సినిమాలు-దర్శకులు

సినీ ఉద్యమాల్లో ప్రముఖులు

The Cabinet of Dr Caligari – సమీక్ష

The Cabinet of Dr Caligari – సమీక్ష

భావ వ్యక్తీకరణ వాదపు సినిమాలుగా పేర్కొనబడే సినిమాలు ఎన్నో వున్నా, తొలి Expressionist సినిమాగా ప్రాచుర్యం పొందిన ’The Cabinet of Caligari’  ద్వారా భావ వ్యక్తీకరణ వాదపు ఆలోచనలు సినిమా తెరపైకి ఎలా అనువదించబడ్డాయనే విషయాన్ని చర్చించడం ఈ వ్యాసం లక్ష్యం. ఈ వ్యాసంలో విషయాలని గ్రహించడానికి ఈ సినిమా చూసి ఉండడం అవసరం అనుకుంటున్నాను. ఈ వ్యాసం చదివే ముందు ఇక్కడ ఆన్ లైన్ లో ఉన్న ఈ సినిమా చూడవలసిందిగా మనవి. కథ:సినిమా(…)

జర్మన్ సినిమాలు-భావవ్యక్తీకరణ వాదం

జర్మన్ సినిమాలు-భావవ్యక్తీకరణ వాదం

పరిచయం: 20 వ శతాబ్దపు తొలి రోజుల్లో కళారంగం గతి మార్చిన భావవ్యక్తీకరణ వాదం సాధారణంగానే బహుళకళల సమ్మేళనమైన చలనచిత్ర ప్రక్రియనూ మార్పు దిశగా నడిపించింది.ముఖ్యంగా జర్మనీలో 1920 ప్రాంతంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో అప్పటి సినిమా దర్శకులు భావవ్యక్తీకరణ ద్వారా తమ ఆలోచనలను బలంగా చిత్రించారు. వ్యాపారమే ప్రాముఖ్యంగా నడుస్తున్న జర్మన్ సినిమా హఠాత్తుగా ఇలా కళాత్మక సినిమాలను నిర్మించడానికి కారణాలు అప్పటి పరిస్థుతులే అని చెప్పుకోవచ్చు. 1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఘోర పరాజయం(…)

అకిరా కురొసావా

అకిరా కురొసావా

ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి(…)

Jean-Luc Godard-ఒక పరిచయం

Jean-Luc Godard-ఒక పరిచయం

Godard- ఈ పేరు తెలియని సినీ ప్రేమికులుంటారంటే ఆశ్చర్యమే.ప్రపంచ సినిమా చరిత్రను మలుపుతిప్పిన ఈయన గురించి రాయడమంటే తేనెతుట్టెపై రాయి వేసినట్టే. Godard ని పరిచయం చెయ్యాలంటే ఆయనొక్కరి గురించి చెప్తే సరిపోదు. ఈయన గురించి చెప్పాలంటే  ముందు Andre Bazin ని పరిచయం చెయ్యాలి. ఆయన పరిచయం చేయడంతో  సరిపోదు. Andre Bazin అన్నాక Cahiers du Cienma గురించి చెప్పకపోతే ఎట్లా? ఈ పెద్దాయన గురించి మొదలెట్టాక  Henri Langlois గురించి చెప్పకపోతే గీస్తున్న(…)

వుడి ఎలెన్ తో కాసేపు

వుడి ఎలెన్ తో కాసేపు

పరిచయం: Woody Allen గురించి పరిచయం చెయ్యక్కర్లేదనుకుంటాను. గత నలభై ఏళ్లుగా నలభై కి పైగా సినిమాలు తీసి తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఉడీ ఆలెన్ మాటల్లో సినిమా దర్శకత్వం గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం. ఉడీ అలెన్ తరహా సినిమాలు (Woody Allenesque Films) అనే ఒక ప్రత్యేక జాన్రా సినిమాలు ఆయన స్వంతం. ఉడీ అలెన్ సినిమాలు చూసిన వాళ్లకు కొన్ని ప్రత్యేకతలు(…)

Salaam Cinema

Salaam Cinema

సినిమానేజీవితం. జీవితమే సినిమా : మన చుట్టూ, మన చెంతన, మన లోలోపల. సినిమా! అరవై నాలుగు కళలనీ తనలో ఇముడ్చుకుని ఉధ్బవించిన ఒక సరికొత్త మహత్తర కళ! శతబ్దాలుగా కళారాధనలో జీవిస్తూ వస్తున్న మానవునికి గత శతాబ్దంలో మాత్రమే సాధ్యమైన ఒక వినూత్న కళ. ఈ ప్రపంచంలోని అరు వందల కోట్ల మంది జనాభాలో కనీసం సగం మందైనా ఎప్పుడోకపుడు ఈ కళ ను అనుభవించిన వాళ్లే అయ్యుంటారు. సినిమా అనే చలనచిత్రానుభవాన్ని రుచి చూశాక(…)

సినీ‘మణిరత్నం’

సినీ‘మణిరత్నం’

  జూన్ 2 మణిరత్నం 55 వ పుట్టినరోజు సందర్బం గా ..ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. పెద్ద పెద్ద దర్శకుల సైతం సినిమా ను ఓరల్ గా చెపుతున్న కాలమది..విజువల్ మీద దర్శకులు ఇంకా సరైన ద్రుష్టి సారించని రోజులవి. గొప్ప కథలు..కానీ విజువల్ లో చెప్పుకోదగ్గంత గొప్పతనం లేదు. కేవలం కథ ను చెప్పటానికి అవసరమైనంత కేర్ తప్ప ..ప్రతి ఫ్రేము నూ ఓ ఆర్ట్ లా తీర్చిదిద్దాలన్న ఉద్దేశానికి ఇంకా దర్శకులు రాలేదు.(…)

ఈవీవీడెవడండీ బాబూ(హటాత్తుగా వెళ్ళిపోయాడు)

ఈవీవీడెవడండీ బాబూ(హటాత్తుగా వెళ్ళిపోయాడు)

“అప్పు” డే తెల్లారిందా” అన్న రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో ఈవీవీ నాకు పరిచయం! ఆ సినిమా అప్పుల అప్పారావు నాకు అంతగా నచ్చకపోయినా ఆయన సినిమాలు కొన్ని బాగానే నచ్చాయి. హాస్యాన్ని బాగానే సృష్టించినా, అందులో కాస్తంత బూతుని రంగరించి ముతగ్గా రూపొందిచడం ఆయన స్టైలు కాబట్టి దాన్ని దాదాపుగా ఏ సినిమాలోనూ తప్పించుకోలేం! అయినా సరే, ఈవీవీ సినిమా అంటే హాస్యానికి మాత్రం మినిమమ్ గారంటీ కాబట్టి చూడొచ్చని వెళ్తాం! ఈవీవీ తీసిన సెంటిమెంట్(…)

గుండె భావాల బాలచందర్

గుండె భావాల బాలచందర్

సినిమా అంటే  కేవలం ఎంటర్ టైన్‌ మెంట్‌ కాదు. సినిమా జీవితాన్ని ప్రతిబింబించ గలగాలి, మానవ మనస్తత్వాల్లోని వైచిత్రిని బయటికి తీసుకురాగలగాలి. మానవ సంబంధాలలో వుండే విభిన్న కోణాలను చూపగలగాలి. గుండె లోతున దాగి వున్న భావాలను స్పృశించగలగాలి. అలాంటి సినిమా లు చేసే అతి కొద్దిమంది దర్శకుల్లో  మొదటి వరుసలో వుండే దర్శకుడు కె.బాలచందర్‌. విప్లవాత్మక ఆలోచనా ధోరణి, మనసు అంతరగాలను దర్శించగల సునిశిత దృష్టి..కె.బాలచందర్‌ ని వెండితెర పై మరపురాని చిత్రాల దర్శకుడి ని(…)

శ్యామ్ బెనెగళ్ తెలుగు సినిమాలు తీయలేడా? Part 1

శ్యామ్ బెనెగళ్ తెలుగు సినిమాలు తీయలేడా? Part 1

మూఢనమ్మకాలపై ఆయన ప్రకటించిన యుద్ధంలో ఎవరు గెలిచినట్లు? ‘అనుగ్రహం’పై తెలుగు ప్రేక్షకులకు ఆగ్రహమా? మనిషిని నమ్మకం ముందుకు నడిపిస్తుంది.మూఢనమ్మకం    దిగజారుస్తుంది,దడిపిస్తుంది,వణికిస్తుంది. ఇది మతపిచ్చి మనిషిని పతనం చేసే మౌఢ్యం.మనదేశంలో ఈ పిచ్చి హద్దూపద్దూ లేకుండా పెరిగిపోతున్న మాట నిజం.రాజకీయనాయకుల.ధనవంతుల అండ దీనివెనుకాల ఉంది.రగులుతున్న సమస్యల్లో ఈ చాదస్తం కూడా ఒకటి.దేశభవిష్యత్తుకు,సమాజప్రగతికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్న తక్షణ సమస్య ఇది. మూఢనమ్మకాలు ఆత్మవిశ్వాసాన్ని,ఆత్మస్థైర్యాన్ని నశింపచేస్తాయి.వ్యక్తిత్వం కోల్పోతాడు మనిషి.ఆలోచనా శక్తి ఉండదు.పిరికిపందలా,పరాన్నభుక్కులా భయంతో అనుక్షణం గడుపుతుంటాడు. శ్యాం బెనెగల్‘అనుగ్రహం’చిత్రానికి తీసుకున్న,సామాజిక(…)

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన  సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్  ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది ‘నీచా నగర్‘ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand(…)

విషాదాంతాలు –  బాలచందర్ సినిమాలు

విషాదాంతాలు – బాలచందర్ సినిమాలు

“బాలచందర్ ” ఎందుకోగాని ఈ పేరు తల్చుకోగానే మనసు దిగులుగా అయిపోతుంది.  నన్నేడిపించిన సినిమాలన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో  కళ్ళముందు  గింగిరాలు తిరుగుతాయి.  సరిత, శ్రీదేవి , జయప్రద ,జయసుధ, సుహాసిని,మాధవి, జయలక్ష్మి ( ఫటాపట్)  …చక్కనమ్మలందరూ , దిగాలుగా నాకేసి చూస్తారు. చిరంజీవి,  కమల్ హాసన్, రజనీకాంత్, నారాయణరావు , ప్రకాష్ రాజ్  ఆయనే లేకపోతే మేం ఎక్కడా ? అని ప్రశ్నిస్తూ  నిలదీస్తారు .బాలచందర్ సినిమాలు ఎన్ని చూసానో గుర్తులేదుకాని ….అన్ని సినిమాలూ ఏడుస్తూ(…)

చేరన్ – ఒక పరిచయం

చేరన్ – ఒక పరిచయం

ముప్పైతొమ్మిదేళ్ళ వయసు. దర్శకుడిగా తొమ్మిది సినిమాలు. నటుడిగా ఏడు సినిమాలు మూడు జాతీయ అవార్డులు అతనే ‘చేరన్’ అనే తమిళ దర్శక-నటుడు.. కె.ఎస్.రవికుమార్ దగ్గర సహాయదర్శకుడిగా పనిచేసి 1997 లో భారతి కణ్ణమ్మ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మారాడు. రెండో చిత్రం ‘పోర్కాలం’(1997)తో జాతీయ బహుమతి అందుకున్నాడు. అంగవైకల్యం ప్రధానాంశంగా గల ఈ చిత్రం ‘మాణిక్యం’ అనేపేరుతో తెలుగులో రీమేక్ చెయ్యబడింది. దేశియగీతం(1999), వెట్రి కొడి కట్టు(2000), పాండవర్ భూమి (2001) వంటి అర్థవంతమైన చిత్రాలు(…)