Category: ఫిల్మ్ మేకింగ్

డిజిటల్ సినిమా- కేవలం మాధ్యమంలో మార్పా లేక విధానంలోనా !

డిజిటల్ సినిమా- కేవలం మాధ్యమంలో మార్పా లేక విధానంలోనా !

గత పదేళ్ళుగా “డిజిటల్ సినిమా వచ్చేసింది ! వచ్చేసింది!!” అని వినడమేగానీ నిజంగా ప్రధానస్రవంతి చిత్రాలను అది ఎంతగా ప్రభావితం చేసింది అనేది ప్రశ్నార్థకమే.
ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, రీరికార్డింగ్, కలరింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగం విరివిగా పెరిగినా అది కేవలం సాంకేతిక పరిజ్ఞానానికి పరిమితమే తప్ప  మన సినిమా కంటెన్ట్ (కథాకథనం)లో తెచ్చిన మార్పు పెద్దగా కనిపించదు.ఈ మధ్యకాలంలో డిజిటల్ ప్రొజెక్షన్ ఉన్న [...]

మొదటి సినిమా - కె. విశ్వనాథ్

మొదటి సినిమా – కె. విశ్వనాథ్

నవతరంగం పాఠకులకు నమస్కారం. ఈ వారం నుంచి నవతరంగంలో ’మొదటి సినిమా’ అనే మరో కొత్త శీర్షిక ప్రవేశ పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రముఖ వెబ్ పత్రిక కౌముది సౌజన్యంతో నడిచే ఈ శీర్షిక మన రాష్ట్రంలోని వివిధ దర్శకులు తాము రూపొందించిన మొదటి సినిమా గురించి, అప్పటి వరకూ జరిగిన జీవనప్రయాణం గురించి తెలియచేస్తారు. ఈ వ్యాసాలు ఔత్సాహిక దర్శకులకు ఎంతో ఉపయోగకరంగానూ, సాధారణ పాఠకులకు ఆసక్తికరంగానూ ఉంటాయని ఆశిస్తున్నాము. ఈ వ్యాసాలు ఇక్కడ ప్రచురించే [...]

మారుతున్న సినిమా కథనం

మారుతున్న సినిమా కథనం

సాధారణంగా మన సినిమాల్లో కథలన్నీ ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటాయి. అలాగే కథనం కూడా సరళ రీతిలో ఉంటుంది. ఒక వ్యక్తి తన గమ్యం చేరడానికి లేదా లక్ష్యం నెరవేర్చడానికి పడే ప్రయత్నం, ఆ ప్రయత్నం లో అతనికెదురయ్యే ఆటంకాలు, అవాంతరాలను అధిగమించి చివరకా వ్యక్తి విజయం సాధించడంతో కథ ముగుస్తుంది. కథలో జరిగే సంఘటనలను సరళ రీతిలో చెప్పకుండ, కథలోని కొన్ని భాగాలను flashbackల రూపంలో చెప్పడం కొన్ని కథల్లో జరుగుతుంది.ఈ [...]

మూడు ముఖాల తమిళ సినిమా

మూడు ముఖాల తమిళ సినిమా

సినిమా, సినిమా తియ్యడమనే ప్రక్రియతో మాత్రమే అంతమైపోదు. ప్రేక్షకుడి తరఫున్నుంచీ చూశామనిపించినంతమాత్రానా అయిపోదు. సినిమా ఒక సమిష్టి కళ. సినిమా ఒక సామాజిక దర్పణం. సినిమా ఒక వ్యాపార దృక్పధం. సమాజం దాని నేపధ్యం. మనుషుల కథలు,ఆలోచనలూ,ఆదర్శాలూ,అనుభవాలూ ‘చలన చిత్రాలుగా’ మలిచేదే దాని పని. అలాంటి సినిమా తియ్యడం- చూడటంతో సమాప్తమైపోతే సామాజిక (చలచిత్ర) చరిత్రగా ఎలా మిగులుతుంది?
అందుకే సినిమాపుట్టిన దేశాలు. సినిమా పెరిగిన దేశాలు. సినిమాని ప్రేమించే దేశాలు. “సినిమా మాది” లేదా “మా సినిమా [...]

శబ్ధగ్రహణం - అంతరార్థం, రెండవ భాగం

శబ్ధగ్రహణం – అంతరార్థం, రెండవ భాగం

సినిమా చిత్రీకరణకు ఎలాగైతే post production, pre production, during production అని ఉంటాయో, శబ్ధగ్రహణానికి కూడా అలాగే ఉంటాయి (మన తెలుగులో ఇలా పాటిస్తున్నారో లేదో నాకు తెలీదు). మరయితే ఏ stage లో ఏం చేస్తారో తెలుసుకుందామా?!
Pre Production stage: ఈ దశలో సౌండ్ తో పనేముందబ్బా….? అని సందేహంగా ఉంది కదూ. అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. ఓ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందే అసలు ఆయా చిత్రం ఏ [...]

"ఒకే ఒక్క చాన్స్.." కాదు.. ఇప్పుడు - "ఒకే ఒక్క నిముషం"

“ఒకే ఒక్క చాన్స్..” కాదు.. ఇప్పుడు – “ఒకే ఒక్క నిముషం”

సినిమా తీయాలన్న వుత్సాహం మీలో వుందా?
సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? ఆ ఒక్క చాన్స్ ఎప్పుడు వస్తుందా అని వేచి వున్నారా?
నిజం చెప్పమంటారా? అవకాశం మీ ఎదురుగానే వుంది. మీరు ఇంతవరకూ దీన్ని పట్టించుకోకపోవటమే ఆశ్చర్యం. అవునండీ, నేను చెప్పేది నిజం. సినిమా అంటే రెండున్నర గంటల నిడివి, ఎంతోమంది టెక్నీషియన్లు, షెడ్యూల్స్, అన్నింటినీ మించి అంతంత  డబ్బు పెట్టగలిగిన నిర్మాత, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్లు.. ఇవన్నీ కావాలనుకుంటున్నారా? అవేమీ అవసరంలేకుండానే మీరు సినిమా తీయొచ్చు. కొన్ని [...]

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర-2

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర-2

“నేను పుట్టడానికి ఆర్నెల్ల ముందు నుంచీ నన్ను చంపటానికి హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఈ ఎత్తుగడ ఎంత బావుంది. కుతూహలం కలిగిస్తుంది. ఇంకో వాక్యంలో ఆ హత్యా ప్రయత్నం చేసేది వాళ్ల అమ్మే అన్నాడు. మరికొంత కుతూహలం, ఒక సాంఘిక సమస్య. బోలెడెంత పాత కథ అన్ని వచ్చేసాయి. అయ్యో పాపం అని మొదటే అనిపిస్తుంది…”అంటూ ప్రముఖ రచయిత(సినీ)ఆరుద్ర కాబోయో కథకులుకు ఆయన చక్కని చిట్కాలు చెప్తున్నారు.
ఈ ఏడు చేపల కథలోనే మరొక సుగణముంది. అది కొసమెరుపు. [...]

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర

చాల్లేవయ్యా..ఆపాటి అనుభవం మాకూ ఉంది. ఊ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచీ కథలు వింటున్నాం. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కంపోజిషన్లు రాయటం మొదలెట్టిన మర్నాటినుంచీ కథలు రాస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి. అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవముందని తప్పుకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచీ కథలు వినాలనీ,చదవాలనీ,వ్రాయాలనీ తహ తహ ఉన్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి అంటున్నారు ప్రముఖ(సినీ)కవి స్వర్గీయ ఆరుద్ర.. ఆయన “కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు!” అంటూ కథలు [...]

శబ్ధగ్రహణం - అంతరార్థం

శబ్ధగ్రహణం – అంతరార్థం

ఓ థ్రిల్లర్ సినిమా…….అంతా ప్రశాంతంగా ఉంది, సినిమాలో ఓ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది, అంతా నిశ్శబ్ధం కాని ఎవరో అటుగా వస్తున్న అలికిడి. ఎవరా అని చూద్దామని ఆ అమ్మాయి భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ అటుగా వెళ్తున్నది. ఆమె వేస్తున్న అడుగుల చప్పుడు మాత్రమే వినిపిస్తున్నది, మరే శబ్ధము లేదు. అంతలోనే ఓ పిల్లి కాలు తగిలి అటకమీద నుంచి స్టీలు సామన్లు గలగలమని కింద పడతాయి. ఒక్కసారిగా నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ [...]

స్నోరి క్యామ్

స్నోరి క్యామ్

స్నోరి క్యామ్ గురించి విన్నారా?
హ్యాండీ క్యామ్, స్టడీ క్యామ్ లాగా స్నోరి క్యామ్ అనేది కెమెరాని ఆపరేట్ చేయడంలో ఒక కొత్త విధానం. ఈ టెక్నిక్ గత నలభై ఏళ్ళగా ఉన్నప్పటికీ ఈ మధ్యనే దీని ఉపయోగం కాస్త ఎక్కువవుతోంది. దీనినే సినిమా పరిశ్రమలో పని చేస్తున్న వారయితే బాడీ రిగ్ అని కూడా అంటారు. కెమెరా నటీ నటుల శరీరానికి (body) కి రిగ్ చేస్తారు కాబట్టే దీన్ని బాడీ రిగ్ అంటారు.
ఎందుకీ పేరు?
ఈ టెక్నిక్ [...]

పరిమితులే సృజనాత్మకతకి తొలి మెట్లు..!!

పరిమితులే సృజనాత్మకతకి తొలి మెట్లు..!!

హాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న చిత్రం – “పారానార్మల్ ఏక్టివిటీ” (Paranormal Activity). ఓరెన్ పెలి (Oren Peli) దర్శకత్వంలో వచ్చిన ఈ “మాకుమెంటరీ” (Mocumentary) చిత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలనం సృష్టించింది. కేవలం 15000 డాలర్ల వ్యయంతో తీసిన ఈ చిత్రం ఇప్పటికే రెండు చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడి, లక్షల డాలర్లు వసూలు చేస్తోంది.
స్థూలంగా కథ: కాలిఫోర్నియాలో వుండే ఒక జంట తమ ఇంటిని ఏదో అతీంద్రియ శక్తి వెంటాడుతోందన్న అనుమానంతో ఒక [...]

పుదొవ్కిన్ on ఎడిటింగ్

పుదొవ్కిన్ on ఎడిటింగ్

వి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం జర్మను అనువాదానికి ఉన్న ముందు మాటలో ఎడిటింగ్/కూర్పు గురించి చాలా చక్కగా చెప్పిన సంగతులు ఇవి. పుదొవ్కిన్ సినిమాలనగానే బ్రహ్మాండమైన విజువల్స్, ఎడిటింగ్ సాధించే effect గుర్తుకొస్తాయి.
సినిమా కళకి కూర్పు పునాది వంటిది. (The foundation of film art is editing)
ఈ మాటలు సోవియెట్ సినిమా కళకు ఇప్పటికీ శిరోధార్యాలు. ఆనాటి నుండీ ఈనాటి వరకూ సోవియెట్ సినిమాలో [...]

లఘుచిత్ర నిర్మాణం-కొన్ని సంగతులు

లఘుచిత్ర నిర్మాణం-కొన్ని సంగతులు

వేలయోజనాల దూరమని తెలిసినా… ప్రయాణం ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఈ సూత్రాన్నే సినిమాకి అన్వయిస్తే…అక్కడా ఓ సక్సెస్‌ ఫార్ములా కనబడుతుంది. సరదాగా మనింట్లో తిరుగాడే …అల్లరి పెట్‌ ప్రవర్తనను సిల్లీగా చిత్రీకరించినా….ఆ అలవాటే ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీయడానికి పురికొల్పవచ్చు. అనూహ్యంగా అది అందలమెక్కనూవచ్చు. సరదాగా మొదలైన వ్యాపకమే ముదిరి పాకానపడి ఓ పెద్ద సినిమా అవకాశానికి ఊపిరులూదనూ వచ్చు. బిగ్‌స్క్రీన్‌ కలలను నిజం చేయనూ వచ్చు. ఆనక కమర్షియల్‌ పంథాలో ఎదగడానికి… అదే కారణమూ కావొచ్చు. అలా ముందుకెళ్లినవాళ్లు [...]

‘సినిమా’టోగ్రాఫర్

‘సినిమా’టోగ్రాఫర్

మంచి సినిమా తియ్యాలంటే మంచి దర్శకుడు ఎంత అవసరమో మంచి సినిమాటోగ్రాఫర్ కూడా అంతే అవసరం. ప్రపంచంలోని ప్రతి మంచి దర్శకుని గొప్పతనం వెనుక ఒక మంచి సినిమాటోగ్రాఫర్ వుంటాడు. హాంగ్‌కాంగ్ చిత్ర దర్శకుడైన Wang-Kar-Wai రూపొందించిన దాదాపు అన్ని సినిమాలకూ ఒకే సినిమాటోగ్రాఫర్ పని చేశారు, ఆయనే Chirstopher Doyle. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ దృశ్య పరంగా అధ్భుతంగా వుంటాయి, అందుకు కారణం వీరద్దరి మధ్య వున్న అవగాహనే కారణమేమో! Chirstopher Doyle లేకుండా [...]

సినిమాలెలా తీస్తారు-మూడో భాగం

సినిమాలెలా తీస్తారు-మూడో భాగం

ఇతివృత్తం -> కథాంశం -> సింగిల్ లైన్ స్టోరీ -> సీనిక్ ఆర్డర్ -> స్క్రీన్ ప్లే
సినిమా తీయాలంటే ముందు కథ కావాలి. ఏ కథ ఎంతబాగా ఆడుతుందనే విషయంలో ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి. (”Last of the great Vijaya classics” గా గుర్తింపు పొందిన గుండమ్మ కథ ఎలా ఆడుతోందో, అసలు ఆ సినిమాలో ఏముందని జనాలు అంతగా చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అదే విజయావారికి మాయాబజార్, పాతాళభైరవి సినిమాలు తీసిపెట్టిన [...]

జెనెర్‌లు - మూసలు (ఒక పరిశీలన)

జెనెర్‌లు – మూసలు (ఒక పరిశీలన)

సినిమా పరిభాషలో జెనెర్ అనే పదం తరచుగా వినపడుతుంటుంది (కొంత మంది జెనెరె అని అంటారు). ప్రాధమికంగా ఇది ఏ “రకమైన” సినిమానో చెప్పటానికి వాడుతుంటారు. చాలా వరకు సినిమాల ప్రచారంలో రివ్యూలలో ఈ పదం వినపడుతుంటుంది. (సినిమా విడుదలకి ముందు మాత్రం ఇదొక డిఫరెంట్ సినిమా అనే వినపడుతుంది). “పూర్తి హాస్య రస చిత్రం”, “వళ్ళు గగుర్పొడిచే ఫైట్లతో, అనూహ్యమైన చేజింగ్ దృశ్యాలతో..”, “అన్నా చెళ్ళెళ్ళ అనురాగానికి అద్దం పట్టే సినిమా..” ఇలాగ నేరుగా జెనెర్ [...]

సినిమాలెలా తీస్తారు-రెండో భాగం

సినిమాలెలా తీస్తారు-రెండో భాగం

చిత్రనిర్మాణంలో ముఖ్యంగా మూడు దశలున్నాయి. అవి:

ప్రి-ప్రొడక్షన్
ప్రొడక్షన్
పోస్ట్-ప్రొడక్షన్

షూటింగుకు అవసరమయ్యే సన్నాహకాలన్నీ జరిగేది ప్రి-ప్రొడక్షన్ దశలో. చిత్రనిర్మాణంలో ఇది అత్యంత కీలకమైన దశ. అసలు దీంట్లోనే చిత్రనిర్మాణానికి సంబంధించిన తొంభై శాతం పని పూర్తవుతుంది. కథ నిర్ణయం, బడ్జెట్ తయారీ, కథాచర్చలు, స్క్రిప్టు, స్క్రీన్‌ప్లేల ఖరారు, క్యాస్టింగు, ఇతర సిబ్బంది, షూటింగు లొకేషన్ల నిర్ణయం, ఔడ్డోర్ యూనిట్ ఎంపిక, పాటల నిర్ణయం, పాటల రచన, పాటల రికార్డింగు, మొదలైనవన్నీ ఈ దశలోనే జరుగుతాయి.
ప్రొడక్షన్ దశలో షూటింగు జరుగుతుంది. మిగతా సినిమా [...]

సినిమాలెలా తీస్తారు-ఒకటవ భాగం

సినిమాలెలా తీస్తారు-ఒకటవ భాగం

సినిమా – ఒక పరిచయం:
సినిమా అనేది ఒకరకంగా చెప్పాలంటే దృశ్యరూపంలోని సాహిత్యమే. ఇది రంగస్థలమ్మీద ఒకసారి ఆడి ఆగిపోయే బదులు వెండితెరమీద మళ్ళీమళ్ళీ ఆడించడానికి వీలయ్యేలా రూపొందే నాటకం, దృశ్యరూపంలోని ఒక కావ్యం, ఒక నవల లేదా ఒక కథ. తెలుగులో టాకీలొచ్చిన తొలినాళ్ళలోనే ప్రసిద్ధి పొందిన కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి నాటకాలు సినిమాలుగా వచ్చాయి. ఆ రోజుల్లోనే నవలల్లో నుంచి ‘బారిష్టర్ పార్వతీశం’, ‘మాలపిల్ల’లు కూడా వెండితెర మీద సాక్షాత్కరించారు. చలం రాసిన ‘దోషగుణం’ అనే [...]

ఎడిటింగ్- ఒక ప్రస్తావన

ఎడిటింగ్- ఒక ప్రస్తావన

ఉపోద్ఘాతం
సెకండుకి ఇరవై నాలుగు నిశ్చల చిత్రాలను తెరపై ప్రదర్శించి, ప్రేక్షకుల కళ్ళకు కదిలే బొమ్మలు చూస్తున్నట్టుగా భ్రమ కలిగించడమే సినిమా లేదా చలన చిత్రం అనే ప్రక్రియ అని ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. మొట్ట మొదట ఈ ప్రక్రియ కేవలం దైనందిన దృశ్యాలను కెమెరా ద్వారా రికార్డు చేసి తెరపై ప్రదర్శించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు స్టేజిపై ప్రదర్శించే నాటకాలనూ, సర్కస్ ప్రదర్శనలనూ కెమెరాలో రికార్డు చేసి ఒక్కో ప్రదర్శననూ ఎన్నోసార్లు, [...]

సినిమా రచయితలు చదవాల్సిన పుస్తకాలు

సినిమా రచయితలు చదవాల్సిన పుస్తకాలు

గత నెలలో జరిగిన చెన్నై స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ లో స్క్రీన్ రైటింగ్ లోని వివిధ అంశాలను ఎంతో ఆసక్తిగా బోధించిన అంజుం రాజ్బలి ఔత్సాహిక స్క్రీన్ రైటర్స్ చదవాల్సిన పుస్తకాలు కొన్నింటిని రికమెండ్ చేశారు. వాటి వివరాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను. అలాగే సంవత్సరానికి డజన్ల కొద్దీ ప్రచురితమయ్యే స్క్రీన్ రైటింగ్ పుస్తకాలు, ’to-do’ పుస్తకాలు ఎక్కువగా చదవడం ద్వారా ఎక్కువ విషయాలు నేర్చుకోవడం అటుంచి రచయితలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన [...]

Page 1 of 3123