Menu

NT Recommends Archive

Stalker

మనిషి నిత్యాన్వేషి. నిరంతరాన్వేషణలో మనిషి సత్యాన్నీ అన్వేషించాడు.ఈ భూమ్మీద మనిషి ఆవిర్భావం జరిగినప్పటినుంచీ ఈ అన్వేషణ సాగుతూనే ఉంది. ఒకానొక కాలంలో అసలీ సత్యం అంటే ఏంటి? అని ఎలా అయినా తెలుసుకోవాలని ఒక వ్యక్తి బయల్దేరాడు. ఎక్కడెక్కడో తిరిగాడు; దారిలో కలిసిన మనుషులనూ, మహర్షులనూ అడిగాడు; రాజులూ, రారాజులనూ దారి చూపమని ప్రాథేయపడ్డాడు. కొండలూ గుట్టలూ ఎక్కాడు. ఏడు సముద్రాలు దాటాడు; మహారణ్యాల్లోనూ తిరిగాడు. పగలనకా రేయనకా అతని అన్వేషణ కొనసాగింది. మనుషులెవ్వరూ చేరుకోలేని ఒక

Kramer vs. Kramer

వాళ్లు కలిసి విడిపోయారు; విడిపోయి కలిసారు. ఎక్కడో పుట్టారు.ఎక్కడో పెరిగారు. జొయన్నా, టెడ్ అనబడే వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆత్మీయత పెరిగి ఒకే ప్రాణంగా మెలగుతూ ఒక వంశవృక్షానికి కొత్త కొమ్మలు, రెమ్మలు తొడిగారు. బిల్లీ అని నామకరణం చేశారు. జంట కట్టి, సంతానం వృద్ధి చేయడమొక్కటే లక్ష్యమయ్యుంటే మానవ నాగరికత, పరిణామక్రమానికి అర్థం లేదు. సంతాన వృద్ధికంటే కూడా ఇద్దరు ఒకటై కలిసి జీవించడంలోని ఆనందానికే వివాహ బంధంలో ప్రాముఖ్యత ఉంటుంది. టెడ్ ని

Ship of Theseus

తానే మారెనా? గుణమే మారెనా? నేను ఎవర్ని? ఇన్ని వేల సంవత్సరాల నాగరికత తర్వాత కూడా ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణంగా సమాధానం చెప్పలేని ప్రశ్న! అయినా మనిషి తన అస్తిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం మాత్రం మానడు. ఇదీ నేను! అని స్థిరంగా నిర్ణయించుకుని మనిషి జీవితం గడిపేస్తుంటాడు. కానీ ఒకానొక సమయంలో ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ మనల్ని ప్రశ్నించినప్పుడు, ఇదా నేను! అని బయల్దేరి, ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో తనని తాను తెలుసుకుంటాడు.

Wild Strawberries

జ్ఞాపకాలు ప్రమాదకరమైన ఉచ్చులు; వాటిలో చిక్కుకుంటే అంతే ! సమయానికి అర్థం లేని చోట, బీటలు వారిన శిధిలాల నడుమ, అతను నడుస్తున్నాడు. వీధి నిండా ఏకాంతం. గడియారంలో ముళ్లు లేవు. తోడు కోసం అతని అన్వేషణ జ్వరాల గుర్రాల బండికి సందు చేసింది దారి. బండిలోనుంచి జారిపడిందో శవపేటిక శవం అతని చెయ్యిపట్టుకు లాగుతోంది…. ఉలిక్కిపడి నిద్రలేచాడు ప్రొఫెసర్ బోర్గ్. ఇంకొద్ది గంటల్లో అతను స్టాక్‍హోమ్ నుంచి విమానంలో బయలుదేరి లుంద్ పట్టణానికి చేరుకోవాలి. కానీ

Poetry

జీవితపు రహస్యాల మేలిముసుగు తొలగింపే కవిత్వం! ఒక జ్ఞాపకం. అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. నా వయసెంతో గుర్తుపెట్టుకోగలిగేంత వయసు కూడా కాదు. బహుశా అప్పుడు నాకు మూడేళ్ల వయసు ఉండవచ్చు. ఆ రోజు అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. పదేళ్ల వయసున్న మా పెద్దక్క ఆ రోజుకి నాకు తల్లయ్యింది. ఉదయాన్నే స్నానం చేపించి నాకు రంగు రంగులున్న బట్టలు తొడిగింది. మేమిద్దరం హాల్లో ఉన్నాం. కిటికీ కి వేలాడుతున్న ఎరుపు రంగు పరదాలగుండా ప్రవహిస్తోన్న సూర్యకాంతి