Menu

NT Recommends Archive

The Man from the Earth

ఏది సత్యం…ఏదసత్యం…ఓ మహాత్మా…ఓ మహర్షీ!!! జాన్ ఓల్డ్‌మ్యాన్ ఒక విశ్వవిద్యాలయంలో పదేళ్ల పాటు ప్రొఫెసర్ గా పని చేసి ఒక రోజు అకస్మాత్తుగా రాజీనామా చేసేశాడు. అతనితో పాటు పని చేస్తున్న మిగిలిన ప్రొఫెసర్లందరికీ అది చాలా విచిత్రంగా అనిపించింది. ఇంకో కొన్ని రోజుల్లో హిస్టరీ డిపార్ట్‌మెంట్ కి డీన్ గా పదోన్నతి పొందుతాడన్న విషయం దాదాపుగా ఖాయం అనుకుంటున్న సమయంలో జాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వారెవరికీ అర్థం కాలేదు. జాన్ ఇల్లు ఖాళీ చేసి

సత్యమే శివం

పరిచయం కదిలే బొమ్మల కళా రూపం. కలలని సైతం కళ్ళ ముందుంచగలిగే అద్భుతం. బొమ్మలకు ప్రాణం పోయగల ఔషధం. ఊహకందని ప్రపంచంలోకి ఇట్టే మనల్ని లాక్కెళ్లిపోగల సాధనం సినిమా. సినిమా అమృతం కాదు. క్యాన్సర్ ని నయం చేయలేదు. కానీ జీవితాన్ని కాపాడే శక్తి కలదు. సినిమా తో బంగారం తయారు కాదు. కానీ మేధస్సుని మేలిమి బంగారంలా మెరిపించగలదు. సినిమా ద్వారా అంతిమ జ్ఞానం పొందలేము. కానీ జ్ఞాననేత్రాన్ని తెరిపించగలదు. నేను రోజు వారీ కూలీనో,

Citizen Kane

మోక్షము గలదా? భువిలో జీవన్ముక్తులుగాని వారలకు “సిటిజెన్ కేన్”. ఈ సినిమా పేరు తెలియని ప్రపంచ సినిమా అభిమానులు ఉండరు. ఈ సినిమా తెలియనివారెవరైనా ఉన్నారంటే వారికి ప్రపంచ సినిమా గురించి ఇంకా అంత పరిచయం లేకుండా ఉండి ఉండాలి. వందేళ్లకు పైబడ్డ చలనచిత్ర చరిత్రలో నెంబర్ వన్ సినిమా ఏదంటే ఠక్కున నోటికొచ్చేది ఈ సినిమా పేరే! నేటికీ ఏ ప్రపంచ చలనచిత్రకారుడ్ని అడిగినా దాదాపు అందరూ ఏకకంఠంతో నెంబర్ వన్ సినిమా గా అంగీకరించే

My dinner with Andre

సినిమాలలో “మై డిన్నర్ విత్ ఆంద్రే” సినిమా వేరయా!!! సాయంత్రం ఏడయింది. షాన్ తన ఇంటి నుంచి బయల్దేరాడు. అతని మనసు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనల ప్రభావం అతని మొహం మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆందోళన నిండిన మొహంతో షాన్ రైల్వే స్టేషన్ వైపు నడిచాడు. నడుస్తున్నంత సేపూ అతనికి ఎంతో పరిచయమైన ఆ నగరం ఎప్పటిలానే పలకరించింది. కానీ షాన్ ఇవేవే పట్టించుకునే స్థితిలో లేడు. నాటక రచయితగా కొద్దో గొప్పో పేరున్నా ఇప్పుడు

Tokyo Story

ఇది నా కథ. మీ కథ. మనందరి కథ! జపనీస్ సినిమా అనగానే సాధారణంగా అకిరా కురసావా పేరే గుర్తొస్తుంది. అకిరా కురసావా తో పాటు యసుజిరో ఓజు మరియు కెంజి మిజొగుచి లు కూడా జపనీస్ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. వీరు ముగ్గురిని జపనీస్ సినిమా స్వర్ణయుగపు నాటి త్రిమూర్తులుగా వర్ణించవచ్చు. వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడం కష్టమే; అసలు అలాంటి