|
కొంత ఆశ కొంత నిరాశ మిగిల్చిన భాగాహారం : సశేషం
ఆలోచన కొత్తగా ఉన్న ఆచరణలలో కొత్తదనం లేకపోతే ఏ లెక్కలో అయినా తేడా వచ్చేస్తుంది. ముఖ్యంగా సినిమా భాగాహారంలో శేషాలు మిగలకూడదు. నిశ్శేషంగా మిగిలితేనే లెక్క సక్సెస్. ఆమధ్య వచ్చిన ‘వైశాలి’ లాంటి జాన్రా మిక్సింగ్ తరహా కథతో వచ్చిన సశేషం సినిమా వెనకనున్న ఆలోచన చాలా విన్నూత్నంగా ఉంటుంది. కానీ సస్పెన్స్ జాన్రా నుంచీ, సైకో జాన్రా మీదుగా హార్రర్ రివీల్ అయ్యేసరికీ ప్రేక్షకుడిని కొంత అసహనానికి గురిచేస్తుంది. మధ్యలో వచ్చే హాస్యం కొంత [...] |
|
బాగలేదు అని చెప్పలేని సినిమా: దేవస్థానం
ప్రస్తుత తెలుగు సినిమా ట్రెండ్ కి భిన్నంగా ఏ మాత్రం స్టార్ లు లేని సినిమా, అదీ కథను నమ్ముకున్న సినిమా రావటం అరుదుగా జరుగుతుంది. కానీ అలాంటి ప్రతి సినిమా శంకరాభరణం కాలేదు. ఇప్పుడు దేవస్థానం పరిస్థితి కూడా అంతే. కే. విశ్వనాధ్, యస్పీబీ, ఆమని వంటి దిగ్గజాలు వున్నారు, మానవ జీవితం గురించి ముఖ్యంగా మానవత్వం గురించి మంచి కథ వుంది – ఇన్ని వున్నా మంచి సినిమా చూశాం అన్న తృప్తిని పూర్తిగా ఇవ్వలేకపోయిన [...] |
|
ఒక “గుప్త దాత” కథ – విక్కీ డోనార్
దానం చేసే దాతల్లో కొంతమంది గొప్పగా చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోకుండా గుప్తంగా వుండటానికి ఇష్టపడచ్చు. కానీ చేసిన దానమే నలుగురికీ చెప్పుకోలేనిదైతే ఆ దాత “గుప్త దాత” గా వుండిపోవాల్సిందేనా? అతను చేసిన దానం గురించి తెలిసిన తరువాత అతని కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇలాంటి కథాంశంతో రూపొందించిన చిత్రమే విక్కీ డోనార్. ఇంతకీ అతను అంత గుప్తంగా చేసిన దానం ఏమిటనా మీ అనుమానం? అయితే వినండి. విక్కీ ఒక sperm donor. [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Pirates of Silicon Valley
ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని శాసించినవాళ్ళు ఇద్దరున్నారు. స్టీవ్ జాబ్స్ టెక్నాలజీ అంటే ఏమిటో తెలిసినవాళ్ళకి ఈ పేరు తెలియకుండా వుండే అవకాశమే లేదు. ఆయన పేరు తెలియకపోయినా కనీసం ఐపాడ్, ఐఫోన్ అనే పేర్లు విని వుండకపోతే ఆ వ్యక్తిని సాంకేతిక నిరక్షరాస్యుడని (technology illiterate) ప్రకటించేయచ్చు. బిల్ గేట్స్ కంప్యూటర్ల గురించి తెలియని సాంకేతిక నిరక్షరాస్యుడికి అయినా ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా బిల్ గేట్స్ సుపరిచితుడు. ఇక కంప్యూటర్ అంటేనే విండోస్ అనేంతగా చొచ్చుకుపోయిన [...] |
|
చూసినవాళ్లకి ‘డాష్ డాష్’
(రివ్యూ కన్నా ముందు నా సోది ఉందీ.. ఇబ్బంది కలిగితే ఈ సారికి క్షమీంపుము.) ఇదిగో టైటిల్ చూసి ఇదేదో సినిమా రివ్యూ అనుకునేరు.. కాదు కాదు.. ఆనందాన్ని పంచుకుంటే పెరుగుతుందంట, దుఃఖాన్ని పంచుకుంటే తరుగుతుందంటా.. చేసిన పాపం చెప్తే పూర్తిగా పోతుందంటా..ఏదో నా పాపాన్ని కడుక్కునే ప్రయత్నమన్న మాట. రోజూ లేచే టైం కన్నా లేటగా లేవటం తో హడావిడిగా రెడీ అయ్యి, కబోర్డ్ లో ఉన్న అరడజన్ డియో స్ప్రే లలో ఒక [...] |
|
మూసలోకూడా ఒదగని ‘రచ్చ’
ఐదు ఫైట్లు, ఆరు పాటలు, వీలైనంత మంది కామెడియన్సూ, సాధ్యమైనన్ని డబుల్ మీనింగ్ డైలాగులూ, ఫ్యూడల్ ఫ్లాష్ బ్యాక్, కథకు సంబంధం లేకుండా సినిమా అంతా స్లీప్ వాకింగ్ చేసే హీరో, కథతోపాటూ కథానాయకుడి గమ్యాన్నీ నిర్దేశించే ఆపద్ధర్మ హీరోయిన్ ఇవి ‘రచ్చ’ సృష్టించిన కొత్త కమర్షియల్ సినిమా ఫార్ములా. మాస్ సినిమాలు అనబడే ఫార్ములా చిత్రాలు చాలా అవసరం. ఎందుకంటే, అవి అసెంబ్లీలైన్ ప్రొడక్షన్స్ లాంటివి. సఫల ప్రయోగాల ఆధారంగా తయారయ్యే ప్రోడక్టుల్లాంటివి. అందుకే చిరంజీవి, [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Kung Fu Panda
సినిమాల ద్వారా చదువులు చెప్పచ్చని అనగానే అదేదో సీరియస్ సినిమాలతోనే సాధ్యం అని అనుకోకూడదు. సరదాగా సాగిపోయి, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాల్లో సయితం ఎన్నో పాఠాలు వుంటాయి. ఎటొచ్చీ అవి తెలుసుకోడానికే కొంత ప్రయత్నం చెయ్యాలి. అలా సరదాగా సాగే పిల్లల సినిమా “కుంగ్ ఫూ పాండా” చిత్రంలో వున్న మేనేజ్మెంట్ పాఠాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం వ్యాసం. కుంగ్ ఫూ పాండా కథ చాలా మందికి తెలిసే వుంటుంది. Underdog తరహాలో సాగే [...] |
|
ఒక ‘చిన్న బడ్జెట్ సినిమా’ కథ
సంవత్సరానికి తెలుగులో విడుదలయ్యే సినిమాలలో అధికశాతం చిన్న బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. విడుదలైన చిన్న బడ్జెట్ సినిమాలలో చాలా వరకు విజయవంతం కానివే. కారణం, బలహీన కథలను ఎంచుకోవడం ఒకటయితే బలహీన దర్శకుడిని ఎంచుకోవడం మరొకటి. ఇదికాక డబ్బు కొరతతో మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమాలూ ఉన్నాయి – చిత్రం, నువ్వే కావాలి, జయం, a film by aravind, ఆనంద్, ఐతే, మంత్ర, [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 O Clock High
మేనేజెంట్ పాఠాలు నేర్పించే సినిమాలలో గతవారం చర్చించిన 12 Angry Men అత్యంత ప్రముఖమైనది అయితే, ఆ తరువాత చెప్పుకోదగ్గ చిత్రం 12 O Clock High. ఈ రెండు చిత్రాలు 12తో మొదలవటం కేవలం కాకతాళీయమే. పైగా రెండు చిత్రాలు Leadership కి సంబంధించినవి కావటం మరో విచిత్రం. 1949 లో నిర్మాణమైన ఈ War Cinema నాజీలకు వ్యతిరేకంగా అమెరికా వైమానికసేవ చేసిన యుద్ధం గురించి ప్రస్తావిస్తుంది. 918 Bomb Group అనే పేరుగల [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 Angry Men
మేనేజ్మెంట్ పాఠాల చెప్పే సినిమాల గురించి ఎక్కడ ప్రస్తావించినా ఈ సినిమా పేరు వినపడకుండా వుండదు. ఎన్నో మేనేజ్మెంట్ ట్రైనింగ్లలో, వర్కషాప్ లలో, ఎంబీయే కాలీజీలలో ఈ సినిమాని ఒక కేస్ స్టడీగా ప్రదర్శించడం నాకు తెలుసు. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతూనే, అంతర్లీనంగా Leadership పాఠాలు బొధించే ఈ సినిమాని సాధారణ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా చూసేట్లు వుండటమే అందుకు కారణం అనుకుంటాను. 1957లో నిర్మాణమైన ఈ చిత్రం Reginald Rose రాసిన ఒక నాటకం ఆధారంగా [...] |
|
విద్యా (బాగ్చీ) + విద్యా (బాలన్) = నేషనల్ అవార్డ్… అదీ “కహానీ”
గుప్పిట మూసి వుంచితే మిస్టరీ. అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం థ్రిల్లర్. కాని ఇలాంటి కథల్లో ఒక చిక్కు వుంది. గుప్పిట తెరవగానే అప్పటిదాకా థ్రిల్ కి గురైన ప్రేక్షకులే “ఓస్ ఇంతేనా” అంటూ పెదవి విరిచేస్తారు. లేదా పొరపాటున ఎక్కడైనా Loose Ends దొరికిపోతే “నాకర్థమై పోయిందోచ్” అంటూ అరిచేస్తారు. అలా దొరికీ దొరక్కుండా, విప్పీ విప్పకుండా అనుక్షణం Thrill Ride ఇవ్వగలిగిన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన ఆణిముత్యం, ఆద్యంతం కట్టిపడేసే [...] |
|
కథే ప్రాణంగా ’కహాని’
ఒక సమకాలీన సమస్యను తీసుకొని, దాని పరిష్కారాన్ని యుగయుగాలుగా వేళ్ళూనుకుపోయిన ఒక విశ్వాసంలో నిలుపుతూనే, సార్వజనీనత కోల్పోకుండా ఒక కథ చెప్పటం కత్తి మీద సాములాంటిది. అవినీతి, ఉగ్రవాదం మొదలైన సమకాలీన సమస్యలతో వచ్చిన సినిమాలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటిలో విభిన్నంగా నిలిచిపోయే సినిమా ఇవ్వాళ నేను చూశాననే నాకనిపిస్తుంది. ఆ సినిమా, బాలీవుడ్ తాజా విడుదల – ’కహాని’. ఇదో థ్రిల్లర్ సినిమా. మొదటి నుండి చివరి దాకా ఏం జరుగుతుందో సగటు ప్రేక్షకునికి తెలుస్తూనే [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |