కన్నడ

కన్నడ సినిమా సమీక్షలు

మైత్రి (2015) – ఓ గౌరవనీయమైన చిత్రం

మైత్రి (2015) – ఓ గౌరవనీయమైన చిత్రం

వాణిజ్యపరంగా మిగతా దక్షిణ చిత్ర పరిశ్రమలకంటే వెనుకబడిన పరిశ్రమని, మూస చిత్రాలు ఎక్కువగా వస్తాయని కన్నడ చిత్ర పరిశ్రమ మీద విమర్శలున్నాయి. నేను ఎక్కువ కన్నడ చిత్రాలు చూడలేదు. నేను చుసిన మొదటి చిత్రం “చార్మినార్” (తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ). కొన్ని రోజులుగా “మైత్రి” అనే చిత్రం గురించి వింటూనే ఉన్నాను. విమ్మర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు చూడటం జరిగింది. మైత్రి ఓ ద్విభాషా చిత్రం. కన్నడ మరియు(…)

Lucia – స్వప్నజీవితం

Lucia – స్వప్నజీవితం

చిన్నప్పుడు కథలు చదివేవాళ్ళం. అందులో  ప్రతి కథకీ ఓ నీతి ఉండేది. అయితే రామాయణ భాగవతాల్లాంటి కావ్యాల్లోనూ..నవలల్లోనూ  ప్రతి చోటా నీతులు..జీవన సత్యాలూ , ప్రవచనాలూ అడుగడుగునా దర్శనమిస్తుంటాయి. సినిమా కూడా విజువల్ గా చెప్పేకథే కనక దానికీ ఓ సారాంశం ఉండాల్సిందే. దీన్నే సినిమా పరంగా మనం ఇతివృత్తం/ ఫిలాసఫీ లేదా /జీవితసత్యం అంటాం.  అయితే పూర్తి వినోదాత్మక చిత్రాలలో సారాంశం గొప్పగా ఉండకపోవచ్చు. వినోదం మరుగున ఆ బలహీనమైన/కొత్తది కానటువంటి  సారాంశాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు. (…)

సంస్కార – 1970

సంస్కార – 1970

ఈ సినిమా నేను చూసి 35 సంవత్సరాలు గడచిపోయాయి. అయినప్పటికి ఏమాత్రం మర్చిపోలేదు. అంత చక్కని సందేశం ఉన్న సినిమా ఇది. గిరీష్ కర్నాడ్ మొదటి సినిమా అని గుర్తు. తప్పయితే ముందే క్షమార్హుడిని. పట్టాభిరామరెడ్ది దర్శకత్వం చిత్రా రామమనోహర నిర్మాత. ఓ కుగ్రామంలో చంద్రప్ప అనే బ్రాహణ తిరుగుబోతు ఉంటాడు. తాగుతూ వ్యభిచరిస్తూ ఊరు బయటే ఉంటాడు. అందరు అతన్ని వెలివేసి తప్పించుకు తిరుగుతూంటారు. అటువంటి వాడు ఒకరోజున చచ్చిపోతాడు. అతనికి ఎవరు కర్మకాండ చెయ్యాలనేదే(…)

గిద్

గిద్

స్త్రీని విలాస వస్తువుగానూ, వినియోగ వస్తువుగానూ పరిగణించడం మన వ్యవస్థలో అనాదిగా వస్తున్నది. ఆ స్త్రీ అట్టడుగు వర్గానికి చెందినది అయినప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. బూర్జువా సమాజంలో అధికారంతో ఆధిపత్యం చెలాయిస్తె ఈ పురుషస్వామ్యం పెట్టుబడిదారి సమాజంలో ధనం, వినోదాల ఎరచూపి స్త్రీని అణచివేతకు గురిచేయడం ఆమె శీలాన్ని జీవితాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అట్టడుగు బడుగువర్గాల స్త్రీలను దేవునిపేర ఊరు పరం చేసే ఆచారాలు అనేకం మనదేశంలో నెలకొని(…)

అమెరికా! అమెరికా!! (కన్నడ) – పరిచయం

అమెరికా! అమెరికా!! (కన్నడ) – పరిచయం

శశాంక్ (అక్షయ్ ఆనంద్) : “పక్షి లాగా ఆకాశం లో ఎగిరిపోవాలి, ప్రపంచాన్ని చుట్టిరావాలి. ఆనందాల్ని అనుభవించాలి” సూర్య (రమేష్ అర్వింద్): మహావృక్షంలా వేళ్ళూనుకుని ఆకాశాన్ని అంటేలా ఎదగాలి. వేర్లు బలంగా నేలలో ఉంటూనే ఆకాశాన్ని ఏలాలి. పక్షిలాగా ఎంత ఎగిరినా ఏం లాభం ఎప్పుడో ఒకప్పుడు నేలని చేరాల్సిందే. కానీ వృక్షమైతే నింగికీ,నేలకూ,నీడనిచ్చే ప్రజకూ అందరికీ ఉపయోగం.” భూమిక (హేమ) : “ఏమిటో బాబూ! మీ ఇద్దరి మాటలూ ఎప్పటికప్పుడు సరైనవే అనిపిస్తాయి. ఇద్దరూ నాకు(…)

సలక్షణమైన బాలల/కుటుంబ చిత్రం – ‘మొగ్గిన జడే’

సలక్షణమైన బాలల/కుటుంబ చిత్రం – ‘మొగ్గిన జడే’

కనీసం ఓ ఇరవై, పాతికేళ్ళ క్రితం, ప్రైవేటు చానెళ్ళు ఏవీ లేని రోజుల్లో దూరదర్శన్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం వివిధ భాషలకు చెందిన classic movies వచ్చేవి. అలాంటి సినిమాలు మీరు మళ్ళీ చూడాలనుకుంటే దానికి చక్కని చిరునామా ‘Lok Sabha TV’ చానెల్. ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతాయి. అదే సినిమా మళ్ళీ మరుసటి రోజు (అంటే ఆదివారం) మధ్యాహ్నం రెండు గంటలకు పునఃప్రసారమవుతుంది. ఇలాంటి చిత్రాల కోవలో ఒక రెండు వారాల(…)

‘ద్వీప’(కన్నడ సినిమా 2002)

ఇళ్ళకూ, పొలాలకూ ఇతర ఆస్తులకూ వెలకట్టొచ్చు. గౌరవానికీ, నమ్మకానికీ, జ్ఞాపకాలకీ వెలకట్టగలమా? చాలా అమూల్యమైన ప్రశ్న ఇది. ‘డ్యామ్’ పునరావాసంలోని మానవీయ కోణాన్ని సూటిగా సంవేదనాత్మకంగా తెరకెక్కించిన ‘గిరీశ్ కాసరవెళ్ళి’ చిత్రం ‘ద్వీప’ (తెలుగులో ‘ద్వీపం’ అనొచ్చు). దివంగత ప్రముఖ తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల కథానాయిక సౌందర్యం నిర్మించి నటించిన చిత్రం ఇది. ద్వీప ఉత్తమ చిత్రంగా భారత ప్రభుత్వ స్వర్ణకమలం పురస్కారాన్ని కూడా అందుకుంది. కొన్ని సినిమాలను చూసి, ఆనందిస్తాం. కొన్నింటిని తిలకించి విశ్లేషిస్తాం.(…)