ఆడియో/వీడియో

ఆడియో మరియు వీడియో

1962 ఓ ‘ఆరాధన’

1962 ఓ ‘ఆరాధన’

1962 లో “జగపతి పిక్చర్స్” బ్యానరు పై, వీ.మధుసూధన రావుగారి దర్శకత్వంలో, రంగరావు-వీ.బీ.రాజేంద్రప్రసాద్ గార్ల నిర్మాణంలో తీసిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు సినీ ప్రపంచానికి కొత్త ఒరవడిని సృష్టించింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రీ ముఖ్య పాత్రలతో ప్రజలని అలరింపజేసిన చిత్రం “ఆరాధన”. బెంగాళీ చిత్రమైన “సాగరిక” ఈ చిత్రానికి మాతృక. ప్రేమ, త్యాగం, సంగీతం వెరసి “ఆరాధన”. సహాయ పాత్రలలో రేలంగి, గిరిజ, జగ్గయ్య, గుమ్మడి, రమణా రెడ్డి, రాజశ్రీ లు చాలా బాగా నటించారు(…)

Connecting Literary Rain to Filmy Desert

Connecting Literary Rain to Filmy Desert

Literature has a total and strange effect on people. It has grandeur, makes our imagination sours high. Many stories move us beyond a point, making our eyes wet and heart with a melancholic/joyous feeling. Such impactful writer is Mr. Devarakonda Bla Gangadhara Thilak’s most poignant story ever “ oori chivara illu” (The last House of(…)

ఆడియో రివ్యూ – హ్యాపీ హ్యాపీ గా

ఆడియో రివ్యూ – హ్యాపీ హ్యాపీ గా

వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న ప్రేమకథా చిత్రం “హేపీ హేపీగా” ఆడియో ఈ మధ్యే విడుదలైంది. “ప్రియ శరణ్” డైరక్టర్గా డెబ్యూ చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం “మణిశర్మ”. మంచి మెలొడీ నిండిన పాటలు ఇచ్చారాయన. మొత్తం పాటలన్నీ “సిరివెన్నెల సీతారామశాస్త్రి” రాయడం ఆయన అభిమానులకి ఆనందం కలిగించే విషయం. కథతో పాటూ తనూ నడిచి చక్కని సాహిత్యం ఆయన అందించారు. సంగీత సాహిత్య మేలుకలయికగా ఉన్న ఈ సినిమా పాటల గురించి క్లుప్తంగా…. 1. ఎదురయే(…)

“మా బాపు బొమ్మకి పెళ్ళంట”లో ఈ పాట మీరు విన్నారా?

“మా బాపు బొమ్మకి పెళ్ళంట”లో ఈ పాట మీరు విన్నారా?

గానం: ఉష రచన: సురేంద్ర క్రిష్ణ సంగీతం: కోటి పల్లవి: మాటలే రాని వేళ పాట ఎలా పాడనూ… కంటిలో కడిలిని ఇక ఎంత సేపు ఆపనూ ఓటమే వెంట ఉంటె అడుగు ఎలా కదపను కాలమే కాటు వేస్తె ప్రాణమెలా నిలుచును మట్టిలో కలిసే దేహమే ఇది లేని పోని ఆశలు రేపెనా విధీ పూజతో శోకం దక్కిందా గుండెలో గాయం మిగిలిందా చరణం 1: చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే నీడలాగ వెంట(…)

ఓ అద్భుత breathless గానా – 2

(అద్భుతం సినిమాలోని “నిత్యం ఏకాంత క్షణమే” పాట గురించి రాస్తున్న వ్యాసానికి ఇది రెండో భాగం. మొదటి భాగం ఇది . రెండో భాగం అన్నాడంటే ఇంకా చాలా భాగాలు ఉన్నాయేమో అని కంగారు పడకండి. శుభవార్త ఏమిటంటే ఇదే ఆఖరి భాగం !) నేను: welcome, welcome back! మీరు: రెండు వెల్కంలు ఎందుకు? నేను: మీరు కొత్త అతిథైతే welcome, నా మొదటి భాగాన్ని చదివిన వారైతే welcome back! మీరు: అయినా పైత్యం(…)

ఓ అద్భుత breathless గానా – 1

ఓ అద్భుత breathless గానా – 1

తెలుగూ, ఇంగ్లీషూ, హిందీలలో ఈ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మీ దృష్టిని ఆకర్షించడానికి చేసిన marketing trick అది! మీకు బడలిక తెలియకుండా ఉండడానికి ముందుగా భేతాళుడిలా ఒక చిన్న కథ: దాదాపు 20 ఏళ్ళ క్రితం సంగతి. ప్రముఖ తమిళ కవీ, సినీ గేయ రచయితా, వైరముత్తు గారు ఒక శుభ కార్యం  ముగించుకుని స్నేహితులతో కారులో ప్రయాణిస్తున్నారు. సభలో ఇవ్వబడిన జ్ఞాపికను(gift) విప్పి చూస్తున్నాడు ఒక స్నేహితుడు. అది ఒక వెండి దీపస్తంభం. మంచి(…)

విలేజ్ లో వినాయకుడు-Audio Review

విలేజ్ లో వినాయకుడు-Audio Review

గతంలో “ఆవకాయ్-బిర్యాని” తినిపించిన సంగీత దర్శకుడు మణికాంత్ కద్రి ఈ సారి తన సంగీత రసామృతాన్ని అందించారు “విలేజ్ లో వినాయకుడు” చిత్రంలో. ఈ చిత్రంలో పాటలన్నీ వనమాలి రాశారు. దర్శక (సాయి కిరణ్ అడివి) నిర్మాతల ఉన్నతమైన అభిరుచి ఈ ఆడియోలో కనిపిస్తుంది. 1. చినుకై వరదై ఈ పాట వింటే చాలా కాలం తర్వాత ఒక చక్కని యుగళ గీతం, ప్రేమ గీతం విన్న భావన కలుగుతుంది. మంచి మెలొడీ ఇస్తూనే foot tapping(…)

యస్.డి.బర్మన్ కూడానా?

యస్.డి.బర్మన్ కూడానా?

సచిన్ దేవ్ బర్మన్! భారతదేశపు చలనచిత్రసంగీత దర్శకులలో ఆకాశమంతటి స్థాయి,ప్రతిభావ్యుత్పత్తులు గలమహానుభావుడు.హిందీసినిమాలకు ఎందరో అత్యుత్తమ సంగీతం అందించారు. నౌషాద్,ఒ.పి.నయ్యర్,సి.రామచంద్ర,రవి,హేమంత్ కుమార్,మదన్ మోహన్,ఖయ్యాం,సలీల్ చౌదరి,శంకర్-జైకిషన్,కళ్యాణ్ జీ-ఆనంద్ జీ,తదనంతరం లక్ష్మీకాంత్-ప్యారేలాల్,రవీంద్రజైన్,ఆర్.డి.బర్మన్ ఇలా అనంతమైన జాబితా ఉన్నప్పటికీ అందరిలోకి అగ్రగామి యస్.డి.బర్మన్. యస్.డి.బర్మన్ సినిమాకెరీర్ నో లేక ఆయన చలనచిత్రాలకు అందించిన సంగీతాన్ని గురించిన విశ్లేషణలను ఆయన నూటనాలగవ జయంతి అక్టోబరు ఒకటో తేదీన మరలా చర్చింకుందాము.ఇంతకీ ఈవ్యాసరచనకు గల ముఖ్య ఉద్దేశ్యాన్ని గురించి ముచ్చటించుకునేముందు ఈ గీతాన్ని చదివి చూసి(…)

మనకు తెలియని మన ఘంటసాల

మనకు తెలియని మన ఘంటసాల

ఈ రోజు డిసెంబర్ 4వ తారీఖు. ‘అయితే ఏమిటి?’ అంటారా? ఈ రోజు మన గాన కళానిధి, అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జన్మదినం. 1922 జనవరి నాలుగున కృష్ణా జిల్లా చౌటుపల్లి గ్రామంలో జన్మించారాయన. అంతకుమించి, మిగిలిన వివరాలలోకి వెళ్ళకుండా, ‘మనకు తెలియని మన ఘంటసాల’ అని ఎందుకన్నానో చెప్తాను. ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు. తమిళం,(…)

గాన గంధర్వుడి గానవర్షం

మూడున్నరదాటి పదినిముషాలైనా బస్సు ఇంకా కదలలేదు. వేడిగానేకాదు ఉక్కగా కూడా ఉంది లోపల. ఫిబ్రవరి వచ్చింది కదా మా ఊరికి వేసవి వచ్చేసింది అనుకున్నాను. ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని ఎఫ్ఫెమ్ రేడియో వినడం మొదలుపెట్టా. “…బాలసుబ్రహ్మణ్యం” అన్నది మాత్రం అర్ధమైంది, ఆ రేడియోజాకీ మాటల్లో. బాలుగారి గాత్రం వినబడడం మొదలైంది. సన్నగా ఏదో రాగాలాపన మొదలైంది. మనస్సులో కాస్త ఉత్సాహం కూడా. పాట మొదలయ్యేప్పటికి బస్సుకూడా కదిలింది. “ఉమండు ఘుమండు ఘన్ గర్‌జే…” అంటూ హిందీలో సాగుతోంది(…)