|
రేపటి సినిమా మాండలిక సినిమా
తరాలు మారుతున్న కొద్దీ ‘మెయిన్‌వూస్టీమ్ కల్చర్’లోంచి కొన్ని సబ్ కల్చర్స్ విడివడుతాయి. తమదైన అస్తిత్వాన్ని, సొంత గొంతుకని వినిపిస్తాయి. కళలు, సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. అందుకే ఇపుడు తెలుగు నుంచి తెలంగాణ మాత్రమే కాదు హిందీ నుంచి భోజ్‌పురి, కన్నడ నుంచి తుళు భాషా చిత్రాలు కూడా రెక్కలను విప్పుతున్నాయి. సొంతంగా సినీవినీలాకాశంలోకి ఎగరడానికి సన్నద్ధమతున్నాయి. స్థానిక మూలాలతో కూడిన కొత్త నేటివ్ ప్రపంచాన్ని స్క్రీన్‌పై సృష్టిస్తున్నాయి. సినిమా: ఒరియరొదరి అసల్ సంవత్సరం: 2011 [...] |
|
సినీ‘మణిరత్నం’
జూన్ 2 మణిరత్నం 55 వ పుట్టినరోజు సందర్బం గా ..ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. పెద్ద పెద్ద దర్శకుల సైతం సినిమా ను ఓరల్ గా చెపుతున్న కాలమది..విజువల్ మీద దర్శకులు ఇంకా సరైన ద్రుష్టి సారించని రోజులవి. గొప్ప కథలు..కానీ విజువల్ లో చెప్పుకోదగ్గంత గొప్పతనం లేదు. కేవలం కథ ను చెప్పటానికి అవసరమైనంత కేర్ తప్ప ..ప్రతి ఫ్రేము నూ ఓ ఆర్ట్ లా తీర్చిదిద్దాలన్న ఉద్దేశానికి ఇంకా దర్శకులు రాలేదు. [...] |
|
ఈవీవీడెవడండీ బాబూ(హటాత్తుగా వెళ్ళిపోయాడు)
“అప్పు” డే తెల్లారిందా” అన్న రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో ఈవీవీ నాకు పరిచయం! ఆ సినిమా అప్పుల అప్పారావు నాకు అంతగా నచ్చకపోయినా ఆయన సినిమాలు కొన్ని బాగానే నచ్చాయి. హాస్యాన్ని బాగానే సృష్టించినా, అందులో కాస్తంత బూతుని రంగరించి ముతగ్గా రూపొందిచడం ఆయన స్టైలు కాబట్టి దాన్ని దాదాపుగా ఏ సినిమాలోనూ తప్పించుకోలేం! అయినా సరే, ఈవీవీ సినిమా అంటే హాస్యానికి మాత్రం మినిమమ్ గారంటీ కాబట్టి చూడొచ్చని వెళ్తాం! ఈవీవీ తీసిన సెంటిమెంట్ [...] |
|
గుండె భావాల బాలచందర్
సినిమా అంటే కేవలం ఎంటర్ టైన్ మెంట్ కాదు. సినిమా జీవితాన్ని ప్రతిబింబించ గలగాలి, మానవ మనస్తత్వాల్లోని వైచిత్రిని బయటికి తీసుకురాగలగాలి. మానవ సంబంధాలలో వుండే విభిన్న కోణాలను చూపగలగాలి. గుండె లోతున దాగి వున్న భావాలను స్పృశించగలగాలి. అలాంటి సినిమా లు చేసే అతి కొద్దిమంది దర్శకుల్లో మొదటి వరుసలో వుండే దర్శకుడు కె.బాలచందర్. విప్లవాత్మక ఆలోచనా ధోరణి, మనసు అంతరగాలను దర్శించగల సునిశిత దృష్టి..కె.బాలచందర్ ని వెండితెర పై మరపురాని చిత్రాల దర్శకుడి ని [...] |
|
శ్యామ్ బెనెగళ్ తెలుగు సినిమాలు తీయలేడా? Part 1
మూఢనమ్మకాలపై ఆయన ప్రకటించిన యుద్ధంలో ఎవరు గెలిచినట్లు? ‘అనుగ్రహం’పై తెలుగు ప్రేక్షకులకు ఆగ్రహమా? మనిషిని నమ్మకం ముందుకు నడిపిస్తుంది.మూఢనమ్మకం దిగజారుస్తుంది,దడిపిస్తుంది,వణికిస్తుంది. ఇది మతపిచ్చి మనిషిని పతనం చేసే మౌఢ్యం.మనదేశంలో ఈ పిచ్చి హద్దూపద్దూ లేకుండా పెరిగిపోతున్న మాట నిజం.రాజకీయనాయకుల.ధనవంతుల అండ దీనివెనుకాల ఉంది.రగులుతున్న సమస్యల్లో ఈ చాదస్తం కూడా ఒకటి.దేశభవిష్యత్తుకు,సమాజప్రగతికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్న తక్షణ సమస్య ఇది. మూఢనమ్మకాలు ఆత్మవిశ్వాసాన్ని,ఆత్మస్థైర్యాన్ని నశింపచేస్తాయి.వ్యక్తిత్వం కోల్పోతాడు మనిషి.ఆలోచనా శక్తి ఉండదు.పిరికిపందలా,పరాన్నభుక్కులా భయంతో అనుక్షణం గడుపుతుంటాడు. శ్యాం బెనెగల్‘అనుగ్రహం’చిత్రానికి తీసుకున్న,సామాజిక [...] |
|
అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’
భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్ ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది ‘నీచా నగర్‘ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand [...] |
|
విషాదాంతాలు – బాలచందర్ సినిమాలు
“బాలచందర్ ” ఎందుకోగాని ఈ పేరు తల్చుకోగానే మనసు దిగులుగా అయిపోతుంది. నన్నేడిపించిన సినిమాలన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో కళ్ళముందు గింగిరాలు తిరుగుతాయి. సరిత, శ్రీదేవి , జయప్రద ,జయసుధ, సుహాసిని,మాధవి, జయలక్ష్మి ( ఫటాపట్) …చక్కనమ్మలందరూ , దిగాలుగా నాకేసి చూస్తారు. చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, నారాయణరావు , ప్రకాష్ రాజ్ ఆయనే లేకపోతే మేం ఎక్కడా ? అని ప్రశ్నిస్తూ నిలదీస్తారు .బాలచందర్ సినిమాలు ఎన్ని చూసానో గుర్తులేదుకాని ….అన్ని సినిమాలూ ఏడుస్తూ [...] |
|
పరిమితులే సృజనాత్మకతకి తొలి మెట్లు..!!
హాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న చిత్రం – “పారానార్మల్ ఏక్టివిటీ” (Paranormal Activity). ఓరెన్ పెలి (Oren Peli) దర్శకత్వంలో వచ్చిన ఈ “మాకుమెంటరీ” (Mocumentary) చిత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలనం సృష్టించింది. కేవలం 15000 డాలర్ల వ్యయంతో తీసిన ఈ చిత్రం ఇప్పటికే రెండు చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడి, లక్షల డాలర్లు వసూలు చేస్తోంది. స్థూలంగా కథ: కాలిఫోర్నియాలో వుండే ఒక జంట తమ ఇంటిని ఏదో అతీంద్రియ శక్తి వెంటాడుతోందన్న అనుమానంతో [...] |
|
చేరన్ – ఒక పరిచయం
ముప్పైతొమ్మిదేళ్ళ వయసు. దర్శకుడిగా తొమ్మిది సినిమాలు. నటుడిగా ఏడు సినిమాలు మూడు జాతీయ అవార్డులు అతనే ‘చేరన్’ అనే తమిళ దర్శక-నటుడు.. కె.ఎస్.రవికుమార్ దగ్గర సహాయదర్శకుడిగా పనిచేసి 1997 లో భారతి కణ్ణమ్మ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మారాడు. రెండో చిత్రం ‘పోర్కాలం’(1997)తో జాతీయ బహుమతి అందుకున్నాడు. అంగవైకల్యం ప్రధానాంశంగా గల ఈ చిత్రం ‘మాణిక్యం’ అనేపేరుతో తెలుగులో రీమేక్ చెయ్యబడింది. దేశియగీతం(1999), వెట్రి కొడి కట్టు(2000), పాండవర్ భూమి (2001) వంటి అర్థవంతమైన చిత్రాలు [...] |
|
హోమ్ సినిమా-what an idea!
ఔత్సాహిక సినిమా దర్శకుడిగా దాదాపు ప్రతి రోజూ నాలాంటి వాళ్ళని ఎంతోమందిని కలుస్తూనే వుంటాను. వారిలో ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ఆ తర్వాత కొనాళ్ళకి సినిమా ఛాన్స్ కొట్టేద్దామనుకునే వాళ్ళతో పాటు మనమే స్వంతంగా ఎలాగైన సినిమా తీసి మన టాలెంట్ నిరూపించుకుంటే అవకాశాలు అవే వస్తాయనే వాళ్ళూ ఉన్నారు. అయితే సొంతంగా సినిమా తీయడమంటే మాటలు కాదు. సినిమా తీసేంత డబ్బు అందరి దగ్గరా ఉండాలి కదా! మన తెలుగులో చూసినట్టయితే సొంతంగా [...] |
|
Jean-Luc Godard-ఒక పరిచయం
నవతరంగం మొదలైన పదిహేను నెలల్లో ప్రతి నెలా ఒక్కో దర్శకుణ్ణి ’ఫోకస్’ శీర్షికలో పరిచయం చేస్తూ వచ్చాము. ఈ ప్రయత్నం ఇన్నాళ్ళూ విజయవంతంగా సాగిందనే చెప్పుకోవాలి. అయితే ఈ నెల, పాఠకులు గమనించారో లేదో కానీ, ఫోకస్ శీర్షికలో Godard గురించి పరిచయం చెయ్యబోతున్నామని మూడు నెలల ముందే ప్రకటించడం జరిగినా ఇప్పటి వరకూ అటువంటి ప్రయత్నాలేవీ జరగలేదు. అందుకే ఈ నెల ముగిసేలోగా, పూర్తిగా కాకపోయినా కొంతలో కొంతైనా Godard గురించి ఆయన సినిమాల గురించి పరిచయం [...] |
|
The Cabinet of Dr Caligari – సమీక్ష
ముందు మాట: ప్రపంచ సినీ ఉద్యమాలు శీర్షికన ఇప్పటికే భావవ్యక్తీకరణ వాదం, మరియు జర్మన్ సినిమాల్లో భావవ్యక్తీకరణవాదం అని రెండు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. భావ వ్యక్తీకరణ వాదపు సినిమాలుగా పేర్కొనబడే సినిమాలు ఎన్నో వున్నా, తొలి Expressionist సినిమాగా ప్రాచుర్యం పొందిన ’The Cabinet of Caligari’ ద్వారా భావ వ్యక్తీకరణ వాదపు ఆలోచనలు సినిమా తెరపైకి ఎలా అనువదించబడ్డాయనే విషయాన్ని చర్చించడం ఈ వ్యాసం లక్ష్యం. ఈ వ్యాసంలో విషయాలని గ్రహించడానికి ఈ సినిమా చూసి [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |