Menu

Film Studies Archive

ఓ సామాజిక పరిణామానికి అద్దం-తెవర్ మగన్

భారతీయ సమాజంలోని పలు ప్రాంతాలు, సమూహాలు ఒకేసారి, ఒకేలా చట్టం, పాలనా వ్యవస్థలను అంగీకరించలేదు. అలాగని అవన్నీ నేరుగా విభేదించనూలేదు. వారి సామాజిక నేపథ్యంతోనో, అనూచానంగా వస్తున్న అలవాట్లతోనో, లేక రాజకీయ స్థితిగతులతోనో చట్టాలు నేరుగా విభేదిస్తున్న చోట వాటికి అమలు ఉండదు. అలాగని ఆ స్థితి యధాతథంగానూ నిలిచిపోయేదీ కాదు. క్రమంగా సాంఘిక, ఆర్థిక స్థితిగతులు మారుతున్న కొద్దీ ఆ సమాజపు నడవడిక చట్టం పరిధిని అంగీకరిస్తూపోతుంది. సమాంతర వ్యవస్థలు రాజకీయ బలంతోనో, ఆర్థిక స్థితిగతులతోనో

అడూర్ తో ముఖాముఖి- తొమ్మిదవ భాగం

ప్ర: స్వయంవరం ని సృష్టించడంలో ఇతర సినిమాల ప్రభావం కానీ దర్శకుల ప్రభావం కానీ ఉందంటారా? అడూర్: స్వయంవరంలో కొంతవరకూ ఘటక్, (సత్యజిత్) రే ల ప్రభావం కొంచెం ఉంటే ఉండొచ్చు. ఆ తరవాత సినిమాల్లో మాత్రం కచ్చితంగా లేదు. ఘటక్ సినిమా సుబర్ణరేఖ లాగా ఉంది అని కొందరన్నారు స్వయంవరం గురించి. అందులో కూడా ఒక యువ జంట లేచిపోయి పట్నం వెళ్ళడం జరుగుతుంది. కానీ స్వయంవరం ముఖ్యంగా ఆ ప్రయాణం గురించి. ఘటక్ సినిమాతో

Zombie – జీవమున్న శవం

  పడమటి ఆఫ్రికాలో కొన్ని మంత్ర తంత్ర శక్తులూ నమ్మకాలకి సంభందించిన పదం జోంబీ ..దాని అర్థం ‘బ్రతికిన శవం’. శవానికి  తంత్ర విద్య ద్వారా ప్రాణంపోస్తే  జోంబీ అంటారు. అలా బతికించి దాన్ని ఒక బానిసగా వాడుకుంటారట.అయితే అవి మామూలు మనుషుల్లా ఉండక నడవలేక నడుస్తూ వింతగా ఉంటాయి.  మైకెల్ జాక్సన్ థ్రిల్లర్ లో స్మశానంలోంచి లేచొచ్చిన శవాలమీద చిత్రీకరించిన పాట ఎంత గొప్ప హిట్టో మనకి తెలిసిందే.   ఆ చరిత్ర అటుంచితే..  పాశ్చ్యాత్యులు 

పఠాభి-Rebel with a cause

1942లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతుండగా అమెరికన్ ఆర్మీలో చేరమని పిలుపు వచ్చింది ఆయనకి.సైన్యంలో చేరితే మాంసాహారం తినాల్సొస్తుందని సైన్యంలో చేరకుండా FBI కి లొంగిపోయి ఆ తర్వాత అమెరికా వదిలిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి భారతదేశం చేరుకోవాలంటే ఓడమీదే చేరుకోవాలి. కానీ ఆ రోజుల్లో జర్మన్ యూబోట్ల నుంచి తప్పించుకుని సురక్షితంగా నౌకలో బయటపడడమంటే అత్యంత కష్టం. ఇలాంటి పరిస్థుతుల్లో నేల మార్గాన, తీర ప్రాంతాల నౌకలద్వారానూ మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీలకు

అకిరా కురొసావా

ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి