లంకెలు back to homepage

తెలుగు సినిమా-Myth and the Reality

ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల గురించి అందులో తనకి నచ్చిన నచ్చని అంశాల గురించి శ్రవణ్ తన బ్లాగు శ్రావణం లో ఇలా అంటున్నారు. “సిరా” లాంటి సినిమా కిచ్చే విలువ ఎలాగూ ఇస్తాం, కాని అన్ని సినిమాల్నీ ఇట్టా తీస్తే సినిమా(మనకి సంబంధించి నంత వరకూ) కి వున్న basic purpose అయినటువంటి ఎంటర్తైన్మెంట్ మిస్ అయిపొతాముకదా! అయినా మంచి సినిమాలు రావట్లేదని ఎవెరన్నారూ…”బొమ్మరిల్లు” నచ్చని తెలుగువాళ్ళు ఉంటారా(60 దాటని వాళ్ళు). అయినా ఓ కత్తిలాంటి [...]

అంతర్జాలంలో బి యెన్ రెడ్డి

ఈ నెల ఫోకస్ విభాగంలో బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి గురించిన సమాచారం అందించాలన్న ప్రయత్నం మొదలుపెట్టాము. ఈ నెలలో సాధ్యమైనంత సమాచారం సమకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాము. ఒక వేళ వీలు కాకపోతే రాబోయే రోజుల్లో కూడా బి యెన్ రెడ్డి సినిమాల గురించి, ఆయన గురించి వ్యాసాలు ప్రచురించే ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే ’కథను గాలికొదిలేసిన తెలుగు సినిమా’ అనే వ్యాసంలో రాజేంద్ర గారు బి యెన్ రెడ్డి గారి ఆలోచనలను పంచుకున్నారు. బియెన్ గురించి అంతర్జాలంలోనూ [...]

Download నవతరంగం

నవతరంగం వెబ్‌సైట్ మొదలుపెట్టి ఇప్పటికి నెల కావొస్తుంది. ఈ నెలలో దాదాపు 50 వ్యాసాలు ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసాలపై పాఠకుల స్పందన కూడా బాగానే వుంది. భవిష్యత్తులో మరింత మంది రచయితలు నవతరంగం రాసే అవకాశాలున్నాయి. దాంతోనే మరింతమంది పాఠకులను ఈ సైటు ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. తెలుగు సినిమాకి సంబంధించిన వెబ్ సైట్లు చాలానే ఉన్నప్పటికీ, ఆ వెబ్ సైట్లలో తెలుగులో వున్నవి తక్కువే. నవతరంగం ద్వారా ఆ కొరత తీర్చాలన్నది మా ప్రయత్నం. [...]

సినిమాలో విధ్వంసమవుతున్న సీమ సంస్కృతి పై ‘పొద్దు’లో వ్యాసం

అంతర్జాల తెలుగు పత్రిక పొద్దులో రాయలసీమ వాసి అయిన విశ్వప్రసాద్ గారు, నేటి తెలుగు సినిమా కర్తలు రాయలసీమ సంస్కృతి పేరిట తెరకెక్కిస్తున్న హింసాఖాండనీ, జుగుప్సాకరమైన సంభాషణలనీ విమర్శిస్తూ వ్యాసాన్ని వ్రాసారు. గ్రామ పార్టీల సమస్యపై కనీసం ‘సహానుభూతి’ కూడా లేని వాళ్లందరూ సీమ గ్రామపార్టీల కథలను రాసుకుని ఈ ప్రాంత సంస్కృతిని వక్రీకరించి సినిమాలు తీసి ఆంధ్రదేశమంతటా వెదజల్లడం సీమవాసులు చేసుకున్న దురదృష్టం… చిత్రసీమ ప్రముఖులు సీమకు చేస్తున్న తీరని ద్రోహం… నేరం…! పూర్తివ్యాసం ఇక్కడ.

జోధా అక్బర్

భారి వ్యయాలతో జోధా అక్బర్ సినిమా వస్తున్న తరుణంలో, “దీప్తి ధార” బ్లాగరు చీమకుర్తి భాస్కర రావు గారు అక్బర్ జీవితం గురించి కొన్ని చారిత్రిక ప్రశ్నలు మీ ముందుకు తెస్తున్నరు. అక్బర్ చరిత్రను పొందుపరిచిన అక్బర్నామా లో జొధాబాయి ప్రస్తావనే లేదని చరిత్రకారులు చెప్తున్నారు. అక్బర్,కచ్చవా వంశం, అంబర్ లోని, భార్ మల్ పుత్రిక హీరా కువారి ను వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అక్బర్ తన కొత్త మతం దిన్-ఎ-ఇలాహి ని ప్రకటించి, ఈమెకు మరియం [...]

నక్షత్రాలు నేల మీద…మరో TZP సమీక్ష

నా మదిలో బ్లాగు రచయిత ప్రవీణ్ తన అభిమాన నటుడు నటించి దర్శకత్వం వహించిన ’తారే జమీన్ పర్ ’ సినిమా గురించి ఇక్కడ రాస్తున్నారు. చదవండి. కొన్ని సినిమాలని టెక్నికాలిటీ దృష్టితో చూడలేము. టెక్నికల్గా ఇది వంద పర్సెంటు కరెక్టుగా లేదు అని మార్కులు వేయలేము. కొన్ని చోట్ల ఎసెన్సు గుర్తించడం ముఖ్యం. ఆ సినిమా తెచ్చిన అవేర్‌నెస్ ముఖ్యం. అనుభవించిన వారికి మాత్రం ఈ సినిమాలోని విషయాలు అర్థమవుతాయి ఈ సినిమా సమీక్షే కాదు, [...]

కొత్త సినిమా సమీక్షలు

ఈ మధ్యనే విడుదలయిన హిందీ సినిమా ’తారే జమీన్ పర్ సినిమా’ గురించి నాగరాజు గారు వివరణాత్మకంగా వ్రాసిన సమీక్ష “నేలకొరిగిన ఇంద్రధనుస్సు” ఆయన బ్లాగులో చదవండి. అమీర్ ఖాన్‌కి మంచి కథలు ఎన్నుకోవటం తెలుసు, సినిమాకి కావల్సిన సెట్టింగులూ, అందమైన సీన్లు తయారు చేసుకోవటం తెలుసు. కాని, సినిమా లాంటి ఒక అతి శక్తివంతమైన విశువల్ మీడియమ్‌ని ఎలా వాడుకోవాలో ఇంకా పట్టుబడినట్టుగా లేదు. అనవసరంగా చాలా సాగదీసాడు. ప్రేక్షకుల హృదయంలో చెరగని ముద్రపడేటట్టుగా చెప్పటానికి [...]

Okka Magadu Comical Review

ఒక్క మగాడు సినిమా సమీక్షని, సినిమా చూస్తున్న అనుభవాన్ని హాస్యభరితంగా శ్రీధర్ గారు తన బ్లాగులో వ్రాసారు. తెలుగు భారతీయుడు-’ఒక్క మగాడు’ (సారీ! ఇది హార్ట్ పేషెంట్లకు నిషిద్దం) ఆయన చెప్పినట్లు ఇది ఎవరినీ నొప్పించడానికి కాదు. అలానే అది సినిమా ఒక్క సాంకేతిక అంశాల సమీక్ష కాదు. చదవి ఆనందించండి.

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories