Menu

NT Recommends Archive

One Flew Over the Cuckoo’s Nest

సినిమా అంటే కేవలం కథ ఒక్కటే కాదు; అందులో చాలా విషయాలు కలిసిపోయుంటాయి. మంచి కథ సైతం చెత్త సినిమా గా తయారవ్వొచ్చు; సాధారణ కథని సైతం అద్భుతమైన సినిమాగా రూపొందిచవచ్చు. అందుకు తోడ్పడే అంశాల్లో స్క్రీన్ ప్లే రచన, కెమెరా పనితనం, ఏడిటింగ్, నటన…ఇలా చాలా ఉన్నాయి. ఇప్పటివరకూ కథాంశం ప్రధానంగానే ఈ వ్యాసాలు కొనసాగినా, ఇక నుంచి సాంకేతిక అంశాలు, తాత్విక విషయాలను కూడా చర్చించాలని ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ప్రయత్నం.

Getting Home

నేలరాలిన ఆకు తిరిగి తన మూలాలకు చేరుకుంటుంది. మనిషి కూడా అంతే! కీచుమని శబ్దం చేస్తూ బస్సు ఆగింది. నిద్రావస్థలో మునిగివున్న ప్రయాణికులు మెల్లగా కళ్లు తెరిచి చూచారు. “బస్సు ఐదు నిమషాలు ఆగుతుంది. మళ్లీ లాస్ట్ స్టాప్ వరకూ ఎక్కడా ఆగదు,” అని చెప్పి కండక్టర్ హడావుడిగా బస్ దిగి వెళ్లిపోయాడు. బస్ దిగిన మగవాళ్లంతా ఒక వైపు వెళ్లారు. ఆడాళ్లంతా మరోవైపు చెట్లలోకి వెళ్లారు. బస్ లోనుంచి ఒక వ్యక్తి మాత్రం దిగలేదు. కూలింగ్

Bicycle Thieves

జీవితమొక పద్మవ్యూహం . ఇక్కడ మనం వేసే ప్రతి అడుగూ ఎడతెగని, అలుపెరుగని పోరాటం. అదిగో అక్కడ చూడండి! రోడ్డు మీద వందల సంఖ్యలో, నిరాశ నిస్పృహలు నిండిన కళ్లతో నీరసంగా నిలబడి ఉన్నారే వాళ్లను చూడండి. వాళ్లల్లో ఒకడిని ఎంచుకోండి. ఎవరైనా ఫరవాలేదు. దారిన పోయే అనేక మంది దానయ్యలలో ఎవరో ఒకరు చాలు. అతనే ఈ నాటి మన కథకు హీరో. ముందే చెప్పాను కదా, అతను మనందరి లాంటి వాడే! మన కథకు

Welcome

వృత్తానికి ఒక్క కేంద్రమే అయినట్లు అతని బ్రతుక్కి ఆమె ఒక్కటే లక్ష్యం. ఒన్…టూ…థ్రీ! మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి కుడి వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఒన్…టూ…థ్రీ! మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి ఎడమ వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఇలా చేస్తున్నంత సేపు, నీళ్లలో కాళ్ళాడిస్తూ, చేతులను కిందకి పైకి ఆడిస్తూ నీటిలో ముందుకు పోవాలి.

Midnight in Paris

నోస్టాల్జియా అంటే బాధాకరమైన వర్తమానాన్ని నిరాకరించడమేనా? వర్షం లో ప్యారిస్ నగరం కొత్త అందాలతో మెరిసిపోతోంది. చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి ప్యారిస్ నగరానికి వచ్చాడు గిల్. అమెరికాలో అతనో సినిమా కథలు రాసే రచయిత. కానీ ఇప్పుడు అతనికి సినిమా కథల మీద ఆసక్తి పోయింది. ఒక నవల రాయాలన్నది అతని ఆలోచన. కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇక కూర్చోని రాయడమే మిగిలుంది. అతని కథలో హీరో ఒక నోస్టాల్జియా షాప్ లో