Menu

Others Archive

ప్రకటన-వెంటనే కావలెను

వెంటనే కావలెను-ప్రేక్షకులు: తెలుగు సినిమా వేగంగా అభివృధ్ది చెంది దేశంలోనే రెండో స్ధానంలో ఉండి మరింత విస్తరించటానికి రెడీ గా ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఈ క్రింద తెలిపిన అర్హతలు కల వారు కావెలెను. భారీ బడ్జెటులతో నిర్మించే మా నీచమైన చిత్రాలకు భారీగా ప్రేక్షకులు కావలెను. అర్హతలు రెండు కళ్లతో సరిగ్గా చూడగలిగినారు (మెదుడు లేకపోవటం మరీ బెస్ట్) ఎటు వంటి చెత్త చిత్త తీసినా ఆహా..అధ్బుతం అనుకుంటూ చూసే ఓపిక ,తీరిక అత్యవసరం.

సినీనటి భూమిక ‘మాయానగర్’

సినీనటి భూమిక నేతృత్వంలో ఒక సినిమా పత్రిక వస్తుందని కొన్ని పత్రికలు,వెబ్ సైట్లూ కొన్నాళ్ళనుంచి హోరెత్తిస్తున్నాయి.ఫలానా వారు వచ్చి ఆవిష్కరించారని మరలా హోరు మొదలయ్యాక,పెద్ద అంచనాలు లేకపొయినా ప్రారంభసంచికను దాచుకోవచ్చు కదా అని ఎప్పుడూ పత్రికలు కొనే షాపులో అడగ్గా మొదటి సంచిక అయిపోయిందండి,సెకండ్ ఇష్యూ ఉంది పట్టుకెళ్తారా అన్నారు వారు.సరే అని తీసుకొచ్చి తాపీగా చదివాను.పత్రిక పేరు‘మాయానగర్’గ్లాజీ పత్రిక,గ్లేజుడ్ పేపరు మీద కళ్ళు జిగేల్ మనిపించేలా ఉన్న ముద్రణ,ఇవ్వాళ మార్కెట్ లో ఉన్న చాలా సినిమాపత్రికల

చందమామలో భానుమతి ఉండాలొయ్

దివంగత పి.భానుమతి నవంబరు 1947 చందమామలో పాపాయిల కోసం రాసిన ఓ బుజ్జిగీతం ఉండాలోయ్ ఉండాలి పి.భానుమతి ఫిలింకు పాట పిల్లలకు ఆట రాజుకు కోట ఉండాలోయ్ ఉండాలి అత్తకు నోరు దేవుడికి తేరు స్టారుకు కారు ఉండాలోయ్ ఉండాలి స్టేజీకి తెర కత్తికి ఒర చేపకు ఎర ఉండాలోయ్ ఉండాలి యింటికి అమ్మ నిమ్మకి చెమ్మ కొలువుకి బొమ్మ ఉండాలోయ్ ఉండాలి తలుపుకి గడి దేవుడికి గుడి అవ్వకు మడి ఉండాలోయ్ ఉండాలి జూదరికి పేక

తెలుగు చలన చిత్ర స్వర్ణయుగం నాటి కొన్ని పోస్టర్స్-చివరి భాగం

తెలుగు చలనచిత్ర చరిత్ర లో చిరకాలమూ గుర్తుండిపోయే ఆణిముత్యాల్లాంటి సినిమాల వాల్ పోస్టర్స్ ఇక్కడ పొందుపరిస్తున్నాం. తొలి తెలుగు టాకీ సినిమా ’భక్త ప్రహ్లాద’, బి.యన్.రెడ్డి రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం ’బంగారు పాప’ లతో పాటు మరికొన్ని పోస్టర్స్ ఇక్కడ చూడవచ్చు.ఈ పోస్టులో బి.యన్.రెడ్డి గారి మల్లీశ్వరి, నాగయ్య గారి ’త్యాగయ్య’ తోపాటు మరి కొన్ని పోస్టర్స్ చూడవచ్చు.

మా అబ్బాయి సినిమాకెళ్ళాడు!!

నూనూగు మీసాలవాడు నూరు పైసలైనా సంపాదించనివాడు గుడ్డ తోరణాలకీ, గులాబీ దండలకీ వందలకొద్దీ వెచ్చించి- మా అబ్బాయి సినిమాకెళ్ళాడు! నాయకుడు-నవరసాలకూ న్యాయం చేశాడా! చిన్నవత్తి వెలిగించినంత చెణుకుతో- హాస్యం చిచ్చుబుడ్డిలా ఎగసి- నవ్వుల వెలుగుపూలు చిందాయా? పెదవి వణుకున దు:ఖం, కంటి కొసలన క్రౌర్యం, తడిదేరిన మోవిపై మోహం ప్రతీకాత్మకంగా మెరిసాయా? మాట విరుపుతో మాత్సర్యం, చెయ్యి తిరిగిన గయ్యాళితనం జనహితమైన ధీరత్వం మచ్చుకైనా లేని కౄరత్వం, వెరసి మానవ సంబంధాల ఔన్నత్యం- ఇవ్వేమీ కావు వాడికి