పరిచయం

ప్రముఖుల పరిచయాలు

కెంజి మిజొగుచి – పరిచయం

కెంజి మిజొగుచి – పరిచయం

జపనీస్ సినిమా అనగానే సాధారణంగా అకిరా కురసావా పేరే గుర్తొస్తుంది. అకిరా కురసావా తో పాటు యసుజిరో ఓజు మరియు కెంజి మిజొగుచి లు కూడా జపనీస్ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. వీరు ముగ్గురిని జపనీస్ సినిమా స్వర్ణయుగపు నాటి త్రిమూర్తులుగా వర్ణించవచ్చు. వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడం కష్టమే కాకుండా అలాంటి ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాసే. తమ తమ(…)

కె.బాలచందర్:ప్రశ్నలు-జవాబులు

కె.బాలచందర్:ప్రశ్నలు-జవాబులు

దాదాపు పదేళ్ల క్రితం… అప్పటికింకా నవతరంగం మొదలు కాలేదు. బెంగుళురు లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో బాలచందర్ “తనీర్ తనీర్” సినిమా స్క్రీనింగ్ కి వెళ్ళాను. అప్పటికి నేను సినిమాల గురించి రాయాలన్న ఆలోచనే లేదు. కానీ సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో ఉన్న సినిమా పుస్తకాలు చూసి మనకీ తెలుగులో ఎవరైనా రాస్తే బావుండనిపించింది. సినిమా అయ్యాక బాలచందర్ గారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఆయనతో చేసిన ఇంటర్వ్యూ ఇది.(…)

పఠాభి-Rebel with a cause

పఠాభి-Rebel with a cause

1942లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతుండగా అమెరికన్ ఆర్మీలో చేరమని పిలుపు వచ్చింది ఆయనకి.సైన్యంలో చేరితే మాంసాహారం తినాల్సొస్తుందని సైన్యంలో చేరకుండా FBI కి లొంగిపోయి ఆ తర్వాత అమెరికా వదిలిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి భారతదేశం చేరుకోవాలంటే ఓడమీదే చేరుకోవాలి. కానీ ఆ రోజుల్లో జర్మన్ యూబోట్ల నుంచి తప్పించుకుని సురక్షితంగా నౌకలో బయటపడడమంటే అత్యంత కష్టం. ఇలాంటి పరిస్థుతుల్లో నేల మార్గాన, తీర ప్రాంతాల నౌకలద్వారానూ మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీలకు(…)

అకిరా కురొసావా

అకిరా కురొసావా

ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి(…)

డేవిడ్ లీన్ – ఒక పరిచయం

డేవిడ్ లీన్ – ఒక పరిచయం

ఫ్రెంచ్ దర్శకుడు jean Renoir సినిమా దర్శకుల గురించి చెప్తూ, “ఒక గొప్ప దర్శకుడు తన జీవితకాలంలో నిర్మించిన అన్ని మంచి సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి పేరిస్తే వచ్చేది వివిధ రకాల సినిమాల సముదాయం కాకపోగా అవన్నీ ఒకే సినిమాలోని వివిధ అధ్యాయాలుగా అనిపిస్తాయి” అంటారు. అంటే ఒక దర్శకుడు తన జీవితకాలంలో రూపొందించే గొప్ప సినిమాలన్నింటిలో చెరిపివేయలేని ఒక మార్కు వదిలిపెడ్తాడని ఆయన ఉద్దేశం. ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులు తమ జీవితకాలంలో రూపొందించిన(…)

ఇంగ్మర్ బెర్గ్మన్

ఇంగ్మర్ బెర్గ్మన్

జులై 14, 1918 లో స్వీడెన్ లోని ఉప్శల అనే ప్రదేశంలో పుట్టి, 1946లో Crisis అనే చిత్రం ద్వారా చలనచిత్ర ప్రపంచంలోనికి అడుగుపెట్టి, The Seventh Seal, Wild Strawberries, Fanny and Alexander లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గాంచి దాదాపు 60 సినిమాల ద్వారా ప్రపంచంలోని అన్నిమూలలవున్న సినీ ప్రేమికుల హృదయాలను స్పందింపచేసారు. Ingmar Bergman గురించి చెప్తూ ఫ్రెంచ్ సినీ దర్శకుడు Jean-Luc Godard ఈ విధంగా అంటారు, “The(…)

బి.యన్.రెడ్డి-ఒక పరిచయం

బి.యన్.రెడ్డి-ఒక పరిచయం

భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు. తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన(…)

ఆంద్రె బాజిన్ – ఒక పరిచయం

ఆంద్రె బాజిన్ – ఒక పరిచయం

ప్రపంచంలోని అత్యుత్తమ సినీ విశ్లేషకుల్లో Andre Bazin పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్సు దేశంలో 1918లో జన్మించిన Bazin ఆఖరి శ్వాస వదిలే వరకూ తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసాడు. ఒక్క సినిమా అయినా తియ్యకుండానే, కేవలం తన రాతల ద్వారా ఒక సినీ ఉద్యమానికే కారకుడయ్యాడీయన. ఈయన స్థాపించిన Cahiers du Cinema అనే పత్రిక ద్వారా ప్రపంచ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసాడు. ఈ పత్రికలో వ్యాసాలు రాస్తూనే Godard, Truffaut,(…)

బెలా టర్ – ఒక పరిచయం

బెలా టర్ – ఒక పరిచయం

హాలీవుడ్ గుర్తిస్తేనో, మీరామ్యాక్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తేనో కానీ మంచి సినిమా అంటే ఎంటో మనకి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. కానీ వాటిని గుర్తించడంలోనే ఎక్కడో పొరపాటు జరుగుతోంది. అందుకు నిదర్శనం Bela Tarr సినిమాలే!గత 25 ఏళ్ళగా సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ Cannes 2007 లో తన సినిమా Man from London ప్రదర్శనతోనూ,బెర్లిన్ ఫెస్టివల్ 2011 లో టూరిన్ హార్స్ సినిమాతో ఉత్తమ(…)

