Menu

NT Recommends Archive

Grave of the Fireflies

మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం చూతము రారండి సెప్టెంబర్ 21, 1945. నేను ఆఖరి శ్వాస విడిచింది ఆ రోజు రాత్రే! రైల్వే స్టేషన్లో జనాల హడావుడి. ప్లాట్‍ఫాం పై ఒక మూల కూర్చుని ఉన్నాను. ఒంట్లో నీరసం. అక్కడ్నుంచి అడుగు వెయ్యలేని దుస్థితి. ఎంత సేపు అక్కడ కూర్చున్నానో, ఎప్పుడు నా ప్రాణం పోయిందో కూడా తెలియదు; దిక్కులేని చావు చచ్చిన నా శవాన్ని అసహ్యంగా చూస్తూ జనాలు ముందుకు కదుల్తున్నారు. ప్లాట్‍ఫాం శుభ్రపరిచే ఒకతను నా

Sansho Dayu

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. కొన్ని వందల ఏళ్ల క్రితం….మనిషి జాతి ఇంకా పూర్తిగా మానవులుగా జాగృతం కానీ సమయం. జపాన్ దేశంలో ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యమేలుతోంది ఒక వైపు పదమూడు ఏళ్ళుగా ప్రజల్ని దహించి వేస్తున్న కరువు కాటకాలు; మరో వైపు యుద్ధాలతో రగిలిపోతున్న రాజ్యాలు. ప్రజలు కడుపు మంటలు ఏ మాత్రం పట్టని సైన్యాధికారులు చిన్నా పెద్దా అని తేడా లేకుండా సైన్యంలో

The Lives of Others

సౌందర్యోపాసనే లోకకళ్యాణానికి మార్గం 1984, తూర్పు జర్మనీ దేశం. సోవియట్ రష్యా అధ్వర్యంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం రాజ్యమేలుతోంది. ప్రభుత్వ అధికారుల హింస తట్టుకోలేక ప్రజలు రహస్యంగా పశ్చిమ జర్మనీకి తరలివెళ్ళిపోతున్న సమయం. ఏ సమయంలోనైనా ప్రజలు తమ మీద తిరగబడి ఉద్యమ బాటలో నడుస్తారనే అనుమానంతో, ప్రభుత్వం అటువంటి విపత్తు ఏదీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంది; షుమారు లక్ష మందితో కూడిన రహస్య పోలీస్ వ్యవస్థతో పాటు, రెండు లక్షల మంది ఇన్ఫార్మర్స్ ని కూడా సమీకరించింది.

Fitzcarraldo

—అతడు అడవిని జయించాడు— మనిషి ఎల్లప్పటికీ అపరిపూర్ణుడు! ఎప్పటికప్పుడు తనని తాను ఆవిష్కరించుకుంటూ పరిపూర్ణత వైపు పయనం సాగిస్తుంటాడు. కానీ ఈ ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాదు; మనిషి ఎప్పటికీ గమ్యాన్ని చేరలేడు. కానీ, ఈ విధంగా ఒక స్థితి నుంచి మరో స్థితికి పోవాలనే ప్రయత్నంలోనే మనిషి స్వేచ్ఛా జీవి అయ్యాడు. తరువాతి స్థితి అనేది మరొకటి లేకపోతే మనిషికి స్వేచ్ఛే లేదు. కానీ ఆ తరువాతి స్థితి కి చేరుకోడానికి ఒక్క స్వేచ్ఛ మాత్రం

పల్ప్ ఫిక్షన్-పరిచయం

ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం మీ తలకింకా బాగా ఎక్కలేదన్న మాట సత్యం. తెలుగు సినిమా చరిత్రలో ఒక శివ లాగా, ఇటాలియన్ సినీ చరిత్రకు ఒక Bicycle Thief