Menu

Film Studies Archive

ప్రపంచ సినీ ఉద్యమాలు – ఒక పరిచయం

19 వ శతాబ్దపు చివర్లో మొదలయిన సినిమా అనే ప్రక్రియ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురైంది. 24 నిశ్చల చిత్రాలను(ఫ్రేములు) ఒక సెకను కాలంలో తెరపై ప్రదర్శించడం ద్వారా కదలిక కలిగిఉన్నట్టుగా భ్రమ కలిగించడమే చలనచిత్ర ప్రక్రియ అయినప్పటికీ, సినిమా అనే ప్రక్రియ మొదలయిన రోజుల్లో కేవలం 16 లేదా అంతకంటే తక్కువ చిత్రాలను మాత్రమే ప్రదర్శించగలిగడం సాధ్యం అయ్యేది. సాంకేతిక విప్లవం కలుగచేసిన సదుపాయాలు సినిమా అనే ప్రక్రియ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదట్లో

’మహేశ్ బాబు పూజారిని రక్షించుట’ అనబడు స్క్రీన్ ప్లే విధానం-STC-2

ఇంతకు ముందు వ్యాసంలో  ఈ పిల్లిని రక్షించుట లేదా Save the Cat అనే స్క్రీన్ ప్లే విధానం గురించి కొంచెం చర్చించాం.ఈ విధానంలో మొత్తం పదిహేను స్టెప్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. అయితే ఈ స్క్రీన్ ప్లే విధానం నిజంగానే మన సినిమాలకు పనికొస్తుందా అనే అనుమానం రావొచ్చు కాబట్టి ఈ పదిహేన్ స్టెప్స్ ని ఏదైనా తెలుగు సినిమాకు అన్వయించి చూస్తే ఏలా ఉంటుందో చూద్దాం. దీనికోసం మనం మహేశ్ బాబు నటించగా త్రివిక్రమ్

’పిల్లిని రక్షించుట’ అనబడు స్క్రీన్ ప్లే రచనా విధానం-STC-1

ఔత్సాహిక సినిమా దర్శకులు రచయితలకు వచ్చే మొట్టమొదటి సందేహం “స్క్రీన్ ప్లే రాయడం ఎలా?” అని. అయితే స్క్రీన్ ప్లే రచన గురించి ఇదివరకే చాలా పద్ధతులు ఉన్నాయి. సిడ్ ఫీల్డ్ తన “స్క్రీన్ ప్లే” పుస్తకంలో ఒక రకమైన టెక్నిక్ గురించి చెప్తే, రాబర్ట్ మెకీ తన “స్టోరీ” పుస్తకంలో మరొక విధానాన్ని చెప్పుకొచ్చారు. అలాగే “21 రోజుల్లో స్క్రీన్ ప్లే రాయడం ఎలా?”, “సీక్వెన్స్ బేస్డ్ స్క్రీన్ ప్లే రాయడం ఎలా” అంటూ పలు

స్ట్రోంబోలియన్ సినిమా

ముందుమాట: చాలా రోజుల తర్వాత ఈ మధ్యనొకసారి గిరీశ్ షంబు గారి బ్లాగ్ సందర్శించాను. అప్పుడే తెలిసింది ఈ స్ట్రోంబోలియన్ సినిమా గురించి. అసలేంటీ స్ట్రోంబోలియన్ సినిమా అని అర్జంటుగా తెలుసుకోవాలనుకుంటే గిరీశ్ గారి బ్లాగులోని ఈ పోస్టు చదవండి. అర్జంటేమీ లేదనుకున్న వాళ్ళు ఈ వ్యాసం తీరిగ్గా చదవొచ్చు. తీరిగ్గా ఎందుకన్నానంటే ఇక్కడ స్ట్రోంబోలియన్ సినిమాల గురించి కాకుండా చాలా విషయాలను చర్చిస్తూ, కొత్త విషయాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. అసలీ వ్యాసాన్ని నేను గతంలో ఎప్పుడో,