Jean-Luc Godard-ఒక పరిచయం

Jean-Luc Godard-ఒక పరిచయం

Godard- ఈ పేరు తెలియని సినీ ప్రేమికులుంటారంటే ఆశ్చర్యమే.ప్రపంచ సినిమా చరిత్రను మలుపుతిప్పిన ఈయన గురించి రాయడమంటే తేనెతుట్టెపై రాయి వేసినట్టే. Godard ని పరిచయం చెయ్యాలంటే ఆయనొక్కరి గురించి చెప్తే సరిపోదు. ఈయన గురించి చెప్పాలంటే  ముందు Andre Bazin ని పరిచయం చెయ్యాలి. ఆయన పరిచయం చేయడంతో  సరిపోదు. Andre Bazin అన్నాక Cahiers du Cienma గురించి చెప్పకపోతే ఎట్లా? ఈ పెద్దాయన గురించి మొదలెట్టాక  Henri Langlois గురించి చెప్పకపోతే గీస్తున్న(…)

వుడి ఎలెన్ తో కాసేపు

వుడి ఎలెన్ తో కాసేపు

పరిచయం: Woody Allen గురించి పరిచయం చెయ్యక్కర్లేదనుకుంటాను. గత నలభై ఏళ్లుగా నలభై కి పైగా సినిమాలు తీసి తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఉడీ ఆలెన్ మాటల్లో సినిమా దర్శకత్వం గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం. ఉడీ అలెన్ తరహా సినిమాలు (Woody Allenesque Films) అనే ఒక ప్రత్యేక జాన్రా సినిమాలు ఆయన స్వంతం. ఉడీ అలెన్ సినిమాలు చూసిన వాళ్లకు కొన్ని ప్రత్యేకతలు(…)

రహస్య స్నేహితుడు

రహస్య స్నేహితుడు

ఆనందం వెతుక్కోవడంలోనా? లేక కనుక్కోవడంలోనా? నాకైతే వెతికి కనుక్కోవడంలో ఉందని ఒక రహస్య స్నేహితుడిని కలిసాక తెలిసింది.  ఆయన సృష్టి అపూర్వం. న భూతో న భవిష్యతి అని తరచుగా వింటుంటాం. అందులో వందకి తొంభై తొమ్మిద సార్లు అది కేవలం అతిశయోక్తి మాత్రమే. అయితే ఈ నా స్నేహితుని గురించి ఆయన చేసిన సృష్టి గురించి చెప్పాలంటే మాత్రమే న భూతో న భవిష్యతి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని మాత్రం ధృఢంగా చెప్పగలను.(…)

అబ్బాస్ కియారోస్తమి-ఒక పరిచయం

అబ్బాస్ కియారోస్తమి-ఒక పరిచయం

అబ్బాస్ కియరోస్తమి ఇరాన్ దేశపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. ఇరాన్ దేశపు సినిమాల్లో నవతరంగం దర్శకులుగా భావించే వారిలో ఇయన కుడా ఒకరు.ప్రపంచ దేశాలకు కియరస్తోమి గురించి తెలిసింది తొంభై లలో అయినప్పటికీ అంతకముందు రెండు దశాబ్దాల క్రితం నుంచే ఆయన ఇరాన్ లో చిత్రనిర్మాణం చేస్తూనే ఉన్నారు. చిత్ర నిర్మాణం చేపట్టి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ అత్యుత్తమ సినిమా దర్శకునిగా ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతున్నాడు. జూన్ 22, 1940లో ఇరాన్ లోని టెహ్రాన్ లో(…)

Wong kar-wai – ఒక పరిచయం

Wong kar-wai – ఒక పరిచయం

అవునన్నా కాదన్నా మనందరికీ సినిమాలంటే విపరీతమైన అభిమానం. అందుకే మనం సినిమాలు కాస్తా ఎక్కువగానే చూస్తూనే వుంటాం. చూడ్డం సంగతి పక్కనబెడితే మనమూ సినిమాలు తీద్దామని చాలా కలలు కంటుంటాం. ఒక వేళ అదృష్టవశాత్తూ మనకు అవకాశం వచ్చి సినిమా తీద్దామన్నా మన చుట్టూ వున్న పరిస్థితులు మనల్ని ఆ రోటీన్ వ్యవహారంలోకి లాగేస్తాయి. కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు మంచి సినిమాలను సునిశితంగా పరిశీలించడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యున్నత సినిమాలను(…)

ఆండ్రే వైదా-ఒక పరిచయం

ఆండ్రే వైదా-ఒక పరిచయం

పరిచయం: అయనకి సినిమా ఒక ఆయుధం.  ఆయనకి సినిమా ఒక సాధనం.  ఆయన సినిమాలు చరిత్రకు సాక్ష్యాలు. ఆయన సినిమాలు సమకాలీన సమాజపు భావజాలానికి ప్రతిబింబాలు. యాభై ఏళ్ళకి పైగా సినిమాలు తీస్తూ తన దేశపరిస్థుతులు ప్రపంచానికి తెలియచేస్తూ సినిమానే జీవితం చేసుకున్న ఆయన పేరు ఆండ్రే వైదా (Andrzej Wazda). పోలండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చదగ్గ ఆండ్రే వైదా పై ఆయన సినిమాలపై ఈ నెల నవతరంగం లో ఫోకస్(…)

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – III

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – III

(ఈ వ్యాసాల్లో ఇది మూడవది, ఆఖరిది. మొదటి భాగంలో కథా నిర్ణయం, తూర్పు పశ్చిమ దేశాల సినిమా ప్రభావం, ఎడిటింగ్ – రెండవ భాగంలో సంగీతం, కెమేరా పనితనం, స్క్రిప్ట్ పరిచయం చేసాను. ఈ మూడవ భాగంలో రూపకల్పన, నటులు, దర్శకత్వం వరుసగా పరిచయం చేస్తున్నాను.) 7. రూపకల్పన ఏ రంగంలో అయినా చేసిన పనికి అత్యుత్తమ స్థాయి గుర్తింపుకి బీజం ఆ పనిలో గుర్తించగలిగే అతి చిన్న వివరాలే అన్న విషయం అందరికీ తెలుసు. సినీరంగంలో(…)

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – II

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – II

(మొదటి భాగంలో రాయ్ సినిమాలపై మూడు అంశాలను పరిచయం చేసాను. అవి కథా నిర్ణయం, తూర్పు – పశ్చిమ సినిమాల ప్రభావం, ఎడిటింగ్. ఈ రెండవ భాగంలో – సంగీతం, కెమేరా పనితనం, స్క్రిప్ట్ అంశాలను పరిచయం చేస్తున్నాను. – రచయిత) 4. సంగీతం రాయ్ అపు చిత్రత్రయంలోని మూడు సినిమాలకు సంగీతం ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ సమకూర్చాడు. ఆ పై వచ్చిన ఒకటి, రెండు సినిమాలకి తప్ప తరవాత సినిమాలకు రాయ్ స్వయంగా(…)

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – I

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – I

(స్థలాభావం వల్ల ఈ వ్యాసంలో మూడవ వంతు కన్నా తక్కువ భాగం మాత్రమే అమెరికాలో ఒక తెలుగు సంఘం 25వ వార్షిక సంచికలో ఈ మధ్యే అచ్చయ్యింది. ఇంటర్‌నెట్ ప్రచురణలలో అటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అది అందుబాటులో ఉండనందువల్ల, మరి కొన్ని విషయాలు జోడించి, ఆ వ్యాసాన్ని పొడిగిస్తూ కొన్ని ఫొటోలతో సహా ఇక్కడ ప్రచురిస్తున్నాను. – రచయిత) “కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు” అన్న వేటూరి(…)

సత్యజిత్ రే-ఒక పరిచయం

సత్యజిత్ రే-ఒక పరిచయం

ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజపవైపు ప్రజల జీవన విధానాల వైపు(…)

” క్లిష్టత. అదే అతని ప్రత్యేకత.”

” క్లిష్టత. అదే అతని ప్రత్యేకత.”

2006 లో వచ్చిన Prestige సినిమాలో ‘ మైకల్ కేన్’ ఒక మాట చెబుతాడు, “The Audience wants to be fooled” అని. భయంకరమైన పోటీ ఉన్న ఇద్దరు ఇంద్రజాలికుల మధ్య జరిగే అతి ఘోర మస్తిశ్కయుద్ధమే ” ప్రెస్టీజ్ “. చిన్నప్పటినుండి Algebra వల్ల నాకు గణితశాస్త్రం అంటే భయం. పెద్దయ్యాక క్వాంటమ్ మెక్యానిక్స్ వల్ల నాకు Physics అంటే చలిజ్వరం. వాటిని చూసి దూరం పరిగెత్తెవాన్ని. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక రోజు(…)

టోనీ స్కాట్ – నివాళి

టోనీ స్కాట్ – నివాళి

హాలీవుడ్ సినిమాలు చూసే వారెవరికైనా టోనీ స్కాట్ పేరు పరిచయం ఉండే ఉంటుంది. Top Gun, True Romance, Man on Fire, Deja Vu, Unstoppable లాంటి సూపర్ హిట్ సినిమాల కు దర్శత్వం వహించిన టోనీ స్కాట్, మరో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు Ridley Scott కి సోదరుడు. The Hunger సినిమాతో 1987 లో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి , Tom Cruise నటించిన Top Gun సినిమాతో హాలీవుడ్ లో(…)

సినిమాటోగ్రాఫ‌ర్ అశోక్ మెహ‌తా-నివాళి

సినిమాటోగ్రాఫ‌ర్ అశోక్ మెహ‌తా-నివాళి

బాండిట్‌ క్వీన్‌, ఉత్సవ్‌, మండి, త్రికాల్‌, రామ్‌ లఖన్‌, ఖల్‌నాయక్‌,గజగామిని, చల్తే చల్తే తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా గత వారం ముంబై లో మరణించారు. శేఖర్ కపూర్, అపర్ణా సేన్, శశి కపూర్, సుభాష్ ఘాయ్, శ్యాం బెనగల్ లాంటి గొప్ప దర్శకుల సినిమాలకు సినిమాటోగ్రఫీ వహించి ఎప్ప‌టిక‌పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చూపుతూ దేశంలో అత్యంత ప్ర‌తిభావంతులైన సినిమాటోగ్రాఫ‌ర్‌ల‌లో ఒక‌రుగా నిలిచారు. రెండు సార్లు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో(…)

ప్రయోగం సమాప్తం: Chris Marker ఇక లేరు

ప్రయోగం సమాప్తం: Chris Marker ఇక లేరు

చలన చిత్రాలను నిశ్చలం చేసినా (La Jetee), కవిత్వాన్ని, చిత్రాలను, శబ్దాలనూ, మాటలను కలగలిపి సమకాలీన రాజకీయ, తాత్విక చర్చలు చేసినా (New Documentary), నడుస్తున్న జీవితాన్ని చరిత్రగా మారే విధానాన్ని డాక్యుమెంట్ చేసినా (“life in the process of becoming history), సినిమా వ్యాసమనే నూతన ప్రక్రియ (Essay Film) కు శ్రీకారం చుట్టినా అది Chris Marker ఒక్కరికే చెల్లింది. Chris Marker జనాలకు అంతగా తెలియకపోవడానికి కారణాలనేకం. ఆయన సినిమాలు చాలా(…)

అల్వీదా బాంబే సూపర్ స్టార్

అల్వీదా బాంబే సూపర్ స్టార్

దిగ్గజ ఎలట్రానిక్ కంపెనీ ఒకటి, ఈ మధ్యే ఓ యాడ్ చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది…. కంపెనీ ప్రోడక్ట్ సంగతి అలా ఉంచితే.. ఈ యాడ్ లో.. బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించిన బాలీవుడ్ వృద్ద నటుడు ఒకరు …..టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యాడు.. ఆ మధ్య…మాసిన తెల్ల గడ్డంతో..మొహం లోపలికి పీక్కుపోయి… బాడీ మూవ్ మెంట్ కాదు కదా.. కనీసం ఫేస్ ఎక్స్ ప్రెషన్ కూడా అంతగా కనిపించడం లేదు .. ఎందుకీయనని సదరు(…)

Remembering The Phenomenon

Remembering The Phenomenon

The Phenomenon. That was how Devi (Devyani Chaubal) used to refer to Rajesh Khanna in Star and Style. That he was. The first super star of Bollywood, they are calling him today. In those days, he was simply The Super Star. Not the first. The ONLY. By 1971, wherever Hindi films played, wherever Hindi film(…)

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట

సత్యలోకం లో ఓ అందమైన సాయంత్రం కచ్చపి తీవెలలో స్వరసుమాలు విరుస్తున్నాయి. బ్రహ్మదేవుడు తన్మయుడై ఆ రాగ పరిమళాలను ఆస్వాదిస్తున్నాడు. యింతలో మహతిని మీటుకుంటూ నారదుడు ప్రవేశించాడు , వెన్నంటే తుంబురుడూను , వీరిని చూడగానే బ్రహ్మదేముడికి భూలోకం గుర్తొచ్చింది . శూన్యం నుండి ధ్వని ప్రసరించదనీ స్పురణకొచ్చింది . తన భార్య సరస్వతికి ఎంతో ప్రియమైన ఆ వీణారావాలు భూలోక వాసులని చేరవని కొద్దిగా దిగులు చెందాడు . పాపం చతుర్ముఖుడు కదా అంతర్ముఖుడు కాలేకపోయాడు(…)

ఎవర్ గ్రీన్ హీరోకి అశ్రునివాళి

ఎవర్ గ్రీన్ హీరోకి అశ్రునివాళి

ఎనభై ఎనిమిది ఏళ్ల వయసులోనూ చలనచిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించి అందులో ప్రధాన పాత్రలు పోషిస్తూ ఎవర్ గ్రీన్ హీరో గా పేరు పొందిన దేవానంద్ ఇవాళ లండన్ లోని ఒక ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా మరణించారు. 1946 లో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవానంద్ దాదాపు 66 ఏళ్ల పాటు నిర్మాత గా , దర్శకుడిగా, నటుడిగా తన జీవితాన్ని సినిమాకే అంకితం చేశారు. తన కొన ఊపిరి ఉన్నంత వరకూ ఆయన(…)

సినిమా పోస్టర్

సినిమా పోస్టర్

అద్భుతమైన ఒక సినిమా పోస్టర్ ముందు, అది మురుక్కాలవ పక్కనే ఉన్నా సరే, గంటల తరబడి నిలబడి చూసినా జ్ఞాపకాలు అందరికీ ఉంటాయేమో! సినిమా బయటికి వచ్చాక ,మనకు కనపడేది తెరమీది నటులే తప్ప తెరెవెనుక కళాకారులు కాదు. నిజానికి సినిమాను ప్రేక్షకుల వద్దకు ముందుగా చేర్చి, ఆ సినిమా గురించి ఒక ఊహను,మనో చిత్రణను ఏర్పరిచేది సినిమా పోస్టరే! పోస్టరే లేకపోతే ఎంత గొప్ప సినిమా తీరైనా రీతిమారిపోవాల్సిందేగా! అలాంటి సినిమా పోస్టర్ తయారీ గురించి,(…)

జగ్జీత్  -ఒక అమర గీతం

జగ్జీత్ -ఒక అమర గీతం

సరిగ్గా రెండు మూడు వారాల క్రితం. నిండా పది సంవత్సరాలు లేని ఒక చిన్న కుర్రాడు.. నీలాకాశం లాంటి నీలి కళ్ళు, అమాయకత్వపు చూపులు , చూసిన వారికి ముద్దే కాదు బోలెడెంత ప్రేమ కలిగించే కనిపించే చూపులతనివి. అతను వచ్చిన ఒక మూరుమూల వెనకపడిన గ్రామానికి ఛిహ్నంలా అనిపిస్తుంది బక్కపలుచని దేహం. అంత బలహీన దేహం నుంచి వెలువడుతున్న స్వరం మనల్ని ఒక సంగీత ప్రపంచంలోకి తీసుకు వెళ్ళి పోయే ఓ హిందీ పాటను ఆలాపిస్తోంది.(…)

తుమ్  జో మిల్ గయో హో రపీ సాబ్

తుమ్ జో మిల్ గయో హో రపీ సాబ్

(24.12.1924 – 31.7.1980) మహ్మద్ రఫీ చనిపోయి ముప్పై సంవత్సరాలైంది. కానీ అతని పాట మరణించలేదు. భారతీయ సినిమా పాటల నేపధ్యం గానంలో సైగల్ తరువాతి శకంలో ఒక కొత్త ఒరవడిని తెచ్చింది రఫీనే. భారతీయ సినిమా పాట ఎల్లలు దాటి ఒక సంస్కృతి గా, పెద్ద మార్కెట్ గా విస్తరించుకోవడానికి రఫీ లాంటి కొన్ని స్వరాలే కారణం. ఇపుడు టెలివిజన్ సంగీత, నృత్య రియాలిటీ షోల రూపంలో చాలా పెద్ద మార్కెట్ గా అవతరించిందంటే కారణం(…)

జానతెలుగుపాటల పుంస్కోకిల – ఒక స్మృత్యాంజలి

జానతెలుగుపాటల పుంస్కోకిల – ఒక స్మృత్యాంజలి

తను తెలుగు వాడిగా — వాడిగా తెలుగు వ్రాయగల వాడిగా — పుట్టడం మన అదృష్టం అన్న గర్వంతో మనసు పులకరిస్తుంది ఆయన పేరు వింటే. నేను తెలుగు వాడినై — అంతో ఇంతో తెలుగు చదవగలిగిన వాడినై — పుట్టడం నా అదృష్టం అన్న స్పృహతో వళ్ళు గగుర్పొడుస్తుంది ఆయన రచన చదివితే. పానగల్ పార్కులోని పేరులేని చెట్టును తక్షశిల, నలందా, వారణాశి విశ్వవిద్యాలయాలంత “ఎత్తు”కు పెంచిన కులపతి — పుంభావసరస్వతి — ఆయన. రూపాయ(…)

మనకోసం ‘మరో సినిమా’

మనకోసం ‘మరో సినిమా’

డెబ్భయ్యో దశకం నాటి భారతీయ సినిమాలో ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం పేరు ‘మరో సినిమా’. సినిమా వినోదం కోసమే కాదు, ఒక సంపూర్ణ కళారూపం అన్నది ఆ విప్లవ నినాదం. సహజ సరుకు! భారతదేశంలో మధ్యతరగతి ఒక వర్గంగా ఆవిర్భవించిన సమయమది. ఆ వర్గానికి కొనుగోలు శక్తి పెరిగిన సమయం కూడా. పారిశ్రామిక కళా రూపమైన సినిమా, సహజంగానే, మార్కెట్ ప్రోడెక్టే! అయితే సినిమాకి రకరకాల మార్కెట్లు. ఆ రకరకాల మార్కెట్లకి రకరకాల సినిమాలు(…)

సినీ‘మణిరత్నం’

సినీ‘మణిరత్నం’

  జూన్ 2 మణిరత్నం 55 వ పుట్టినరోజు సందర్బం గా ..ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. పెద్ద పెద్ద దర్శకుల సైతం సినిమా ను ఓరల్ గా చెపుతున్న కాలమది..విజువల్ మీద దర్శకులు ఇంకా సరైన ద్రుష్టి సారించని రోజులవి. గొప్ప కథలు..కానీ విజువల్ లో చెప్పుకోదగ్గంత గొప్పతనం లేదు. కేవలం కథ ను చెప్పటానికి అవసరమైనంత కేర్ తప్ప ..ప్రతి ఫ్రేము నూ ఓ ఆర్ట్ లా తీర్చిదిద్దాలన్న ఉద్దేశానికి ఇంకా దర్శకులు రాలేదు.(…)

రమణీయ కథ – 2

రమణీయ కథ – 2

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011 చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు. మొదటి(…)

రమణీయ కథ – 1

రమణీయ కథ – 1

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011  చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు. చాలా(…)

ధవళేశ్వరం బుడుగును నేను…

ధవళేశ్వరం బుడుగును నేను…

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011 చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు. రమణ(…)

“మెగాస్టార్” సినిమాటోగ్రాఫర్

“మెగాస్టార్” సినిమాటోగ్రాఫర్

సినిమా ఒక దృశ్య మాలిక అయనప్పటికీ.. కథా ప్రధానం కనక..  ప్రేక్షకుడు కథలో లీనం అయిపోతాడు.  మన తెలుగు సినిమా ముఖ్యంగా  మాటల్లో కథ నడుస్తుంటుంది,  కనక చెవులు రిక్కించి వింటుంటాడు. అందుకే కళ్ళ ముందు వొచ్చే అద్భుతమైన చిత్రీకరణని పెద్దగా గుర్తించక పోయినా.. ఆ దృశ్యాలు  సూటిగా అంతః చేతనం లోకి వెళ్ళిపోతాయి.  ఆ ప్రకారం లో సినిమాలోని దృశ్యాలు అంతర్లీనగా పని చేస్తాయి.తదనుగుణంగా హృదయాంతరాళం లో ఎక్కడో ఒక విధమైన  రాసానందం ఉంటూనే ఉంటుంది.(…)

అందమైన కల- ఏ మాయ చేసావే

అందమైన కల- ఏ మాయ చేసావే

ఈ మధ్య కాలం లో  వొచ్చిన “ఏ మాయ చేసావే”  చిత్రం లో మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాల అందంగా కుదిరింది. ప్రతి ఫ్రేం చాల క్వాలిటీ గా కనిపిస్తుంది. ఎక్కడ తడబడదు.  ప్రతి షాట్ ని పక్క ప్లాన్ చేసుకుంటే కాని రాదు అలా చిత్రీకరించటం. సినిమాతోగ్రఫి మీద గట్టి పట్టు ఉంటే తప్ప ఆది సాధ్యం కాదు. director, cinematographer టీం ఎంత క్లారిటీ గా ఉంటే అంతా బాగా జరుగుతుంది చిత్రీకరణ .(…)

గుండె భావాల బాలచందర్

గుండె భావాల బాలచందర్

సినిమా అంటే  కేవలం ఎంటర్ టైన్‌ మెంట్‌ కాదు. సినిమా జీవితాన్ని ప్రతిబింబించ గలగాలి, మానవ మనస్తత్వాల్లోని వైచిత్రిని బయటికి తీసుకురాగలగాలి. మానవ సంబంధాలలో వుండే విభిన్న కోణాలను చూపగలగాలి. గుండె లోతున దాగి వున్న భావాలను స్పృశించగలగాలి. అలాంటి సినిమా లు చేసే అతి కొద్దిమంది దర్శకుల్లో  మొదటి వరుసలో వుండే దర్శకుడు కె.బాలచందర్‌. విప్లవాత్మక ఆలోచనా ధోరణి, మనసు అంతరగాలను దర్శించగల సునిశిత దృష్టి..కె.బాలచందర్‌ ని వెండితెర పై మరపురాని చిత్రాల దర్శకుడి ని(…)

యాడ్‌ఫిల్మ్స్ రంగంలో తెలుగుతేజం

యాడ్‌ఫిల్మ్స్ రంగంలో తెలుగుతేజం

జూలై లో జరిగిన రెండురోజుల సినిమాటోగ్రాఫర్స్ సదస్సులో చాలానే టెక్నికల్ విషయాలు తెలుసుకున్నాము, రెండోరోజు సాయింత్రం సినిమాటోగ్రఫీ రంగంలో నిష్ణాతులైన వారికి లైఫ్‌ ఎచీవ్‌మెంట్ అవార్డ్స్ ప్రధానోత్సవం చేస్తున్నారు. అనిల్‌మెహత  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజెన్ కొఠారి గారిని అవార్డ్స్ ప్రకటించిమని కొరారు, రాజెన్ కొఠారి గారు శ్యామ్‌బెనగల్ చిత్రాలకు ఎక్కువగా సినిమాటోగ్రాఫర్ గా పని  చేసారు, ఆయన ప్రసంగం మొదలెడుతూ….”  నేను ఎప్పుడు మన ఫిల్మ్ ప్రోససింగ్ ల్యాబ్స్ వెళ్ళినా అక్కడ  కొన్ని నెగటివ్ ఫిల్మ్స్ ప్రోససింగ్(…)

గొప్పనటుడు,మానవతావాది ‘పాల్ న్యూమన్’

గొప్పనటుడు,మానవతావాది ‘పాల్ న్యూమన్’

ఆ వార్త విని హాలీవుడ్ ఆశ్చర్యపోయింది,అమెరికా సినిమా పరిశ్రమతో సంబంధమున్న ప్రతివారూ నివ్వెరపోయారు,మరికొందరు మౌనంగా శాపనార్ధాలు పెట్టగా పలువురు సంతోషం పట్టలేక ధారాళంగా అభినందించారు. 2008 సంవత్శరం జనవరి 29న పాల్ న్యూమన్,జొయన్ని తమ యాభయవ వివాహవార్షికోత్శవాన్ని జరుపుకోనుండటమే ఆ సంచలనానికి కారణం.అమెరికాలో చలనచిత్ర పరిశ్రమ ప్రారంభమైన అన్ని యేళ్ళలో అటువంటి ‘విపరీతవార్త’కనీవిని ఎరుగని విడ్డూరమే మరి!నాలుగు,ఆరు,ఎనిమిది ఇలా అసంఖ్యాకంగా జరిగే పెళ్ళిళ్ళు,అక్రమసంబంధాలు,విపరీత లైంగిక ప్రవర్తనలు,మాదకద్రవ్యాలు,మాఫియాతో సంబంధాలు ఇలా ఒకటేమిటి ఎన్ని రకాల అవలక్షణాలు,అనారోగ్యకరధోరణులుండాలో అన్నీ సమృద్ధిగా(…)

మొదటి సినిమా-వి.ఎన్.ఆదిత్య

మొదటి సినిమా-వి.ఎన్.ఆదిత్య

తన మొదటి సినిమా ‘మనసంతా నువ్వే’ తోనే ఘన విజయం సాధించిన వి.ఎన్.ఆదిత్య గారి అనుభవాలూ – జ్ఞాపకాలూ. నా చిన్నతనంలో నాన్నగారి ఉద్యోగరీత్యా చాలా ఊళ్ళు తిరిగాం. నాన్నగారు స్టేట్ బాంక్ లో పనిచేసేవారు. నేను 1972 ఏప్రిల్ 30 న ఏలూరులో పుట్టాను. నాకు చాలా కాలం తెలియనిదీ, నేను సినిమా రంగంలోకి వచ్చాకనే తెలిసిందీ ఏమిటంటే.. మా నాన్న గారికి ఆయన చిన్నతనంలోనే ఆదుర్తి సుబ్బారావు గారి వద్ద అసిస్టెంటుగా పనిచేసే అవకాశం(…)

మొదటి సినిమా-శ్రీను వైట్ల

మొదటి సినిమా-శ్రీను వైట్ల

‘నీకోసం’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమై, మొదటి సినిమాకే ఏడు నంది బహుమతుల్ని గెలుచుకుని, ‘ఎవరీ సరికొత్త టేకింగ్ ఉన్న కుర్రాడూ..!?’ అని అందరి దృష్టినీ ఆకర్షించిన శ్రీను వైట్ల ‘ఆనందం’ తో ఎంత సక్సెస్ సాధించారో అందరికీ తెలుసు. అప్పటినుంచీ తన దిగ్విజయయాత్ర కొనసాగిస్తున్న శ్రీను వైట్ల గారు తన మొదటి సినిమా జ్ఞాపకాలని ఇలా పంచుకుంటున్నారు.. మాది తూర్పు గోదావరి జిల్లా లో రామచంద్రాపురం దగ్గర ఉన్న కందులపాలెం అనే పల్లెటూరు. నాన్నగారు(…)

మొదటి సినిమా-సాగర్

మొదటి సినిమా-సాగర్

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్న సాగర్ తెలుగు చలనచిత్ర సీమలో సీనియర్ డైరెక్టర్. దాదాపు 30 సినిమాలకు దర్శకత్వం వహించిన సాగర్ లిస్టులో ‘అమ్మదొంగా’ ,‘అమ్మ నాకోడలా’ , ‘ఓసి నా మరదలా’ లాంటి హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన ‘రామసక్కనోడు’ కి మూడు నంది అవార్డులు కూడా వచ్చాయి. ఆయన నిర్మాతగా రూపొందించిన ‘ఆశల పల్లకి’ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ(…)

మొదటి సినిమా-ఆర్. నారాయణ మూర్తి

మొదటి సినిమా-ఆర్. నారాయణ మూర్తి

ఆవేశం అతని మారుపేరు.. విప్లవపంధా అతని జీవన మార్గం.. ప్రజా సమస్యలే అతని సినిమాకి కథా వస్తువులు.. మామూలు ప్రజలే అతని సినిమాలో పాత్రధారులు.. జేబులో చిల్లిగవ్వ లేకుండానే నిర్మాతా, దర్శకుడుగా మొదటి సినిమా నిర్మించిన కళాజీవి.. ఆర్. నారాయణ మూర్తి. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని వ్రాసుకోగలిగిన నిబద్ధత గల కళాకారుడు.. ఆయన మొదటి సినిమా అనుభవాలు.. ఆయన మాటల్లోనే.. మాది తూర్పుగోదావరి జిల్లాలోని మల్లంపేట. అమ్మ పేరు రెడ్డి చిట్టెమ్మ నాన్న(…)

మొదటి సినిమా – భీమినేని శ్రీనివాస రావు

మొదటి సినిమా – భీమినేని శ్రీనివాస రావు

మాది గుంటూరు జిల్లాలో తాటపూడి అనే చిన్న పల్లెటూరు. అమ్మ తిరుపతమ్మ, నాన్న రాఘవయ్య, అన్నయ్య వెంకట్రావు. ఇదీ మా కుటుంబం. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులేం లేవు. అమ్మ,నాన్నలు ఇద్దరూ చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు. సాధారణంగా అందరూ కష్టపడి చదువుకుంటారు. కానీ, మేము చదువుకోవటానికి కష్టపడాల్సి వచ్చింది.!! ఎందుకంటే ఎలిమెంటరీ స్కూల్ వరకూ మా ఊళ్ళోనే ఉన్నా, హైస్కూల్ చదువు కోసం పక్కనే ఉన్న(…)

‘వేదం’ రాములు

‘వేదం’ రాములు

రిలీజు రోజు సినీమ్యాక్స్ లో సినిమా దాదాపు మొత్తం ‘వేదం’ టీంతో చూడ్డం జరిగింది. షోకి ఇంకా టైం ఉందనగా ఫుడ్ కోర్ట్ లో కూర్చున్నా. పక్కన ఒక పెద్దాయన కూర్చొనున్నాడు. నేను ఒకసారి అతన్ని చూశా. దయగల ముఖం. సినీమ్యాక్స్ లోని ఆర్టిఫిషియాలిటీ మధ్య మూర్తీభవించిన సహజత్వంలాగా నవ్వాడు. ఎక్కడో చూశానే అనిపించింది. అప్పటికే నాకు వేదం సినిమా గురించి తెలిసుండటం వల్ల, ఎవరో గుర్తొచ్చింది. “మీరు…రాములు కదూ” అన్నా… “నాపేరు నాగయ్య” అన్నారు. నాకూ(…)

వేటూరి పాటే మంత్రము

వేటూరి పాటే మంత్రము

వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది.నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే.ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూఒ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర.కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు. పోనీ వేటూరి వెండితెర యాత్రనే తీసుకున్నా తలవని తలపుగా “ఓ సీత కథ”లో(…)

మొదటి సినిమా – లయ

మొదటి సినిమా – లయ

అందం, అభినయం సమపాళ్ళలో కలబోసుకున్న అచ్చమైన తెలుగింటి ఆడపడుచు, కుటుంబ చిత్రాల కథానాయకిగా పేరుతెచ్చుకున్న లయ తన చిన్ననాటి తీపి గుర్తుల్నీ, మొదటి సినిమా జ్ఞాపకాల్నీ మనతో పంచుకుంటున్నారు. నా చిన్నతనంలో నాన్నగారి వృత్తిరీత్యా ( ప్రస్తుతం నెఫ్రాలజిస్ట్ ) మద్రాసులో ఉన్నప్పుడు నేను ప్రి-నర్సరీ, నర్సరీ చదువుకున్నాను. తరువాత విజయవాడకి మారి ఎల్.కె.జి నుంచీ నేను సినిమా రంగానికి వచ్చేవరకూ ( ఇంటర్మీడియట్ ) విజయవాడలోని నిర్మలా కాన్వెంట్లో, హైస్కూల్లో చదువుకున్నాను. అమ్మా నాన్నలకి నేను(…)

మొదటి సినిమా – ముత్యాల సుబ్బయ్య

మొదటి సినిమా – ముత్యాల సుబ్బయ్య

తెలుగు సినిమా దర్శకుల్లో చక్కటి కుటుంబ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ముత్యాల సుబ్బయ్యగారు దాదాపు 50 సినిమాలకి దర్శకత్వం వహిస్తే 75 శాతం హిట్ సినిమాలే. ఒకే నిర్మాతకి ఐదారు సినిమాలు తీసి నిర్మాతల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుబ్బయ్యగారు. చిరంజీవి తో ‘హిట్లర్’ , ‘అన్నయ్య’ సినిమాలూ ; వెంకటేశ్ తో ‘పవిత్రబంధం’ , ‘పెళ్ళి చేసుకుందాం’ ; బాలక్రిష్ణ తో ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’ , ‘పవిత్రప్రేమ’ , ‘కృష్ణబాబు’ ; ఏ(…)

మొదటి సినిమా – అన్నే మోహన్ గాంధీ

మొదటి సినిమా – అన్నే మోహన్ గాంధీ

శ్రీ మోహన్ గాంధీగారు ‘కర్తవ్యం’ , ‘మౌనపోరాటం’.. లాంటి సందేశాత్మక, సామాజిక ప్రయోజనాత్మక చిత్రాలతోపాటు ‘మంచి మనసులు’ , ‘వారసుడొచ్చాడు’ లాంటి ఫేమిలీ సెంటిమెంట్ సినిమాలకూ దర్శకత్వం వహించి సూపర్‍ హిట్‍ చేసిన ఘనత ఆయనది. ఇంతవరకూ దాదాపు 40 సినిమాలకి పైగా దర్శకత్వం వహించిన గాంధి గారు కొన్ని కన్నడ సినిమాలకి కూడా దర్శకుడిగా పనిచేశారు. మొదటిసినిమా అనుకోగానే ఒక్కసారిగా మనసు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లింది. చిత్రరంగంలో పనిచేసే వాళ్లకి మొదటి సినిమా అంటే(…)

ప్రస్థానం మొదలు ‘ప్రస్థానం’ వరకూ…దేవ కట్ట (వీడియో) ఇంటర్వ్యూ

ప్రస్థానం మొదలు ‘ప్రస్థానం’ వరకూ…దేవ కట్ట (వీడియో) ఇంటర్వ్యూ

‘వెన్నెల’ చిత్రంతో తన ఉనికిని చాటుకుని, ‘ప్రస్థానం’తో తెలుగు సినిమాకి కొత్తరంగులు అద్ది, కథను నమ్మే పాతవైభవాన్ని మళ్ళీతెస్తాడేమో అన్న ఆశలు రేపిన దర్శకుడు దేవ కౌశిక్ కట్టా.  కాంబినేషన్లు, మూసకథలు, కమర్షియల్ హంగులు, నిరర్థకమైన ఫార్ములాలే సినిమా అనుకుంటున్న తెలుగు పరిశ్రమ, అగాధపు అంచులు అందుకుంటున్న ఈ తరుణంలో వచ్చిన ఒక చల్లని తెమ్మెర దేవ కట్టా.  సంచలనాల్ని నమ్మే ప్రరిశ్రమలో స్వయంకృషిని నమ్ముకునొచ్చిన కార్యశీలి దేవ. సినిమా మీద ప్రేమ. ఎంచుకున్న పనిమీద నమ్మకం.(…)

చిత్తూరు నాగయ్య

చిత్తూరు నాగయ్య

“చిత్తూరు నాగయ్య” పాత తరం వారికి పరిచయం అవసరం లేని పేరు. నేటి తరం వారికి పెద్దగా తెలియని పేరు.. పేరు విన్నాం మనిషి గుర్తు లేడు అనేవారికోసం ఈ వ్యాసం లో ఆయన ఫోటో కూడా పెట్టాను. ఆయన పేరు కూడా వినని వారికోసం ఆయన గురించి తెలుగు వీకీపీడియా వారి పరిచయ వాక్యాలు “చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక(…)

సహజ నటనలో బాద్ షా నసీరుద్దిన్ షా

సహజ నటనలో బాద్ షా నసీరుద్దిన్ షా

దాదాపు పాతికేళ్ళ క్రితం ఎనభైల్లో నేను “స్పర్ష్” (Sparsh)అనే సినిమా చూసాను. ఆర్ట్ సినిమాలకి అదే మొదటి పరిచయం నాకు. చాలా నచ్చింది నాకా సినిమా!. ఆ సినిమాలో అంధుడైన స్కూల్ ప్రిన్సిపాల్ గా నసీరుద్దిన్ షా నటన గురించి (దాన్ని నటన అనొచ్చా?)ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ తరువాత వదలకుండా నసీరుద్దిన్ షా నటించిన సినిమాలు చాలా వరకూ చూస్తూనే వున్నాను. అతని నటన ఎందుకో నటనలా అనిపించనే అనిపించదు. నిజంగా ఆ పాత్ర(…)

మొదటి సినిమా – కె. విశ్వనాథ్

మొదటి సినిమా – కె. విశ్వనాథ్

నా పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. నాన్నగారు కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు. అమ్మగారు కాశీనాథుని సరస్వతీ దేవి గారు. మేము ముగ్గురం సంతానం. నేను పెద్దవాడిని. నాకు ఇద్దరు చెల్లెళ్ళు. శ్యామలా దేవి, గిరిజా దేవి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని ’పెదపులివర్రు’ అనే గ్రామం. మా తాతగారు పరమ నిష్ఠాగరిష్టుడు. మనదేశానికింకా స్వాతంత్ర్యం రాక ముందు జరిగిన సంఘటన. తాతగారు కాంగెస్ వాలంటీర్లకి భోజనం పెట్టారనే నెపంతో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని అరెస్టు(…)

త్రిష – సమంతాల అందమైన గొంతు: చిన్మయి

త్రిష – సమంతాల అందమైన గొంతు: చిన్మయి

తమిళంలో ‘విన్నైతాండివరువాయా’, తెలుగులో ‘ ఏ మాయ చేసావో’ సినిమాలు నచ్చినా నచ్చకపోయినా ప్రేక్షకులందరికీ నచ్చేది హీరోయిన్లు త్రిష-సమంత కు డబ్బింగ్ చెప్పిన గొంతు. ఆ అందమైన గొంతే లేకపోతే కథానాయిక పాత్రలోని సంక్లిష్టత ఎలివేట్ అయ్యుండదనేది సినిమా చూసిన ఎవరైనా ఖచ్చితంగా చెప్పే విషయమే. ఆ అందమైన గొంతు గాయని “చిన్మయి”ది. ఈ సినిమాల్లో డబ్బింగ్ చెప్పిన అనుభవాల్ని  తన బ్లాగులో ఇలా పంచుకుంది. As always I write about this here only(…)

భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం “ఆరోచూ.. ..”

భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం “ఆరోచూ.. ..”

ఈ సంక్రాంతి కి రోటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు ఏమైన షూటింగ్ ప్రారంభమైతవా లేదా అని ఆనుకుంటున్న వారికి ఒక శుభ వార్త అదేంటంటే… (1995 నుంచి) దశాబ్ద కాలాని కి పైనుంచే రవిరాజ పినిశెట్టి, సి కల్యాణ్,ఈ వి వి సత్య నారాయణ ,పూరి జగన్నాధ్, ఉషాకిరణ్ మూవిస్ లో ఇత్యాది ప్రముఖ నిర్మాతలు , దర్శకుల ఎన్నో కమర్షియల్ సినిమాలకు రచయితగా,మరియు దర్శకత్వ విభాగం లో ను పనిచేస్తు వచ్చిన నా మిత్రుడు(…)

తెలుగులో మహిళా దర్శకులు

తెలుగులో మహిళా దర్శకులు

తెలుగు సినిమా ప్రపంచంలో మొట్టమొదటి మాటల ( టాకీ ) సినిమా తీసి సుమారు 77 ఏళ్ళు కావస్తోంది. ఇన్నేళ్ళలోనూ తెలుగు సినిమా అనేక సాంకేతిక హంగులు సంతరించుకొనీ, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సినిమాలు తీసే భాషా చిత్రాల సరసన చేరింది. ఇంతవరకూ వందల కొద్దీ దర్శకులు పుట్టుకొచ్చారు. అనేక చిత్రాలు తీసారు. ఈ దర్శకుల జాబితా సరిగ్గా పరికిస్తే ఈ దర్శకుల్లో అధిక శాతం పురుషులే! నటులు వేషం మార్చి దర్శకులయ్యారు. రచయితలూ రూపాలు మార్చారు.(…)

గడుగ్గేయకారుడు: వేటూరి-రెండవ భాగం

వేటూరి మానవ జీవితంలోని అన్ని అనుబంధాలలోని అన్ని కోణాలను తనదైన కవి హృదయంతో దర్శించారు. దాంపత్య జీవితంలోని అనురాగాన్ని కంటి తడిలో చూపించి… భార్యాభర్తలే సిరులన్నింటినీ మించిన చిరునవ్వులనీ అత్యంత హృద్యంగా చెప్పారు. (మా ఇంటిలోన మహలక్ష్మి నీవే.) వేటూరి కలం – సరస సరాగాల సుమవాణిని -శిలలతో సైతం వినిపించేలా చేసింది. పదం-పాదం కలిసిన నర్తనలో పరుగు గౌతమినే- పరవళ్లు తొక్కించింది. (నిన్నటి దాకా శిలనైన.) వేటూరి ఎంతో హృద్యమైన పాటలను సైతం రాశారు. మాటలనే(…)

గడుగ్గేయకారుడు: వేటూరి-మొదటి భాగం

గడుగ్గేయకారుడు: వేటూరి-మొదటి భాగం

తెలుగు సినిమా ఒక అందమైన తోట… అందులో ఒక పాటల చెట్టు… ఆ చెట్టులోని కొమ్మకొమ్మకో సన్నాయిలను పూయించి… రాగాల పల్లకిలో ప్రేక్షకులను- ఊయలూగించిన పదాల మాంత్రికుడు… వేటూరి సుందరరామమూర్తి! తెలుగు పాటను పరవళ్లు తొక్కించి, ఉరకలెత్తించిన గీతర్షి ఆయన! తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేసి ఆకుచాటు పిందెను, కొండమీద చందమామను పదాలతో సాక్షాత్కరించజేసిన పదచిత్రకారుడు వేటూరి. ఆకాశదేశాన… ఆషాఢమాసాన, నవమి నాటి వెన్నెలని చూపించి రగులుతున్న మొగలిపొదలో చిలక్కొట్టుడు చిన్నదాన్ని మంచమేసి దుప్పటేసి(…)