భారతీయ సినిమా back to homepage

456310_327046830700324_149515215120154_819228_734489553_o కొంత ఆశ కొంత నిరాశ మిగిల్చిన భాగాహారం : సశేషం

ఆలోచన కొత్తగా ఉన్న ఆచరణలలో కొత్తదనం లేకపోతే ఏ లెక్కలో అయినా తేడా వచ్చేస్తుంది. ముఖ్యంగా సినిమా భాగాహారంలో శేషాలు మిగలకూడదు. నిశ్శేషంగా మిగిలితేనే లెక్క సక్సెస్.   ఆమధ్య వచ్చిన ‘వైశాలి’ లాంటి జాన్రా మిక్సింగ్ తరహా కథతో వచ్చిన సశేషం సినిమా వెనకనున్న ఆలోచన చాలా విన్నూత్నంగా ఉంటుంది. కానీ సస్పెన్స్ జాన్రా నుంచీ, సైకో జాన్రా మీదుగా హార్రర్ రివీల్ అయ్యేసరికీ ప్రేక్షకుడిని కొంత అసహనానికి గురిచేస్తుంది. మధ్యలో వచ్చే హాస్యం కొంత [...]

Devasthanam_NT బాగలేదు అని చెప్పలేని సినిమా: దేవస్థానం

ప్రస్తుత తెలుగు సినిమా ట్రెండ్ కి భిన్నంగా ఏ మాత్రం స్టార్ లు లేని సినిమా, అదీ కథను నమ్ముకున్న సినిమా రావటం అరుదుగా జరుగుతుంది. కానీ అలాంటి ప్రతి సినిమా శంకరాభరణం కాలేదు. ఇప్పుడు దేవస్థానం పరిస్థితి కూడా అంతే. కే. విశ్వనాధ్, యస్పీబీ, ఆమని వంటి దిగ్గజాలు వున్నారు, మానవ జీవితం గురించి ముఖ్యంగా మానవత్వం గురించి మంచి కథ వుంది – ఇన్ని వున్నా మంచి సినిమా చూశాం అన్న తృప్తిని పూర్తిగా ఇవ్వలేకపోయిన [...]

vik_donor ఒక “గుప్త దాత” కథ – విక్కీ డోనార్

దానం చేసే దాతల్లో కొంతమంది గొప్పగా చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోకుండా గుప్తంగా వుండటానికి ఇష్టపడచ్చు. కానీ చేసిన దానమే నలుగురికీ చెప్పుకోలేనిదైతే ఆ దాత “గుప్త దాత” గా వుండిపోవాల్సిందేనా? అతను చేసిన దానం గురించి తెలిసిన తరువాత అతని కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇలాంటి కథాంశంతో రూపొందించిన చిత్రమే విక్కీ డోనార్. ఇంతకీ అతను అంత గుప్తంగా చేసిన దానం ఏమిటనా మీ అనుమానం? అయితే వినండి. విక్కీ ఒక sperm donor. [...]

neku-naku-dash-dash చూసినవాళ్లకి ‘డాష్ డాష్’

(రివ్యూ కన్నా ముందు నా సోది ఉందీ.. ఇబ్బంది కలిగితే ఈ సారికి క్షమీంపుము.)   ఇదిగో టైటిల్ చూసి ఇదేదో సినిమా రివ్యూ అనుకునేరు.. కాదు కాదు.. ఆనందాన్ని పంచుకుంటే పెరుగుతుందంట, దుఃఖాన్ని పంచుకుంటే తరుగుతుందంటా.. చేసిన పాపం చెప్తే పూర్తిగా పోతుందంటా..ఏదో నా పాపాన్ని కడుక్కునే ప్రయత్నమన్న మాట. రోజూ లేచే టైం కన్నా లేటగా లేవటం తో హడావిడిగా రెడీ అయ్యి, కబోర్డ్ లో ఉన్న అరడజన్ డియో స్ప్రే లలో ఒక [...]

racha_wallpaper12_1280 మూసలోకూడా ఒదగని ‘రచ్చ’

