన్న’. ఒక కాల్పనిక జానపద హీరో కథని చారిత్రక నేపధ్యంలో సృష్టించి ఆ కాలపు చరిత్రతోపాటూ, స్థానిక సంస్కృతిని, నమ్మకాలను, జనపద ఒరవడులను అల్లుకుంటూ హృద్యమైన కథ చెప్పడం అభినందించదగ్గ ప్రయత్నం. ప్రధానకథ ఊరిమంచి కోసం ప్రధానమంత్రి నెహ్రూకి దొరసాని దౌర్జన్యాల్ని వివరించడానికి చిన్నారి మల్లమ్మ (బేబి ఆనీ) చేసే అద్వితీయ ప్రయాణానిదే అయినా, ఉపకథగా మల్లమ్మ తండ్రి రాజన్న(నాగార్జున) సాహసగాధ [...]

allari-naresh-sangharshana-movie-trailers సంఘర్షణ-అభినంధించదగ్గ ప్రయత్నం

జీవితం రణరంగం అనుకుంటే బ్రతకడానికి ప్రతిరోజు పరిస్థితులతో సంఘర్షణ తప్పదు అనే సారాంశంతో తీయబడిన సినిమా “సంఘర్షణ”. ప్రయాణం అద్భుతంగా మొదలు పెట్టిన దర్శకుడు సముద్రఖని కి గమ్యం ఏమిటో తెలియక పోవడం తో రెండవ అర్థభాగం అయోమయంగానే ముగించాడు.కానీ సినిమా ముగిసేసరికి ప్రేక్షకులకు మనం కూడా మనషులమే,సాటి మనషులకు సాయపడటమే మానవత్వం అనే విషయం మళ్ళి గుర్తుకువస్తుంది,ఎన్ని రోజులు జ్ఞాపకం వుంచుకుంటారో మాత్రం తెలియదు. కథలోకి వెళితే కుమార్ (శశి),నరేష్ అజ్ఞాత ప్రదేశం లో నుండి [...]

Veera-Telangana-Songs తెలంగాణ చరిత్ర చిత్రాలు : వీరతెలంగాణ (2010), మాభూమి(1979))

(ముందు “వీర తెలంగాణా” సినిమా చూసాను. ఫాలో-అప్ గా ఒక ముప్పై ఏళ్ల నాడు వచ్చిన “మా భూమి” చూసాను. వాటి రెంటి గురించి…ఈ వ్యాసం)   నాకు ఆర్.నారాయణమూర్తి అనగానే – “నా రక్తంతో నడుపుతాను రిక్షాని…నా రక్తమే నా రిక్షకు పెట్రోలు” అని పాడే రిక్షావాడు, “నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…తోడబుట్టిన ఋణం తీర్చుకుంటానే చెల్లెమ్మా” అని పాడే అన్నా…”ఎర్రజెండెర్రజెండెన్నీయలో” అని గుడ్లు మిటకరిస్తూ పాడే విప్లవకారుడో గుర్తువస్తాడు. ఇంతా చేసి ఈ [...]

Srirama శ్రీరామరాజ్యం

ఈ పోస్టర్ చూశారా ఎంత బావుందో? విశ్వ హిందూ పరిషత్ రాముడి బొమ్మ ఆధారంగా రూపొందించారో లేదో కానీ, ఆ మొహంలో శౌర్యం, నిలబడ్డం లో రాజసం …. అద్భుతంగా రూపొందిన పోస్టర్! ఈ ఒక్క పోస్టర్ చూసి ఆలస్యం చెయ్యకుండా సినిమాకెళ్ళాను. ఇంతకంటే మంచి ఫొటో బాల కృష్ణకు ఇంతకు ముందూ, ఈ తర్వాతా కూడా ఉండబోదు కాబట్టి దీన్ని లైఫ్ సైజ్ చేయించి హాల్లో పెట్టుకుంటే బాగుంటుందని బాలకృష్ణకి నా సలహా! శ్రీరామ రాజ్యం [...]

moogudu మెప్పించని మొగుడు !

* మొగుడు తారాగణం: గోపీచంద్, తాప్సీ, శ్రద్దాదాస్ రాజేంద్రప్రసాద్, నరేష్ హర్షవర్ధన్, ఆహుతి ప్రసాద్ గీతాంజలి, మహర్షి రాఘవ వేణుమాధవ్ తదితరులు. సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ సంగీతం: బి.బాబు శంకర్ నిర్మాణం: లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ —- మన తెలుగు సినిమాలలో ’మొగుడు’ సినిమాలది ఓ ప్రత్యేక శైలి. శోభన్‌బాబు పుణ్యమా అని మొగుడు సినిమాలు కొనే్నళ్లపాటు ట్రెండ్‌గా మారాయి. ఇంకా చెప్పాలంటే కుటుంబ మహిళా చిత్రాలు అంటే అప్పట్లో [...]

pilla jamindar కామెడీ డ్రామా! – పిల్ల జమీందార్

తారాగణం: నాని, బిందుమాధవి హరిప్రియ, మేఘనానాయుడు రావురమేష్, ‘వెనె్నల’ కిషోర్ ఎమ్మెస్ నారాయణ తదితరులు. —- సినిమాటోగ్రఫీ: సాయ శ్రీరామ్ సంగీతం: సెల్వగణేష్ నిర్మాణం: సిరి శైలేంద్ర సినిమాస్ నిర్మాత: మాస్టర్ బుజ్జిబాబు దర్శకత్వం: జి.అశోక్ —- ‘క్యారెక్టర్స్‌లోని ట్రాన్స్‌ఫర్మేషన్ మంచి నాటకానికుండాల్సిన ప్రధాన లక్షణం’ అని షేక్‌స్పియర్ అన్నారు. అందుకే నాటకాలలో ఈనియమాన్ని తప్పనిసరిగా ఫాలో అవుతూ ఆ మేరకే క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసేవారు. నాటకానికి తర్వాతి తరం ఎంటర్‌టైన్‌మెంట్ అయిన సినిమాలో కూడా ఈ [...]

oosaravelli_telugu_movie_wallpapers పరమసిల్లీ కథనంతో ‘ఊసరవెల్లి’

సినిమా చూసొచ్చి రివ్యూ రాయడానికి టైప్ కొడుతూ, కథ కష్టపడి వెతుక్కునే స్థాయికి తెలుగు సినిమా గత పదిపదిహేను సంవంత్సరాలుగా దిగజారుతూనే ఉంది. కథకు కావలసిన సామాగ్రిని అడ్డదిడ్డమైన స్క్రీన్ ప్లే పేరుతోనో లేక హీరోని కూడా కామెడీ కోసం కథకు సంబంధంలేని నానాగడ్డీ కరిపించో అసలు కథను అద్భుతంగా  పారేసుకొనే సాంప్రదాయం మన ప్రత్యేకత. ఊసరవెల్లి సినిమా దానికి ఏమాత్రం మినహాయింపు కాదు. కథగా చెప్పాలంటే కొంచెం కష్టమే అయినా ప్రయత్నిస్తాను. గమ్యంలేకుండా చిన్నచిన్న గూండాగిరీచేసుకుని [...]

dookudu మాస్‌మసాలా కామెడీ ఏక్షన్ రొమాంటిక్ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం – “దూకుడు”

శ్రీనువైట్ల తీసిన “ఢీ”, “రెఢీ” వంటి సినిమాలు గుర్తుంటే ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు “పోకిరి” పవర్, “అతిధి” కామిడి కలగలిపితే ఇంక చెప్పేదేమీ లేదు. అయితే ఈ రెండింటిని కలిపితే వచ్చే మాస్‌మసాలా కామెడీ ఏక్షన్ రొమాంటిక్ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రమే – “దూకుడు” అజయ్ అని ఒక హీరోగారు. సగటు తెలుగు సినిమా హీరో లాగానే వంటి చేత్తో వందమందిని మట్టి కరిపించగల మహా శక్తిమంతుడు. “మైండ్లో ఒక [...]

siri కె.విశ్వనాథుని చల్లని సినీ వెన్నెల-సిరివెన్నెల

ప్రపంచంలో ఎక్కడైన సరే మనిషిలో ఉన్న నిజమైన జీవ కళ బయటికి రావాలంటే ముందుగా యోగం అంటూ వుండాలి ఆ తరువాత దానికి తగ్గట్టుగానే ఆ కళ ను బయటికి తీసుకురావడానికి సరైన స్పందన కలగాలి.చాలా సార్లు ఆ స్పందన కలిగించే వస్తువు ప్రకృతిగాని, ఆ ప్రకృతికి పర్యాయమైన స్త్రీ గాని అవుతూవుంటుంది.వీటిచేత స్పందన కలిగిన హృదయంతో తమలోని కళని బయటికి తీసురాగలిగిన వాళ్ళు సృస్టి రహస్యం తెలుసుకున్నవారై ప్రకృతిలో ఐక్యమవుతూ వారి జన్మని సార్ధకం చేసుకుంటారు [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories