వ్యాసాలు

సినీ ప్రముఖులు రచించిన ప్రత్యేక వ్యాసాలు

కృషీ వలుడు అక్కినేని – ఆచార్య ఆత్రేయ

కృషీ వలుడు అక్కినేని – ఆచార్య ఆత్రేయ

అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు(వివరాలు ఉన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు.అమ్మాడు. మరొక ఇల్లు కట్టాడు. అమ్మాడు. హైదరాబాద్ లో ఒక ఇల్లు కొన్నాడు. ఇంకొక ఇల్లు కడుతున్నాడు. పొడి చేస్తాం, దంచేస్తాం అనే ఒక(…)

One Flew Over the Cuckoo’s Nest

One Flew Over the Cuckoo’s Nest

సినిమా అంటే కేవలం కథ ఒక్కటే కాదు; అందులో చాలా విషయాలు కలిసిపోయుంటాయి. మంచి కథ సైతం చెత్త సినిమా గా తయారవ్వొచ్చు; సాధారణ కథని సైతం అద్భుతమైన సినిమాగా రూపొందిచవచ్చు. అందుకు తోడ్పడే అంశాల్లో స్క్రీన్ ప్లే రచన, కెమెరా పనితనం, ఏడిటింగ్, నటన…ఇలా చాలా ఉన్నాయి. ఇప్పటివరకూ కథాంశం ప్రధానంగానే ఈ వ్యాసాలు కొనసాగినా, ఇక నుంచి సాంకేతిక అంశాలు, తాత్విక విషయాలను కూడా చర్చించాలని ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ప్రయత్నం.(…)

Zombie – జీవమున్న శవం

Zombie – జీవమున్న శవం

  పడమటి ఆఫ్రికాలో కొన్ని మంత్ర తంత్ర శక్తులూ నమ్మకాలకి సంభందించిన పదం జోంబీ ..దాని అర్థం ‘బ్రతికిన శవం’. శవానికి  తంత్ర విద్య ద్వారా ప్రాణంపోస్తే  జోంబీ అంటారు. అలా బతికించి దాన్ని ఒక బానిసగా వాడుకుంటారట.అయితే అవి మామూలు మనుషుల్లా ఉండక నడవలేక నడుస్తూ వింతగా ఉంటాయి.  మైకెల్ జాక్సన్ థ్రిల్లర్ లో స్మశానంలోంచి లేచొచ్చిన శవాలమీద చిత్రీకరించిన పాట ఎంత గొప్ప హిట్టో మనకి తెలిసిందే.   ఆ చరిత్ర అటుంచితే..  పాశ్చ్యాత్యులు (…)

Welcome

Welcome

వృత్తానికి ఒక్క కేంద్రమే అయినట్లు అతని బ్రతుక్కి ఆమె ఒక్కటే లక్ష్యం. ఒన్…టూ…థ్రీ! మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి కుడి వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఒన్…టూ…థ్రీ! మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి ఎడమ వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఇలా చేస్తున్నంత సేపు, నీళ్లలో కాళ్ళాడిస్తూ, చేతులను కిందకి పైకి ఆడిస్తూ నీటిలో ముందుకు పోవాలి.(…)

Midnight in Paris

Midnight in Paris

నోస్టాల్జియా అంటే బాధాకరమైన వర్తమానాన్ని నిరాకరించడమేనా? వర్షం లో ప్యారిస్ నగరం కొత్త అందాలతో మెరిసిపోతోంది. చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి ప్యారిస్ నగరానికి వచ్చాడు గిల్. అమెరికాలో అతనో సినిమా కథలు రాసే రచయిత. కానీ ఇప్పుడు అతనికి సినిమా కథల మీద ఆసక్తి పోయింది. ఒక నవల రాయాలన్నది అతని ఆలోచన. కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇక కూర్చోని రాయడమే మిగిలుంది. అతని కథలో హీరో ఒక నోస్టాల్జియా షాప్ లో(…)

Children of Heaven

Children of Heaven

అందమైన జీవితమంటే అన్నీ ఉండడం కాదు. ఏది అవసరం లేదో తెలుసుకోవడం. సాయంత్రమైంది. ఆలీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ పని చెప్పింది. మొదట చిరిగిపోయిన చెల్లిలి స్కూల్ షూస్ కుట్టించుకు రావాలి. ఆ తర్వాత బేకరీ కి వెళ్లి రొట్టెలు కొనాలి. చివరిగా కూరగాయల షాప్ లో కేజీ ఆలుగడ్డలు కొనాలి. మొదటి రెండు పనులూ అయిపోయాయి. కూరగాయల షాప్లోకి వెళ్తూ చెల్లెలి షూస్ ని, రొట్టెలున్న సంచీ ని బయటే వదిలి లోపలకి(…)

ఏక్ డాక్టర్ కీ మౌత్

ఏక్ డాక్టర్ కీ మౌత్

కొన్ని సన్నివేశాలు పదే పదే పునరావృతం కాకూడదన్న ఆశయమే ఈ సినిమా కలకత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక చిన్నపాటి వైద్యుడిగా పని చేస్తున్న దీపాంకర్ రాయ్ చాలా స్వార్థపరుడు. తనమీద తనకి అపారమైన నమ్మకం. తన మీద అనడం కంటే తన పని మీద అనడం సబబు. రెండు గదుల ఇరుకు ఇల్లు. పగలంతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం. రాత్రంతా తన ఇంట్లోని ఒక గదిలో ఏర్పరుచుకున్న ప్రయోగశాలలో అలుపెరగని పరిశోధనలు. పది సంవత్సరాలుగా ఇదే(…)

As it is in Heaven

As it is in Heaven

కళ నెరిగి, అనుభవైకవేద్యంగా తెలుసుకుంటే- దైవాన్ని ఎరిగినట్లే. పికాసో అనే చిత్రకారుడు ఒక రోజు సాయంత్రం సముద్రతీరాన నుంచొని ఒక తైలవర్ణచిత్రం చేస్తున్నాడు. అతను తన చిత్రాన్ని పూర్తి చేసి దానికి తుది మెరుగులు దిద్దుతూ యధాలాపంగా దాన్నొకసారి, ఒక్క అడుగు ఇవతలికి వేసి చూశాడు. ఇది తాను వేసిన చిత్రమేనా అని ఎందుకో అనుమానం కలిగి, ఆ చిత్రాన్ని మరింత పరీక్షగా చూశాడు. అతడికే అర్థం కాని ఓ రకమైన సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు పికాసో. ఆ(…)

Ikiru

Ikiru

జీవితం ఒక తెల్లకాగితం లాంటిది; చాలా కొద్దిమంది మాత్రమే దానిమీద తమ సంతకాలను వదిలివెళ్లగలరు. ఈయన పేరు వతానబే. ఇతనే మన కథకి నాయకుడు. ఈయనంత బోరింగ్ మనిషి ఇంకెవరూ ఉండబోరు. శాశ్వతమైన ఈ జీవన ప్రవాహంలో, తమ సంబంధమేమీ పెద్దగా లేకుండానే కొట్టుకుపోతున్న కోట్లాదిమందిలో ఈయనా ఒకడు. ఈయన ఒక ప్రభుత్వ అధికారిగా ముప్ఫై ఏళ్లకు పైగా గానుగెద్దులా, ఏ ఒక్క రోజూ శెలవు తీసుకోకుండా పని చేస్తూ వచ్చాడు. ప్రస్తుతానికి బతికుండడానికి, బతకడానికి మధ్య(…)

A Separation

A Separation

ఇది సామాన్య శాస్త్రం. ఇక్కడి సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.   పై ఫొటో లో ఉన్న వీరి పేర్లు సిమిన్, నాదెర్.ఇద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందిన వారే! ఉద్యోగస్థులు; చాలామందితో పోలిస్తే బాగా ఉన్నవాళ్లు. పన్నెండేళ్ల కి పైగానే దాంపత్య జీవితం; పదకొండేళ్ల కూతురు. వీళ్లు నిన్నమొన్నటి వరకూ అన్యోన్య దాంపత్యంలో భాగస్వాములు; నేడు విడాకులు కావాలని కోర్టుకెక్కిన అర్జీదారులు. తమ దేశంలో కంటే విదేశాల్లోనే తమకీ, తమ కూతురుకీ సరైన భవిష్యత్తు ఉంటుందని భావించి,(…)

Blow-Up

Blow-Up

అంతా శూన్యమే, మనిషీ శూన్యమే ! ఉదయాన్నే వికసించి కళ్ళకు అందంగా కనిపించిన పువ్వు, సాయంకాలానికి వాడి నేల రాలుతుంది. బహుశా అశాశ్వతమైన ఆ పువ్వు అందాన్ని శాశ్వతం చెయ్యాలనుకోవడంలో కళ పుట్టి ఉండొచ్చు. ఆ పువ్వు యొక్క చిత్రాన్ని తనకి దొరికిన పనిముట్లతో కొండ గుహల్లో చిత్రీకరించి ఉంటాడు ఆదిమ మానవుడు. మానవుడి ఎదుగుదలతో పాటే ఎదుగుతూ వచ్చింది కళ. కళ్ళ ముందు కనిపించిన పువ్వు ని ఉన్నదున్నట్టుగా, ఇది నిజంగా పువ్వేమో అని అనుమానపడేంతగా(…)

Grave of the Fireflies

Grave of the Fireflies

మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం చూతము రారండి సెప్టెంబర్ 21, 1945. నేను ఆఖరి శ్వాస విడిచింది ఆ రోజు రాత్రే! రైల్వే స్టేషన్లో జనాల హడావుడి. ప్లాట్‍ఫాం పై ఒక మూల కూర్చుని ఉన్నాను. ఒంట్లో నీరసం. అక్కడ్నుంచి అడుగు వెయ్యలేని దుస్థితి. ఎంత సేపు అక్కడ కూర్చున్నానో, ఎప్పుడు నా ప్రాణం పోయిందో కూడా తెలియదు; దిక్కులేని చావు చచ్చిన నా శవాన్ని అసహ్యంగా చూస్తూ జనాలు ముందుకు కదుల్తున్నారు. ప్లాట్‍ఫాం శుభ్రపరిచే ఒకతను నా(…)

ఇంగ్మర్ బెర్గ్మన్

ఇంగ్మర్ బెర్గ్మన్

జులై 14, 1918 లో స్వీడెన్ లోని ఉప్శల అనే ప్రదేశంలో పుట్టి, 1946లో Crisis అనే చిత్రం ద్వారా చలనచిత్ర ప్రపంచంలోనికి అడుగుపెట్టి, The Seventh Seal, Wild Strawberries, Fanny and Alexander లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గాంచి దాదాపు 60 సినిమాల ద్వారా ప్రపంచంలోని అన్నిమూలలవున్న సినీ ప్రేమికుల హృదయాలను స్పందింపచేసారు. Ingmar Bergman గురించి చెప్తూ ఫ్రెంచ్ సినీ దర్శకుడు Jean-Luc Godard ఈ విధంగా అంటారు, “The(…)

Sansho Dayu

Sansho Dayu

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. కొన్ని వందల ఏళ్ల క్రితం….మనిషి జాతి ఇంకా పూర్తిగా మానవులుగా జాగృతం కానీ సమయం. జపాన్ దేశంలో ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యమేలుతోంది ఒక వైపు పదమూడు ఏళ్ళుగా ప్రజల్ని దహించి వేస్తున్న కరువు కాటకాలు; మరో వైపు యుద్ధాలతో రగిలిపోతున్న రాజ్యాలు. ప్రజలు కడుపు మంటలు ఏ మాత్రం పట్టని సైన్యాధికారులు చిన్నా పెద్దా అని తేడా లేకుండా సైన్యంలో(…)

Eternal Sunshine of the Spotless Mind

Eternal Sunshine of the Spotless Mind

జ్ఞాపకాలనే వృత్తంలో కేంద్ర బిందువు ఆమె ఆ రోజు సాయంత్రం బీచ్ లో… అంతమంది జనాల మధ్యన, గుంపులో ఒంటరిగా నేను. జనాలకు దూరంగా అలలకు చేరువులో, గలగలా మాట్లాడే నువ్వు. అన్నింటికీ ఒక లెక్క ఉండాలనే నేను. లెక్కలేకుండా జీవితాన్ని గడిపెయ్యాలనుకునే నువ్వు? నేనేమో ముక్కు మొహం లేని అనామక నాయకున్ని. నువ్వేమో అణువణువనా రంగుల కాంతులు విరజిమ్మే తారవి. నువ్వలా, నేనిలా! అయినా రెండు సగాలు కలుసుకున్నంత ఆనందం. ****** మనం కలుసుకున్న కొన్ని(…)

The Lives of Others

The Lives of Others

సౌందర్యోపాసనే లోకకళ్యాణానికి మార్గం 1984, తూర్పు జర్మనీ దేశం. సోవియట్ రష్యా అధ్వర్యంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం రాజ్యమేలుతోంది. ప్రభుత్వ అధికారుల హింస తట్టుకోలేక ప్రజలు రహస్యంగా పశ్చిమ జర్మనీకి తరలివెళ్ళిపోతున్న సమయం. ఏ సమయంలోనైనా ప్రజలు తమ మీద తిరగబడి ఉద్యమ బాటలో నడుస్తారనే అనుమానంతో, ప్రభుత్వం అటువంటి విపత్తు ఏదీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంది; షుమారు లక్ష మందితో కూడిన రహస్య పోలీస్ వ్యవస్థతో పాటు, రెండు లక్షల మంది ఇన్ఫార్మర్స్ ని కూడా సమీకరించింది.(…)

Fitzcarraldo

Fitzcarraldo

—అతడు అడవిని జయించాడు— మనిషి ఎల్లప్పటికీ అపరిపూర్ణుడు! ఎప్పటికప్పుడు తనని తాను ఆవిష్కరించుకుంటూ పరిపూర్ణత వైపు పయనం సాగిస్తుంటాడు. కానీ ఈ ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాదు; మనిషి ఎప్పటికీ గమ్యాన్ని చేరలేడు. కానీ, ఈ విధంగా ఒక స్థితి నుంచి మరో స్థితికి పోవాలనే ప్రయత్నంలోనే మనిషి స్వేచ్ఛా జీవి అయ్యాడు. తరువాతి స్థితి అనేది మరొకటి లేకపోతే మనిషికి స్వేచ్ఛే లేదు. కానీ ఆ తరువాతి స్థితి కి చేరుకోడానికి ఒక్క స్వేచ్ఛ మాత్రం(…)

Stalker

Stalker

మనిషి నిత్యాన్వేషి. నిరంతరాన్వేషణలో మనిషి సత్యాన్నీ అన్వేషించాడు.ఈ భూమ్మీద మనిషి ఆవిర్భావం జరిగినప్పటినుంచీ ఈ అన్వేషణ సాగుతూనే ఉంది. ఒకానొక కాలంలో అసలీ సత్యం అంటే ఏంటి? అని ఎలా అయినా తెలుసుకోవాలని ఒక వ్యక్తి బయల్దేరాడు. ఎక్కడెక్కడో తిరిగాడు; దారిలో కలిసిన మనుషులనూ, మహర్షులనూ అడిగాడు; రాజులూ, రారాజులనూ దారి చూపమని ప్రాథేయపడ్డాడు. కొండలూ గుట్టలూ ఎక్కాడు. ఏడు సముద్రాలు దాటాడు; మహారణ్యాల్లోనూ తిరిగాడు. పగలనకా రేయనకా అతని అన్వేషణ కొనసాగింది. మనుషులెవ్వరూ చేరుకోలేని ఒక(…)

Shadows of Forgotten Ancestors

Shadows of Forgotten Ancestors

అనుభవించదగ్గదే కానీ వర్ణించలేనిది; చావూ బతుకుల తేడా తెలియనిది – ప్రేమ. ఈ విశాల ప్రపంచమంతా ఒక్క పురుషుడు ఒక్క స్త్రీ కోసమే సృష్టించబడిందా? అసలు అనంతమే రెండుగా విడిపోయి వారిద్దరి రూపాలు దాల్చిందా? చంద్రుడిని ఆకాశం కోసం చేయబడినట్లు, దేవుడు ఆమెను తన కోసం చేశాడా? ఇవాన్-మరీచ్కా ల జంటను చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. వారిద్దరూ ప్రేమించుకుంటే – కొండలేమిటి, నదులేమిటి, నక్షత్రాలేమిటి, ఈ చరాచర సృష్టి ఏమిటి – అన్నీ వారి ప్రేమ గీతానికి(…)

Kramer vs. Kramer

Kramer vs. Kramer

వాళ్లు కలిసి విడిపోయారు; విడిపోయి కలిసారు. ఎక్కడో పుట్టారు.ఎక్కడో పెరిగారు. జొయన్నా, టెడ్ అనబడే వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆత్మీయత పెరిగి ఒకే ప్రాణంగా మెలగుతూ ఒక వంశవృక్షానికి కొత్త కొమ్మలు, రెమ్మలు తొడిగారు. బిల్లీ అని నామకరణం చేశారు. జంట కట్టి, సంతానం వృద్ధి చేయడమొక్కటే లక్ష్యమయ్యుంటే మానవ నాగరికత, పరిణామక్రమానికి అర్థం లేదు. సంతాన వృద్ధికంటే కూడా ఇద్దరు ఒకటై కలిసి జీవించడంలోని ఆనందానికే వివాహ బంధంలో ప్రాముఖ్యత ఉంటుంది. టెడ్ ని(…)

Ship of Theseus

Ship of Theseus

తానే మారెనా? గుణమే మారెనా? నేను ఎవర్ని? ఇన్ని వేల సంవత్సరాల నాగరికత తర్వాత కూడా ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణంగా సమాధానం చెప్పలేని ప్రశ్న! అయినా మనిషి తన అస్తిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం మాత్రం మానడు. ఇదీ నేను! అని స్థిరంగా నిర్ణయించుకుని మనిషి జీవితం గడిపేస్తుంటాడు. కానీ ఒకానొక సమయంలో ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ మనల్ని ప్రశ్నించినప్పుడు, ఇదా నేను! అని బయల్దేరి, ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో తనని తాను తెలుసుకుంటాడు.(…)

Code Unknown

Code Unknown

ఎన్ని రంగుల్లో వికసించినా దాని పేరు మాత్రం గులాబి! రంగు నలుపైతే మాత్రం అతను మనిషి కాడా? శ్రీశ్రీ అంటారు, “ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా/ఎంతగా పైపై భేదాలున్నా/ఎంతగా స్వాతిశయం పెరిగినా/ ఎంత బలం, ధనం, జవం పెరిగినా/అంతరంగం అట్టడుగున మాత్రం/అంతమందిమీ మానవులమే!” కానీ ఈ విషయాన్ని మనం ఎంత వరకూ ఆచరణలో పెడ్తున్నామనేదే పెద్ద ప్రశ్న. జాతి, కులం, ప్రాంతం, వర్ణం ఆధారంగానే ఇంకా మనుషులను అంచనా వేస్తున్న కాలం ఇది. ఈ అంచనాల ఆధారంగానే(…)

Wild Strawberries

Wild Strawberries

జ్ఞాపకాలు ప్రమాదకరమైన ఉచ్చులు; వాటిలో చిక్కుకుంటే అంతే ! సమయానికి అర్థం లేని చోట, బీటలు వారిన శిధిలాల నడుమ, అతను నడుస్తున్నాడు. వీధి నిండా ఏకాంతం. గడియారంలో ముళ్లు లేవు. తోడు కోసం అతని అన్వేషణ జ్వరాల గుర్రాల బండికి సందు చేసింది దారి. బండిలోనుంచి జారిపడిందో శవపేటిక శవం అతని చెయ్యిపట్టుకు లాగుతోంది…. ఉలిక్కిపడి నిద్రలేచాడు ప్రొఫెసర్ బోర్గ్. ఇంకొద్ది గంటల్లో అతను స్టాక్‍హోమ్ నుంచి విమానంలో బయలుదేరి లుంద్ పట్టణానికి చేరుకోవాలి. కానీ(…)

వుడి ఎలెన్ తో కాసేపు

వుడి ఎలెన్ తో కాసేపు

పరిచయం: Woody Allen గురించి పరిచయం చెయ్యక్కర్లేదనుకుంటాను. గత నలభై ఏళ్లుగా నలభై కి పైగా సినిమాలు తీసి తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఉడీ ఆలెన్ మాటల్లో సినిమా దర్శకత్వం గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం. ఉడీ అలెన్ తరహా సినిమాలు (Woody Allenesque Films) అనే ఒక ప్రత్యేక జాన్రా సినిమాలు ఆయన స్వంతం. ఉడీ అలెన్ సినిమాలు చూసిన వాళ్లకు కొన్ని ప్రత్యేకతలు(…)

Poetry

Poetry

జీవితపు రహస్యాల మేలిముసుగు తొలగింపే కవిత్వం! ఒక జ్ఞాపకం. అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. నా వయసెంతో గుర్తుపెట్టుకోగలిగేంత వయసు కూడా కాదు. బహుశా అప్పుడు నాకు మూడేళ్ల వయసు ఉండవచ్చు. ఆ రోజు అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. పదేళ్ల వయసున్న మా పెద్దక్క ఆ రోజుకి నాకు తల్లయ్యింది. ఉదయాన్నే స్నానం చేపించి నాకు రంగు రంగులున్న బట్టలు తొడిగింది. మేమిద్దరం హాల్లో ఉన్నాం. కిటికీ కి వేలాడుతున్న ఎరుపు రంగు పరదాలగుండా ప్రవహిస్తోన్న సూర్యకాంతి(…)

Salaam Cinema

Salaam Cinema

సినిమానేజీవితం. జీవితమే సినిమా : మన చుట్టూ, మన చెంతన, మన లోలోపల. సినిమా! అరవై నాలుగు కళలనీ తనలో ఇముడ్చుకుని ఉధ్బవించిన ఒక సరికొత్త మహత్తర కళ! శతబ్దాలుగా కళారాధనలో జీవిస్తూ వస్తున్న మానవునికి గత శతాబ్దంలో మాత్రమే సాధ్యమైన ఒక వినూత్న కళ. ఈ ప్రపంచంలోని అరు వందల కోట్ల మంది జనాభాలో కనీసం సగం మందైనా ఎప్పుడోకపుడు ఈ కళ ను అనుభవించిన వాళ్లే అయ్యుంటారు. సినిమా అనే చలనచిత్రానుభవాన్ని రుచి చూశాక(…)

Taste of Cherry

Taste of Cherry

ఇక చాలు అని చాలించడానికి వంద కారణాలుంటాయి; కానీ చివరి దాకా కొనసాగించడానికి ఒక్క కారణం చాలు! ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారని అంటారు. నా గొయ్యి నేనే తీసుకున్నాను. కానీ నేను పడలేదు; పడుకున్నాను. నేను మెలుకవగానే ఉన్నాను. ఇది మెలుకవేనా? పైన ఆకాశంలో చంద్రుడు నల్లటి మబ్బుల పల్లకి ఎక్కి విహరిస్తున్నాడు. నా ఆలోచనలు వెనక్కి పరిగెడుతున్నాయి. **** నేను మీకు తెలుసు! ఇవాళ ఉదయం ఎవరి కోసమో వెతుకుతూ కార్లో నగరమంతా(…)

Revolutionary Road

Revolutionary Road

అది ప్రేమాకాలం. అతడి కంటి వెలుగులో ఆమె. ఆమె చిరునవ్వులో అతడు. వారు వయసులో ఉన్నారు. ఎండ-వాన, పగలు-రాత్రి, తేడా తెలియని వయసు. గుంపును మరిచి జంట పిచ్చుకల్లా ప్రేమలో మునిగితేలారు. ప్రేమికులు భార్య భర్తలయ్యారు. జంట పక్షులు గుంపు ని వెతుక్కున్నాయి. వారిద్దరూ జన ప్రవాహంలో కలిసిపోయారు. జనం పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారు. అది పండాలంటే శ్రమించాలన్నారు. ఉండడానికి గూడు కావాలన్నారు. తినడానికి తిండి కావాలన్నారు. ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలన్నారు. డబ్బు కావాలంటే(…)

గురు-శిష్యులు:ఘటక్-జాన్

గురు-శిష్యులు:ఘటక్-జాన్

రిత్విక్ ఘటక్ ఒక సినిమా దర్శకుడిగా ఎంతో మంది నవ యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచాడు. ఒక సినిమా దర్శకునిగానే కాకుండా పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వైస్ ప్రిన్సిపల్ గా తన బోధనలతో ఎంతో మంది విద్యార్థులనూ నవ్య సినిమా వైపు నడిపించాడాయన. ఆయన విద్యార్థులయిన మణి కౌల్, అదూర్ గోపాలకృష్ణన్, జాన్ అబ్రహంలు తర్వాతి కాలంలో భారతీయ నవ్య సినిమా ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించారు. అమెరికన్ ఫిల్మ్ క్రిటిక్ John Levich రిత్విక్ గురించి(…)

ఒక ‘చిన్న బడ్జెట్ సినిమా’ కథ

ఒక ‘చిన్న బడ్జెట్ సినిమా’ కథ

సంవత్సరానికి తెలుగులో విడుదలయ్యే సినిమాలలో అధికశాతం చిన్న బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. విడుదలైన చిన్న బడ్జెట్ సినిమాలలో చాలా వరకు విజయవంతం కానివే. కారణం, బలహీన కథలను ఎంచుకోవడం ఒకటయితే బలహీన దర్శకుడిని ఎంచుకోవడం మరొకటి. ఇదికాక డబ్బు కొరతతో మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి.   చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమాలూ ఉన్నాయి – చిత్రం, నువ్వే కావాలి, జయం, a film by aravind, ఆనంద్, ఐతే, మంత్ర,(…)

సినిమా పోస్టర్

సినిమా పోస్టర్

అద్భుతమైన ఒక సినిమా పోస్టర్ ముందు, అది మురుక్కాలవ పక్కనే ఉన్నా సరే, గంటల తరబడి నిలబడి చూసినా జ్ఞాపకాలు అందరికీ ఉంటాయేమో! సినిమా బయటికి వచ్చాక ,మనకు కనపడేది తెరమీది నటులే తప్ప తెరెవెనుక కళాకారులు కాదు. నిజానికి సినిమాను ప్రేక్షకుల వద్దకు ముందుగా చేర్చి, ఆ సినిమా గురించి ఒక ఊహను,మనో చిత్రణను ఏర్పరిచేది సినిమా పోస్టరే! పోస్టరే లేకపోతే ఎంత గొప్ప సినిమా తీరైనా రీతిమారిపోవాల్సిందేగా! అలాంటి సినిమా పోస్టర్ తయారీ గురించి,(…)

పోస్టర్ లో ఏముంది…!

పోస్టర్ లో ఏముంది…!

పోస్టర్ ని చూసి సినిమా కథ చెప్పేరకాలు ప్రతి ఫ్రెండ్షిప్ గ్రూప్ కీ ఖచ్చితంగా ఒకడుండేవాడు ఒకప్పుడు. నిజానికి ఒక్కోసారి సినిమా కంటే ఈ కథలల్లేవాళ్ళ కథకుల కథలే బాగుండేవి. కానీ ఇప్పుడూ! పోస్టర్ చూస్తే కథకాదుకదా కనీసం సినిమా దేని గురించో కూడా తెలియట్లేదు. రాంగోపాల్ వర్మ ‘దెయ్యం’ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజైనప్పుడు జె.డి.చక్రవర్తిని ఎవరో మీడియా వాళ్ళు అడిగారట “సినిమాలో హీరోవి నువ్వేకదా, నువ్వు లేకుందా పోస్టరేంటి?” అని. దానికి జె.డి. వర్మ(…)

తుమ్  జో మిల్ గయో హో రపీ సాబ్

తుమ్ జో మిల్ గయో హో రపీ సాబ్

(24.12.1924 – 31.7.1980) మహ్మద్ రఫీ చనిపోయి ముప్పై సంవత్సరాలైంది. కానీ అతని పాట మరణించలేదు. భారతీయ సినిమా పాటల నేపధ్యం గానంలో సైగల్ తరువాతి శకంలో ఒక కొత్త ఒరవడిని తెచ్చింది రఫీనే. భారతీయ సినిమా పాట ఎల్లలు దాటి ఒక సంస్కృతి గా, పెద్ద మార్కెట్ గా విస్తరించుకోవడానికి రఫీ లాంటి కొన్ని స్వరాలే కారణం. ఇపుడు టెలివిజన్ సంగీత, నృత్య రియాలిటీ షోల రూపంలో చాలా పెద్ద మార్కెట్ గా అవతరించిందంటే కారణం(…)

మీరూ హిచ్‌కాకియనా?

మీరూ హిచ్‌కాకియనా?

అదేంటి “మీరూ హిచ్కాకా?” అని అడగాల్సింది పోయి “హిచ్కాకియనా?” అని అడుగుతున్నాడేంటానీ చూస్తున్నారా? ఆల్‌ఫ్రేడ్ హిచ్కాక్ ఎంత గొప్ప దర్శకుడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి హిచ్కాక్ లాంటి ఆలోచనా ధోరణిని ఎలా అలవర్చుకోవాలో మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఎన్నో నిద్రలేని రాత్రులు, వందల సినిమాలు, గంటల తరబడి చేసిన బ్రౌసింగ్, రోజుల తరబడి చేసిన రిసర్చ్…ఇవన్నీ ఆ మనిషినీ, అతని ట్రేడ్‌మార్క్ని క్లుప్తంగా అర్ధం చేసుకోవడానికి నాకు సహాయపడ్డాయి. అందుకనే(…)

సినీ‘మణిరత్నం’

సినీ‘మణిరత్నం’

  జూన్ 2 మణిరత్నం 55 వ పుట్టినరోజు సందర్బం గా ..ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. పెద్ద పెద్ద దర్శకుల సైతం సినిమా ను ఓరల్ గా చెపుతున్న కాలమది..విజువల్ మీద దర్శకులు ఇంకా సరైన ద్రుష్టి సారించని రోజులవి. గొప్ప కథలు..కానీ విజువల్ లో చెప్పుకోదగ్గంత గొప్పతనం లేదు. కేవలం కథ ను చెప్పటానికి అవసరమైనంత కేర్ తప్ప ..ప్రతి ఫ్రేము నూ ఓ ఆర్ట్ లా తీర్చిదిద్దాలన్న ఉద్దేశానికి ఇంకా దర్శకులు రాలేదు.(…)

“విశ్వనాథుడు”

“విశ్వనాథుడు”

” ఆ పాత మధురము సంగీతము ..అంచిత సంగాతము ..సంచిత సంకేతము ! శ్రీ భారతి క్షీరసంప్రాప్తము… అమృత సంపాతము.. సుకృత సంపాకము !! ఆలోచనామృతము సాహిత్యము ..సహిత హిత సత్యము ..శారదా స్తన్యము ! సారస్వతాక్షర సారధ్యము …జ్ఞాన సామ్రాజ్యము …జన్మ సాఫల్యము!! “ కళామతల్లి శ్రీభారతీదేవి స్తన్యామృతమయిన సంగీత సాహిత్యాల మాధుర్యాన్ని పండితులకే కాక పామరులకి కూడా రుచిచూపించాలని తాపత్రయపడిన కళా బంధువు.శాస్త్రీయ నృత్య రీతులయిన కూచిపూడి,భరత నాట్యాలని కథా వస్తువులుగా,వాటి మీద సామాన్య(…)

సత్యజిత్ రాయ్ గురించి బాపు

బాపుబొమ్మ సీతాకళ్యాణం ఢిల్లీలో చూసిన సందర్భంలో, జరిగిన ఈ ముచ్చటను బాపు స్వంత మాటల్లో,”సత్యజిత్ రాయ్ గారు ఢిల్లీలో చూసి బావుందీలేదూ చెప్పలేదు,కానీ క్లుప్తంగా రెండే పాయింట్లు చెప్పారు.”The carpet on which Sita sat  is of arabic design.There were no crotons in those times”.సీతమ్మవారు పాటపాడిన తోటలో ఓ పక్క క్రోటను మొక్కలు కన్పించాయి ఆయనికి,అంత “నిశ్శితంగా”చూశారాయన.ఆయన్ను కలుసుకున్నప్పుడు ఆయనతో కలసి తీయించుకున్న ఫొటో కి ’the long and short(…)

సినిమా జ్వరం 2 – చలం

సినిమా జ్వరం 2 – చలం

మొదటి భాగం క్షుద్ర నీతుల నుంచి ఉన్నతమైన నీతికి  కళ్ళు తెరవమనే చలం పుస్తకాలు చదవకుండా యువకులని అడ్డు పెడుతూనే ఉన్నారు.  గాని ..పోస్టులో పుస్తకాలు  పోస్టు నుంచి కాజేస్తున్నారు గాని.. నీతి అంటే ఇంతేనా అనిపించేట్టు  నీతిని  అతి చవక చేసే చిత్రాన్ని చూడకుండా ఆపగలుగుతున్నారా  ? చలం,  మీ నీతిని అవినీతి అంటే.. ఈ  చిత్రాలు  మీ అవినీతిని నీతి అంటున్నాయి. మీ అంతరాత్మలకి చక్కని Vaseline  పూస్తున్నాయి. కొన్ని ఏళ్ళు గడిస్తే గాని(…)

సినిమా జ్వరం – చలం

సినిమా జ్వరం – చలం

మనుషుల కోసం కళా, కళ కోసం మనుషులూ..?? రెండు విధాల  అభిప్రాయలు ఉన్న వాళ్ళూ ఉన్నారు. మన సినిమాల్లో కళ లేని లోపం కళ్ళు చెదరగొట్టే కాంతి తీరుస్తోంది. కళ అంతా మనుషుల కోసమే గాని,  కళకి  అవసరమైన మనుషులు లేరు. మరి ఇంక దేనికోసరం ఉన్నారు? అని వాళ్ళని ప్రశ్నిస్తే ” తిండికోసం,  హెచ్చు ఏది లభిస్తే దానికోసం” అని నిర్మోహమాటంగా  నిజం ఒప్పుకొని,   “సినిమా కళ…  సినిమా నీతి” అని ఈ అబద్దపు(…)

చిర స్మర(మ)ణీయం

చిర స్మర(మ)ణీయం

నవ్వడం ఆరోగ్యం. నవ్వకపోడం అనారోగ్యం. నవ్వంచడం మహాభాగ్యం. మొదటిది వెంటపడితే వస్తుంది.రెండోది వద్దన్నా వస్తుంది. మూడోదానికి మాతృం అదృష్టం కావాలి. ప్రస్తుతం ఆ మహాభాగ్యం హఠాత్తుగా అద్శశ్యమయిపోయింది. తెలుగునాట అక్షర గ్రహణం పట్టింది. ఉన్నట్టుండి సాహితీకారుల మదిలో చీకట్లు కమ్ముకున్నాయి. తెలుగువారికి కానీ ఖర్చులేకుండా ఇన్నాళ్ళూ హాస్యరసాన్ని పంచిచ్చిన అక్షరవైద్యులు బుద్ధిమంతుడిలా, రాజాధిరాజు మల్లే పెట్టేబేడా సర్దుకుని, చెప్పాపెట్టకుండా బుల్లెట్లాగా, తిరిపతి వేంకట రమణ సాక్షిగా, ముళ్ళపూడిగా మీదుగా, ’శ్రీ రామరాజ్యానికి చెక్కేసారు. మొన్నటికి మొన్న తెలుగునాట(…)

రమణీయ కథ – 2

రమణీయ కథ – 2

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011 చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు. మొదటి(…)

రమణీయ కథ – 1

రమణీయ కథ – 1

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011  చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు. చాలా(…)

ధవళేశ్వరం బుడుగును నేను…

ధవళేశ్వరం బుడుగును నేను…

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011 చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు. రమణ(…)

సినిమా-sensibility (అర్థవంత భావోద్వేగం)

సినిమా-sensibility (అర్థవంత భావోద్వేగం)

“Transformation of Impression into Expression is art ” . మనచుట్టూ జరుతుగున్న వాస్తవ పరిస్తితులు మనలో ఎలాంటి స్పందన కలిగిస్తున్నాయి. మనం వాటిని ఏ విధంగా స్వీకరిస్తున్నాం తిరిగి ఎలా వ్యక్త పరుస్తున్నాం ? స్వతహాగా ఫీల్ అయింది మొత్తానికి మొత్తంగా వ్యక్త పరచలేము.ఈ వ్యక్త పరచటం లో ఒక ఫిల్టర్ ఉంటుంది – వ్యక్తం-  అనేది మనం పుట్టిపెరిగిన పరిస్తితులు,  మన స్వభావం, చదువు, శిక్షణ , సంస్కారం , అలవాట్లు, ,(…)