ఐదు ఫైట్లు, ఆరు పాటలు, వీలైనంత మంది కామెడియన్సూ, సాధ్యమైనన్ని డబుల్ మీనింగ్ డైలాగులూ, ఫ్యూడల్ ఫ్లాష్ బ్యాక్, కథకు సంబంధం లేకుండా సినిమా అంతా స్లీప్ వాకింగ్ చేసే హీరో, కథతోపాటూ కథానాయకుడి గమ్యాన్నీ నిర్దేశించే ఆపద్ధర్మ హీరోయిన్ ఇవి ‘రచ్చ’ సృష్టించిన కొత్త కమర్షియల్ సినిమా ఫార్ములా. మాస్ సినిమాలు అనబడే ఫార్ములా చిత్రాలు చాలా అవసరం. ఎందుకంటే, అవి అసెంబ్లీలైన్ ప్రొడక్షన్స్ లాంటివి. సఫల ప్రయోగాల ఆధారంగా తయారయ్యే ప్రోడక్టుల్లాంటివి. అందుకే చిరంజీవి, [...]

3film వై దిస్ గోల “వెర్రి” థ్రీ?

గత కొంతకాలంగా వేలంవెర్రిలా పాకిన కొలవెరి పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి పాటను రూపకల్పన చేసినవాళ్ళు తీసిన సినిమా అంటే అంచనాలు వుండటం సహజం. అందునా ఈ మధ్యకాలంలో వైవిధ్యానికి మారుపేరుగా నిలిచిన తమిళ పరిశ్రమ చిత్రం కావడంతో ఆ అంచనాలు మరో నాలుగింతలయ్యాయి. అయితే నిన్న విడుదలైన “3” చిత్రం ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడింది. గత కొంతకాలంగా తమిళ సినిమాని తెగపొగిడేసిన మా లాంటి వారి కళ్ళు తెరిపించేలా [...]

topsongs10-teshirts-designe ఈ రోజుల్లో…

ఈ రోజుల్లో తెలుగు సినిమా చూడడమంటే పాపమయిపోయింది. డబ్బులిచ్చి మరీ తలనొప్పి తెచ్చుకోవడమంటే తెలుగు సినిమా చూడడమే! అయినప్పటికీ తెలుగు వాళ్లకి వినోదం కోసం సినిమా తప్ప మరో గతి లేకపోవడంతో సినిమాలు ఆడేస్తున్నాయి. ఒక మోస్తరుగా ఉంటే చాలు హిట్లు సూపర్ హిట్లూ అయిపోతున్నాయి కూడా. ఇలాంటి పరిస్థుతుల్లో ప్రేక్షకులు కూడా కాస్తా తెలివి మీరిపోయారని చెప్పాలి. తలనొప్పి ఎలాగూ తప్పదు, డబ్బులు ఎలాగూ వృధా అని పక్కాగా తెలిసిపోయినప్పుడు అదేదో పెద్ద (అంటే భారీ [...]

agent-vinod-poster-nWo అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ సీక్రెట్ ‘ఏజంట్ వినోద్’

విచ్చినమైన రష్యానుంచీ ఒక సూట్ కేస్ న్యూక్లియర్ బాంబ్ ఓపన్ మార్కెట్ లోకి వచ్చింది. అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠాలన్నిటికీ అది కావాలి. అది ఎవరి చేతిలో పడినా ఒక మహావిస్ఫోటనం తధ్యం. ఒక మహానగరంలో మంటలు రేగడం ఖాయం. కొన్ని లక్షలమంది ప్రజల ప్రాణాలు పోవడం ఖచ్చితం. ఈ ప్రమాదాన్ని ఆపాల్సిన బాధ్యత భారతీయ ‘రా’ ఏజంట్ వినోద్ ది. తొమ్మిది దేశాలు, ఎన్నో ప్రయాణాలు, మరెన్నో ప్రమాధాల నుంచీ తప్పించుకుని ఆ బాంబుని కనుక్కుని అది [...]

kah_vidya విద్యా (బాగ్చీ) + విద్యా (బాలన్) = నేషనల్ అవార్డ్… అదీ “కహానీ”

గుప్పిట మూసి వుంచితే మిస్టరీ. అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం థ్రిల్లర్. కాని ఇలాంటి కథల్లో ఒక చిక్కు వుంది. గుప్పిట తెరవగానే అప్పటిదాకా థ్రిల్ కి గురైన ప్రేక్షకులే “ఓస్ ఇంతేనా” అంటూ పెదవి విరిచేస్తారు. లేదా పొరపాటున ఎక్కడైనా Loose Ends దొరికిపోతే “నాకర్థమై పోయిందోచ్” అంటూ అరిచేస్తారు. అలా దొరికీ దొరక్కుండా, విప్పీ విప్పకుండా అనుక్షణం Thrill Ride ఇవ్వగలిగిన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన ఆణిముత్యం, ఆద్యంతం కట్టిపడేసే [...]

vidya_balan_kahaani_review_movie కథే ప్రాణంగా ’కహాని’

ఒక సమకాలీన సమస్యను తీసుకొని, దాని పరిష్కారాన్ని యుగయుగాలుగా వేళ్ళూనుకుపోయిన ఒక విశ్వాసంలో నిలుపుతూనే, సార్వజనీనత కోల్పోకుండా ఒక కథ చెప్పటం కత్తి మీద సాములాంటిది. అవినీతి, ఉగ్రవాదం మొదలైన సమకాలీన సమస్యలతో వచ్చిన సినిమాలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటిలో విభిన్నంగా నిలిచిపోయే సినిమా ఇవ్వాళ నేను చూశాననే నాకనిపిస్తుంది. ఆ సినిమా, బాలీవుడ్ తాజా విడుదల – ’కహాని’. ఇదో థ్రిల్లర్ సినిమా. మొదటి నుండి చివరి దాకా ఏం జరుగుతుందో సగటు ప్రేక్షకునికి తెలుస్తూనే [...]

images ఒక రచయిత కృషి “ఋషి”

ప్రసాద్ ప్రొడక్షన్స్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నిర్మాణరంగంలోని అడుగుపెట్టాలనుకుంటే ఖచ్చితంగా అచితూచి అడుగేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానితోపాటూ అలాంటి నిర్మాణ సంస్థని ప్రేరేపించి, మళ్ళీ ఒక సినిమా తియ్యాలనే కోరిక కలిగేలా చేసిన కథకుడూ దర్శకుడూ రాజ్ మాదిరాజు ప్రతిభని కూడా అంచనా వెయ్యొచ్చు. ఈ నమ్మకం, అంచనాతోపాటూ, “మెడిసన్ ఒక తపస్సు. డాక్టర్ ఒక ఋషి” అంటూ ప్రోమోలు కలిగించిన ఆసక్తితో థియేటర్ కి వెళితే వేటినీ నిరాశపరచని చిత్రం ‘ఋషి’.   [...]

wp-2sonthavooru800 రుద్రుడి “సొంతఊరు” కథ

ఎల్బీ శ్రీరాం చాలా బాగా చేసాడు అని ఒకరిద్దరు పదే పదే చెప్పగా విన్నాక, ఈ సినిమా ఎట్టకేలకు చూసేసాను. నాకనిపించింది టూకీగా చెప్పాలంటే: ఈ సినిమాని కమర్షియలైజ్ చేయాలా? లేకుంటే అలాగ “ఆర్టు” సినిమాలాగా ఉంచేయాలా అన్న అయోమయంలో ఈ సినిమా తీసిన వాళ్ళు అలాగ కొట్టుమిట్టాడుకుంటూ, చివరికి దీన్ని ఇలా ఒక కిచిడీ లా చేసారేమో అనిపించింది. డైలాగులు, ఎల్బీ శ్రీరాం నటన మాత్రం అద్భుతం. ఇక వివరాల్లోకి వెళితే: కథా విశేషాలు ఏమిటంటే: [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories