సమీక్ష back to homepage

images ఒక రచయిత కృషి “ఋషి”

ప్రసాద్ ప్రొడక్షన్స్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నిర్మాణరంగంలోని అడుగుపెట్టాలనుకుంటే ఖచ్చితంగా అచితూచి అడుగేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానితోపాటూ అలాంటి నిర్మాణ సంస్థని ప్రేరేపించి, మళ్ళీ ఒక సినిమా తియ్యాలనే కోరిక కలిగేలా చేసిన కథకుడూ దర్శకుడూ రాజ్ మాదిరాజు ప్రతిభని కూడా అంచనా వెయ్యొచ్చు. ఈ నమ్మకం, అంచనాతోపాటూ, “మెడిసన్ ఒక తపస్సు. డాక్టర్ ఒక ఋషి” అంటూ ప్రోమోలు కలిగించిన ఆసక్తితో థియేటర్ కి వెళితే వేటినీ నిరాశపరచని చిత్రం ‘ఋషి’.   [...]

wp-2sonthavooru800 రుద్రుడి “సొంతఊరు” కథ

ఎల్బీ శ్రీరాం చాలా బాగా చేసాడు అని ఒకరిద్దరు పదే పదే చెప్పగా విన్నాక, ఈ సినిమా ఎట్టకేలకు చూసేసాను. నాకనిపించింది టూకీగా చెప్పాలంటే: ఈ సినిమాని కమర్షియలైజ్ చేయాలా? లేకుంటే అలాగ “ఆర్టు” సినిమాలాగా ఉంచేయాలా అన్న అయోమయంలో ఈ సినిమా తీసిన వాళ్ళు అలాగ కొట్టుమిట్టాడుకుంటూ, చివరికి దీన్ని ఇలా ఒక కిచిడీ లా చేసారేమో అనిపించింది. డైలాగులు, ఎల్బీ శ్రీరాం నటన మాత్రం అద్భుతం. ఇక వివరాల్లోకి వెళితే: కథా విశేషాలు ఏమిటంటే: [...]

Poster5 copy ఎడారి వర్షం: దోషం నాది కాదు, మూలానిది!

ఏం చెప్పదల్చుకున్నాడో రచయిత ముందే నిక్కచ్చిగా నిర్ణయించేసుకోవడం వల్ల పుట్టే అసంబద్ధమైన కథల కోవకి చెందినది దేవరకొండ బాల గంగాధర తిలక్‌ ‘ఊరిచివర ఇల్లు’. పరాయి జీవితమైనా దాన్నొక సహానుభవంగా కాకుండా స్వకపోల కల్పితంగా ‘సృజిస్తే’ కొన్ని అష్టావక్ర కథలు పుట్టుకొస్తాయి. తన ఆధునిక కవిత్వానికి ఆపాదించుకున్నట్లే, కథలకు కూడా ప్రబోధించే తత్త్వాన్ని ఎక్కించాలని ‘బాధ్యత’తో భావించినందువల్లనేనేమో తిలక్‌ కథలు చాలావరకూ పైకోవకి చెందుతాయి. ఇక ‘ఊరి చివర ఇల్లు’ విషయానికొస్తే, ఈ కథకి Third person [...]

saaz Sai Paranjape’s Saaz

“Human relationships are my forte.” అని ఉద్ఘాటించగల  ప్రతిభావంతురాలైన దర్శకురాలు, సినీ వినీలాకాశంలో నేపథ్యగాయనీమణులుగా తారాస్థాయిని చేరటానికి ఇద్దరి తోబుట్టువుల మధ్య జరిగిన అప్రకటిత స్పర్థను తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? సాయి పరాన్‍జపే ’సాజ్’లా ఉంటుంది. సంగీతభరితమై మనసు లోతుల్ని చూపేదిగా  సాగుతుంది. కళాకారుల్లోని మానవీయ కోణాలకు అద్దం పడుతుంది. కళ మనిషిని ఎంత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళినా, మనిషి మనిషిలా మిగలడానికి మరెన్నో కావాలని గుర్తుచేస్తుంది. కథ:సినిమా మొదలయ్యే సరికి బన్సి (షబానా ఆజ్మీ) [...]

220px-Katha,_1983_Hindi_film ఈ ’కథ’ చూసారా?

ముళ్ళపూడి వారి బుడుగుంగారు కథ చెప్పడానికి ఉపక్రమించే ముందే నీతి సెలవిస్తారు. ఎప్పుడోకప్పుడు చెప్పుకోవలసినదే కదా, ముందు ’నీతి’ అనేసుకుంటే అలా పడుంటుంది కదా, అని. మరే! కథ అన్నాక నీతంటూ ఉన్నాక చెప్పుకోవాలిగా. ఫలానా కథలో ఫలానా వాళ్ళ మధ్య ఫలానా సంఘటనలు జరిగినప్పుడు, ఫలనా అవుతుంది, దాన్ని బట్టి మనకు ఫలనా నీతి బోధపడుతుంది. మరి ఇలాంటి ఓ ఫలానా కథను తీసుకొని మనుషులకు, మారుతున్న పరిస్థితులకూ అన్వయిస్తే ఏమవుతుంది? అప్పుడే నీతులు బోధపడతాయి? [...]

