ముఖాముఖి

అడూర్ తో ముఖాముఖి- తొమ్మిదవ భాగం

అడూర్ తో ముఖాముఖి- తొమ్మిదవ భాగం

ప్ర: స్వయంవరం ని సృష్టించడంలో ఇతర సినిమాల ప్రభావం కానీ దర్శకుల ప్రభావం కానీ ఉందంటారా? అడూర్: స్వయంవరంలో కొంతవరకూ ఘటక్, (సత్యజిత్) రే ల ప్రభావం కొంచెం ఉంటే ఉండొచ్చు. ఆ తరవాత సినిమాల్లో మాత్రం కచ్చితంగా లేదు. ఘటక్ సినిమా సుబర్ణరేఖ లాగా ఉంది అని కొందరన్నారు స్వయంవరం గురించి. అందులో కూడా ఒక యువ జంట లేచిపోయి పట్నం వెళ్ళడం జరుగుతుంది. కానీ స్వయంవరం ముఖ్యంగా ఆ ప్రయాణం గురించి. ఘటక్ సినిమాతో(…)

అడూర్ తో ముఖాముఖి- ఎనిమిదవ భాగం

అడూర్ తో ముఖాముఖి- ఎనిమిదవ భాగం

ఇండియన్ న్యూ వేవ్ లో తీసిన సినిమాలు చాలా మట్టుకు పల్లెల కథలతో, అక్కడి కుల, వర్గ, హింస సమస్యలతో తీసారు. కానీ అందుకు భిన్నంగా స్వయంవరం పట్టణంలో జరిగే ప్రేమకథ. కేరళలో ఈ పల్లెల కుల హింస ఇలాంటివన్నీ ఎప్పుడో జరిగినాయి, అది వర్తమాన చరిత్ర కాదిక్కడ. అందుకని అలాంటి కథలు సృష్టించడం ఉన్న సామాజిక నిజాన్ని వక్రీకరించడం అవుతుంది. ఎప్పుడో ముప్ఫయ్యేళ్ళ క్రితం కేరళలో తీసిన సినిమా ఇవ్వాళ్టి పేరిసియన్ (Parisian) యువతీ యువకులు ఇష్టపడ్డారంటే చూడండి. అందులో కథ విశ్వాత్మకం. అది ప్రధానంగా యువత గురించి .. వాళ్ళ ఆశలూ, ఆశయాలూ, కష్టాలూ. అది ఒక నిజ జీవిత సంఘటన గురించి .. ప్రేక్షకుణ్ణి పట్టుకుని విడవని గుణం ఒకటుంది అలాంటి సన్నివేశంలో.

అడూర్ తో ముఖాముఖి- ఏడవ భాగం

అడూర్ తో ముఖాముఖి- ఏడవ భాగం

ప్ర: మీరు డిప్లమా కోసం తీసిన సినిమా దేన్ని గురించి?

అడూర్: దానికి “గొప్ప రోజు” (A Great Day) అని పేరు పెట్టాను. ఒక పరమ బద్ధకస్తుడి గురించి, హాస్యభరితమైన కథ. ఆ రోజున ఈ బద్ధకస్తుడు పెళ్ళిచేసుకుందా మనుకున్న అమ్మాయి తండ్రి (కాబోయే మావగారు) మొదటిసారి అతణ్ణి చూడ్డానికి వస్తారు. వీడెంత బద్ధకస్తుడంటే ఎప్పుడూ ఏదీ సర్దడు, తన గదినైనా శుభ్రంగా ఉంచుకోడు. పొద్దున్నే పక్కలోంచి లేవకుండానే గుమ్మం దగ్గర్నించి పాలసీసా లోపలికి తెచ్చుకోడానికి బ్రహ్మాండమైన పద్ధతి కనిపెట్టిన ఘనుడు. ఆ రోజున పాపం గది సర్దుదామని అనుకుంటాడు గానీ వాడి వల్ల కాదు.

అడూర్ తో ముఖాముఖి- ఆరవ భాగం

అడూర్ తో ముఖాముఖి- ఆరవ భాగం

ప్ర: తిరువనంతపురంలోనా? అడూర్: జోనల్ కార్యాలయం తిరువనంతపురంలోనే కానీ పని కోసం కేరళ అంతా తిరగాల్సి వచ్చేది. పని కూడా ఆసక్తి కరంగానే ఉండేది. ఏమంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశాలకి వెళ్ళి, అక్కడక్కడా కొన్నాళ్ళైనా ఉండి వచ్చే అవకాశం అది. ఇలాంటి మారుమూల చోట్లకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఏదైనా కొట్టు పైన చిన్న గది ఖాళీ ఉంటే అందులో ఉండేవాణ్ణి. ఆ రోజుల్లోనే నెలకి ఆరొందలంటే, మంచి జీతమే. ఒక కాలేజి(…)

అడూర్ తో ముఖాముఖి- ఐదవ భాగం

అడూర్ తో ముఖాముఖి- ఐదవ భాగం

ప్ర: కళాశాలలో ఉండగా ఎటువంటి నాటికల్లో ఆసక్తి ఉండేది? అడూర్: ఎక్కువ సాంఘికాలే. తొప్పిల్ భాసి, ఎస్సెల్ పూరం ప్రభ్రుతుల నాటికలు వేసేవాళ్ళం. అప్పట్లో చాలా బహుమతులు కూడా సంపాయించాను. గాంధీగ్రాంలో చదువుతుండగా అనియార అని ఒక నాటిక చేశాను. అది ఆ రోజుల్లో నాటికల పోటీల్లో మొదటి బహుమతి గెల్చుకుంది. అదొక తమాషా ఇతివృత్తం. నాటిక వెయ్యడానికి సిద్ధపడుతున్న ఒక ఎమెచ్యూర్ ట్రూపు కథ .. నాటిక అంతా గ్రీన్ రూములో జరుగుతుంది. నాటికలో నాటిక(…)

అడూర్ తో ముఖాముఖి-నాలుగవ భాగం

అడూర్ తో ముఖాముఖి-నాలుగవ భాగం

ప్ర: బహుశా ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం కావచ్చు. ఒక సాంస్కృతిక బీజం నించి పుట్టిన మర్రి చెట్టు బలంగా వేళ్ళూనుకుని మిగతా చిన్న చిన్న సంస్కృతిక మొక్కల్ని బతకనీయకుండా చేస్తున్నది. అడూర్: అవును. ఇవ్వాళ్ళ మనం డబ్బు తెచ్చి పెట్టేవి మాత్రమే ముఖ్యమైనవని అనుకుంటూన్నాం. ఈ క్రమంలో మన ఉనికినే మనం మర్చిపోతున్నాం. అంతే కాకుండా .. ఈ చిన్న సంస్కృతులు తమని తాము తక్కువగా, కించపరుచుకుంటూ చూసుకునే పరిస్థితి తయారవుతున్నది. వలసవాద పిచ్చి(…)

అడూర్ తో ముఖాముఖి-మూడవ భాగం

అడూర్ తో ముఖాముఖి-మూడవ భాగం

ప్ర: సమకాలీన భారతీయ కళ ఈ సంప్రదాయానికి దీటుగా ఎదిగిందా? అడూర్: అసలు మనం మనదైన, మన స్వంతమైన ఒక సంప్రదాయం అనేదాన్ని ఎరిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇటీవలి కాలాన్ని దాటి చూస్తున్నామా? అసలు మన చుట్టూనే రోజూ జరిగే సంఘటనలనే ఒక తదేక దృష్టితో పట్టించుకుంటున్నామా? నా సినిమాల్లో కాకులు, కుక్కలు, బల్లులు ఇలాంటి వాటినన్నిటినీ అనేక రకాలుగా ఉపయోగించుకున్నాను. ఇవన్నీ ఎవరన్నా గమనించారో అర్ధం చేసుకున్నారో లేదో(…)

అడూర్ తో ముఖాముఖి-రెండవ భాగం

అడూర్ తో ముఖాముఖి-రెండవ భాగం

ప్ర: మీరు సినిమా తీసే పద్ధతి మీద కథకళి ప్రభావం ఉండనిపిస్తుంది .. దాని మూలాంశాలు, ఒక రంగ దృశ్య రచన (mise-en-scene), స్టేజిమీద పాత్రలు స్పష్టమైన విభజనతో గుర్తించబడుతూనే, అందులోనే తాత్కాలిక సృజనకి అవకాశం ఇవ్వడం. అంటే, ఒకే సారి వంగగలిగేలా ఉండటమూ దృఢంగా ఉండటమూ కనిపిస్తాయి. ఈ లక్షణం మీ సినిమాలకి కూడా వర్తిస్తుంది .. పాత్రల పరిచయంలో, దృశ్యాల అమరికలో. అడూర్: కావచ్చు. ఒక డొంక తిరుగుడు పద్దహ్తిలో అలాంటి ప్రభావం ఏవన్నా(…)

అడూర్ తో ముఖాముఖి-మొదటి భాగం

అడూర్ తో ముఖాముఖి-మొదటి భాగం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలయాళీ దర్శకుడు ఆడూర్ గోపాల్ కృష్ణన్ తో ’సినిమా ఆఫ్ మలయాళం’ అనే వెబ్ సైట్లో ’డీప్ ఫోకస్’ పేరుతో సి.యస్.వెంకటేశ్వరన్ గారు నిర్వహించిన ముఖాముఖి ని తెలుగులోకి అనువదించి నవతరంగం పాఠకులకు అందచేయాలనే మా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అనుమతి ఇచ్చిన రాజగోపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ముఖాముఖి ద్వారా ఆడూర్ తన జీవితం-సినిమా గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియచేశారు. పాతిక పేజీలు పైగా ఉన్న ఈ ముఖాముఖి(…)

కె.బాలచందర్:ప్రశ్నలు-జవాబులు

కె.బాలచందర్:ప్రశ్నలు-జవాబులు

దాదాపు పదేళ్ల క్రితం… అప్పటికింకా నవతరంగం మొదలు కాలేదు. బెంగుళురు లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో బాలచందర్ “తనీర్ తనీర్” సినిమా స్క్రీనింగ్ కి వెళ్ళాను. అప్పటికి నేను సినిమాల గురించి రాయాలన్న ఆలోచనే లేదు. కానీ సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో ఉన్న సినిమా పుస్తకాలు చూసి మనకీ తెలుగులో ఎవరైనా రాస్తే బావుండనిపించింది. సినిమా అయ్యాక బాలచందర్ గారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఆయనతో చేసిన ఇంటర్వ్యూ ఇది.(…)

ప్రస్థానం మొదలు ‘ప్రస్థానం’ వరకూ…దేవ కట్ట (వీడియో) ఇంటర్వ్యూ

ప్రస్థానం మొదలు ‘ప్రస్థానం’ వరకూ…దేవ కట్ట (వీడియో) ఇంటర్వ్యూ

‘వెన్నెల’ చిత్రంతో తన ఉనికిని చాటుకుని, ‘ప్రస్థానం’తో తెలుగు సినిమాకి కొత్తరంగులు అద్ది, కథను నమ్మే పాతవైభవాన్ని మళ్ళీతెస్తాడేమో అన్న ఆశలు రేపిన దర్శకుడు దేవ కౌశిక్ కట్టా.  కాంబినేషన్లు, మూసకథలు, కమర్షియల్ హంగులు, నిరర్థకమైన ఫార్ములాలే సినిమా అనుకుంటున్న తెలుగు పరిశ్రమ, అగాధపు అంచులు అందుకుంటున్న ఈ తరుణంలో వచ్చిన ఒక చల్లని తెమ్మెర దేవ కట్టా.  సంచలనాల్ని నమ్మే ప్రరిశ్రమలో స్వయంకృషిని నమ్ముకునొచ్చిన కార్యశీలి దేవ. సినిమా మీద ప్రేమ. ఎంచుకున్న పనిమీద నమ్మకం.(…)

“రాక్ స్టార్” మ్యూజిక్ ఆల్బం రూపకర్త  నవీన్ దలవాయ్ తో ముఖాముఖి

“రాక్ స్టార్” మ్యూజిక్ ఆల్బం రూపకర్త నవీన్ దలవాయ్ తో ముఖాముఖి

సా‍ఫ్ట్ వేర్ ఇంజినేర్ నవీన్ దలవై తన తొలి ప్రయత్నం ”రాక్ స్టార్” ఆడియో ఆల్బమ్‍తో ఇప్పటికే బాగా ప్రాచూర్యుం పొందుతున్నారు. ఇటీవలే లహరి ఆడియో కంపెనీ ”రాక్ స్టార్” డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని త్వరలోనే ఈ ఆల్బమ్‍ని మన ముందుకు తీసుకురానున్నది. కమ్మని గీతాలు, ఫ్రెష్ వాయిస్, ఉన్నతమైన ప్రొడక్షన్ ప్రమాణాలు ”రాక్ స్టార్” ఆల్బమ్ విజయానికి వెన్నుముకలు. సంగీత సరస్వతి ఇళయరాజా ”రాక్ స్టార్” పాటలు విని నవీన్‍కు మంచి భవిష్యత్ వుందని కొనియాడారు.(…)

సంగీత దర్శకుడు కార్తిక్ తో ముఖాముఖి

సంగీత దర్శకుడు కార్తిక్ తో ముఖాముఖి

విజయానికి దగ్గరి దారులు ఉండవు అని చాల మంది చెప్తుంటారు, కాని వాస్తవం ఏమిటంటే షార్ట్ కట్ వెతకడమే విజయం అనే విషయం చాలమందికి బోధ పడదు. కొంతమంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కాని చాల మంది మాత్రం బయటెక్కడో ఏదో సాధిస్తేనే ఇక్కడి వారు గుర్తిస్తారు ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో. నిన్న మొన్నటి వరకు సినిమా అంటే అభిరుచి ఉన్నవారంతా ఏ మద్రాసుకో లేదా ముంబాయికో లేదా హైదరాబాదు ఫిల్మ్ నగర్ లకు(…)

రహమాన్ తో ముఖాముఖి – పాఠకులకు సంక్రాంతి కానుక

రహమాన్ తో ముఖాముఖి – పాఠకులకు సంక్రాంతి కానుక

మనమందరమూ మన అంతరాత్మలను అన్వేషించుకోవాలి.అదే విజయానికీ,ఆనందానికీ గల రహస్యం–ఎ.ఆర్.రహమాన్ సాధారణ సంగీత ఔత్శాహికుడి నుంచి,దేశంలోని అత్యంతప్రభావవంతమైన, శక్తివంతులైన సాంస్కృతికమూర్తుల్లో ఒకరిగా ఎదిగిన వ్యక్తి అల్లా రఖా రహమాన్. భారతీయ సంగీత పునరుజ్జీవానికి అసలు సిసలు కధానాయకుడైన రహమాన్ పేరుతో ఎలా తమను జోడించుకునేందుకైనా సగర్వంగా భావించుకునేవారికి కొదవేలేదు.’మొజార్ట్ ఆఫ్ మద్రాస్’ గా విఖ్యాతిగాంచిన రహమాన్ 43వ జన్మదినసందర్భంగా,జీవితం,తత్వం,ప్రేమ,భవిష్యభారతం లాంటి అంశాల గురించి విజే సాయి తో జరిపిన సరదా సంభాషణ నవతరంగానికి ప్రత్యేకం. మొదటి సన్నివేశం చెన్నయ్(…)

కొత్త దర్శకుడితో కొత్త పరిచయం -ముఖాముఖి

కొత్త దర్శకుడితో కొత్త పరిచయం -ముఖాముఖి

మొదటి భాగం కోసం ఇక్కడ నొక్కండి. అప్పటిదాకా దాదాపు చాలారొజుల తరువాత కలిసిన స్నేహితుల్లాగా మాట్లాడేసుకున్న తరువాత, ‘వినాయకుడు’ సినిమా విషయం చర్చకు రాగానే ఆ సినిమా నాకు in parts మాత్రం నచ్చిందన్న నిజం గుర్తుకొచ్చింది. ఈ సారి కొంత “ఫ్రొఫెషనలిజం” చూపిద్ధామని ఒట్టుపెట్టుకున్నాను.ప్రశ్నలేతప్ప చర్చలొద్దని నిర్ణయించుకున్నాను. కానీ ప్రశ్నలడుగుతున్నంతసేపూ ఆత్మారాముడు స్వగతంగా ఏదో ఒకటి వాగుతూనే వుంటే వాడి మాటల్తో కలిపి ఈ ఇంటర్వ్యూ ఇలా తయారయ్యింది… నేను (నే): ‘వినాయకుడు’… అసలీ టైటిల్(…)

కొత్త దర్శకుడితో కొత్త పరిచయం

కొత్త దర్శకుడితో కొత్త పరిచయం

మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ చేరుకున్నాను.ఫోన్ లో మళ్ళీ ఆఫీస్ అడ్రస్ అడగాల్సొచ్చింది. ఒకటో సారి. రెండో సారి మూడో సారి. అదే గొంతు విసుగులేకుండా ఓపిగ్గా డైరెక్షన్స్ చెబుతుంటే…’కొత్తగా విజయాన్ని దక్కించుకున్న ఒక నూతన సినీదర్శకుడు ఇంకా సాధారణంగా ఉన్నాడంటే అసాధారణమే’ అనిపించింది. ఆఫీస్ లోపలికి అడుగుపెట్టాను. అప్పుడే కొత్తగా ఏర్పాటుచేసుకుంటున్న పార్టిషన్లు ఇంకా పని జరుగుతున్నట్లుగా సంకేతాలందించాయి. ఆదివారం కాబట్టి వర్కర్లు పని చెయ్యడానికి రాలేదేమోగానీ, లేకుంటే the office would have(…)

అనురాగ్ బసు తో ముఖాముఖి

అనురాగ్ బసు తో ముఖాముఖి

Anurag Basu is one of the few prolific Bollywood film makers of current times. Anurag directed blockbuster movies Murder, Gangster, Life in a Metro, each with an elusive concept. Anurag is currently filming KITES in New Mexico and Nevada, US. It was a pleasure meeting him here in Santa Fe, New Mexico quite a few(…)

కాబోయే దర్శకుడు సునీల్ సుబ్రమణి తో ముఖాముఖి

కాబోయే దర్శకుడు సునీల్ సుబ్రమణి తో ముఖాముఖి

నవతరంగంలో రాసే వాళ్ళు, చదివే వాళ్ళలోచాలా మంది చలనచిత్ర దర్శకులవడానికి కృషి చేస్తున్నారన్న విషయం తెలిసేవుంటుంది. అసలు సినిమా దర్శకుడు ఎలా అవ్వాలి, దర్శకత్వ శాఖలో పనిచేయడానికి అవసరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఇప్పటికే సినిమా దర్శకులైన వారికంటే ఇప్పుడిప్పుడే చలనచిత్ర రంగంలోకి అడుగులు వేస్తున్న సహాయ దర్శకులను (assistant director) అడిగి తెలుసుకుంటే మేలని నా అభిప్రాయం. అందుకే మొన్నీ మధ్య అమెరికాలో Kites అనే బా(హా)లీవుడ్ చిత్రం షూటింగ్ లో ఆ చిత్ర చీఫ్ అసిస్టెంట్(…)

సినిమా వాళ్ళతో ముఖాముఖి

MSN ఇండియా వెబ్‍సైటు తెలుగులో వుందని తెలుసు గానీ పెద్దగా ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు చూస్తుంటే కొన్ని ఇంటర్వ్యూలు కనిపించాయి. “తెలుగు సినీ సాహిత్యం-భాషా సాహిత్య విలువలు” సదస్సులో పాల్గొన్న పరుచూరి “సినిమాల వల్ల జనం చెడిపోరని, సామాజిక విలువలే వారిని ప్రభావితం చేస్తాయని” అంటున్నారు. శ్యామ్ బెనగల్ తన ఇంటర్వూలో “పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటే ఇమేజ్ చట్రం అడ్డు వస్తుంది.” అంటున్నారు. పూరీ జగన్నాధ్ తన ఇంటర్వ్యూలో “నేను గనక సమాజాన్ని చైతన్య(…)