“మెగాస్టార్” సినిమాటోగ్రాఫర్

“మెగాస్టార్” సినిమాటోగ్రాఫర్

సినిమా ఒక దృశ్య మాలిక అయనప్పటికీ.. కథా ప్రధానం కనక..  ప్రేక్షకుడు కథలో లీనం అయిపోతాడు.  మన తెలుగు సినిమా ముఖ్యంగా  మాటల్లో కథ నడుస్తుంటుంది,  కనక చెవులు రిక్కించి వింటుంటాడు. అందుకే కళ్ళ ముందు వొచ్చే అద్భుతమైన చిత్రీకరణని పెద్దగా గుర్తించక పోయినా.. ఆ దృశ్యాలు  సూటిగా అంతః చేతనం లోకి వెళ్ళిపోతాయి.  ఆ ప్రకారం లో సినిమాలోని దృశ్యాలు అంతర్లీనగా పని చేస్తాయి.తదనుగుణంగా హృదయాంతరాళం లో ఎక్కడో ఒక విధమైన  రాసానందం ఉంటూనే ఉంటుంది.(…)

“తెలుగు సినిమా” – పునరుజ్జీవనం

“తెలుగు సినిమా” – పునరుజ్జీవనం

ఒకసారి వర్మ ఇంటర్వ్యూ చూసాను.. పెద్దగా గుర్తులేదు..సందర్భం..కాని అయన ఇచ్చిన  సమాధానం మాత్రం బాగా గుర్తుంది. సర్ ఈరోజు మనకి మంచి సినిమా రావటం లేదు . ..పాత్రికేయిని   ప్రశ్న పూర్తి కాకుండానే..  వర్మ సమాదానం ఇచ్చ్చారు. “మంచి సినిమా.. నా జేబులో ఉంది..తీసుకోండి..( వెటకారంగా) ఎవడి standards   బట్టి వాడు సినిమా తీస్తున్నాడు. ఆది  మంచి సినిమా అనే  అనుకుంటాడు.” ఆ సమాధానం లో  కొత్తదనం లేకపోయినా .. ఈ standards ని(…)

‘సిత్ర’మైన సినీ బ్లాక్ మార్కెట్ విధానాలు

‘సిత్ర’మైన సినీ బ్లాక్ మార్కెట్ విధానాలు

రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు! ఈ మధ్య ‘రగడ‌’ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నాగార్జున, అలాగే అంతకు కొన్ని వారాల ముందు ‘ఆరెంజ్‌’ చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, హీరో చిరంజీవి చాలా ఆవేశంగా పైరసీదారులపై విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయలు వెచ్చించి, చిత్ర నిర్మాతలు సినిమా తీస్తుంటే, వాళ్ళ మొత్తం కష్టాన్ని పది రూపాయల సీడీలతో పైరసీదారులు తేలిగ్గా కొట్టేసి, దొంగ సొమ్ము సంపాదించేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిజమే!(…)

రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు!

రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు!

ఈ మధ్య ‘రగడ‌’ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నాగార్జున, అలాగే అంతకు కొన్ని వారాల ముందు ‘ఆరెంజ్‌’ చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, హీరో చిరంజీవి చాలా ఆవేశంగా పైరసీదారులపై విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయలు వెచ్చించి, చిత్ర నిర్మాతలు సినిమా తీస్తుంటే, వాళ్ళ మొత్తం కష్టాన్ని పది రూపాయల సీడీలతో పైరసీదారులు తేలిగ్గా కొట్టేసి, దొంగ సొమ్ము సంపాదించేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిజమే! చిత్రసీమకు పట్టిన దౌర్భాగ్యం – దారుణమైన(…)

కన్నీళ్ళ రుచి – గుల్జార్ ‘నమ్కీన్’

కన్నీళ్ళ రుచి – గుల్జార్ ‘నమ్కీన్’

ఎనభైల్లో దూరదర్శన్ లో చాలా మంచి సినిమాలూ ధారావాహికలూ వచ్చేవి. నమ్మలేకపోయినా ఇది నిజం! ఆ రోజుల్లో ఎన్నో గొప్ప చిత్రాలని నేను ఇంట్లో కూర్చుని చూసి నా ప్రపంచ ఙ్ఞానాన్ని (?) పెంచుకున్నాను. అలాటి రోజుల్లో గుల్జార్ అంటే పిచ్చి ఇష్టం వుండేది నాకు. (ఇప్పటికీ ఆ ఇష్టం వుందనుకోండి!) గుల్జార్ పాటలని విశ్లేషిస్తూ పాడుకోవటానికనే నా చుట్టూ ఒక స్నేహ బృందం కూడా వుండేది. ఒకరోజు టీవీలో గుల్జార్ దర్శకత్వం వహించిన “నమ్కీన్” అనే(…)

గొప్పనటుడు,మానవతావాది ‘పాల్ న్యూమన్’

గొప్పనటుడు,మానవతావాది ‘పాల్ న్యూమన్’

ఆ వార్త విని హాలీవుడ్ ఆశ్చర్యపోయింది,అమెరికా సినిమా పరిశ్రమతో సంబంధమున్న ప్రతివారూ నివ్వెరపోయారు,మరికొందరు మౌనంగా శాపనార్ధాలు పెట్టగా పలువురు సంతోషం పట్టలేక ధారాళంగా అభినందించారు. 2008 సంవత్శరం జనవరి 29న పాల్ న్యూమన్,జొయన్ని తమ యాభయవ వివాహవార్షికోత్శవాన్ని జరుపుకోనుండటమే ఆ సంచలనానికి కారణం.అమెరికాలో చలనచిత్ర పరిశ్రమ ప్రారంభమైన అన్ని యేళ్ళలో అటువంటి ‘విపరీతవార్త’కనీవిని ఎరుగని విడ్డూరమే మరి!నాలుగు,ఆరు,ఎనిమిది ఇలా అసంఖ్యాకంగా జరిగే పెళ్ళిళ్ళు,అక్రమసంబంధాలు,విపరీత లైంగిక ప్రవర్తనలు,మాదకద్రవ్యాలు,మాఫియాతో సంబంధాలు ఇలా ఒకటేమిటి ఎన్ని రకాల అవలక్షణాలు,అనారోగ్యకరధోరణులుండాలో అన్నీ సమృద్ధిగా(…)

మన వాళ్ళు ఇలాంటి సినిమా తీయరేం..?

మన వాళ్ళు ఇలాంటి సినిమా తీయరేం..?

ఇటీవల తమిళంలో ‘మదరాస పట్టిణం’ అనే ఓ సినిమా వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొద్ది కాలం ముందు నాళ్ళ నేపథ్యంలో రూపొందిన కల్పిత కథ అది. దానికి అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, దాని రాజధాని మద్రాసు వేదికలు. అలా అరవై ఏళ్ళ వెనక్కి తీసుకువెళ్ళి, అప్పటి మద్రాసు పట్టణం రూపురేఖలను చూపే ప్రయత్నం ఈ సినిమాలోని ప్రత్యేకత. కథాంశం తెలియకపోయినా, కథా నేపథ్యం తెలుసు కాబట్టి, విడుదలకు ముందు నుంచి ఈ సినిమా(…)

వర్మ ‘సత్య’ ఒక పరిచయం

వర్మ ‘సత్య’ ఒక పరిచయం

‘సత్య’ మాఫియా నేపధ్యంగా ఉన్న చిత్రమే అయినా, రాంగోపాల్ వర్మ ‘శివ’ ద్వారా మొదలుపెట్టిన సమాజపు చీకటికోణాలపై తన పరిశీలనను తారాస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం. వర్మ తన socio- philosophical premise ని ఒక నిరపేక్షిక (objective, detached) స్థాయికి ఈ చిత్రం ద్వారా తీసుకెళ్ళాడూ.  ‘సత్య’ (జె.డి.చక్రవర్తి) కు భూత, భవిష్యత్ కాలాలు లేవు, ఒక్క వర్తమానం తప్ప. ఇలాంటి ఒక సాధారణ వ్యక్తి. .. చాలా సా…ధా…ర…ణం…గా ముంబై మాఫియాలొ చేరి, అంతే సులువుగా(…)

సలాం సినిమా

సలాం సినిమా

సినిమాలు చెడిపోతున్నాయి , పతనమౌతున్నాయి , సమాజాన్ని చెడగొడుతున్నాయి అని చాలాకాలంగా మనం వింటున్న/చూస్తున్న/అంటున్న వాదనలే. కానీ చెడిపోతున్న/పతనమవుతున్న సమాజాన్ని సినిమా ఎలా ప్రతిఫలిస్తోందో అనే ఆలోచనలోని కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. విభేదించేవారు కూలంకషంగా చర్చిస్తారని ఆశిస్తూ .. డెబ్భై, ఎనభయ్యో దశకాల్లో మన ( భారతీయ / ప్రాంతీయ) సినిమాల్లో హీరోలు మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలోంచో లేక రోడ్డుమీదబ్రతికే ఆవారాలాంటివాళ్ళో అవడం చాలా సాధారణంగా కనిపించేది. కమర్శియల్ సినిమాల్లో తప్పనిసరిగా హీరోయన్ మాత్రం గొప్పింటి(…)

డాక్యుమెంటరీ సినిమా-3

డాక్యుమెంటరీ సినిమా-3

చైనా సినిమా – చరిత్ర – దశలు అభ్యుదయ సినిమాలకి అభివృద్ధి నిరోధక సినిమాలకీ ఉన్న సంఘర్షణే చైనా సినిమా చరిత్ర. “పోరాటం – ఓటమి” పోరాటం – ఓటమి – గెలుపు” అన్న మావో సూక్తి చీకటి కోణంలో దాగిన సినిమా చరిత్రను చదవటానికి ప్రేరేపిస్తుంది. చైనాలో 1896 లోనే సినిమా ప్రదర్శింపబడింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాతే చైనాలో సినిమాలు తీయడం ప్రారంభించారు. చైనా సినిమా చరిత్రని సమగ్రంగా తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి ఇప్పటిదాకా(…)

డాక్యుమెంటరీ సినిమా-1

డాక్యుమెంటరీ సినిమా-1

డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటో ఇప్పుడు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా నేడు డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణం జరుగుతోంది. అయితే డాక్యుమెంటరీ అనే పదాన్ని మొట్టమొదటిగా Robert Flaherty నిర్మించిన ’నానూక్ ఆఫ్ ది నార్త్’ అనే చలనచిత్రం గురించి వ్రాసిన ఒక సమీక్షలో వాడడం జరిగింది. ఇంతకూ డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటి? నిజజీవితంలోని విషయాలను ఉన్నదున్నట్టుగా విజువల్ గా డాక్యుమెంట్ చేయడమే డాక్యుమెంటరీ సినిమా అని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ డాక్యుమెంటరీ సినిమాకు ఆద్యుడిగా(…)

“సినిమా విమర్శ” – కొడవటిగంటి కుటుంబరావు

“సినిమా విమర్శ” – కొడవటిగంటి కుటుంబరావు

సినిమా విమర్శలు రాసేవారికి గల అర్హత లేవన్న ప్రశ్న ఒకటి ఈ మధ్యన కలుగుతున్నది. ఈ విమర్శకులందరికీ సినిమా చిత్రం నిర్మాణం గురించి,ఫొటోగ్రఫీ గురించి, డైరక్షన్ గురించి, పాత్ర పోషణ గురించీ, నటన గురించీ, ఏం తెలుసు అని కొందరడుగుతారు. సినిమా చిత్ర నిర్మాణంలోకి దిగేవారికే(కొందరికి) ఈ విషయాలు తలాతోకా తెలియనప్పుడు సినిమా విమర్శకులకు ఇవన్నీ తెలిసుండటం సాధ్యం కాదు. ఈ ప్రశ్న వేసే చిత్రనిర్మాతలు ఇంకొక విషయం కూడా మరుస్తున్నారు. నిజంగా చిత్రాలకు బతుకు నిర్ణయించేది(…)