Category: బెంగాలీ

అంతర్జలి యాత్ర

అంతర్జలి యాత్ర

స్త్రీలను సతీ అనసూయలుగానూ, సతీ సావిత్రులుగానూ, మహా పతివ్రతలుగానూ చిత్రిస్తూ మన భారతీయ సినిమాల్లో అనేక చలన చిత్రాలు వచ్చాయి. కాని సతీ సహగమనాన్ని కథాంశంగా తీసుకుని దాన్ని సమర్ధిస్తూనో, లేదా వ్యతిరేకిస్తూనో వచ్చిన చిత్రాలు స్వల్పం. సతీ సహగమనాన్ని మూఢాచారంగా ఖండిస్తూ సాహిత్య రంగంలో అనేక రచనలు వచ్చాయి. ఓ పెద్ద సామాజికోద్యమమే వచ్చింది. అయితే సతీ సహగమనాన్ని కమల్ కుమార్ మజుందార్ రాసిన నవల ఆధారంగా గౌతం ఘోష్ నిర్మించిన “అంతర్జలీ [...]

చారులత

చారులత

భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు రూపమైన సత్యజిత్ రే తన జీవితకాలంలో నిర్మించిన ముప్పైకి పైగా చలన చిత్రాల్లో అత్యంత భావావేశంతో కూడుకున్న చిత్రం “చారులత”. ఆ చిత్రంలో అత్యంత వివేకమూ, అమితమయిన సున్నితత్వమూ, తనపైన తనకు గాఢమైన విశ్వాసమూ కలిగిన అందమయిన స్త్రీ చారులత ముఖ్యాభినేత. ఆమె తన జీవితంలో ఎదిగిన తీరూ, అనుభవించిన ఒంటరితనమూ, తన అభీష్టాలను నెరవేర్చుకునే క్రమంలో ఆమె ముందుకు సాగిన వైనమూ ఈ చిత్రంలో ప్రధానాంశాలు. తన కుటుంబ జీవన [...]

ఇద్దరు

ఇద్దరు

ఇద్దరు (1964)-సత్యజిత్ రే లఘు చిత్ర పరిచయం
మనకు అంటే భారతీయులకు రే సిన్మాలు సినిమా పాఠ్యగ్రంథాలు. మన వాడు కదా అని మనం కితాబు ఇచ్చుకోవడం కాదు.ఉద్దండులైన ప్రపంచ సినీ దర్శకులే రే సినిమాలను కొనియాడారు. రే సినిమాలు చూడని వారికి “రే సినిమాలు చూడకపోవడం అంటే, సూర్య చంద్రులను చూడకుండా జీవించడం” అన్న జపాన్ సినీ దర్శక దిగ్గజం అకిరా కురోసావ మాటల కంటే మంచి పరిచయ వాక్యాలు లేవు. ఆ [...]

మేఘేధాక తార

మేఘేధాక తార

భారతీయ సినిమా రంగంలో రిత్విక్ ఘటక్ ఓ హై ఓల్టేజీ టాలెంట్. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎంచుకున్న సబ్జెక్టు కానీ, నిర్మాణ రంగంలో ఆయన చిత్రీకరణ పధ్ధతి , సంగీతాన్ని దృశ్యాల్ని లయీకరించిన విధానమూ ఆయన స్థాయిని చెబుతాయి.భారతదేశ విభజన పట్ల ఆయన దు:ఖపడడమూ, కళాత్మకంగా స్పందించిన తీరూ ఆయనలోని సున్నితత్వాన్ని, నిజాయితీని స్పష్టపరుస్తాయి.నవ్య వాస్తవిక వాదిగా ఆయన చిత్రాల్లో అత్యంత వేదనా భరితమయిన బతుకుల్ని వెళ్ళదీస్తున్న వారే ప్రధాన పాత్రలుగా నిలుస్తారు.భారతీయ నవ్య సినిమా రంగంలో [...]

మహానగర్

మహానగర్

పితృస్వామ్య భావజాలం వేళ్లూనికుని అనధికారకంగా కుటుంబంలోనూ, సమాజం లోనూ రాజ్యమేలుతున్న వ్యవస్థలో స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడడమూ, కుటుంబం గడపదాటి అడుగుపెట్టడమూ ఓ గొప్ప సందర్భమే. ఆ సందర్భం ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలోని పురుష వీక్షణాల్ని అతలాకుతలం చేస్తుంది. అంతదాకా పురుష దృక్పథానికి వస్తువుగా కనిపించిన స్త్రీ వ్యక్తిత్వంతో ఎదిగే తీరు ఆ పరుష భావజాలానికి పెద్ద సంచలనంగానే కనిపిస్తుంది. యాభై ఏళ్ల క్రితం స్త్రీ బయటి ప్రపంచంలోకి ఉద్యోగం కోసం వెళ్లడమంటే సనాతన [...]

సద్గతి (Deliverance)- కులవ్యవస్థను అర్థంచేసుకోడానికి ‘రే’ చేసిన ప్రయత్నం.

సద్గతి (Deliverance)- కులవ్యవస్థను అర్థంచేసుకోడానికి ‘రే’ చేసిన ప్రయత్నం.

1981 లో దూరదర్శన్ కోసం సత్యజిత్ రే దర్శకత్వం వహించిన లఘు/టెలి చిత్రం “సద్గతి”. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన అదేపేరుతో ఉన్న హిందీ లఘు కథ ఈ చిత్రానికి మూలం.  దూరదర్శన్ వారి పుణ్యమా అని, ఈ ‘టెలీ ఫిల్మ్” ప్రస్తుతం సామాన్య మానవులకు అందనిదైపొయింది. నాకు కూడా కాలేజి రోజుల్లో (1994) film club పుణ్యమా అని, చూసే భాగ్యం కలిగింది. ఇప్పుడు, ఆ సినిమా ఆఖర్లో బ్రాహ్మణుడు (మోహన్ అఘాసే) అంటరాని కులానికి చెందినవా డి (ఓంపురి) శవాన్ని తాడు కట్టి లాక్కెళ్ళి [...]