తమిళం

తమిళ సినిమా సమీక్షలు

మౌనరాగం – మనసు తీరు

మౌనరాగం – మనసు తీరు

స్త్రీ పురుషులిద్దరూ కొన్నాళ్ళపాటూ కలిసుంటే..స్నేహం వికసించి,  ఒకరినొకరు అర్థంచేసుకొని..సర్ధుబాటు కూడా చేసుకొని ఒకరిమీద ఒకరికి ఆధారపడే తత్వం ఏర్పడి,  ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు తద్వారా వాళ్లమధ్య అనుబంధం ఏర్పడి ప్రేమ చిగురిస్తుంది. ఈ లోపు ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా పిల్లలు పుట్టుకొస్తారు. అలా కుటుంబం ఏర్పడుతుంది.  ప్రేమ కొంచం అటూ ఇటూ అయినప్పటికీ అలవాటు అయిన అనుభంధం వివాహాన్ని పటిష్టంగా ఉంచుతుంది. ( పటిష్టం అంటే…ఇద్దరూ కొట్టుకుంటున్నా వివాహన్ని విడిచిపోకూడదు అనుకుంటారు ) .(…)

తిరువిళయాడల్

తిరువిళయాడల్

“తిరువిళయాడల్” అంటే భగవంతుని ఆటలు అని అర్థం. “తిరువిళయాడల్ పురాణం” తమిళ శైవ వాఙ్మయంలో ఒక భాగం. అందులోని అరవై నాలుగు కథల్లోంచి ఎంచిన నాలుగు కథలు కలిస్తే ఈ సినిమా. నలుపు-తెలుపుల తెలుగు సినిమాల్లో “నవరాత్రి” సినిమా నాకెందుకో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ సినిమా తమిళ మాతృక తీసిన ఏ.పి.నాగరాజన్ ఈ తిరువిళయాడల్ కి కూడా దర్శకుడు. అదే ఏకైక కారణం ఈ సినిమా చూడ్డానికి. ఎందుకో గానీ నాకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది.(…)

థ్రీ (3)

థ్రీ (3)

కొలవెరి డి” పాటతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించగా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమాగా కూడా గత కొన్నాళ్ళుగా అందరినోటా వినిపిస్తోన్న “3(థ్రీ)” సినిమా గత వారం విడుదలైంది. ’3’ సినిమా పేరుకు తగ్గట్టుగానే రామ్ (ధనుష్) మరియు జనని (శృతి హాసన్) అనే యువజంట జీవితంలో మూడు దశల్లో జరిగిన వివిధ అంశాల కలబోతే(…)

వై దిస్ గోల “వెర్రి” థ్రీ?

వై దిస్ గోల “వెర్రి” థ్రీ?

గత కొంతకాలంగా వేలంవెర్రిలా పాకిన కొలవెరి పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి పాటను రూపకల్పన చేసినవాళ్ళు తీసిన సినిమా అంటే అంచనాలు వుండటం సహజం. అందునా ఈ మధ్యకాలంలో వైవిధ్యానికి మారుపేరుగా నిలిచిన తమిళ పరిశ్రమ చిత్రం కావడంతో ఆ అంచనాలు మరో నాలుగింతలయ్యాయి. అయితే నిన్న విడుదలైన “3” చిత్రం ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడింది. గత కొంతకాలంగా తమిళ సినిమాని తెగపొగిడేసిన మా లాంటి వారి కళ్ళు తెరిపించేలా(…)

ఆత్మ ఉన్నకథ ‘మయక్కమ్ ఎన్న’

ఆత్మ ఉన్నకథ ‘మయక్కమ్ ఎన్న’

హాబీఫోటోగ్రఫర్ గా ఉంటూ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ఒక గమ్యం వైపు ఎదగాలనుకునే ‘కార్తీక్ స్వామినాథన్’ అనే ఒక సాధారణ యువకుడి గతుకులప్రయాణం “మయక్కమ్ ఎన్న” సినిమా పేరే తెలుగులో చెప్పాలంటే ‘ఎందుకీ మత్తు?’. తన సామర్థ్యం తనకే తెలీని మత్తో, కేర్ లెస్ నెస్ మత్తో, సామాజికచట్రలో ఇమిడి ఎగదాలంటే ఏంచెయ్యాలో తెలీని మత్తో, స్నేహాల మత్తో, అర్థంకాని ప్రేమానుబంధాలమత్తొ, తాగుడుమత్తో…చివరికి విజయం మత్తో… మొత్తానికి జీవితం మత్తోగానీ అన్నిటినీ కలగలిపిన ఒక జీరోటూ(…)

గుర్తుపెట్టుకోవలసిన యాక్సిడెంట్ –  “ఎంగెయిమ్ ఎప్పోదుమ్”

గుర్తుపెట్టుకోవలసిన యాక్సిడెంట్ – “ఎంగెయిమ్ ఎప్పోదుమ్”

భారతదేశంలో సగటున ప్రతి సంవత్సరం 1,30,000 మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతారనేది ఒక అంచనా. ప్రతిరోజూ మనం ఇలాంటి ప్రమాదాల గురించి పేపర్లో చదువుతూ ఉంటాం. ఎంత మంది చనిపోయారో లెక్కలు వింటూ ఉంటాం. కానీ ఆ చనిపోయినవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే… పరిచయమున్నవాళ్ళు అయితే… బాగా కావలసినవాళ్లైతే… మనం ప్రేమించినవాళ్లైతే… ఆ వార్త అక్షరాలు కన్నీళ్ళవుతారు. అంకెలు గుండెల్ని తూట్లు పొడుస్తాయి. ఇలాంటి అనుభవాన్ని రెండు హృద్యమైన ప్రేమకథలతో ముడివేసి, మనం ఖచ్చితంగా మరోసారి రోడ్డెక్కినప్పుడు(…)

” ఉరుమి ” ఎందుకు చూడాలి ?

” ఉరుమి ” ఎందుకు చూడాలి ?

“భారతదేశమునకు సముద్రమార్గమును కనుగొన్న పోర్చుగీసు నావికుడెవరు ? ” లాంటి ప్రశ్నలు మన చరిత్ర పాఠాల్లో కనిపిస్తాయి. దానికి జవాబుగా ” వాస్కోడిగామా ” లాంటి సమాధానాలు కనిపిస్తాయి. కాబట్టే యూరోపియన్లు, యూరప్ చరిత్రంటే ” ప్రపంచ చరిత్రే ” అని మోర విరుచుకుని తిరుగుతూంటారు. మనం ఎంతమాత్రం సిగ్గులేకుండా ” వాళ్ళే లేకపోతే మనకి అభివృద్ధంటేనే తెలియదు , మనం ఈరోజు ఇలా జీవించగలుగుతున్నామంటే దానిక్కారణం ఆ యూరోపియన్లే ” అనే భ్రమల్లో పిల్లి గెడ్డాలూ(…)

దైవతిరుమగన్ (నాన్న)

దైవతిరుమగన్ (నాన్న)

అప్పుడే అస్తమించిన సూర్యుడి చివరి కిరణాల జాడ నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారుతూ….ఆకాశంలో కలిసిపోతూ ఉన్నది. మరో వైపు నుంచి దట్టమైన మేఘాలు నెమ్మదిగా ఆ వైపు నుంచి ఈ వైపుకి విస్తరిస్తున్నాయి. సాయంత్రమై చాలా సేపయిందనుకుంటా….రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఒక్కొక్కొటి head lights on చేస్తున్నాయి. అప్పుడే సినిమా చూసి బయటకొచ్చిన నేను, బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాను. బైక్ రైడ్ చేస్తుండగా…..చల్లని గాలి సర్రున ముఖానికి రాసుకుంటూ వెళుతుంటే ఎంతో హాయిగా అనిపించింది.(…)

అబ్బురపరిచే ‘అరణ్యకాండం’

అబ్బురపరిచే ‘అరణ్యకాండం’

2010 మధ్యలో అనుకుంటా ఒక యుట్యూబ్ లో తమిళ్ షార్ట్ ఫిల్మ్ కొన్ని చూస్తూ ఒక సినిమా ప్రోమో ఒకటి చూశాను. చూడగానే “వావ్” అనిపించింది. ఆ సినిమా పేరు ‘అరణ్యకాండం’. ఆ తరువాత సినిమా అగిపోయిందనో, పూర్తవలేదనో, కేవలం ఫిల్మ్ ఫెస్టిల్స్ కోసం తీశారనో ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత ఏమీ న్యూస్ లేదు. మధ్యలో ఎప్పుడో South Asian International Film Festival లో Grand Jury Award for Best(…)

యుద్దం సెయ్ (తమిళ్) గెలిచింది

యుద్దం సెయ్ (తమిళ్) గెలిచింది

క్రైం థ్రిల్లర్ తియ్యడం అదీ mainstream సినిమాల్లో చాలా రిస్క్ తో కూడుకున్నపని. అలాంటి సినిమాల్ని చూస్తే ప్రేక్షకుల సంఖ్య తక్కువవడం, రిపీట్ ఆడియన్స్ ఉండకపోవడం, మిగతా entertainment అనబడే అంశాలు జొప్పించడానికి వీలుకాకపోవడం లాంటి ఎన్నో కారణాలవల్ల మంచి క్రైంథ్రిల్లర్లు మనకు కరువు. కాకపోతే దర్శకుడి ప్రతిభ చూపించుకోవడానికి ఇది నిజంగా బాగా అనుకూలించే జాన్రా. అదీ అలాంటి సబ్జెక్టుని ప్రభావవంతంగా తెరకెక్కిస్తే మంచి సినిమాగా కూడా నిలబడుతుంది. ‘యుద్దం సెయ్’ అలాంటి ఒక ప్రయత్నమే.(…)

అంగడి తెరు (తమిళ్) – అద్భుతం !

అంగడి తెరు (తమిళ్) – అద్భుతం !

గత పది సంవత్సరాలుగా మనకళ్ళ ముందే కొన్ని వందల షాపింగ్ మాల్స్ వచ్చేశాయి. వచ్చేపొయ్యేవాళ్ళ హడావుడి. సంతను మరిపించే సందడి. ఉత్సవాన్ని గుర్తుతెచ్చే ఒరవడి.సూపర్ మార్కెట్ల జిలుగుల్లో, నియోన్ లైట్ల వెలుగుల్లో మనల్ని మనం మర్చిపోయి వస్తువులతో పాటూ అనుభవాల షాపింగ్ చేసుకొచ్చేయ్యడమే మనకు తెలిసిన ఆనందం. ఆ అందమైన అనభవాన్ని మనకు అందించేవారి వెనుక కొన్ని చీకటి కోణాలుంటాయని గానీ, కొన్ని వందల బ్రతుకులు అడకత్తెరలో పోకచెక్కల్లా మారిపోయాయని మనకు తెలీదు. బహుశా తెలియాల్సిన అవసరం(…)

సహజమైన ప్రేమకథ- విన్నైతాండి వరువాయా -will you cross the skies for me?  (తమిళ్)

సహజమైన ప్రేమకథ- విన్నైతాండి వరువాయా -will you cross the skies for me? (తమిళ్)

సింబు (సిలబరసన్) కథానాయకుడిగా గౌతమ్ మీనన్ చిత్రమనగానే అదొక స్టైలిష్ యాక్షన్ సినిమా ఏమో అనుకోవడం సహజం. కానీ ఈ ఇద్దరూ ఒక ప్రేమకథ కోసం ఒకటయ్యారంటే ఆశ్చర్యం కలుగుతుంది. గౌతమ్ మీనన్ సినిమాల్లో (కాకా-కాకా, వెట్టయాడు విలయాడు, వరణం ఆయిరం)ని ప్రేమకథలు ఎప్పుడూ హృద్యంగానే ఉంటాయి. కాబట్టి తను పూర్తిస్థాయి ప్రేమకథ చెయ్యడం వింతకాదు. కానీ సింబుకు తమిళ్ సినిమాలో ఉన్న ఇమేజ్ లవర్ బాయ్ కన్నా ఒక మాస్ హీరోగానే ఎక్కువ. తనూ సొంతంగా(…)

ఉనైపోల్ ఒరువన్ / ఈనాడు

ఉనైపోల్ ఒరువన్ / ఈనాడు

ఈనాడు తెలుగు రీమేక్ గురించి క. మహేష్ గారు రాసిన టపాలో దీన్ని రెడ్ తో చిత్రీకరించారని చదివాక సినిమాని థియేటర్ లో చూడాలనిపించింది. జాక్సన్ విల్ తమిళ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో థియేటర్ లో చూసే అవకాశం ఈ రోజు కలిగింది. ప్రేక్షకుల్ని సినిమాలు చూడ్డానికి థియేటర్లకి పంపిస్తున్న నవతరంగం వ్యాసాలఖాతాలో మహేష్ (గారు వదిలేస్తానింక) వ్యాసం కూడా ఒకటి. నేను వెడనస్ డే చూడలేదు. తమిళంలో పాటకూడ కమల్ హాసనే పాడారు.(…)

వింత కలయికల ‘తడి’- ఈరమ్ (తమిళ్)

వింత కలయికల ‘తడి’- ఈరమ్ (తమిళ్)

ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ‘S picture‘ వైవిధ్యానికి పట్టంగట్టే నిర్మాణసంస్థగా మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ నూతన చిత్రం, ‘అరివళగన్‘ దర్శకత్వం వహించిన “ఈరమ్“. ఈరమ్ అంటే తెలుగులో తడి లేదా చమ్మ అని అర్థం. ఒక అపార్ట్మెంట్ బిల్డింగులో రమ్య(సింధు మీనన్) అనే గృహిణి బాత్ టబ్ లో మునిగి చనిపోతుంది. అది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీస్ పరిశోధన ప్రారంభమవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ రమ్య(…)

క్విక్ గన్ మురుగన్ – రీడ్ ఇట్ ఐ సే!

క్విక్ గన్ మురుగన్ – రీడ్ ఇట్ ఐ సే!

నేను “క్విక్ గన్ మురుగన్” చూసి ఇరవైనాలుగు గంటలైనా… ఇంకా మురుగన్ డైలాగులు గుర్తొస్తూనే ఉన్నాయి. ఏదైనా మాట్లాడి… “ఐ వాంట్ ఇట్ ఐ సే” తరహా లో మాట్లాడ్డం బాగా వంటబట్టేసింది. “లీవ్ ద లేడీస్ ఐ సే” – అబ్బ తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వొస్తోంది. సినిమా గురించి ఇదివరలో నవతరంగం లో ఓ పరిచయం రాసారు, ఇది ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైనప్పుడు. కానీ, మన థియేటర్లలో రిలీజై రెండ్రోజులైనా దీని(…)

నాడొడిగల్ సమీక్ష

నాడొడిగల్ సమీక్ష

దక్షిణ భారత సినిమాల్లో ఒక విశిష్టత ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం- నాల్గింటిలో ఏ భాష లో నైనా మంచి కథాబలమున్న చిత్రాలు వస్తే వెంటనే అవి తక్కిన మూడింటిలోకీ వచ్చేస్తాయి. మళయాళం లో వచ్చిన తెన్‌కాసి పట్నం (తెలుగులో హనుమాన్ జంక్షన్), వాసంతియుం లక్ష్మియున్ పిన్నె న్యానుం (శ్రీన్ వాసంతి లక్ష్మి) కానీ, తమిళ్ లో వచ్చిన ఆటోగ్రాఫ్ కానీ కన్నడ లో వచ్చిన జోగి కానీ తెలుగు లో వచ్చిన ఒక్కడు కానీ తక్కిన(…)

నాడోడిగళ్ (త)- సమీక్ష

నాడోడిగళ్ (త)- సమీక్ష

“తమ జీవితంలో కోరుకున్న ప్రేమని పొందలేని వారు. తాము కోరుకున్న ప్రేమ దక్కుతుందని ఆశపడేవారు. కనీసం ఎదుటోడైనా కోరుకున్న ప్రేమని దక్కించుకోవాలనుకునేవాళ్ళూ ఉన్నంతవరకూ ఈ ప్రపంచంలో ప్రేమికుల్ని ఒకటి చేసే మనుషులుంటారు.” అంటాడు ఈ చిత్రంలోని ప్రధానపాత్రధారి (ఈ సినిమాలో హీరోలు లేరు. కేవలం పాత్రలున్నాయి) అదే స్ఫూర్తితో, అప్పటికే వారివారి కష్టాల్లో ఉన్న ముగ్గురు స్నేహితులు, వాళ్ళలో ఒక స్నేహితుడి యొక్క మరో స్నేహితుడి ప్రేమని పెళ్ళిదాకా నడిపించి గెలిపించాలని నిర్ణయించుకుంటారు. Friend’s friend is a friend అనే(…)

సత్యమే శివం (2003)

సత్యమే శివం (2003)

అసలు ’సత్యమే శివం’ అంటే – కమల హాసన్ ఎప్పట్లాగే ఘోస్టు డైరెక్షన్ చేసిన ఓ సినిమా కమ్యూనిస్టు సినిమా ఏమిటో, కాస్త బోరు కొడుతుంది అసలదేం సినిమా? ఎప్పుడొచ్చింది? వావ్! మంచి సినిమా! – వీటిలో ఏ స్పందన వచ్చిన మనిషిని చూసినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే అన్ని స్పందనల్నీ విని ఉన్నా కనుక. ఈ సినిమా 2003 లో వచ్చిన తమిళ సినిమా “అన్బే శివం” కు తెలుగు అనువాదం. తారాగణం: కమల హాసన్,(…)

సుబ్రమణ్యపురం (2008)

సుబ్రమణ్యపురం (2008)

ఎదురుచూసి, ఎదురుచూసి నేను కూడా “సుబ్రమణ్యపురం” చూసేసాను. దీనిపై వెంకట్ గారు రాస్తానన్న వివరమైన వ్యాసం ఇంకా రానేలేదు కనుక, పెద్ద వివరాలేమీ చెప్పకుండా నా స్పందన మాత్రం ఇక్కడ పెట్టేస్తున్నా. సుబ్రమణ్యపురం ఏమిటీ? అంటారా? రెణ్ణెల్ల క్రితం వచ్చిన ఓ తమిళ సినిమా. దీని గురించి నవతరంగంలో ఇదివరలో వచ్చిన వ్యాసం ఇక్కడ. కథ విషయానికొస్తే, 1980 లో మధురై ప్రాంతాల్లోని సుబ్రమణ్యపురం లో నడుస్తుంది కథ. ఐదుగురు అల్లరి చిల్లరగా తిరిగే నిరుద్యోగపు స్నేహితులు,(…)

Arai enn 305 il kadavul (2008)

Arai enn 305 il kadavul (2008)

Arai enn 305 il kadavul అన్నది 2008 లోనే వచ్చిన ఓ తమిళ సినిమా. దీనికి అర్థం – 305 గదిలో దేవుడు అని. దేవుడుగా ప్రకాశ్ రాజ్ నటించాడు. ఈ సినిమా గురించి ఎందుకు రాద్దాం అనుకుంటున్నా అంటే… ఇది ఒక మంచి ప్రయత్నమని నాకు తోచింది. ఏదో గొప్ప ప్రభావవంతమైన కథ అని కాదు. హాస్యం పాలు ఎక్కడా తగ్గకుండానే చెప్పాలనుకున్న సందేశాన్ని అంతర్లీనంగా ఎలా చెప్పొచ్చో తెలుసుకోడానికి ఈ సినిమా ఓ(…)

Kannum Kannum (2008)

నేను ఇటీవల చూసిన సినిమాల్లోకెల్లా “ఎందుకు చూస్తున్నానో!” అనిపించిన సినిమా ఇది. ఇలా మొదలుపెట్టడం ఎందుకు? అసలు దాని గురించి రాయకుండా ఉంటే పోతుంది కదా? అని అనుకోవచ్చు. కానీ, “its a pretty neat film to watch as a family” అని వికీపీడియా లో రాసుంటే చదివి ఈ సినిమా చూసాను. ఓహో… కుటుంబ సమేతంగా చూడాలంటే ఇంత “బాగా” తీయాలా! అన్న జ్ఞానోదయం అయ్యాక ఇక ఈ సినిమా గురించి రాయడం(…)

Velli Thirai (2008)

Velli Thirai (2008)

“mozhi” సినిమా చూశాక ప్రకాశ్ రాజ్ నిర్మించిన తక్కిన సినిమాల గురించి నాకు కుతూహలం పెరిగింది. దానికి తోడు ’వెళ్ళితిరై’ (Meaning: Silver screen) గురించి చాలా విని ఉండటంతో ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూసాను. కానీ, సినిమా నన్ను కాస్తంత నిరాశపరిచింది. Problems of over-expectations! ఇది సినీప్రపంచం కథ. శరవణన్ (పృథ్వీరాజ్) దర్శకుడు కావాలని కలలు కంటున్న యువకుడు. అసిస్టంట్ గా పనిచేస్తూ తను తీయబోయే సినిమా కోసం కథ సిద్ధం చేసుకుని, అవకాశం(…)

సుబ్రమణ్యపురం – Dont miss it!

సుబ్రమణ్యపురం – Dont miss it!

తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్(…)

Mozhi (2007)

ఒక మంచి తమిళసినిమా ఏదన్నా ఉంటే చెప్పు చూస్తాను అని నా తమ్ముణ్ణి అడిగితే ఇది చూపించాడు. చూశాక దీని గురించి వీలైనంతమందికి చెప్పాలి అనిపించింది నాకు. బరువైన విషయాన్ని కూడా ఎక్కడా పట్టు సడలకుండా, ఎక్కడా మనకు మరీ భారంగా అనిపించకుండా, ఎక్కడా హాస్యం పాలు తగ్గకుండా, ఇన్ని చేస్తూ కూడా కథ నుండి సైడ్ ట్రాక్ అవ్వకుండా రెండు గంటలకి పైగా ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు. ఈ సినిమా తారాగణం: జ్యోతిక,(…)