Menu

NT Recommends Archive

Children of Heaven

అందమైన జీవితమంటే అన్నీ ఉండడం కాదు. ఏది అవసరం లేదో తెలుసుకోవడం. సాయంత్రమైంది. ఆలీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ పని చెప్పింది. మొదట చిరిగిపోయిన చెల్లిలి స్కూల్ షూస్ కుట్టించుకు రావాలి. ఆ తర్వాత బేకరీ కి వెళ్లి రొట్టెలు కొనాలి. చివరిగా కూరగాయల షాప్ లో కేజీ ఆలుగడ్డలు కొనాలి. మొదటి రెండు పనులూ అయిపోయాయి. కూరగాయల షాప్లోకి వెళ్తూ చెల్లెలి షూస్ ని, రొట్టెలున్న సంచీ ని బయటే వదిలి లోపలకి

ఏక్ డాక్టర్ కీ మౌత్

కొన్ని సన్నివేశాలు పదే పదే పునరావృతం కాకూడదన్న ఆశయమే ఈ సినిమా కలకత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక చిన్నపాటి వైద్యుడిగా పని చేస్తున్న దీపాంకర్ రాయ్ చాలా స్వార్థపరుడు. తనమీద తనకి అపారమైన నమ్మకం. తన మీద అనడం కంటే తన పని మీద అనడం సబబు. రెండు గదుల ఇరుకు ఇల్లు. పగలంతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం. రాత్రంతా తన ఇంట్లోని ఒక గదిలో ఏర్పరుచుకున్న ప్రయోగశాలలో అలుపెరగని పరిశోధనలు. పది సంవత్సరాలుగా ఇదే

Ikiru

జీవితం ఒక తెల్లకాగితం లాంటిది; చాలా కొద్దిమంది మాత్రమే దానిమీద తమ సంతకాలను వదిలివెళ్లగలరు. ఈయన పేరు వతానబే. ఇతనే మన కథకి నాయకుడు. ఈయనంత బోరింగ్ మనిషి ఇంకెవరూ ఉండబోరు. శాశ్వతమైన ఈ జీవన ప్రవాహంలో, తమ సంబంధమేమీ పెద్దగా లేకుండానే కొట్టుకుపోతున్న కోట్లాదిమందిలో ఈయనా ఒకడు. ఈయన ఒక ప్రభుత్వ అధికారిగా ముప్ఫై ఏళ్లకు పైగా గానుగెద్దులా, ఏ ఒక్క రోజూ శెలవు తీసుకోకుండా పని చేస్తూ వచ్చాడు. ప్రస్తుతానికి బతికుండడానికి, బతకడానికి మధ్య

A Separation

ఇది సామాన్య శాస్త్రం. ఇక్కడి సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.   పై ఫొటో లో ఉన్న వీరి పేర్లు సిమిన్, నాదెర్.ఇద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందిన వారే! ఉద్యోగస్థులు; చాలామందితో పోలిస్తే బాగా ఉన్నవాళ్లు. పన్నెండేళ్ల కి పైగానే దాంపత్య జీవితం; పదకొండేళ్ల కూతురు. వీళ్లు నిన్నమొన్నటి వరకూ అన్యోన్య దాంపత్యంలో భాగస్వాములు; నేడు విడాకులు కావాలని కోర్టుకెక్కిన అర్జీదారులు. తమ దేశంలో కంటే విదేశాల్లోనే తమకీ, తమ కూతురుకీ సరైన భవిష్యత్తు ఉంటుందని భావించి,

Blow-Up

అంతా శూన్యమే, మనిషీ శూన్యమే ! ఉదయాన్నే వికసించి కళ్ళకు అందంగా కనిపించిన పువ్వు, సాయంకాలానికి వాడి నేల రాలుతుంది. బహుశా అశాశ్వతమైన ఆ పువ్వు అందాన్ని శాశ్వతం చెయ్యాలనుకోవడంలో కళ పుట్టి ఉండొచ్చు. ఆ పువ్వు యొక్క చిత్రాన్ని తనకి దొరికిన పనిముట్లతో కొండ గుహల్లో చిత్రీకరించి ఉంటాడు ఆదిమ మానవుడు. మానవుడి ఎదుగుదలతో పాటే ఎదుగుతూ వచ్చింది కళ. కళ్ళ ముందు కనిపించిన పువ్వు ని ఉన్నదున్నట్టుగా, ఇది నిజంగా పువ్వేమో అని అనుమానపడేంతగా