Rajanna Movie Wallpapers జానపద హీరో ‘రాజన్న’

చాలా రోజుల తరువాత తెలుగులో ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మిగిల్చిన చిత్రం ‘రాజన్న’. ఒక కాల్పనిక జానపద హీరో కథని చారిత్రక నేపధ్యంలో సృష్టించి ఆ కాలపు చరిత్రతోపాటూ, స్థానిక సంస్కృతిని, నమ్మకాలను, జనపద ఒరవడులను అల్లుకుంటూ హృద్యమైన కథ చెప్పడం అభినందించదగ్గ ప్రయత్నం. ప్రధానకథ ఊరిమంచి కోసం ప్రధానమంత్రి నెహ్రూకి దొరసాని దౌర్జన్యాల్ని వివరించడానికి చిన్నారి మల్లమ్మ (బేబి ఆనీ) చేసే అద్వితీయ ప్రయాణానిదే అయినా, ఉపకథగా మల్లమ్మ తండ్రి రాజన్న(నాగార్జున) సాహసగాధ [...]

220px-Dvd_hirak_rajar_deshe సత్యజిత్ రాయ్ ‘హిరాక్ రాజర్ దేశ’

ఒక నాలుగేళ్ల క్రితమేమో – ఈ సినిమా షూటింగ్ లో తన అనుభవాల గురించి రాయ్ “చైల్డ్ హుడ్ డేస్” అనే పుస్తకంలో రాసారు. చదివిన ఒక సంవత్సరం లోపే, ఆ వ్యాసాన్ని నేను నవతరంగంలో అనువదించాను. అప్పటికి నాకు కథ తెలుసుకానీ, సినిమా చూడలేదు. కథ చదివినప్పుడు పిల్లల సినిమానే అనుకున్నా కానీ, చూస్తూ ఉంటే అర్థమైంది – ఎంత వ్యంగ్యం ఉందో. ఆ ఏటి ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుని, సైప్రస్ [...]

Sparsh-1980 మనిషి లోతుల్ని చూపే ’స్పర్ష్’

గత మూడు రోజుల్లో సాయి పరాన్‍జపేతీసిన మూడు విభిన్న చిత్రాలు చూడ్డం తటస్థపడింది. వాటిలో, ఆవిడకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డునే కాక ఎనలేని గుర్తింపునీ సంపాదించి పెట్టిన సినిమా, ’స్పర్ష్’ ఒకటి. నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ తారాగణం అని నేను ప్రకటించగానే మా అమ్మ “అయితే, కొంచెం ఓపికతో చూడాల్సిన సినిమా అయ్యుంటుంది.” అని అనేసారు. వికిలో చిత్ర వివరాలు చూస్తే కొంచెం భారీ సబ్జెక్ట్ ఉన్న సినిమా అని వెంటనే అర్థమయిపోయింది. ఆ [...]

the-dirty-picture-new-poster The Dirty Picture – When Silk is not Silk.

A few weeks ago, I was watching Merchant–Ivory’s early film, Bombay Talkies, starring Sashi Kapoor and Jennifer Kendall. One of the bonus features on the DVD was a documentary, “The Queen of Nautch Girls”, directed and narrated by Anthony Komer, a 30 minute feature on Helen, the original item dance queen. This thoroughly enjoyable, nostalgia [...]

wild_straw బెర్గ్ మెన్ ’ వైల్డ్ స్ట్రా బెర్రీస్

సినిమా ఓ కళాత్మక ప్రక్రియ అన్నదానికి సరైన నిర్వచనాలు గా ప్రపంచ సినీ చరిత్ర లో ఎన్నదగిన అతి తక్కువ సినిమాల్లో స్వీడిష్ దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్ మెన్ సినిమాలు ముఖ్యమైనవి. సినిమాల ద్వారా , ఆనాటి నుంచీ ఈ నాటి వరకూ సినిమా అభిమానులకీ ముఖ్యంగా విమర్శకులకూ, మేధావులకూ రకరకాలుగా అర్థం అవుతూ ఆరాధించబడుతూ వచ్చాడు బెర్గె మెన్. ఆయన కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు. ఆయనొక ఫిలాసఫర్. ఆయనొక కవి. ఆయనొక స్వాప్నికుడు. [...]

icp041 Benegal’s Bhumika

రంగస్థలంపైనో, సినిమా తెరపైనో రంగులు పూసుకొని ఆడి, పాడి, నవ్వి, ఏడ్చి చిత్రవిచిత్ర పాత్రలకు ప్రాణం పోసే కళాకారుల జీవితాలను తరచి చూస్తే ఆ రంగుల వెనుకున్న వివర్ణ జీవితాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. జీవితం పట్ల కొన్ని మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతాయి. అలా ఒక నటి జీవితంలోని విభిన్న కోణాలను అత్యంత హృద్యంగా తెరకెక్కించారు, ’భూమిక-ది రోల్’ అనే సినిమాలో శ్యామ్ బెనిగల్. చిత్ర కథ: దేవదాసి వర్గానికి చెందిన ఒక గాయని మనవరాలు ఉష (స్మితా పాటిల్). [...]

MV5BMTY4NzcwODg3Nl5BMl5BanBnXkFtZTcwNTEwOTMyMw@@._V1._SY317_ Eternal Sunshine of Spotless Mind

బయట హోరున వాన పడుతుంటే, లోపలెక్కడో, ఆదమరుపుగా కళ్ళు మూసుకొని ఆ చప్పుడు వింటున్నట్టు, కిటికి దగ్గర నించొని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానను రెప్పార్పకుండా చూస్తున్నట్టు, చూరు కింద నిలబడి వాన చినుకులతో ఆడకున్నట్టు, గొడుగేసుకొని సగం తడుస్తూ, సగం తడవకుండా నడుస్తున్నట్టు, రేన్ కోర్ట్ వేసుకొని వానలో తడుస్తూనే వడివడిగా నడుస్తున్నట్టు, తడవడం ఇష్టం లేక ఏ మూల ఇంత నీడ (షేడ్) దొరికినా దూరిపోయి, అకాల వానను తిట్టుకున్నట్టు, తప్పించుకునే వీల్లేక వానలో [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories