|
ఒక “గుప్త దాత” కథ – విక్కీ డోనార్
దానం చేసే దాతల్లో కొంతమంది గొప్పగా చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోకుండా గుప్తంగా వుండటానికి ఇష్టపడచ్చు. కానీ చేసిన దానమే నలుగురికీ చెప్పుకోలేనిదైతే ఆ దాత “గుప్త దాత” గా వుండిపోవాల్సిందేనా? అతను చేసిన దానం గురించి తెలిసిన తరువాత అతని కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇలాంటి కథాంశంతో రూపొందించిన చిత్రమే విక్కీ డోనార్. ఇంతకీ అతను అంత గుప్తంగా చేసిన దానం ఏమిటనా మీ అనుమానం? అయితే వినండి. విక్కీ ఒక sperm donor. [...] |
|
అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ సీక్రెట్ ‘ఏజంట్ వినోద్’
విచ్చినమైన రష్యానుంచీ ఒక సూట్ కేస్ న్యూక్లియర్ బాంబ్ ఓపన్ మార్కెట్ లోకి వచ్చింది. అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠాలన్నిటికీ అది కావాలి. అది ఎవరి చేతిలో పడినా ఒక మహావిస్ఫోటనం తధ్యం. ఒక మహానగరంలో మంటలు రేగడం ఖాయం. కొన్ని లక్షలమంది ప్రజల ప్రాణాలు పోవడం ఖచ్చితం. ఈ ప్రమాదాన్ని ఆపాల్సిన బాధ్యత భారతీయ ‘రా’ ఏజంట్ వినోద్ ది. తొమ్మిది దేశాలు, ఎన్నో ప్రయాణాలు, మరెన్నో ప్రమాధాల నుంచీ తప్పించుకుని ఆ బాంబుని కనుక్కుని అది [...] |
|
విద్యా (బాగ్చీ) + విద్యా (బాలన్) = నేషనల్ అవార్డ్… అదీ “కహానీ”
గుప్పిట మూసి వుంచితే మిస్టరీ. అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం థ్రిల్లర్. కాని ఇలాంటి కథల్లో ఒక చిక్కు వుంది. గుప్పిట తెరవగానే అప్పటిదాకా థ్రిల్ కి గురైన ప్రేక్షకులే “ఓస్ ఇంతేనా” అంటూ పెదవి విరిచేస్తారు. లేదా పొరపాటున ఎక్కడైనా Loose Ends దొరికిపోతే “నాకర్థమై పోయిందోచ్” అంటూ అరిచేస్తారు. అలా దొరికీ దొరక్కుండా, విప్పీ విప్పకుండా అనుక్షణం Thrill Ride ఇవ్వగలిగిన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన ఆణిముత్యం, ఆద్యంతం కట్టిపడేసే [...] |
|
కథే ప్రాణంగా ’కహాని’
ఒక సమకాలీన సమస్యను తీసుకొని, దాని పరిష్కారాన్ని యుగయుగాలుగా వేళ్ళూనుకుపోయిన ఒక విశ్వాసంలో నిలుపుతూనే, సార్వజనీనత కోల్పోకుండా ఒక కథ చెప్పటం కత్తి మీద సాములాంటిది. అవినీతి, ఉగ్రవాదం మొదలైన సమకాలీన సమస్యలతో వచ్చిన సినిమాలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటిలో విభిన్నంగా నిలిచిపోయే సినిమా ఇవ్వాళ నేను చూశాననే నాకనిపిస్తుంది. ఆ సినిమా, బాలీవుడ్ తాజా విడుదల – ’కహాని’. ఇదో థ్రిల్లర్ సినిమా. మొదటి నుండి చివరి దాకా ఏం జరుగుతుందో సగటు ప్రేక్షకునికి తెలుస్తూనే [...] |
|
Sai Paranjape’s Saaz
“Human relationships are my forte.” అని ఉద్ఘాటించగల ప్రతిభావంతురాలైన దర్శకురాలు, సినీ వినీలాకాశంలో నేపథ్యగాయనీమణులుగా తారాస్థాయిని చేరటానికి ఇద్దరి తోబుట్టువుల మధ్య జరిగిన అప్రకటిత స్పర్థను తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? సాయి పరాన్‍జపే ’సాజ్’లా ఉంటుంది. సంగీతభరితమై మనసు లోతుల్ని చూపేదిగా సాగుతుంది. కళాకారుల్లోని మానవీయ కోణాలకు అద్దం పడుతుంది. కళ మనిషిని ఎంత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళినా, మనిషి మనిషిలా మిగలడానికి మరెన్నో కావాలని గుర్తుచేస్తుంది. కథ:సినిమా మొదలయ్యే సరికి బన్సి (షబానా ఆజ్మీ) [...] |
|
ఈ ’కథ’ చూసారా?
ముళ్ళపూడి వారి బుడుగుంగారు కథ చెప్పడానికి ఉపక్రమించే ముందే నీతి సెలవిస్తారు. ఎప్పుడోకప్పుడు చెప్పుకోవలసినదే కదా, ముందు ’నీతి’ అనేసుకుంటే అలా పడుంటుంది కదా, అని. మరే! కథ అన్నాక నీతంటూ ఉన్నాక చెప్పుకోవాలిగా. ఫలానా కథలో ఫలానా వాళ్ళ మధ్య ఫలానా సంఘటనలు జరిగినప్పుడు, ఫలనా అవుతుంది, దాన్ని బట్టి మనకు ఫలనా నీతి బోధపడుతుంది. మరి ఇలాంటి ఓ ఫలానా కథను తీసుకొని మనుషులకు, మారుతున్న పరిస్థితులకూ అన్వయిస్తే ఏమవుతుంది? అప్పుడే నీతులు బోధపడతాయి? [...] |
|
మనిషి లోతుల్ని చూపే ’స్పర్ష్’
గత మూడు రోజుల్లో సాయి పరాన్‍జపేతీసిన మూడు విభిన్న చిత్రాలు చూడ్డం తటస్థపడింది. వాటిలో, ఆవిడకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డునే కాక ఎనలేని గుర్తింపునీ సంపాదించి పెట్టిన సినిమా, ’స్పర్ష్’ ఒకటి. నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ తారాగణం అని నేను ప్రకటించగానే మా అమ్మ “అయితే, కొంచెం ఓపికతో చూడాల్సిన సినిమా అయ్యుంటుంది.” అని అనేసారు. వికిలో చిత్ర వివరాలు చూస్తే కొంచెం భారీ సబ్జెక్ట్ ఉన్న సినిమా అని వెంటనే అర్థమయిపోయింది. ఆ [...] |
|
The Dirty Picture – When Silk is not Silk.
A few weeks ago, I was watching Merchant–Ivory’s early film, Bombay Talkies, starring Sashi Kapoor and Jennifer Kendall. One of the bonus features on the DVD was a documentary, “The Queen of Nautch Girls”, directed and narrated by Anthony Komer, a 30 minute feature on Helen, the original item dance queen. This thoroughly enjoyable, nostalgia [...] |
|
Benegal’s Bhumika
రంగస్థలంపైనో, సినిమా తెరపైనో రంగులు పూసుకొని ఆడి, పాడి, నవ్వి, ఏడ్చి చిత్రవిచిత్ర పాత్రలకు ప్రాణం పోసే కళాకారుల జీవితాలను తరచి చూస్తే ఆ రంగుల వెనుకున్న వివర్ణ జీవితాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. జీవితం పట్ల కొన్ని మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతాయి. అలా ఒక నటి జీవితంలోని విభిన్న కోణాలను అత్యంత హృద్యంగా తెరకెక్కించారు, ’భూమిక-ది రోల్’ అనే సినిమాలో శ్యామ్ బెనిగల్. చిత్ర కథ: దేవదాసి వర్గానికి చెందిన ఒక గాయని మనవరాలు ఉష (స్మితా పాటిల్). [...] |
|
Gulzar’s Angoor – A tribute to Shakespeare
మొన్నటి శుక్రవారం రాత్రి, నా మానసిక వాతావరణం భీభత్స రూపం దాల్చి, అది ఎవరి పాలిటో వాయుగుండంగా మారబోతుండగా.. “అమ్మాయ్.. ఒక సినిమా చూస్తున్నా! టైటిల్స్ భలే ఉన్నాయి” అని ఫ్రెండ్. నేను: ఓకె (= సర్లే, ఇక్కడ నేనెవరికో శుభం కార్డు వేస్తున్నా) “అంగూర్ అట.. ఇంతకు ముందు చూసావా?” నేను: నో (= వదిలెయ్య్ నన్ను. మీరూ, మీ సినిమాలు! ఇప్పుడు పేరు కూడా తెలీదంటే నన్ను వాయించేస్తారు.) “గుల్జార్ సినిమా. సంజీవ్ కుమార్ [...] |
|
అద్భుతానికి అడుగుదూరంలో “రాక్‌స్టార్”
సినిమా చూస్తున్నంతసేపు ఆహా ఎంత గొప్పగా తీశాడు అని అనిపిస్తుంది. రణ్‌బీర్ నటన చూసినప్పుడల్లా ఇతనిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ఆశ్చర్యమేస్తుంది. కథ, కథనం కొత్తగా కనిపిస్తుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వ ప్రతిభతోపాటు, అతని సినిమాలలో ఎప్పుడూ ఆసక్తికరంగా వుండే హీరోయిన్ కేరక్టరైజేషన్ కట్టిపడేస్తుంది. ఢిల్లీలో మొదలై కాష్మీర్, ప్రాగ్ తదితర ప్రదేశాలలో అందాలు కెమెరా అందంగా పట్టుకుందని తెలుస్తూనే వుంటుంది. ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం ఎప్పటిలాగే వీనులవిందుగా సాగుతుంది. అయితే సినిమా అంతా అయిన [...] |
|
Bose: The Forgotten hero (2005)
౨౦౦౪-౦౫ ప్రాంతంలో నాంపల్లి లోని గృహకల్ప కాంప్లెక్స్ లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారి ఎగ్జిబిషన్లో సుభాష్ చంద్రబోసు గురించి శిశిర్ కుమార్ బోస్ రాసిన జీవితచరిత్ర పుస్తకం ఒకటి కొన్నాను. అప్పట్లోనే శ్యాం బెనెగల్ తీసిన “నేతాజీ సుబాష్ చంద్ర బోస్: ది ఫర్గాటెన్ హీరో” సినిమా గురించి కూడా తెలిసింది. నా ఖర్మ కొద్దీ బాగా కత్తిరించిన డీవీడీ దొరికి, గంటన్నర నిడివి ఉన్న సినిమా చూసి, అదే సినిమా అనుకుంటున్నప్పుడు చివరకి [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |