Category: అభిప్రాయాలు

’కళ’ కోల్పోతున్న భారతీయ సినిమా

’కళ’ కోల్పోతున్న భారతీయ సినిమా

జాతీయ స్థాయిలో తెలుగు సినిమా రంగం సంఖ్యాపరంగా ద్వితీయ స్థానం ఆక్రమిస్తూ వుంది. కాని కళాత్మక విలువల పరంగా ఆలోచించినప్పుడు దాని స్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇండియన్ పనోరమాకి ఎంపికయ్యే స్థాయి చిత్రాలు కూడా తెలుగులో రావడం లేదు. సరిగ్గా ఇదే స్థితి అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ సినిమా ఎదుర్కొంటుంది.ఉత్తమ కళాత్మక చిత్రాల్ని నిర్మించడంలో భారత చలనచిత్రసీమ తీవ్రంగా విఫలమవుతోంది. ప్రపంచ స్థాయిలో ఇరాన్, కొరియాలాంటి ఆసియన్ దేశాలు తమ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ [...]

నాకు నచ్చిన "గ్రహణం"

నాకు నచ్చిన “గ్రహణం”

మొన్నీ మధ్యనే సూర్యగ్రహణం అయ్యినప్పుడు, అందరూ ఆ అబ్బురాన్ని సంబరంలా ఆనందిస్తుంటే, “అయ్యో పాపం, సూర్యునికి గ్రహణం, మనకు వినోదం” అని అనుకుంటూ ఉన్నాను. ఈ రోజు “గ్రహణం” సినిమా చూశాక ఏదో తెలీని ఆనందం నన్ను కమ్మేస్తుంది. I’m in awe of the film.. it’s a beauty!
ఈ మధ్యకాలంలో సవాలక్ష కారణాల వల్ల తెలుగు సినిమాలు చూడ్డం ఎక్కువైపోయింది. సినిమా చూసి బయటకొచ్చే ప్రతీ సారీ ఓ గమ్మత్తైన సన్నివేశాన్ని ఊహించుకుంటుంటాను – [...]

పాటల పారడీ

పాటల పారడీ

ఎన్నో చిత్రాలు వస్తున్నాయి పోతున్నాయి. కొన్ని రోజులు తర్వాత కధలూ, సినిమా పేర్లు మర్చిపోతున్నాము. కాని మంచి పాటలను మాత్రం నెమరు వేస్తూనే ఉంటాము. కొన్ని పాటలు దశాబ్దాలు గడచినా కమ్మగా పాడుకుని ఆనంద పడతాము. ఆ అనుభూతే వేరుగా ఉంటుంది.
సలలిత రాగ సుధా(నర్తనశాల).. నీలీల పాడెద దేవా (మురిపించే మువ్వలు) వివాహ భోజనంబు (మాయాబజార్) ఇది మల్లెల వేళ యని (సుఖదుఖాలు) కళ్ళలోకళ్ళు పెట్టి చూడు (భలేమాష్టారు)మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ (రాము) గోదారి గట్టుంది [...]

Paranormal activity

Paranormal activity

Paranormal activity
ఇది ఈ మధ్యే మా ఊళ్ళో విడుదలైన ఓ ఆంగ్ల చిత్రం పేరు,
” What happens when you sleep”, ” Don’t see it when you are alone” అన్న Captions చూసి చాలా ఆతృతగా వెళ్ళా థియేటర్ కి. తీరా వెళ్ళి చూసాక తెలిసింది! ఇది…….ఎందుకులెండి, క్రింద కథ రాసాను మీరే చదువుకోండి.
ఓ ఇంట్లోకి కొత్తగా పెళ్ళైన జంట దిగుతారు. అయితే ఆ అమ్మాయికి ఏదో అదృశ్య శక్తి తనని వెంబడిస్తున్నదని, [...]

మహా యోగి

మహా యోగి

రాసిన వారు: పూర్ణిమ
**********************
సూర్యకిరణాలు పరచుకున్న జీవన మైదానంలో పనిలోనో / పరధ్యానంలోనో నిమగ్నమయ్యిపోయిన జీవి మీద మెల్లిగా కమ్ముకుంటున్న నీడను ఎవరన్నా గ్రహించేలోపే, అనువైన శరీర భాగాన్ని తన రెండు కాళ్ళ మధ్యన పట్టు బిగించి తన్నుకుపోయే పెద్ద గద్ద మృత్యువు. ఎప్పుడెక్కడెలా ఈ గద్ద వస్తుందో తెలీదు. ఎటు పోతుందో తెలీదు. వస్తుందని తెల్సు. పోతుందని తెల్సు. దాన్ని తప్పించుకోలేమని తెల్సీ ప్రయత్నించటం, ఓడిపోవటం, ఏడవటం – దేవుడు hire చేసుకొన్న స్క్రిప్ట్ రైటర్ [...]

సినిమా-జీవితం కనెక్టివిటీ కట్

సినిమా-జీవితం కనెక్టివిటీ కట్

గతంలో సినిమా చూసి బావుంది లేక బాగోలేదు అని మాత్రమే చెప్పేవాళ్లు. ఇప్పుడు ఎడిటింగ్ బావుంది..కెమెరా బావుంది,కొరియోగ్రఫి అదిరింది, ఆర్ట్ డైరక్టర్ ఎవరో గానీ సూపర్ ఇలా మాట్లాడటం కామన్ అయిపోయింది. అదే గతంలో అయితే 24 క్రాఫ్ట్స్ వంద శాతం సమన్వయంతో,సమర్ధవంతంగా పని చేసేవి కాబట్టే, సినిమా(మొత్తం)బావుంది అని మాత్రమే అనే వారు. రాను రాను కొన్ని క్రాఫ్ట్ లు బలహీనపడి,బలంగా పనిచేసిన క్రాఫ్ట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించటం మొదలైంది . ఇది [...]

హాలివుడ్  శ్యాం ప్రసాద్ రెడ్డి ....జేమ్స్ కెమెరాన్

హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్

హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్
ఇలా ఎందుకన్ననో అవతార్ గురించి తెలిసిన మీకందరికి తెలిసే ఉంటది కదా.
అతని కష్టం, అతని సహనం, అతని విశ్వాసం , అతని విజయం.కానీ
అవతార్ చూస్తే చాలా బాధేసింది.
మీడియ సృష్టించినంత గొప్ప గా ఏం లేదు.
నవతరంగం లో అవతార్ గురించి మిత్రులు అందరు చెప్పారు కదా.
మా మిత్రుల అభిప్రాయం వాస్తవం చెప్పాలంటే హాలివుడ్ టెక్నాలజి ఆ సినిమాల తో [...]

రొమాంటిక్ కామెడి It's Complicated

రొమాంటిక్ కామెడి It’s Complicated

It’s Complicated. సినిమా టైటిల్ అది కాని సమీక్ష మాత్రం సులువే. అంత కాంప్లికేటెడ్ ఏమీ కాదు. ముందు చెప్పాల్సింది ఏమిటంటే,ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. నేను మొన్ననే ప్రివ్యూ చూసాను. ఇది ఓల్డ్ ఫాషన్ టైప్ రొమాంటిక్ కామెడి. అందుకే ఈ సినిమా గురించి చెప్పటానికేమి లేదు , నవ్వటానికి తప్ప.
హాలీవుడ్ కామెడీ సినిమాలంటే చెప్పద్దు నాకు కొంచెం భయమే. మొన్ననే The Funny People అనే ఘోరమైన సినిమాకు [...]

హాలీవుడ్ చిత్రం 'అవతార్' చూడద్దు: రామ్ గోపాల్ వర్మ

హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ చూడద్దు: రామ్ గోపాల్ వర్మ

జేమ్స్ కెమెరాన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘అవతార్’ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ…”ఈ సినిమాను చూడకండి..అనుభవించండి”..అంటూ తన అనుభూతులను వివరిస్తున్నారు.ఆయన మాటల్లో… నేనెప్పుడూ దేముడ్ని నమ్మను..కానీ దర్శకుడు జేమ్స్ కెమరాన్ దేముడు కన్నా గొప్పవాడని మాత్రం అనిపించింది.ఎందుకంటే ఆయన అవతార్ లో చాలా అధ్బుతమైన, అందమైన,ఉత్సాహవంతమైన. ఉద్వేగభరిత అనుభవానికి గురిచేసే ప్రపంచాన్ని సృష్టించాడు. దేముడు కూడా ఇట్లాంటి ప్రపంచాన్నిసృష్టించటానికి. ఊహించి ఉండడు .అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా ఐమాక్స్ లో అవతార్ [...]

అరుంధతి(A) బాధితుల సంఘం ౨

అరుంధతి(A) బాధితుల సంఘం ౨

నేను- చూడ్డం చూడవచ్చండి, కానీ అలా అడల్టు సినిమాలు చూడ్డం పిల్లలకు మంచిది కాదు.
ఆమె- వాళ్ళ కోసం మనం కూడా sacrifice చేసుకోలేము కదా.

న్నల్లమాఆఆఆ...! డబ్బులిస్తావా?

న్నల్లమాఆఆఆ…! డబ్బులిస్తావా?

మల్లన్న!
ఎన్నాళ్ళో ఎదురు చూసిన ముదురు సినిమా. సూపర్‍స్టార్ కృష్ణ ఉన్నాడని, ఈ సినిమాతో అయినా మళ్ళా హిట్ కొడతాడనీ ఒక ఆశ. ఎంతైనా విక్రం ఉన్నాడు, భారీ బడ్జట్ ఇన్నాళ్ళు తీశారు, చాలా కాకపోయినా కొంతైనా బాగుంటుందేమో అని ఒక ఆశ. సినిమా విడుదలప్పుడు చెన్నైలో ఉన్నాను. తమిళ్ అయినా ఒకసారి చూద్దామని ప్రయత్నం చేసి వెళ్ళాము. హ్మ్! Wrongest of the wrong choice. ఇంత డిజప్పాయింటైన సినిమా వేరొకటి లేదు.
సినిమా ఎత్తుగడబిడే చివరిదాకా కొనసాగింది. అందులో [...]

పేలకుండానే తుస్సుమనేలా ఉన్న Rocket singh...

పేలకుండానే తుస్సుమనేలా ఉన్న Rocket singh…

రన్బీర్ కపూర్ అభిమానుల సంఘంలో సభ్యత్వం ఎందుకు తీసుకున్నానో నాకింకా అర్థం కాని విషయం. నిన్నటి దాకా అతనిది నేను చూసిన ఏకైక సినిమా – ’అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ పరమ నాన్సెన్స్ అని నా అభిప్రాయం పైగా. ఆ సినిమా లో అతను, కొంత హాస్యమూ తప్ప వేరేదీ నచ్చలేదు నాకు. అయినా సరే, సిగ్గులేకుండా, రెండోరోజే వెళ్ళిపోయా – “రాకెట్ సింగ్ – సేల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్” కి. [...]

అనగనగా ఓ చిన్న సందేహం!

అనగనగా ఓ చిన్న సందేహం!

చిన్నప్పటి నుండి నేను సినిమాలు తెగ చూసేవాడిని. ఎన్.టి.ఆర్ దగ్గరనుండీ చిరంజీవి వరకూ ఆ తరవాత నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోల సినిమాలు ఇలా అందరి సినిమాలు చూసేవాడిని. అవి నా మెదడులో ఒక  సందేహాన్ని రేకెత్తించాయి.
అది, అసలు సినిమా అంటే ఏంటి?
ఇదేం ప్రశ్నరా బాబు, మా ఊళ్ళో చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు అని అనుకుంటున్నారా! నిజమే సినిమా అంటే తెలీనిదెవరికి! ప్రతి రోజు కొన్ని కోట్ల మంది వీటిని తెర మీదో, టీవి లోనో [...]

తెలుగు చిత్రసీమ ప్రస్థుత పరిస్థితి(ఓ అభిమాని ఆక్రోశం ఆవేదన,నివేదన కూడా...)

తెలుగు చిత్రసీమ ప్రస్థుత పరిస్థితి(ఓ అభిమాని ఆక్రోశం ఆవేదన,నివేదన కూడా…)

1960-70ల దాకా మొదటి రెండో తరం నిర్మాతా దర్శకులు ఉన్నంతవరకూ ఆచితూచి అడుగులేస్తూ చక్కటి అభిరుచితో సమాజం పట్ల బాధ్యతతో నిర్మించిన సినిమాలతో తెలుగు చిత్రసీమని గర్వంగా తలెత్తుకెనేట్టు చేసిన అదే సీమ ఇప్పుడు తెలుగునీ చిత్రజగత్తునీ అంధకారంలో ముంచేస్తోంది. భవిష్య త్తేమిటో తెలీక మార్గం చూపించే దిక్కులేక ఫిలింనగర్ కూడలిలో నించుని వెర్రిచూపులు చూస్తోంది వదిలేసిన వాడిపెళ్లాం ఎవడితో లేచిపోతేనేమి అన్నట్టు ప్రవర్తిస్తూ. నాయకుడు మరణించిన సైన్యంలా సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్ళు లేక దిక్కుమాలిన బ్రతుకు [...]

తెలుగులో Atlas Shrugged?

తెలుగులో Atlas Shrugged?

అవును నిజం. తెలుగులో Ayn Rand వ్రాసిన అద్భుత నవల Atlas Shrugged ని సినిమాగా తీసి చేతులు కాల్చుకున్నారు.
మహా మహా హాలీవుడ్ ఉద్దండులే (వాళ్ళని వాళ్ళే అనుకున్నారేమో నాకు తెలియదు మరి) మల్ల గుల్లాలు పడే ఆ నవలని సినిమాగా తీయటం అంటే మాటలు కాదు. A novel with multilayered plot structure, and philosophically challenging theme, and a huge number of characters. Moreover, it has speeches. Eight in [...]

బాబోయ్ అవార్డు సినిమాలు-నాలుగవ భాగం

బాబోయ్ అవార్డు సినిమాలు-నాలుగవ భాగం

ఎప్పుడో ఆగిపోయిన ఈ సీరీస్ ని [మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం] మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి తేవడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీలేవు. కానీ గతంలో చర్చించిన విషయాలకంటే ఈ సారి అక్కడక్కడా కళ గురించి నేను చదివిన కొన్ని విషయాలు పాఠకులతో పంచుకుందామనే లక్ష్యంతో ఈ వ్యాసం మొదలుపెడ్తున్నాను.
ముందుగా సినిమా అనేది ఒక కళ అనే విషయంలో అనుమానం లేదనుకుంటాను. అయితే ఈ కళ అధిక మొత్తంలో డబ్బులతో కూడుకున్నది కాబట్టి ఆ [...]

పెళ్ళిపుస్తకం - పునర్దర్శనం

పెళ్ళిపుస్తకం – పునర్దర్శనం

అనుకోకుండా, రెండ్రోజుల క్రితం “పెళ్ళిపుస్తకం” సినిమా చూశాను. చూసిందే అయినా, ఇప్పుడు కొత్తగా అనిపించింది. ఒకప్పుడు “కాబోలు” అని వదిలేసినవి, పెళ్ళయ్యాక చూడ్డంతో, కొత్త వెలుగులో కనబడ్డాయి – భార్యా భర్తా తగాదాల వంటివి . దానితో, మరోసారి ఈ సినిమాను తల్చుకున్నట్లు ఉంటుందని, ఈ వ్యాసం.
కథ: మిస్సమ్మని తిరగేసి రావికొండల్రావుగారు ఈ కథ రాసారని ఇదివరలో నవతరంగంలోనే చదివేసి ఉంటారు కదా. మా సినిమాలు అని బాపు గారి వ్యాసాల్లో… ఈ విషయం చదివేదాకా నా [...]

Inherit the wind (1960)

Inherit the wind (1960)

మొదట నాకు ఈ సినిమా కథతో పరిచయమైన సందర్భంతో మొదలుపెడతాను. లాంగ్ వీకెండ్, హోమ్ అలోన్ – అలాంటప్పుడే జైఅర్జున్ అనబడు jabberwock బ్లాగును చూస్తూ ఉంటే ఈ టపా కనిపించింది. ఈ సినిమా స్కోప్స్ ట్రయల్ (Scope’s trial of 1925) ఆధారంగా తీశారని తెలిసి, కుతూహలం పెరిగింది. ఆమధ్య ఓరోజు కార్టూనింగ్ ఎవల్యూషన్ వెబ్సైట్లో డార్విన్ సిద్ధాంతంపై కార్టూన్లు చూస్తూ ఉంటే, స్కోప్స్ ట్రయల్ గురించి తెలిసింది. అలా ఓ రెండ్రోజులు ఆ ఉదంతానికి [...]

అంతా మన మంచికే (1972)

అంతా మన మంచికే (1972)

ఒక ఆదివారం పొద్దున్నే ఏడు గంటలకి బోరు కొడుతూ ఉన్నప్పుడు ఈ సీడీ కనిపించింది – “అంతా మన మంచికే” అని. టైటిల్స్ వివరాలు చూసి, “అంతా మన భానుమతే” అనుకున్నాను. అవును మరి – ఇది భరణీ పిక్చర్స్ చిత్రం. దర్శకత్వం భానుమతి. సంగీతంలోనూ పాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి…. ఇది కాక, ఈ సినిమాలో పాటలు కూడా పాడారని చూస్తూ ఉంటే అర్థమైంది. ఇంకా ఏమన్నా చేశారేమో తెలీదు కానీ, సినిమా మాత్రం [...]

బాబోయ్ అవార్డు సినిమాలు-మూడవ భాగం

బాబోయ్ అవార్డు సినిమాలు-మూడవ భాగం

బాబోయ్ అవార్డు సినిమాలంటూ ఒక వెబ్ సైట్లో వచ్చిన వ్యాసాలు అందులో చెప్పిన అంశాల గురించి విశ్లేషిస్తూ గతంలో రెండు వ్యాసాలు వచ్చాయి. ఆ వ్యాసాలు ఇక్కడ(మొదటి భాగం) మరియు ఇక్కడ(రెండో భాగం) చదవొచ్చు. ఈ వ్యాసంలో ఎమ్బీయస్ ప్రసాద్ గారు ప్రస్తావించిన మరి కొన్ని అంశాల గురించి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
ఆర్ట్ సినిమాలంటే సింబాలిజం పేరుతో, ఆంబియన్స్ క్రియేట్ చేయడం లాంటి అంశాలతో చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష బెట్టే [...]

Page 1 of 41234